వరం శాపంగా మారడంతో…ఇప్పటికి పారిపోతున్నాను: ధనుష్
హైదరాబాద్: కోలీవుడ్‌లో అగ్రహీరోల సినిమాలు తెలుగులో విడుదల చేస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్‌లలో సూర్య, విజయ్, దనుష్, రజనీకాంత్ సినిమాలు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతున్నాయి. తమిళంలో విడుదల చేసిన ప్రతి సినిమాను టాలీవుడ్‌లో సదరు హీరోల సినిమాలను రిలీజ్ చేస్తూ బాక్సాపీసు వద్ద వసూళ్లు రాబడుతున్నారు. వెంక్లీ అట్లూరి దర్వకత్వంలో ధనుష్ నటించిన ‘సార్’ అనే మూవీ హిట్ కావడంతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో వంద కోట్ల కలెక్షన్లు కూడా రాబట్టడంతో దర్శక, నిర్మాతలు సంతోషంతో మురిసిపోతున్నారు. ధనుష్ పాడిన పాట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ‘వై దీస్ కొలవరి డీ’ పాటపై ధనుష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను తమిళనాడు నుంచి వచ్చానని, తమిళ భాష అనేది పురాతన లాంగ్వేజ్ అని, ఆ పాట తమిళంలో లేదని, తంగ్లీష్‌లో ఉందని తెలియజేశారు. ఆ పాట నుంచి ఇప్పటివరకు పారిపోతూనే ఉన్నానని ధనుష్ జవాబిచ్చాడు. తాను ఇప్పటికీ ఓడిపోతున్నానని, వైరల్ మార్కెట్‌కు నిర్వచనంలా మారిందని ప్రశంసించారు. ఒక రోజు పాటను పాడి పక్కన పెట్టేశామని, కొన్ని రోజుల తరువాత వింటే మాకు చాలా జోక్‌గా అనిపించిందని, జోక్స్ ఎల్లప్పుడూ పని చేస్తాయని మ్యూజిక్ డైరెక్టర్ చెప్పడంతో ఒకసారి చూద్దామని చెప్పానన్నారు. ఆ పాటను విడుదల చేసిన కొన్ని రోజులలో యూట్యూబ్‌లో రికార్డులో స్థాయిలో వ్యూస్ వచ్చాయన్నారు. తనకు చాలా గర్వంగా ఉందని, వరం వలే ఇది మాకు శాపంగా మారిందన్నారు. ప్రస్తుతం ధనుష్ డి-54, డి-55 వంటి భారీ ప్రాజెక్టులలో పని చేస్తున్నారు.