‘ఆంధ్ర కింగ్..’కు అదిరిపోయే స్పందన
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ బా ్లక్‌బస్టర్ ’ఆంధ్ర కింగ్ తాలూకా’. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మే కర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ బాబు. పి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషించారు. ఈ చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ స్పందనతో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా థాంక్ యూ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో హీరో రామ్ పోతినేని మాట్లాడుతూ “స్టార్ అండ్ ఫ్యాన్‌కు మ ధ్య ఉన్న ఎమోషన్ చెబుతూ, హ్యూమన్ ఎ మోషన్ కూడా టచ్ చేసిన సినిమా ఇది. ఇలాంటి ఎమోషన్ ప్రపంచంలో ఎక్కడా లే దు. మన తెలుగు సినిమాకే సొంతం. వివేక్, మెర్విన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో మంచి సందేశం ఉంది. భాగ్యశ్రీ గ్లామర్‌గా కనిపిస్తూనే అద్భుతంగా నటించింది”అని అన్నారు. ప్రొడ్యూసర్ రవి మా ట్లాడుతూ “ఇది చాలా మంచి సినిమా. అం దరూ చూడాలని కోరుకుంటున్నాం. ఈ సినిమాని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లబోతున్నాం”అని పేర్కొన్నారు. డైరెక్టర్ మహేష్ బాబు మాట్లాడుతూ సినిమా ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్లబోతోందిఅని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీ రోయిన్ భాగ్యశ్రీ ,మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్, మెర్విన్ పాల్గొన్నారు.