ఎన్నికల ముందు లాలూ ప్రసాద్‌కు ఇంటిపోరు

పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌కు స్వంత ఇంటిపోరు తప్పడం లేదు. ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య “రెబెల్”గా ఎదురుతిరిగి తనతండ్రి, సోదరులు తేజస్వియాదవ్, తేజప్రతాప్ యాదవ్, సోదరి మీసా భారతి సూచనలను ఏమాత్రం సోషల్ మీడియాలో ఖాతరు చేయడం లేదు. కాకలు తీరిన రాజకీయ యోధుడు లాలూప్రసాద్ యాదవ్ ఇప్పుడు ఒకేసారి మూడు పోరాటాలు చేయవలసి వస్తుంది. మొదట ఆయన న్యాయ పోరాటాన్ని ఎదుర్కొంటున్నారు . […]








