అఫ్ఘాన్ ఇంటికి… లంక, బంగ్లా సూపర్-4కు

అబుదాబి: ఆసియాకప్ గ్రూప్‌బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సూపర్4కు అర్హత సాధించాయి. గురువారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యాన్ని లంక 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ 52 బంతుల్లో 10 ఫోర్లతో అజేయంగా 74 పరుగులు చేసి లంకను గెలిపించాడు. కుశాల్ పెరీరా (28), కమిందు మెండిస్ 26 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు. […]








