హైదరాబాద్ మెట్రో విస్తరణను కేంద్రం అడ్డుకోవడం లేదు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్ మెట్రో విస్తరణను కేంద్ర ప్రభుత్వం ఆపడం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కిషన్‌రెడ్డి కలిశారు. తెలంగాణలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల అభివృద్ధి గురించి చర్చించారు. రాష్ట్రంలో రోడ్డు మార్గాల కనెక్టివిటీని మెరుగుపరచడం, ప్రాజెక్టుల విస్తరణపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు అత్యంత […]








