Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

jojobet

Streameast

onwin

ataköy escort

ultrabet

ultrabet

aresbet

padişahbet

royalbet

royalbet

Hacklink Panel

Hacklink

ultrabet

padişahbet

Streameast

Hacklink

wbahis

casibom giriş

Betoffice

Holiganbet giriş

wbahis

wbahis

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet giriş

jojobet

matbet

wbahis

rokubet

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

jojobet

jojobet giriş

hiltonbet

pusulabet

meritking giriş

Galabet

ultrabet

truvabet

artemisbet

rokubet

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

sahabet

rokubet

Hacklink

casibom

livebahis

matbet

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

betpas

request hit botu

betpas giriş

matbet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

rokubet

Restbet

Restbet giriş

piabellacasino

milosbet

sonbahis

bahix

parmabet

mislibet

piabellacasino

piabellacasino

yakabet

casibom

meybet

online diyetisyen

Betoffice

wbahis

kralbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

primebahis

Meritking Giriş Güncel

Kavbet

Galabet

polobet

asyabahis

queenbet

Restbet

Restbet giriş

winxbet

casibom giriş

ultrabet

Marsbahis

sekabet

marsbahis

bahsegel

pusulabet

pusulabet

meritking

oslobet

kingroyal

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

ronabet giriş

milosbet

wbahis

padişahbet giriş

vaycasino

Casibom

Casibom Giriş

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

nitrobahis

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

holiganbet

holiganbet

holiganbet

betsmove

betsmove giriş

Meritking Giriş

yakabet resmi adres

Betoffice

Casibom

Betoffice

Betoffice

Agb99

Agb99

holiganbet

piabellacasino

ultrabet

padişahbet giriş

bağcılar escort

betpuan

xgeorgia

sekabet

pusulabet

vdcasino

imajbet

marsbahis

imajbet

Betoffice

grandpashabet

grandpashabet

pusulabet

pusulabet

pusulabet güncel

meritking

vaycasino

jojobet giriş

betsmove

Slot Mahjong

meritking güncel

jojobet

Betpas

matbet

matbet güncel giriş

sweet bonanza oyna

1xbet

fatih escort

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

jojobet

Online Hack Tool

Meritking Güncel

piabellacasino

starzbet

piabellacasino

mislibet

nitrobahis

milosbet

milosbet

parmabet

piabellacasino

odeonbet

odeonbet

coinbar

coinbar

odeonbet giriş

coinbar giriş

royalbet

royalbet giriş

polobet

polobet giriş

vdcasino

betine

ultrabet

marsbahis

vdcasino

sekabet

pusulabet

casibom

imajbet

matbet

meritking

grandpashabet

holiganbet

casivera

hilarionbet

betoffice

bahiscasino

vdcasino

Marsbahis giriş

Holiganbet giriş

sekabet güncel giriş

deneme bonusu veren yeni siteler

casibom giriş

casibom

betpuan

betpuan giriş

izmir escort

Jojobet giriş

vdcasino

queenbet

padişahbet

setrabet

vdcasino

milanobet

kralbet

kingroyal

casibom giriş

otobet

madridbet

superbet

betovis

betasus

grandpashabet

onwin

berlinbet

matadorbet

rinabet

casinowon

sonbahis

hazbet

yakabet

kralbet

suratbet

süratbet

winxbet

pradabet

betcio

gobahis

parmabet

sekabet

matbet

kavbet

casinolevant

casinolevant

vdcasino

spinco

kingroyal giriş

artemisbet

meritking giriş

betturkey

Sweet Bonanza

Sweet Bonanza Oyna

casinolevant

kingroyal

kingroyal giriş

casinolevant

roketbet

kralbet

asyabahis

betticket

betticket giriş

Sugar Rush 1000

wbahis

casinolevant

cratosroyalbet

rinabet

meritking

yakabet

casinolevant

marsbahis

marsbahis

marsbahis

casinowon

grandpashabet

marsbahis

kingroyal

kingroyal giriş

kingroyal güncel giriş

dinamobet

betturkey giriş

జూబ్లీహిల్స్ బిజెపి అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: ఎట్టకేలకు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి బి జెపి అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును ఆ పార్టీ జాతీయ నాయకత్వం బుధవారం ప్రకటించింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు ఇదివరకే తమ అభ్యర్థులను బరిలోకి దించి విస్తృతంగ ప్రచారం నిర్వహిస్తుండగా బిజెపి అభ్యర్థి ఎంపిక విషయంలో జాప్యం చేసింది. చివరకు లంకల దీపక్ రెడ్డి అభ్యర్థిత్వా న్ని ఖరారు చేసింది. దీపక్ రెడ్డి గత అసెంబ్లీ సా ర్వత్రిక ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఆయన ప్ర స్తుతం బిజెపి హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బిఆర్‌ఎస్ తరపున ఎన్నికైన మగంటి గోపినాథ్ ఈ ఏడాది జూన్ 8న అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. పోలింగ్ వచ్చే నెల 11న, ఓట్ల లెక్కింపు 14న జరగనున్నది.

నేటి నుంచి మక్కల కొనుగోలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం లో సాగైన మక్కలను గురువారం నుంచి కొనుగోలు చేసేందు కు సర్కారు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 202సెంటర్లలో మక్కలు కొనుగోలు చేయనున్నారు. ఈ సీజన్లో మొక్కజొన్న పంట మార్కెట్‌కు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించి మక్కల కొనుగోళ్ల బాధ్యతలు అప్పగించింది. మార్క్‌ఫెడ్ అధికారులు కొనుగోళ్లపై కసరత్తు పూర్తి చేసి, ప్రణాళికలు సిద్ధం చేశారు. రైతులు తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకొని నష్టపోకుండా సర్కారు మ ద్దతు ధరలకు మక్కలు కొనుగోలు చేయనుంది. క్వింటాకు రూ.2,400 చొప్పున మద్దతు ధరతో మక్కలు కొనుగోలు చే యనుండగా, సాధారణ ధర క్విటాకు రూ. 1900 నుంచి రూ.2000 ధర మాత్రమే ఉంది.

రాష్ట్రంలో 6.24 లక్షల ఎకరాల్లో సాగు

ఈ వానాకాలంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 6.24 ల క్షల ఎకరాల్లో 11.55 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు సాగు చేసి రాష్ట్ర రైతులు రికార్డు సృష్టించారు. వానాకాలం మక్కల సాధారణ సాగు విస్తీర్ణం 5.21లక్షల ఎకరాలు కాగా, నిరు డు ఇదే సమయానికి 5.23 లక్షల ఎకరాల్లో సాగైంది. గతేడాది కంటే అధికంగా మక్కలు సాగైనట్లు వ్యవసాయశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదికలో పేర్కొంది. మక్కల సాగులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 95,116 ఎకరాలతో ప్రథమ స్థానంలో ఉండగా, ఆ తరువాత రంగారెడ్డి జిల్లాలో 65,262 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 59,734 ఎకరాల్లో సాగైంది. నాగర్ కర్నూల్ జిల్లాలో 53,128 ఎకరాల్లో, నిజామాబాద్ జిల్లాలో 52,093 ఎకరాల్లో, కామారెడ్డి జిల్లాలో 50,736 ఎకరాల్లో సాగైనట్లు అధికారిక నివేదికలో పేర్కొన్నారు. వానాకాలం సీజన్లో 11లక్షల టన్నులు మార్కెట్‌కు రావచ్చని అధికారులు తెలిపారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో నిర్వహించే కొనుగోలు సెంటర్లకు 5 నుంచి 6 లక్షల టన్నుల మక్కలు వస్తాయని మార్క్ ఫెడ్ అధికారులు అంచనా వేస్తున్నారు.

బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తలొగ్గను: మంత్రి జూపల్లి

బ్లాక్ మెయిల్ రాజకీయాల కు తాను లొంగనని, తప్పుడు వార్తలు, ఆరోపణలపై స్పం దించాల్సిన అవసరం లేదని పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ తన మేనల్లు డు సతీశ్ రావు కనపర్తి ఆర్గానిక్ చైన్ స్టోర్స్ విషయంలో వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు. కుట్రపూరిత ఆరోపణల వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, తప్పుఒప్పులు అందరి దగ్గర జరుగుతాయన్నారు. ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకుంటానని ఆయన తెలిపారు. లిక్కర్ టెండర్లు చివరి మూడు రోజుల్లో భారీ సంఖ్యలో వస్తాయ ని గతేడాది చివరి మూడు రోజుల్లో 96 వేల దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు.

ఆర్గానిక్ చైన్ స్టోర్స్ పేరుతో వ్యాపారం

అమెరికాలో ఉండే మంత్రి జూపల్లి కృష్ణారావు మేనల్లుడు సతీశ్ రావు కనపర్తి తన మేనమామ మంత్రి జూపల్లి కావటంతో ఆయన ఇండియాకు వచ్చి ఆర్గానిక్ చైన్ స్టోర్స్ పే రుతో వ్యాపారం మొదలు పెట్టారని, అందులో భాగంగా హైదరాబాద్‌లో 4 స్టోర్లు ప్రారంభించిన సతీశ్ రావు నేచురల్‌గా పండిన వ్యవసాయ ఉత్పత్తులు అందించి ఆరో గ్యం కాపాడుతానని ప్రజలను నమ్మించి వారి వద్ద కోట్లు వసూలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయన్ను నమ్మి అనేక మంది సీనియర్ సిటిజన్లు పెట్టబడులు పెట్టా రు. కొంతకాలం వారికి నెల నెల వడ్డీలు కడుతూ వారిలో నమ్మకం కలిగించిన సతీశ్ కోట్లాది రుపాయలు వసూలు చేశారని అనంతరం ఆ సొమ్ముతో అమెరికా పారిపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తమ డబ్బులేవని అడిగినందుకు సతీశ్ రావు తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తుండడంతో ఈ అంశంపై మంత్రి జూపల్లి స్పందించారు.

డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ప్రారంభం

 మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ -గూగుల్‌తో భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఒప్పందం డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ బుధవారం డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని క్యాంపస్‌లో నిర్వహిస్తుంది. ఇది భారతదేశంలోనే అతి పెద్ద డిజిటల్ భాగస్వామ్యంగా నిలవనుంది. దీని ద్వారా 50,000 మంది విద్యార్థులకు రాబోయే రోజుల్లో ్ సాంకేతిక నైపుణ్యాలు, ఏఐ ఆధారిత విద్యా పద్ధతులు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సర్టిఫికేషన్‌లు అందించబడతాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గూగుల్ సంస్థ నుండి వైభవ్ కుమార్ శ్రీవాస్తవ (ఇండియా హెడ్ – ఎడ్యుకేషన్ అండ్ ఎడ్‌టెక్స్), సిద్ధార్థ్ దల్వాడి (దక్షిణ భారత హెడ్ – ఎడ్యుకేషన్ అండ్ ఎడ్‌టెక్స్), మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో 50,000 మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని గూగుల్ లోగోతో ఉన్న 50,000 బెలూన్లు ఆకాశంలోకి ఎగురవేశారు.

మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం, మల్లారెడ్డి డీమ్ డ్ టు బీ యూనివర్సిటీ లతో కూడిన మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ భారతదేశంలోనే అతి పెద్ద డిజిటల్ భాగస్వామ్య ప్రాజెక్టుగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ విద్యా ప్రపంచం, డిజిటల్ ఇండస్ట్రీ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే కాకుండా, విద్యార్థులు ప్రపంచ టెక్నాలజీ మార్పులకు సన్నద్ధంగా ఉండేలా చేస్తుంది. ఈ సందర్భంగా మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ డాక్టర్ భద్రా రెడ్డి మాట్లాడుతూ గూగుల్‌తో ఈ భాగస్వామ్యం కేవలం సాంకేతికతను అనుసంధానించడం మాత్రమే కాదని, ఇది మొత్తంగా విద్యా వ్యవస్థను మార్చగలిగే ఒక విప్లవాత్మక అడుగు అన్నారు. ప్రతి మల్లారెడ్డి విద్యార్థిని ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలకు సిద్ధం చేయడం పై దృష్టి కేంద్రీకరించామని, విద్యా ప్రావీణ్యాన్ని డిజిటల్ ఆవిష్కరణతో మేళవించడం ద్వారా ‘గూగుల్ క్లౌడ్‌పై డిజిటల్ క్యాంపస్’ తమ విద్యార్థులను భవిష్యత్ ఉద్యోగ రంగానికి అవసరమైన నైపుణ్యాలతో సాధికారులను చేస్తుందన్నారు.మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం హైదరాబాద్ వైస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న ప్రీతి రెడ్డి మాట్లాడుతూ ఉన్నత విద్యా రంగంలో ఈ మార్పు దిశలో ముందంజలో నిలవడం మా గర్వకారణంగా ఉంది. గూగుల్ సాంకేతికతను మా విద్యా బలంతో కలిపి, డిజిటల్ లెర్నింగ్‌కి కొత్త నిర్వచనాన్ని అందించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. ఇంజినీరింగ్ నుండి హెల్త్‌కేర్ వరకు ప్రతి విద్యార్థి ఈ ప్లాట్‌ఫాం ద్వారా ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఆవిష్కరణ, సమగ్రత, ప్రతిభను ప్రోత్సహించే తమ లక్ష్యానికి ఈ భాగస్వామ్యం పూర్తిగా అనుకూలంగా ఉందని తెలిపారు.

25 నుంచి జాగృతి జనం బాట

 క్షేత్ర స్థాయిలో ప్రజాసమస్యలను వినేందుకు ఈ నెల 25 నుంచి 2026 ఫిబ్రవరి 13వ తేదీ వరకు ‘జాగృతి జనం బాట’ పేరుతో జిల్లాల్లో పర్యటించబోతున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. బుధవారం జూబ్లీహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో జాగృతి జనం బాట పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని, అక్కడి ప్రజలతో మమేకమై వారి సమస్యలు వింటామన్నారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్న మనం సామాజిక తెలంగాణ ఇంకా సాధించుకోలేదని మాట్లాడితే తనను బీఆర్‌ఎస్ నుంచి కుట్రపూరితంగా వెళ్లగొట్టారని ఆరోపించారు. నాడు చెప్పిందే నేడు తాను మళ్లీ చెబుతున్నానని సామాజిక తెలంగాణ సాధించుకోవడానికి తెలంగాణ జాగృతి కట్టుబడి పని చేస్తుందన్నారు. సామాజిక తెలంగాణ అంటే నినాదం కాదని ఇది విధానపరమైన నిర్ణయం అని దీనికోసం జాగృతి పని చేస్తుందన్నారు.

కేసీఆర్ పేరు చెప్పి బతకాలని లేదు : కేసీఆర్ ఫొటో లేకుండానే ఈ యాత్ర నిర్వహించబోతున్నామని కవిత క్లారిటీ ఇచ్చారు. తాను బీఆర్‌ఎస్ సభ్యురాలిని కూడా కాదని అందుకే నైతికంగా కేసీఆర్ ఫొటో లేకుండానే యాత్ర చేయబోతున్నామని, అంత మాత్రాన కేసీఆర్‌ను అవమానించినట్లు కాదన్నారు. కేసీఆర్ అనే చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడటానికి తాను చేయని ప్రయత్నం అంటూ లేదన్నారు. ఆ చెట్టు నీడ నాది కానప్పుడూ ఆ చెట్టుపేరు చెప్పి బతకాలనే ఉద్దేశం నాకు లేదన్నారు. తాను తన దారి వెతుక్కుంటున్నానన్నారు. కేసీఆర్ కూతురుగా పుట్టడం జన్మజన్మలకు తాను చేసుకున్న అదృష్టం అని అయితే దారులు వేరవుతున్నప్పుడు తాను ఇంకా వారి పేరు చెప్పుకోవడం నైతికంగా మంచిది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయన్నారు. పరిష్కారాలను పక్కన పెట్టి ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా ఈ ప్రభుత్వం పెట్టుకుందన్నదని విమర్శించారు. ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినా ఒక్క రూపాయి కూడా కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో అనిశ్చితి తెలంగాణ వ్యాప్తంగా ఉందన్నారు.

జిల్లాల వారీగా టూర్ షెడ్యూల్ : నిజామాబాద్ – అక్టోబర్ 25, 26. మహబూబ్నగర్ – అక్టోబర్ 28, 29, కరీంనగర్ – అక్టోబర్ 31, నవంబర్ 1, ఆదిలాబాద్ – నవంబర్ 3, 4, వరంగల్ / హన్మకొండ – నవంబర్ 8, 9, నల్గొండ – నవంబర్ 11, 12, మెదక్ – నవంబర్ 14, 15, ఖమ్మం – నవంబర్ 17, 18, రంగారెడ్డి – నవంబర్ 20, 21, నారాయణపేట – నవంబర్ 23, 24, కామారెడ్డి – నవంబర్ 27, 28, గద్వాల్ – నవంబర్ 30, డిసెంబర్ 1, పెద్దపల్లి – డిసెంబర్ 3, 4, యాదాద్రి భువనగిరి – డిసెంబర్ 6, 7, భూపాలపల్లి – డిసెంబర్ 9, 10, మంచిర్యాల – డిసెంబర్ 12, 13, సిద్దిపేట – డిసెంబర్ 15, 16, భద్రాద్రి కొత్తగూడెం – డిసెంబర్ 18, 19, మెద్చల్ – మల్కాజిగిరి – డిసెంబర్ 21, 22, నాగర్కర్నూల్ – డిసెంబర్ 27, 28, రాజన్న సిరిసిల్ల – జనవరి 3, 4, సూర్యాపేట – జనవరి 6, 7, జనగామ – జనవరి 10, 11, ఆసిఫాబాద్ – జనవరి 17, 18, సంగారెడ్డి – జనవరి 20, 21, వికారాబాద్ – జనవరి 24, 25, ములుగు – జనవరి 27, 28, జగిత్యాల – జనవరి 30, 31, మహబూబాబాద్ – ఫిబ్రవరి 2, 3, నిర్మల్ – ఫిబ్రవరి 5, 6, వనపర్తి – ఫిబ్రవరి 8, 9, హైదరాబాద్ – ఫిబ్రవరి 12, 13.

బిసి బంద్‌కు బిజెపి మద్దతు: రాంచందర్ రావు

బిసి రిజర్వేషన్లపై హైకోర్టు ‘స్టే’ విధించడాన్ని నిరసిస్తూ బిసి సంఘాల ఐక్య కార్యాచరణ సంఘం ఇచ్చిన పిలుపునకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మద్దతు పలికారు. బుధవారం బిసి జెఎసి నాయకుడు, బిజెపి రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్, గుజ్జ కృష్ణ తదితరులు పార్టీ రాష్ట అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును కలిసి తమ బంద్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బంద్‌కు మద్దతు పలికారు. బిసిలకు న్యాయం జరగాలని డిమాండ్‌తో బిసి జెఎసి చేపట్టిన ఉద్యమానికి పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. బిసిల హక్కుల కోసం ఆర్. కృష్ణయ్య అనేక సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నారని ఆయన చెప్పారు.

బిసి సమాజ అభ్యున్నతికి ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తున్నానని అన్నారు.బిజెపి మాత్రమే బిసిలకు న్యాయం చేయగలదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బిసిలను మోసం చేసిందని, రిజర్వేషన్లు అమలు చేయలేక ఇతరులపై నెపం వేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. బిసిలకు గౌరవం ఇచ్చిన పార్టీ తమదేనని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడి మంత్రివర్గంలో ఇరవై ఏడు మంది బిసిలు ఉన్నారని ఆయన వివరించారు. బిసిలకు న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం కొనసాగించాలని ఆయన బిసి సంఘాలను కోరారు. బిసి సంఘాలు ఇచ్చిన బంద్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాంచందర్ రావు కోరారు.

మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ‘ఆసియా-పసిఫిక్’ ప్రాంతంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే ‘ఆస్బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025‘లో కీలకోపన్యాసం చేసే అవకాశం లభించింది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ ‘ఆస్బయోటెక్‘, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త నిర్వహణలో మెల్ బోర్న్‌లో జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక సదస్సులో భారత్ నుంచి ప్రసంగించే అవకాశం ఆయనకు మాత్రమే దక్కింది. రెండేళ్లలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలు, అవకాశాలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలపై ఆయన ప్రసంగించనున్నారు. ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ బుధవారం మంత్రి శ్రీధర్ బాబును ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు.

సీఎం రేవంత్ రెడ్డి మార్గ నిర్దేశంలో ‘గ్లోబల్ ఫార్మా, బయో టెక్నాలజీ, మెడ్‌టెక్‘ ఆవిష్కరణ హబ్ గా తెలంగాణ ను తీర్చిదిద్దేందుకు మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ‘ఆస్ట్రేలియా – తెలంగాణ‘ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చొరవ చూపాలని కోరారు. ‘ఈ ఆహ్వానం లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ సాధించిన పురోగతికి అంతర్జాతీయ స్థాయిలో దక్కిన గౌరవం. ప్రపంచవ్యాప్తంగా ఏడు అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్‌లలో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయ నగరం మనదే. ఈ రంగంలో కొత్తగా రూ.63వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చాం. మరిన్ని తీసుకొచ్చేందుకు ఈ వేదికను మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటాం. ఆస్ట్రేలియా తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది‘ అని మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అస్త్రాలు వదిలి లొంగిపోండి: బండి సంజయ్

మావోయిస్టులు అస్త్రాలు వదిలి లొంగిపోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. గడ్చిరోలి ప్రాంతంలో వారి ఉనికికి గట్టి దెబ్బగా మావోయిస్టుల సీనియర్ నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అరవై మంది దళ సభ్యులతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారని ఆయన తెలిపారు. ఈ పరిణామం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దృఢమైన, ఫలితాలపై దృష్టి పెట్టిన కాలపరిమితికి ప్రతిబింబం అని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలిజం పూర్తిగా నిర్మూలించాలన్నది కేంద్ర మంత్రి అమిత్ షా లక్షమని ఆయన తెలిపారు. అంతర్గత భద్రత పట్ల ఆయన రాజీ లేని వైఖరి దృఢమైన అమలు స్పష్టమైన ఫలితాలు ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడి నాయకత్వంలో ఎన్టీయే ప్రభుత్వం శాంతి-భద్రత, అభివృద్ధికి కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు. ఈ సమయంలో మావోయిస్టులు లొంగిపోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు.

==++==

ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావుకు చుక్కెదురు

మన తెలంగాణ/హైదరాబాద్ : రా ష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మంగళవారం సు ప్రీం కోర్టులో జస్టిస్ నాగరత్న, జస్టి స్ ఆర్ మహదేవ్ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ధర్మాసనం కీలక వ్యా ఖ్యలు చేసింది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కంప్యూటర్ క్లౌడ్, ఐ క్లౌడ్ పాస్‌వర్డ్ రీసెట్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే ప్రభాకర్ రావుకు అరెస్టు నుంచి క ల్పించిన స్పెషల్ రిలీఫ్‌ను న్యాయస్థా నం పొడిగించింది. తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది.

మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌తో పాటు స్పెషల్ ప్రొటెక్షన్‌ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాననం ఈ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినించారు. మాజీ ఎస్‌ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కేసు దర్యాప్తునకు సహకరించడం లేదని, ఆయన్ను కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు అప్పగించాలని కోర్టుకు తెలిపారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ ద్వారానే నిజాలు బయటికి వస్తాయన్నారు. ప్రభుత్వం మారగానే హార్డ్ డిస్క్‌లో డేటా ధ్వంసం చేసి, కొత్తగా 50 హార్డ్ డిస్కులు ఆ స్థానంలో ఉంచారని న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, జడ్జిలు, బిల్డర్లు, వ్యాపారుల ఫోన్లు టాప్ చేశారని ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. నక్సలైట్ల పేరుతో ఈ కార్యక్రమాలన్నీ చేసినట్లు తెలిపారు. డిజిటల్ డివైసెస్‌లో డేటా ఫార్మా చేశారని, ఐ ఫోన్, ఐ క్లౌడ్ పాస్వర్డ్ ఇవ్వడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. డేటా మొత్తం డిలీట్ చేసి డివైసెస్ తమకు ఇచ్చారని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు తరఫున న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు.

ప్రభాకర్ రావు డివైస్ రీసెట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆయన్ను ఇప్పటికే 11సార్లు పిలిపించి సుమారు 80 గంటల పాటు విచారణ జరిపినట్లు తెలిపారు. డేటాను ప్రభాకర్ రావు డిలీట్ చేయలేదని డిపార్ట్‌మెంట్ డిలీట్ చేసిందని చెప్పారు. విచారణకు సహకరించడంలేదు అనడంలో వాస్తవం లేదని, విచారణ అంతా వీడియో రికార్డుల సమక్షంలోనే జరిగిందని కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం కేసులో సిట్ అధికారులు అడిగిన సమాచారం ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు ఇవ్వాల్సిందేనని తెలిపింది. అదే విధంగా యూజర్, పాస్‌వర్డ్‌ల సమాచారం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో సమాచారం తీసుకోవాలని సిట్‌కు సూచించింది. సమాచారం ధ్వంసం చేసినట్లుగా, నిందితుడు ప్రయత్నించనట్లుగా తేలితే తదుపరి చర్యలపై తాము నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 18 వతేదీకు వాయిదా వేసింది.

ఎపిని అడ్డుకోండి

మన తెలంగాణ / హైదరాబాద్ : పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టు టెండర్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం సీడబ్ల్యూసీకి లే ఖ రాసింది. పోలవరం -బనకచర్ల లింక్ ప్రాజెక్టు పై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నపటికీ ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటీవలే ఏపీ ప్రభుత్వం కొత్త టెండర్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా టెండర్‌ను రద్దు చేయాలని సీడబ్ల్యూసీకి లేఖ రాసింది. బనకచర్ల టెండర్, సర్వే నిలిపివేయాలని వి జ్ఞప్తి చేసింది. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం – బనకచర్ల లింక్ ప్రా జెక్టును ఆమోదించవద్దని కోరింది. పోలవరం డీపీఆర్‌కు విరుద్ధంగా ఈ టెండర్ ఉందని తెలంగాణ ఆరోపించింది. కాగా ఇటీవలే ఈ ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని, సిఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అడ్డుకుని తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. బనకచర్లపై కేంద్ర జలశక్తి మంత్రి 

సీఆర్ పాటిల్‌ను స్వయంగా కలిసి లిఖితపూర్వకంగా తెలంగాణ అభ్యంతరాలు తెలిపామని, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ మేం ఆలమట్టి ఎత్తు పెంపును వ్యతిరేకిస్తున్నామన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై ట్రైబ్యునల్ ఎదుట సమర్థంగా వాదనలు వినిపించామని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.

దేవాదుల ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలి

దేవాదుల ప్రాజెక్టు పురోగతిని సమీక్షించిన ఉత్తమ్ కుమార్ రెడి, సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నీటిపారుదల, పౌర సరఫరాల మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి డి. సీతక్క , ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికైన ప్రతినిధులతో కలిసి జె. చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం (జెసిఆర్‌డిఎల్‌ఐఎస్) పురోగతిని సమీక్షించారు. నిర్ణీత గడువు లోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అన్ని విధానపరమైన అడ్డంకులను తొలగించాలని, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని, ఉత్తర తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలలోని ప్రతి రైతుకు నీటిపారుదల ప్రయోజనాలు చేరేలా చూడాలని ఆయన నీటిపారుదల శాఖను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గంగారం గ్రామం సమీపంలోని గోదావరి నది నుండి 38.16 టిఎంసి నీటిని లిఫ్టు చేయడానికి రూపొందించబడిన దేవాదుల పథకం, హన్మకొండ, వరంగల్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగాం, యాదాద్రి, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల ఎగువ, పాక్షిక శుష్క ప్రాంతాల్లో 5.57 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి రూపొందించబడిందని అధికారులు మంత్రికి తెలిపారు.

తాజా పురోగతి నివేదిక ప్రకారం ఇప్పటి వరకు మొత్తం నీటిపారుదల సామర్థ్యం మొత్తం 5.56 లక్షల ఎకరాల్లో 3.17 లక్షల ఎకరాలు. భూగర్భజలాల ద్వారా సాగునీరు అందించే 58,028 ఎకరాలతో కలిపి, మొత్తం ఆయకట్టు సామర్థ్యం పూర్తయిన తర్వాత 6.14 లక్షల ఎకరాలకు చేరుకుంటుందన్నారు. సవరించిన ప్రాజెక్టు వ్యయం రూ. 18,500 కోట్లకు గాను రూ. 14,269.63 కోట్లు ఖర్చు చేయగా మిగిలిన పనులను పూర్తి చేయడానికి రూ. 4,230 కోట్లు మిగిలి ఉన్నాయన్నారు. ఖర్చు చేసిన మొత్తం మొత్తంలో సివిల్ పనులకు రూ. 11,667.85 కోట్లు, భూసేకరణకు రూ. 1,343.06 కోట్లు, హైడ్రో-మెకానికల్, ఎలక్ట్రో-మెకానికల్ ఇన్‌స్టాలేషన్‌లకు రూ. 1,170.63 కోట్లు ఖర్చయ్యాయని పేర్కొన్నారు. సమావేశంలో సమర్పించిన నివేదిక ప్రకారం ప్రణాళిక ప్రకారం 2,430.82 కిలోమీటర్లలో 1,663.10 కి.మీ. మట్టి తవ్వకం పూర్తయిందని, 702.62 కిలోమీటర్లలో 669.66 కి.మీ. పైపులైన్లు వేయబడ్డాయని తెలిపారు. ప్రణాళిక చేసిన 16,113 నిర్మాణాల్లో 8,510 పూర్తయ్యాయని, 1,202.14 కిలోమీటర్లలో 799.80 కి.మీ కాలువ లైనింగ్ పూర్తయిందన్నారు. 46 ట్యాంకులకుగాను 39, 21 పంప్ హౌస్‌లకు గాను 18 పనిచేస్తున్నాయన్నారు.

సాగునీటి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయండి : స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

సచివాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. ములుగు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని మంత్రి సీతక్క కోరారు. అలాగే గోదావరి రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తిచేయాలని కోరారు. ములుగు పెండింగ్ ప్రాజెక్ట్ పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ములుగు పెండింగ్ ప్రాజెక్ట్ ల పనుల పురోగతి పై నివేదిక సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశించారు.

మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవు : చిట్‌చాట్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

తెలంగాణలో కేబినెట్ మంత్రుల మధ్య విభేదాలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. మంత్రుల మధ్య సమన్వయం ఉందని, ఎలాంటి విభేదాలు లేవన్నారు. మంగళవారం సచివాయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన శాఖ, జిల్లా అభివృధి పనులపై ఫోకస్ పెట్టానని, ఇరిగేషన్ శాఖలో అవినీతి ఆరోపణలు అవాస్తవం అని చెప్పారు. బదిలీలు నిబంధనల ప్రకారం జరిగాయని ప్రాసెస్ అంతా తానే దగ్గరుండి చూశానన్నారు. నీటి వాటాల్లో తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నామని కర్ణాటకలో కాంగ్రెస్, మహారాష్ట్రలో బీజేపీ, ఏపీలో టీడీపీ ఉన్నా హక్కులను వదులుకోబోమన్నారు. బనకచర్ల, ఆల్మట్టిపై మేము నిబంధనల ప్రకారం ఫైట్ చేస్తున్నామని కృష్ణా, గోదావరిలో నీటి వాటాల కోసం ప్రభుత్వం కమిట్‌మెంట్‌తో పనిచేస్తోందన్నారు. కేసీఆర్ పదేళ్లలో చేసిందేమి లేదని కాళేశ్వరం పేరుతో మిగతా ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. కాళేశ్వరం నీళ్లు లేకున్నా భారత దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పంటలు పండాయని, త్వరలోనే మహారాష్ట్ర వెళ్లబోతున్నామన్నారు. ధాన్యం కొనుగోలు కోసం 25 వేల కోట్లు రైతులకు కేటాయిస్తున్నామని మంత్రి వెల్లడించారు.