తాజా వార్తలు,State News
Auto Added by WPeMatico
ఆల్మట్టిపై న్యాయపోరాటానికి సిద్ధం
అక్టోబర్ 3న అలయ్-బలయ్
రేవంత్ పంజాకు కెసిఆర్ కుటుంబం నిలబడలేదు: మంత్రి జూపల్లి
పూలను పూజించే గొప్ప సంస్కృతికి బతుకమ్మ పండుగకు ఉంది: సిఎం రేవంత్ రెడ్డి
కొత్తగా ఎంవొ అనే విధానంలోనూ పైరసి : సివి. ఆనంద్
హైదరాబాద్: టెలిగ్రామ్ ఛానెల్స్, టొరెంట్స్ ద్వారా సినిమాల పైరసి జరుగుతోందని సిపి. సివి ఆనంద్ తెలిపారు. పైరసి వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ ముఠా పైరసీ వల్ల తెలుగుచిత్ర పరిశ్రమకు రూ. 3700 కోట్ల మేర నష్టం జరుగుతుందని ఆవేదనను వ్యక్తం చేశారు. కొత్తగా ఎంవొ అనే విధానంలోనూ పైరసి జరుగుతోందని, థియేటర్ కు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి పైరసికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. విస్తుపోయేలా డిజిటల్ శాటిలైన్ ను కూడా హ్యాక్ చేసి పైరసి చేస్తున్నారని,
పైరసి మూవీలు అప్ లోడ్ చేసి బెట్టింగ్, గేమింగ్ యాప్ ప్రకటనల ద్వారా ఆదాయం పొందుతున్నారని, సింగిల్, హాట్ సినిమాల పైరసి జరిగినప్పుడు తమకు ఫిర్యాదులు అందాయని తెలియజేశారు. పైరసి కేసులో జానా కిరణ్ కుమార్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడని, సినిమాకు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా మరొకరికి పంపించాడని అన్నారు. హైఎండ్ కెమెరా ఉన్న సెల్ ఫోన్ తో సినిమాను రికార్డింగ్ చేస్తారని, కిరణ్ ముఠా ఇప్పటివరకు 40 సినిమాలను పైరసి చేశారని చెప్పారు.
ప్రత్యేకమైన యాప్ ద్వారా సినిమాను థియేటర్ లో రికార్డింగ్ చేశారని, సెల్ ఫోన్లను జేబులోగాని, పాప్ కార్న్ డబ్బాలో గానీ పెడతారని అన్నారు. రికార్డింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ స్క్రీన్ లైట్ కూడా ఆఫ్ లో ఉంటుందని, మొబైల్ స్క్రీన్ లైట్ ఆఫ్ లో ఉండటంతో ఎవరికి అనుమానం రాదని చెప్పారు. ఇతర భాష చిత్రాలను రికార్డింగ్ చేసేందుకు ఏజెంట్లు కూడా ఉన్నారని, సినిమా పైరసిలకు నెదర్లాండ్ కు చెందిన ఐపి అడ్రస్ వాడుతున్నారని పేర్కొన్నారు. పైరసి ముఠాను పట్టుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీ వినియోగించామని, పోలీసులు ఎప్పటికి పట్టుకోలేరని నిందితులు భావించారని సివి ఆనంద్ స్పష్టం చేశారు.
నెదర్లాండ్ ఐపి అడ్రస్ తో పైరసీ: సివి ఆనంద్
హైదరాబాద్: టెలిగ్రామ్ ఛానెల్స్, టొరెంట్స్ ద్వారా సినిమాల పైరసి జరుగుతోందని సిపి. సివి ఆనంద్ తెలిపారు. పైరసి వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ ముఠా పైరసీ వల్ల తెలుగుచిత్ర పరిశ్రమకు రూ. 3700 కోట్ల మేర నష్టం జరుగుతుందని ఆవేదనను వ్యక్తం చేశారు. కొత్తగా ఎంవొ అనే విధానంలోనూ పైరసి జరుగుతోందని, థియేటర్ కు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి పైరసికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. విస్తుపోయేలా డిజిటల్ శాటిలైన్ ను కూడా హ్యాక్ చేసి పైరసి చేస్తున్నారన్నారు.
పైరసి మూవీలు అప్ లోడ్ చేసి బెట్టింగ్, గేమింగ్ యాప్ ప్రకటనల ద్వారా ఆదాయం పొందుతున్నారని, సింగిల్, హాట్ సినిమాల పైరసి జరిగినప్పుడు తమకు ఫిర్యాదులు అందాయని ఆనంద్ తెలియజేశారు. పైరసి కేసులో జానా కిరణ్ కుమార్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడని, సినిమాకు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా మరొకరికి పంపించాడని అన్నారు. హైఎండ్ కెమెరా ఉన్న సెల్ ఫోన్ తో సినిమాను రికార్డింగ్ చేస్తారని, కిరణ్ ముఠా ఇప్పటివరకు 40 సినిమాలను పైరసి చేశారని చెప్పారు.
ప్రత్యేకమైన యాప్ ద్వారా సినిమాను థియేటర్ లో రికార్డింగ్ చేశారని, సెల్ ఫోన్లను జేబులోగాని, పాప్ కార్న్ డబ్బాలో గానీ పెడతారని అన్నారు. రికార్డింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ స్క్రీన్ లైట్ కూడా ఆఫ్ లో ఉంటుందని, మొబైల్ స్క్రీన్ లైట్ ఆఫ్ లో ఉండటంతో ఎవరికి అనుమానం రాదని చెప్పారు. ఇతర భాష చిత్రాలను రికార్డింగ్ చేసేందుకు ఏజెంట్లు కూడా ఉన్నారని, సినిమా పైరసిలకు నెదర్లాండ్ కు చెందిన ఐపి అడ్రస్ వాడుతున్నారని పేర్కొన్నారు. పైరసి ముఠాను పట్టుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీ వినియోగించామని, పోలీసులు ఎప్పటికి పట్టుకోలేరని నిందితులు భావించారని సివి ఆనంద్ స్పష్టం చేశారు.
పేదలకు నాణ్యమైన భోజనం, టిఫిన్ : పొన్నం
హైదరాబాద్: ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నా పేదలకు నాణ్యమైన భోజనం, టిఫిన్ అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మోతీనగర్ లో ఇందిరమ్మ క్యాంటీన్లు పొన్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మోతీనగర్ లో మీడియాతో మాట్లాడుతూ.. జిహెచ్ఎమ్ సి లో 60 క్యాంటీన్ లు ఏర్పాటు చేశామని, ఇకపై రూ.5 బ్రేక్ ఫాస్ట్ అని తెలియజేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఎక్కడా అసంతృప్తి లేదని అన్నారు. స్థానిక ఎన్నికల్లో వంద శాతం స్థానాల్లో తామే గెలుస్తామని, ఎమ్ఎయుడి, హెచ్ఎమ్ డిఎ అవినీతి జరుగుతోందని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటివి ఉంటే తన దృష్టికి తీసుకురండని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఫ్యూచర్ సిటి ప్రపంచానికే తలమానికం: భట్టి
హైదరాబాద్: ప్రపంచం మొత్తం భవిష్యత్తు నగరం వైపు చూస్తోందని డిప్యూటి సిఎం భట్టివిక్రమార్క తెలిపారు. మహా అద్భతంగా మారే
నగరంగా ఫ్యూచర్ సిటి రూపుదిద్దుకోబోతుందని అన్నారు. ఫ్యూచర్ సిటి డెవలప్ మెంట్ అథారిటీ భవనానికి సిఎం శంకుస్థాపన చేశారు.
రావిర్యాల- ఆమన్ గల్ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్-1 సిఎం భూమి పూజ చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు
చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్ పేటలో భట్టి మీడియాతో మాట్లాడుతూ.. కొత్త సాంకేతికతతో ఫ్యూచర్ సిటి కార్యక్రమం
చేయబోతున్నామని, భవిష్యత్తులో ఫ్యూచర్ సిటి ప్రపంచానికే తలమానికం కాబోతుందని తెలియజేశారు. అద్భుతమైన వైద్య,
విద్యాసంస్థలు, పరిశ్రమలు రాబోతున్నాయని, గొప్ప సంకల్పబలంతో ఫ్యూచర్ సిటిని సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని పేర్కొన్నారు.
అందరూ భాగస్వాములై ఫ్యూచర్ సిటి నిర్మాణానికి సహకరించాలని, భవిష్యత్తు అంతా ఫ్యూచర్ సిటిలోనే ఉందని భట్టి విక్రామార్క స్పష్టం
చేశారు.
న్యూయార్క్ ను మరిపించే నగరం కడతా: రేవంత్
హైదరాబాద్: తనకు ఇక్కడ భూములు ఉన్నందువల్లే ఫ్యూచర్ సిటి కడుతున్నానని అంటున్నారని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తన కోసం కాదని భవిష్యత్తు తరాల కోసం ఫ్యూచర్ సిటీ అని అన్నారు. ఫ్యూచర్ సిటి డెవలప్ మెంట్ అథారిటీ భవనానికి సిఎం శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో రావిర్యాల- ఆమన్ గల్ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్-1 సిఎం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్ పేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఫ్యూచర్ సిటీపై కొందరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ముందుతరాల కోసం ఆలోచించారని, అందువల్లే హైటెక్ సిటి, శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఒఆర్ఆర్ వచ్చాయని తెలియజేశారు.
చాలా మంది విదేశాలకు వెళ్లి వచ్చి అద్భుతంగా ఉన్నాయని చెబుతుంటారని, ఎన్నాళ్లు న్యూయార్క్, సింగపూర్, దుబాయి గురించి చెప్పుకుంటామని అన్నారు. గత పాలకుల నుంచి మంచి ఉంటే నేర్చుకోవాలని, ఎన్నాళ్లు విదేశాల గురించి చెప్పుకుంటాం.. మనం కూడా అలా తయారు కావాలి కదా అని సూచించారు. తనకు పదేళ్లు సమయం ఇవ్వండని.. న్యూయార్క్ ను మరిపించే నగరం కడతానని, 70 ఏళ్ల తర్వాత కూడా మన గురించి ప్రపంచం మాట్లాడుకునే పనులు చేయొద్దా? అని రేవంత్ ప్రశ్నించారు.
అభివృద్ధి పనుల వల్ల కొందరికి ఇబ్బందులు కలగవచ్చునని, భారత్ ఫ్యూచర్ సిటీకి ఏం తక్కువ? అన్ని అవకాశాలు ఉన్నాయని, అందుకే ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నానికి 12 లేన్ల రోడ్డు వేయబోతున్నామని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటి నుంచి చైన్నైకి బుల్లెట్ ట్రైన్ వయా అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందని, ఫ్యూచర్ సిటీలో 500 ఫ్యార్చ్యూన్ కంపెనీలు కొలువు తీరాలన్నది తన స్వప్నం అని, హైదరాబాద్ లో ప్రస్తుతం 80 ఫ్యార్చ్యూన్ కంపెనీలే ఉన్నాయని అన్నారు. ఫ్యూచర్సి సిటీ విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటామని, చిన్న చిన్న విషయాలకు కోర్టులకు వెళ్లి ఇబ్బంది పడవద్దు అని రేవంత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి సిఎం భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, తదితరలు పాల్గొన్నారు.