50 మిలియన్ల వ్యూస్‌తో ‘మీసాల పిల్ల..’ హల్‌చల్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల…’ 50 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా మ్యూజిక్‌కి కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది. హిట్‌మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పండగ వాతావరణంలో, కుటుంబమంతా కలిసి చూసేలా ఉండే ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఆ వైబ్‌ను అద్భుతంగా అందించిన సాంగ్ మీసాల పిల్ల. భీమ్స్ సెసిరోలియో అందించిన ఎనర్జిటిక్ ట్యూన్, బీట్‌లతో ఈ పాట దేశవ్యాప్తంగా చార్ట్‌బస్టర్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి తన సిగ్నేచర్ చార్మ్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ముఖ్యంగా నయనతారతో ఉన్న సీన్స్‌లో ఆయన టైమింగ్ ఫ్యాన్స్‌ని అలరించింది. ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ గాత్రాలు కట్టిపడేశాయి. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, రీల్స్ ఎక్కడ చూసినా మీసాల పిల్ల ఫీవర్‌నే కనిపిస్తోంది. అభిమానులు డాన్స్ చేస్తూ, రీమిక్స్‌లు చేస్తూ, తమ ప్రేమను అద్భుతంగా వ్యక్తపరుస్తున్నారు. ఈ పాటకు వస్తున్న అద్భుతమైన స్పందనతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మిగతా సాంగ్స్‌పై కూడా భారీ ఆసక్తి నెలకొంది. సాహూ గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్న మన శంకరవర ప్రసాద్ గారు 2026 సంక్రాంతికి గ్రాండ్‌గా విడుదల కానుంది.