తాజా వార్తలు,Cinema News
Auto Added by WPeMatico
‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ యాక్షన్- ప్యాక్డ్ టీజర్ విడుదల
‘ఛాంపియన్’ వచ్చేస్తున్నాడు
ఆ వార్తలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది: సమంత
విద్యార్థుల జీవితానికి మంచి మార్కులు, గ్రేడులే ముఖ్యం కావని మానవతా విలువలు కూడా అంతే అవసరమని అన్నారు స్టార్ హీరోయిన్ సమంత. తాజాగా ఆమె నేటి విద్యావ్యవస్థ గురించి మాట్లాడుతూ “చదువుతో పాటు మంచి విలువలు ఉండేలా పిల్లలకు అన్ని రకాల విద్యలు నేర్పించాలి. ప్రస్తుతం విద్యార్దుల పడుతోన్న బాధలు, ఇబ్బందుల గురించి పత్రికల్లో , సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. పిల్లలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారనిపిస్తోంది. నేను స్కూల్‌లో చదువుకుంటోన్న రోజుల్లో ఇలాంటివి ఏవీ లేవు. స్నేహం, దయ, సానుభూతి, ఇతరుల పట్ల గౌరవం వంటి లక్షణాలే నాకు జీవితంలో ఎంతగానో ఉపయోగపడ్డాయి. మంచి మనిషిగా ఎలా ఉండాలో పాఠశాల నేర్పిస్తుంది. స్కూల్‌లో నేర్చుకున్నవే జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలో సహకరిస్తాయి. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నిలబడే ధైర్యాన్ని కూడా పాఠశాల దశ నుంచే పిల్లలు అలవాటు చేసుకోవాలి. ఇలాంటి అంశాలతో కూడిన పాఠ్యాంశాలను జోడిస్తే బాగుంటుంది”అని పేర్కొంది.
యూరప్‌లో ‘రాజా సాబ్’
ఆకట్టుకుంటున్న ‘సింగారి..’
యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా మూవీ డ్యూడ్‌తో అలరించడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ‘ప్రేమలు’ అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. మ్యూజిక్ ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ ‘సింగారి’ సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఈ పాటను స్వయంగా సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ స్వరపరచి పాడారు. ఎనర్జిటిక్ బీట్స్, క్యాచి లిరిక్స్, యూత్ ఎనర్జీ ఈ సాంగ్‌ని ఒక ఫన్ ప్యాకేజ్‌లా మార్చేశాయి. రామజోగయ్య శాస్త్రి రాసిన ఆకట్టుకునే లిరిక్స్ సాంగ్‌కి అదనపు ఉత్సాహం తీసుకొచ్చింది. డ్యూడ్ అక్టోబర్ 17న దీపావళి సందర్భంగా, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
‘మిరాయ్’ టీంని అభినందించిన దిల్ రాజు
సూపర్‌హీరో తేజా సజ్జా బాక్సాఫీస్ వద్ద విజయయాత్ర కొనసాగిస్తున్నారు. ఆయన తాజా చిత్రం మిరాయ్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్‌తో దూసుకెళ్తోంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ సీజన్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు మిరాయ్ టీంని అభినందించారు. మిరాయ్ సినిమా విజయాన్ని పురస్కరించుకొని సూపర్‌హీరో తేజసజ్జా కోసం తమ ఇంట్లో ఆత్మీయంగా ఒక వేడుక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తేజసజ్జాతో పాటు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది అభిమానం, అభినందనలతో కూడిన ఒక ఆద్భుతమైన సందర్భంగా నిలిచింది. మిరాయ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో 150 కోట్లు పైగా వసూలు చేసింది. నార్త్ అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్క్‌ని దాటింది. రితికా నాయక్ హీరోయిన్‌గా, మనోజ్ మంచు, శ్రీయా శరణ్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం, యాక్షన్ సన్నివేశాలు, అద్భుతమైన విజువల్స్‌తో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
స్నేహం, ఐక్యతను చూపిన ఆత్మీయ వేదిక
దక్షిణ భారత సినిమా పరిశ్రమలో ప్రతి సంవత్సరం ఎంతో అద్భుతంగా జరిగే 80s స్టార్స్ రీ యూనియన్ చెన్నైలో జరిగింది. మూడు సంవత్సరాల విరామం తర్వాత జరిగిన ఈ సమావేశం, అందరికీ అద్భుతమైన ఎమోషనల్ మూమెంట్ గా నిలిచింది. గతేడాదే నిర్వహించాలనుకున్నా, చెన్నైలో జరిగిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఆ రీయూనియన్ వాయిదా పడింది. ఈసారి ఆ వేడుక స్నేహం, ఐక్యత, హృదయపూర్వకమైన సమావేశం విజయవంతంగా జరిగింది. రాజ్‌కుమార్ సేతుపతి, శ్రీప్రియ దంపతులు తమ ఇంట్లోనే ఈ రీయూనియన్‌ను ఆతిథ్యం ఇచ్చారు. లిస్సీ లక్ష్మి, పూర్ణిమ భగ్యరాజ్, ఖుష్బూ సుందర్, సుహాసిని మణిరత్నం ఈ కార్యక్రమాన్ని కోఅర్దినేట్ చేశారు. ఇంటి ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ సమావేశం, ఆ తారల మధ్య ఉన్న నిజమైన అనుబంధాన్ని ప్రతిబింబించింది. మొత్తం 31 మంది నటులు ఈ రీయూనియన్‌లో పాల్గొన్నారు.
తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పాటు హిందీ పరిశ్రమ నుండి కూడా స్టార్స్ వచ్చారు. సాయంత్రం అంతా నవ్వులు, జ్ఞాపకాలు, అనుభవాలు పంచుకుంటూ ఆత్మీయంగా గడిచింది. 80s స్టార్స్ రీ యూనియన్ గురించి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. “80s స్నేహితులతో ప్రతి రీయూనియన్ మధుర జ్ఞాపకాల వీధిలో ఒక నడకలా ఉంటుంది. నవ్వులు, ఆప్యాయత, పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ ఆనందం, ప్రేమతో గడుస్తుంది. ఎన్ని సార్లు కలిసినా, ప్రతి సారి కొత్తగా, మొదటిసారి కలిసినట్టే సంతోషంగా అనిపిస్తుంది‘ అని చిరంజీవి అన్నారు.’ ఈసారి ఇది ఉత్సవం కాదు, అని సుహాసిని మణిరత్నం తెలిపారు. ఇలా ప్రతి ఏడాది జరగే ఈ 80s స్టార్స్ రీ యూనియన్ స్నేహం, ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం విలువలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ రీ యూనియన్ లో చిరంజీవి, వెంకటేష్, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, రాజ్‌కుమార్ సేతుపతి, శ్రీప్రియ, నదియా, రాధ, సుహాషిని, రమ్యకృష్ణ, జయసుధ, సుమలత, రెహమాన్, ఖుష్బూ, భాగ్యరాజ్, పూర్ణిమా భాగ్యరాజ్, లిస్సీ, నరేష్, సురేష్, శోభన, మేనక, రేవతి, ప్రభు, జయరామ్, అశ్వతీ జయరామ్, సరిత, బాను చందర్, మీనా, లత, స్వప్న, జయశ్రీ పాల్గొన్నారు.
మూడో పాట వచ్చేస్తోంది
మాస్ మహారాజా రవితేజ హీరోగా 75వ చిత్రంగా రూపొందుతున్న సినిమా ‘మాస్ జాతర’ శ్రీలీల హీరోయిన్‌గా దర్శకుడు భాను బోగవరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు చాలా కాలం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఫైనల్‌గా ఈ అక్టోబర్‌లో రిలీజ్‌కి వస్తున్న ఈ సినిమా నుంచి నెకస్ట్ సాంగ్‌కి రంగం సిద్ధం అయ్యింది. ఇది వరకే వచ్చిన రెండు పాటలు మంచి స్పందనను అందుకున్నాయి. ఇక మూడో సాంగ్ హుడియో హుడియో అంటూ సాగే శ్రీలీల, రవితేజ మాస్ నెంబర్. ఇక ఈ సాంగ్ తాలూకా ప్రోమో సోమవారం ఉదయం 11 గంటల 8 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. సంగీత దర్శకుడు భీమ్స్ ఈసారి ఎలాంటి ట్యూన్‌ని అందించాడో చూడాలి మరి. ఇక ఈ సినిమా థియేటర్లలో అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదలవుతుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.