సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా
వరలక్ష్మీ పప్పుల సమర్పణలో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రేమిస్తున్నా చిత్రం నుండి సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నాను మేకర్స్ విడుదల చేశారు. 56 సెకన్ల నిడివి ఉన్న కంటెంట్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సినిమా ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేసింది చిత్ర యూనిట్. ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
స్వచ్ఛమైన ప్రేమకథతో రాబోతున్న ఈ సినిమాలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా పోటీపడి నటించారు. దర్శకుడు భాను ప్రేమిస్తున్నా సినిమాను న్యూ ఏజ్డ్ లవ్ స్టోరీగా ఆడియన్స్ కు చూపించబోతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ “అన్ కండీషనల్ లవ్‌తో తెరకెక్కిన సినిమా ప్రేమిస్తున్నా. ఇప్పటివరకు తెలుగులో ఇలాంటి సినిమా రాలేదు. అద్భుతమైన పాటలు, సన్నివేశాలతో ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇది ఒక మ్యూజికల్ లవ్ స్టొరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు సాత్విక్ వర్మ, ప్రీతి నేహా, నిర్మాత కనకదుర్గారావు పప్పుల పాల్గొన్నారు.