ట్రెండ్ సెట్ చెయ్…
నవదళపతి సుధీర్ బాబు నటిస్తున్న ఫాంటసీ యాక్షన్ మూవీ జటాధర నుంచి ప్రమోషనల్ సాంగ్ ట్రెండ్ సెట్ చెయ్ రిలీజ్ అయింది. ఇన్‌స్టంట్‌గా ఈ సాంగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎంటర్‌టైనింగ్ బీట్స్, కలర్‌ఫుల్ విజువల్స్, సుధీర్ బాబు ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో ఈ పాట అందరినీ అలరిస్తోంది. రీస్, జైన్ – సామ్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ యూత్‌ఫుల్ ఎనర్జీతో అదిరిపోయింది. లిరిసిస్ట్ శ్రీమణి తెలుగుతో ఇంగ్లీష్ మిక్స్ చేస్తూ, ఆకట్టుకునే వర్డ్ ప్లేతో సాంగ్‌ను ట్రెండీగా రాశారు. జితేందర్ ,రాజీవ్ రాజ్ తమ గాత్రంతో పాటకు మరింత ఎనర్జీ ఇచ్చారు.
స్టైలిష్ పబ్ సెట్‌లో తెరకెక్కిన వీడియోలో సుధీర్ బాబు, శ్రేయా శర్మతో కలసి స్టైలిష్ మూవ్స్ చూపిస్తూ అదరగొట్టారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా నిర్మిస్తున్న ఈ మిథాలజికల్ స్పెక్టాకిల్‌లో బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.