హాస్టల్‌లో యువకుడి అనుమానస్పద మృతి

హైదరాబాద్: మియాపూర్‌లోని ఓ హాస్టల్‌లో (Miyapur Hostel) దారుణం చోటు చేసుకుంది. ప్లంబర్‌గా పని చేస్తూ హాస్టల్‌లో ఉంటున్న ఖమ్మం జిల్లాకు చెందిన గణేష్ అనే యువకుడు హాస్టల్‌లో అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. హాస్టల్‌లో విగతజీవిగా పడి ఉండటంతో హాస్టల్ నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసి హాస్టల్ వద్ద వచ్చిన మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పడంతో మృతుడి బంధువులు ఆందోళణ విరమించారు. ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు […]








