నా కుటుంబ నుంచి నన్ను దూరం చేసిన వాళ్లని వదలను: కవిత

సిద్ధిపేట: చింతమడకలో బతుకమ్మ వేడుకలకు మాజీ ఎమ్మెల్సీ కవిత (Kavitha) హాజరయ్యారు. ఈ వేడుకల్లో కవిత భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితిలో ఇక్కడకు వచ్చాను అని అన్నారు. ‘‘ఉద్యమం మొదలయ్యాక కెసిఆర్ ఇక్కడికి మరొకరిని తెచ్చిపెట్టారు. కొందరు సిద్ధిపేట.. చింతమడక తమ సొంత ప్రాపర్టీలా వ్యవహరిస్తున్నారు. చింతమడక చిరుతపులులను కన్న నేల. రాజకీయంగా ఆంక్షలు పెడితే మళ్లీ ఇక్కడకు వస్తా. కెసిఆర్‌కు మచ్చ తెచ్చే పనులు కొందరు చేశారు. […]