కామెడీ, ఎమోషన్స్ చాలా కొత్తగా…
లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్‌తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ’ప్రేమలు’ అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ సందర్భంగా శరత్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “నేను కథలో ముఖ్య భాగమయ్యే పాత్రలు చేయడానికి ఇష్టపడతాను. డైరెక్టర్ కీర్తిశ్వరన్ చెప్పిన డ్యూడ్ కథ అద్భుతంగా వుంది. ప్రదీప్ కి అంకుల్ గా కనిపిస్తాను. నా పాత్ర కథలో చాలా ముఖ్యమైనది. చాలా కొత్త పాయింట్. ఒక ఫ్యామిలీలో ఇలాంటి ఒక విషయం జరిగితే సమాజం ఎలా స్పందిస్తుందనే కోణంలో డైరెక్టర్ చాలా అద్భుతంగా చూపించారు. -ఇది రెగ్యులర్ సినిమాలా వుండదు. కామెడీ, ఎమోషన్స్ అన్నీ విభిన్నంగా, కొత్తగా చూపించారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో పని చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. ఇది చాలా ఎమోషనల్ ఫిల్మ్. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి కంటెంట్ వుంది. ఆడియన్స్ చాలా కొత్తగా ఫీల్ అవుతారు. సాయి అభ్యంకర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. -ప్రదీప్ ఆల్‌రౌండర్. మంచి నటుడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టయిల్ వుంది. ప్రస్తుతం మిస్టర్ ఎక్స్ అనే సినిమా చేస్తున్నాను. అలాగే నవంబర్‌లో ఒక సినిమా రిలీజ్‌కి వుంది. బాలీవుడ్‌లో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే గౌతమ్ మీనన్‌తో కలసి ఒక సినిమా చేస్తున్నాను” అని అన్నారు.