ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సుభాస్కర న్ లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో జాసన్ సంజయ్ దర్శకత్వంలో యాక్షన్- అడ్వెంచర్ కామెడీ మూవీ ‘సిగ్మా’ చిత్రం 65 రోజుల షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు ప్రకటించారు. నాలు గు నెలల పాటు జరిగిన షూటింగ్‌తో ఇప్పుడు సినిమా 95 శాతం పూర్తయింది. ఈ చిత్రానికి సిగ్మా అనే టైటిల్ ఫిక్స్ చేశా రు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హీరో సందీప్ కిషన్ యాక్షన్ అవతార్ కనిపించారు. బంగారం, నోట్ల కట్టల మధ్య కూర్చొని, తన చేతికి బ్యాండేజ్ కడుతున్నట్లుగా కనిపించిన సందీప్ లుక్ అదిరిపోయింది. ఈ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా హీరో పాత్రలోని ఇన్‌టెన్స్ యాంగిల్‌తో పాటు సినిమా ట్రెజర్ హంట్ కథాంశాన్ని సూచిస్తోంది. సిగ్మా కథ ఒక ధైర్యశాలి, నియమాలకు అతీతమైన వ్యక్తి నేపధ్యంలో వుంటుంది. ఈ చిత్రంలో సందీప్ కిషన్ పూర్తి స్థాయి యాక్షన్ హీరోగా అలరించనున్నారు.
ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండ, మహాలక్ష్మి, సుదర్శనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు జేసన్ సంజయ్ మాట్లాడుతూ “ట్రెజర్ హంట్, కామెడీ అంశాల మేళవింపుతో ఈ సినిమా ఒక థ్రిల్లింగ్ సినిమా అనుభూతిని అందిస్తుంది. తమన్ సంగీతం, సందీప్ కిషన్ యాక్షన్ ఎనర్జీ, లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు – ఇవన్నీ కలిసి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. సినిమాలో ఒక పాట మిగిలి ఉండగా, త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభించి వేసవి ప్రారంభంలో సినిమాను విడుదల చేస్తాం”అని అన్నారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని చెన్నై, సేలం, తలకోన, థాయ్‌లాండ్ ప్రాంతాల్లో షూట్ చేశారు.