‘మహాకాళి’ పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్
హనుమాన్ సినిమాతో సూపర్ హీరో జానర్‌ను నెక్స్ లెవల్ కి తీసుకెళ్ళిన విజనరీ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ వర్మ, ఆర్‌కెడి స్టూడియోస్ తో కలసి మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. వారి కొత్త చిత్రం మహాకాళి నుంచి లీడ్ ఫేస్‌ను పరిచయం చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో భూమి శెట్టి ప్రధాన పాత్రలో కనిపించగా, ఆమె లుక్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా ఇప్పటికే 50 శాతానికి పైగా షూట్ పూర్తిచేసుకుంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్స్‌పై ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.
ఫస్ట్ లుక్‌లో భూమి శెట్టి ఎరుపు, బంగారు వర్ణంలో ఆగ్రహం, కరుణ రెండింటినీ ప్రతిబింబిస్తూ మెరిసింది. సాంప్రదాయ ఆభరణాలు, పవిత్ర చిహ్నాలతో అలంకరించబడిన ఆమె చూపు, సృష్టి-ప్రళయం, విధ్వంసం-, పునర్జన్మ శక్తిని సూచిస్తోంది. ఆర్‌ఎకే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్, పూజ కొల్లూరు దర్శకత్వం కలసి గ్రేట్ విజువల్ వండర్‌ను అందించబోతున్నాయి.