హైదరాబాద్ లో దంచి కొట్టిన వాన.. రోడ్లన్నీ నదులాయే

హైదరాబాద్‌లో మరోసారి కుండపోత వాన స్తంభించిన వాహనాల రాకపోకలు పలు ప్రాంతాల్లో కొట్టుకుపోయిన వాహనాలు బంజారాహిల్స్‌లో 10.15 సెం.మీటర్ల వర్షపాతం మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో సోమవా రం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఆకాశమం తా మేఘావృతమై కుండపోతగా వర్షం పడింది. ఏకంగా 10.15 సెం.మీ.లుగా భారీగా వాన కురవడంతో నగర రోడ్లు నదులుగా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలాశయాలుగా మారా యి. బంజారాహిల్స్ హకీంపేట్‌లో ఓ గోడకూలింది. పలు వాహనాలు కొట్టుకుపోయాయి. […]








