తాజా వార్తలు,Cinema News
Auto Added by WPeMatico
హర్రర్ థ్రిల్లర్.. ఆద్యంతం ఆసక్తికరంగా ‘ఆర్యన్’ టీజర్
విజువల్ వండర్‌గా..
ఎస్‌ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా గత వైభవ. సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు. మేకర్స్ తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. చరిత్ర, పురాణాల నేపధ్యంలో రూపొందిన టీజర్ అద్భుతంగా వుంది. ఎస్‌ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ పర్ఫార్మెన్స్‌లు ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ సింపుల్ సుని కథని విజువల్ వండర్‌గా చూపించారు. నవంబర్ 14న ఈ చిత్రం విడుదల కానుంది.
‘శశివదనే’ అందమైన ప్రేమ కథ
సుడిగాలి సుధీర్ ‘హైలెస్సో’ ప్రారంభం
రష్మిక హారర్ కామెడీ మూవీ ‘థామా’ ట్రైలర్ విడుదల
అదే నిజమైన ప్రేమ.. అప్పుడు నాకు ఎవరూ చెప్పలేదు.. సమంత పోస్ట్ వైరల్
‘ది రాజాసాబ్’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
విజయ దశమి కానుకగా..
నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. విజయదశమి కానుకగా ఈ సినిమా నుంచి అక్టోబర్ 1న ధన పిశాచి సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ అదిరిపోయింది. జటాధరలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, సుభలేఖ సుధాకర్తో పాటు ప్రముఖ నటులు కనిపించనున్నారు. మంచికి-చెడుకి, వెలుగుకి-చీకటికి, మానవ సంకల్పానికి- విధికి మధ్య జరిగే అద్భుతమైన పోరాటాన్ని ఈ చిత్రం చూపించబోతోంది. జీ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్హల్, నిఖిల్ నందా నిర్మించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
‘కాంతార: చాప్టర్ 1’ బ్లాక్ బస్టర్ హిట్ కావాలి: ఎన్టీఆర్
రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. హోంబలే ఫిలమ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘కాంతార రిషబ్ శెట్టి డ్రీమ్ ఈ సినిమా. ఈ కలని నెరవేర్చడానికి హోంబలే ఫిలమ్స్ సపోర్ట్ చేశారు. ఇండియన్ ఫిలిమ్స్‌లో ఒక గొప్ప బ్లాక్ బాస్టర్‌గా ఈ చిత్రం నిలవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి మాట్లాడుతూ ‘ఈ వేడుకకు ఎన్టీఆర్ రావడం చాలా ఆనందంగా ఉంది. అక్టోబర్ 2న ఈ సినిమాని అందరూ థియేటర్స్‌లో చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి మాట్లాడుతూ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో భారీ వసూళ్లను సాధించాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, హీరోయిన్ రుక్మిణి వసంత్ తదితరులు పాల్గొన్నారు.