దక్షిణ పసిఫిక్‌లోని ఉష్ణమండల ప్రాంతం ఫిజీ. మూడువేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఐటౌకీలు అక్కడి స్థానికులు. 1874లో అది బ్రిటిష్ కాల నీ అయింది. దక్షిణాఫ్రికాలోని నటాల్‌ని నమూనా గా తీసుకొని, చక్కెర, కొబ్బరి, పత్తి, కాఫీ తోటలలో ఉపాధి కోసం కార్మికులను క్రమక్రమం గా సరఫరా చేసుకోవాలనే ఉద్దేశ్యంతో 1879లో ఒప్పంద కార్మి క విధానాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం అనుమతించినా, భారతీయ ఒప్పంద కూలీలను నియమించుకున్న చివరి దేశం ఫిజీ. 498మంది భారతీయ ఒప్పంద కార్మికులతో, మొదటి నౌక లియోనిడాస్ 1879 మార్చి 3న భారతదేశంలోని కలకత్తా నుండి బయలుదేరి అదే సంవత్సరం మే 14న ఫిజీలోని లెవుకా కు చేరుకుంది. ఆ కార్మికులే తరువాతి 37 సంవత్సరాలలో, భారత ఉపఖండం నుండి వచ్చిన దాదాపు 61వేల మందిలో మొదటివారు. వారి వారసులు ఇప్పుడు ఫిజీ జనాభాలో 40శాతంగా ఉన్నారు. 18791916 మధ్య, మొత్తం 42 నౌకలు 87 ప్రయాణాలు చేసి, భారతీయ కార్మికులను ఫిజీకి తీసుకెళ్లాయి. కలకత్తా నుంచి 45,439 మంది, మద్రాసు నుంచి 15,114 మంది ఒప్పంద కార్మికులు వెళ్లారు. ఫిజీకి ప్రయాణం, సెయిలింగ్ నౌకల్లో సగటున 73 రోజులు పడితే, స్టీమర్లకు 30 రోజులు పట్టేది.
ఆ ఒప్పంద కాలంలో స్వేచ్ఛా భారతీయుల పట్ల ద్వేషపూరిత ప్రవర్తన ఎంత దారుణంగా ఉందో, ఒప్పందాలు చేసుకున్న కార్మికులు కాలనీలో పని చేయాల్సిన పరిస్థితులూ, అంతే దిగ్భ్రాంతికరంగా మారుతూపోయాయి. లింగ నిష్పత్తిలో భయంకరమైన అసమానతలు, వైవాహిక జీవితపు గౌరవాన్ని కాపాడటానికి ఎటువంటి గోప్యత లేకపోవడం, చా లామంది భారతీయుల్ని నైతికంగా దెబ్బ తీసాయి. కొన్ని కాలనీలు వ్యభిచార గృహాలుగా మారాయి. కోలుకోలేని అనైతికత వ్యాధులతో కూడిన జీవితానికి అలవాటుపడ్డ వారుగా, భారతీయులు పేరుపడ్డారు. ఫిజీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లించ్ ఇలా రాసాడు. ‘ఒక ఒప్పంద భారతీయ కార్మిక మ హిళ, ముగ్గురు ఒప్పంద కార్మిక పురుషులతో పా టు, వివిధ బయటి వ్యక్తులకు సేవ చేయవలసి వ చ్చినప్పుడు, గనేరియా, సవాయి రోగాల బారినప డేది. పని పరిస్థితులు కూడా అధ్వాన్నం.’ ద్వేషపూరిత వాతావరణం పెరిగి, హింసాత్మక నేరాలు, ఆత్మహత్యలు ఫిజీలో భారతీయ జీవితంలో నిత్య వైఖరిగా మారాయి. ఫిజీలో కుటుంబ జీవితానికి సరైన పునాది వేయాలంటే కనీసం 40శాతం మంది కార్మిక మహిళలు ఉండాలని భారత వలస ప్రభుత్వం భావించింది. అయితే దళారీల ప్రయత్నాలు చేసినా ఈ నిష్పత్తిని కొనసాగించలేక, చా లా సందర్భాల్లో మహిళలను అపహరించుకు పో యేవారు. మహాత్మా గాంధీ, ఇతర జాతీయ నాయకులు ఒప్పంద వ్యవస్థను ఒక ముఖ్యమైన జాతీయ సమస్యగా తీసుకున్నారు. అక్కడ జరుగుతున్న అనే క దుర్మార్గాలు బయటకు వెల్లడి కావ డం, ఇంకా అనేక కారణాలతో భారతీయ ప్రజాభిప్రాయం ఒ ప్పందాన్ని రద్దు చేయాలని ఏకగ్రీవంగా డిమాండ్ చేసింది. భారతదేశానికి చేసిన ఈ ద్రోహం మీద దేశం మొత్తం ఆగ్రహావేశాలతో ప్రతిధ్వనించింది. చివరకు 1920లో ఇండెంచర్ వ్యవస్థ ఒప్పంద విధానం రద్దు చేయబడింది. అలా ఒప్పంద కార్మిక వ్యవస్థ రద్దుకు ఫిజీనే కారణమయింది.
భారతదేశ విశాల చరిత్ర ముందు గిర్మిట్ల చరిత్ర నిర్లక్ష్యం కావడం ఒక విషాదం. ఒప్పంద కార్మికులు తమ జీవిత అనుభవాలను కవిత్వ రూపంలో వ్యక్తీకరించారు. 1879-1920 మధ్య కాలంలో, పురుషులూ, స్త్రీలు చెరకు పొలాల్లో నిర్ణీత సమయం కంటే ఎక్కు వ గంటలు పనిచేయాల్సి వచ్చేది. శ్వేతజాతి యజమాని, అతను నియమించిన సర్దార్ (నాయకుడు) రోజంతా కొరడాలతో తిరుగుతూ భారతీయ కార్మికులు తమకు కేటాయించిన పనులను ఆ రోజు ముగిసేలోగా పూర్తి చేసేలా చూసేవారు. వివిధ కారణాలతో కార్మికుల్లో కొందరు పరస్పర శత్రువుల్లా ఉండేవారు. జింకీ అనే మహిళ సిగటోకా ప్రాంతంలో తన అనుభవాన్ని ఒక సాయంత్రం, ఫి ర్యాదు స్వరంలో ఇతర మహిళలకు ఇలా చెప్పుకుంది.
“ఎవరూ లేరు జింకీ బాధలు వినడానికి
యజమాని బాగా కొడుతుంటాడు
నా మీద సర్దార్ చాడీలు చెబుతుంటాడు
రామదియా నా శత్రువు”
చెరకు పొలాల్లో పని చేస్తున్నప్పుడు, రకిరాకిలోని ఒక మహిళ తనను ఫిజీకి పంపిన ఆర్కటీ అని పిలవబడే దళారీని ఇలా తిట్టుకుంది.
“ప్రేమికుడ్ని వదిలేసి
దేశం నుంచి పారిపోయి
వచ్చాను నాకు పెళ్లి
కాకుండా చేసి
తరలించినవాడు
తప్పకుండా చావాలి”
బాధలను భరించే సామర్థ్యం ఎంతున్నా, ఓపిక నశించిన సందర్భంలో, మహిళా కార్మికుల ముఠాను, శ్వేతజాతీయ పర్యవేక్షకుడు కొలంబెర్ తరచూ వేధిస్తూ కొరడాతో కొట్టేవాడు. ఒకరో జు ఒక స్త్రీని అతను అవమానించినప్పుడు, అంద రూ కలిసి అతన్ని కొట్టడానికి అతనిపైకి వెళ్లారు. అది చూసిన వారు మరింత దూకుడు పెంచారు.
“ఓ రామా! పనిలో పడి చస్తుంటాం మేము
అయినా పరదేశీ అవమానిస్తాడు గద్దిస్తాడు
చెమటతో, రక్తంతో పొలాల్ని తడుపుతాం
కూర్చుని కూర్చునే అధికారం
చలాయిస్తాడు వాడు”
కొన్నిసార్లు వారి బాధల కథలు వినడానికి ఎవరూ ఉండరు. చెరకు మొక్కలే సాక్షులు. పని చేస్తున్నప్పు డు, వారి చేతుల్లో పనిముట్లతోనే, ఇలా పాడుకున్నారు.
“ఈ కత్తులూ కొడవళ్లతోనే
పగలూ రాత్రులూ గడుస్తున్నాయి ఇపుడు
ఆకుపచ్చని చెరకు ఆకులకు తెలుసు
మా అన్ని కష్టాలూ”
ఫిజీకి మహిళల్ని పంపడానికి చాలా సందర్భాలలో అపహరణలకు సైతం ఆర్కటీలు అని పిలవబడే దళారీలు వెనకాడలేదు. అణచివేత, అనిశ్చితి మ ధ్య, మహిళలు తమ గత అనుభవాలను గుర్తుచేసుకునే వారు.
“కాగితం చేతిలో పెట్టారు గోదాంలో
పర్యవసానాలు తెలియక
దానిమీద వేలుముద్ర వేశాను
చీకటి సంద్రాన్ని ఎలా దాటగలమని
గొణుక్కుంటూ ఏడ్చుకుంటూ
తెరచాపల పడవ మీద
ఆశ్చర్యంలో కూరుకుపోయాను”
అభాగ్యులైన మహిళలు ‘నలిగిన విరిగిన’ హృదయాల నుంచి బాధను ఇలా వెళ్లబోసుకున్నారు.
“చీకటి గదిలో కఠినంగా గడుస్తోంది రాత్రి
ఎవరితో చెప్పుకోవాలి నా యాతన?
రాత్రీ, పగలూ కష్టాలమయం
నా కన్నీళ్లు సైతం ఇంకిపోయాయి”
వారికి ఇళ్లల్లో సైతం దుర్భర జీవన పరిస్థితులు ఉం డేవి. వ్యంగ్య పద్ధతిలో వారి ఆగ్రహాన్ని వ్యక్తం చే యడం తప్ప దాని గురించి వారు ఏమీ చేయలేకపోయారు.
“ఆరడుగుల వెడల్పు
ఎనిమిదడుగుల పొడవు గదిలోనే
అన్ని సౌఖ్యాలూ
అందులోనే కొడవళ్లు పనిముట్లు
అదే సొంత ఇల్లు
అందులోనే వంటచెరకు
రుబ్బురోలు, పొయ్యి కూడా
అందులోనే మా పడక”
భారతీయ సంతతికి చెందిన ఫిజీయన్లు యకోనా (అక్కడి ఒక విధమైన మదిర) పట్ల అభిరుచిని నవువాలో పెంచుకున్నారు. అనామక పాటల రచయిత తన భార్యను ఉద్దేశించి దానిని ఇలా స్వరపరిచా డు. ఈ పాట ఎంత జనరంజకం అయిందంటే, ప్రజలు తమ సంగీత సమావేశాలలో కలిసినప్పుడ ల్లా ఈ పాట పాడకుండా ఉండే వారు కాదు.
“ఓ, నా ప్రియమైనదానా
యకోనాని వదలలేను నేను
నా దేశాన్నీ, కులాన్నీ వదిలేసాను
అమ్మనీ, నాన్ననీ వదిలేసాను
కానీ ఇప్పుడు యకోనాని వదలలేను
మత్తెక్కించే ఈ ద్వీప పానీయాన్ని
తాగుతూ, తాగుతూ రాత్రంతా గడుపుతాను”
ఒప్పందపు వలస జ్ఞాపకాలు మరికొన్ని
“మాకులానే
దుంగ మిల్లుకు వచ్చింది
ఓడిపోయిన చెట్టు దుంగగా చేయబడ్డాక
దానికిప్పుడు నిజంగా ఏ పట్టింపూ లేదు”
ససెనరైన్ పెర్సౌద్
“ఇక్కడ నా యవ్వనం పోగొట్టుకున్నాను
ఈ దీవికి నా జీవితాన్ని ఇచ్చాను
చరిత్ర దౌర్జన్యానికి
మనిషి జీవితం కంటే ఏమి ఇవ్వగలడు?”
సత్యేంద్ర నందన్
ఒప్పంద కార్మికులు నిద్రలేచి ఆహారం సిద్ధం చేసుకుని పొలాలకు వెళ్లాల్సి వచ్చేది. స్త్రీ, పురుష కార్మికులకు ఇది చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ క్రింది పాట అదే
‘సమయం కాని సమయంలోనైనా
నిద్ర లేపుతాడు
కట్టెలు లేకుండా నిద్రపోనివ్వడు
ఫిజీలో ఇలాంటి బాధలు ఉంటాయని తెలిసుంటే
నగరంలో దండోరా చాటిద్దును
ఫిజీకి ఎవరూ పోవద్దని”
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన భర్త కోసం భార్య పాడింది.
“తూర్పు నుంచి రైలొచ్చింది
పడమర నుంచి ఓడొచ్చింది
నా ప్రియమైన వ్యక్తిని
దూరంగా తీసుకుపోయింది
నా సవతిలా రైలు
నా ప్రియమైన వ్యక్తిని దూరం చేసింది
రైలు నా శత్రువు కాదు, ఓడా కాదు
నా నిజమైన శత్రువు డబ్బు
నా ప్రియమైన వ్యక్తిని
ఒక స్థలం నుంచి మరొక స్థలానికి
తీసుకుపోతోంది
నా నిజమైన శత్రువు డబ్బే”
కొందరు కొంతకాలం తరువాత, స్త్రీలను ఇంటి నుంచి బయటకు నెట్టేసేవారు. అలాంటి కష్ట సమయాల్లో, స్త్రీలు తమను తాము రక్షించుకోవలసి వచ్చేది. ఈ క్రింది జానపద గీతం భార్య వేదనలు కొన్నింటిని నమోదు చేసింది.
“సూర్యుడు క్రూరుడు ప్రకాశవంతుడు
చాలా పనులు ఇంకా చేయాల్సి ఉంది
జనం తిరిగి తమ ఇళ్లకు వెళ్లిపోయారు
అయినా భోజనానికి పిలుపు లేదు నాకు
ఇక్కడ, ఈ పొలాలలో
దురదృష్టం కొద్దీ, ఒంటరిగా పని చేస్తున్నాను
నా ప్రభువు దూరదేశంలో ఉన్నాడు
మీ ప్రభువు వచ్చాడని ఎవరు చెబుతారు
ఆ ఆనందపు రోజు ఉదయిస్తుందా”
స్థిరమైన గృహ వివాదాలు, ఇళ్ళ నుంచి బయటకుపోవడానికి మరొక కారణం
“అయ్యో, నేను వేరొకనితో పారిపోవాలా
నా నుంచి తన మనసు
దూరం చేసుకున్నాడు నా ప్రియుడు
నేను ఎంత ఉత్కంఠతో
అన్నం, పప్పు వండి నెయ్యి వడ్డిస్తానో
మేము భోజనానికి కూర్చున్న వెంటనే
గొడవలు మొదలెడతాడు
అతనితో నా హృదయం అలసిపోయింది
కుండలో వేడి నిప్పు పెట్టి
నేను జాగ్రత్తగా పడకపరుస్తాను
మేము విశ్రాంతి తీసుకుందుకు పడుకోగానే,
గొడవలు మొదలెడతాడు
నా హృదయం అతనితో అలసిపోయింది.”
ప్రపంచ వ్యాప్తంగా అనేక ఇతర ప్రాంతాల్లో లాగా నే ఫిజీ భారతీయ వలస కార్మికుల చరిత్ర కూడా విషాదభరితమే.
ముకుంద రామారావు