StreamEastmardin escortizmit escortkonya escorteskişehir escortkayseri escortankara escortankara escortankara escortbahiscasinobahiscasino girişmasterbettingmasterbetting girişwinxbetwinxbet girişkalebetkalebet girişbetlikekalebetmasterbettingrinabettrendbetrealbahislivebahislordbahispashagaminghazbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

onwin

aresbet

padişahbet

royalbet

royalbet

Hacklink Panel

Hacklink

ultrabet

padişahbet

Streameast

Hacklink

polobet

casibom giriş

wbahis

Holiganbet

polobet

polobet

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet giriş

jojobet

matbet

polobet

rokubet

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

grup porno

iptv satın al

jojobet

jojobet giriş

hiltonbet

pusulabet

meritking giriş

Galabet

ultrabet

artemisbet

rokubet

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet giriş

Betpas

Betpas

Betpas giriş

matbet

sahabet

betvole

Hacklink

casibom

livebahis

matbet

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

betpas

request hit botu

betpas giriş

matbet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

şanscasino

sapanca escort bayan

onwin

meritking güncel giriş

rokubet

Restbet

Restbet giriş

piabellacasino

milosbet

sonbahis

bahix

parmabet

mislibet

piabellacasino

piabellacasino

yakabet

casibom

hilarionbet

online diyetisyen

wbahis

polobet

kralbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betebet

Meritking Giriş

Kavbet

Galabet

jojobet

asyabahis

queenbet

Restbet

Restbet giriş

winxbet

casibom giriş

ultrabet

Marsbahis

matbet

holiganbet

vdcasino giriş

perabet

perabet

meritking

oslobet

kingroyal

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

ronabet giriş

milosbet

romabet

padişahbet giriş

jojobet giriş

matbet

matbet giriş

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

nitrobahis

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

holiganbet

holiganbet

holiganbet

jojobet

jojobet giriş

Meritking

yakabet resmi adres

wbahis

Casibom

wbahis

wbahis

Agb99

Agb99

holiganbet

piabellacasino

ultrabet

padişahbet giriş

bağcılar escort

betpuan

xgeorgia

sekabet

pusulabet

vdcasino

imajbet

marsbahis

imajbet

wbahis

grandpashabet

piabet

pusulabet

grandpashabet giriş

casibom

meritking

jojobet

holiganbet

betsmove

Slot Mahjong

meritking güncel

jojobet giriş

Betpas

matbet

matbet giriş

sekabet giriş

1xbet

fatih escort

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

jojobet

Online Hack Tool

Meritking

piabellacasino

baywin

piabellacasino

mislibet

bahisvebaihs

nitrobahis

piabellacasino

parmabet

piabellacasino

artemisbet

artemisbet

artemisbet

artemisbet

artemisbet

artemisbet giriş

royalbet

royalbet giriş

polobet

polobet giriş

casibom

casibom

bahiscasino

sekabet güncel giriş

casibom giriş

casibom

padişahbet

vdcasino

betovis

betasus

berlinbet

casinowon

suratbet

süratbet

betcio

mislibet

casinolevant

marsbahis

casinowon

grandpashabet

marsbahis

kingroyal

dinamobet

betturkey giriş

kingroyal

Google Maps Yorum Satın Al

polobet

casivera

enbet

sonbahis

padişahbet

betoffice

padişahbet

padişahbet giriş

betpas

kralbet

asyabahis

holiganbet

betebet

ultrabet

betturkey

imajbet

matbet

sekabet

casibom

casibom giriş

casibom güncel giriş

vdcasino

tarafbet

pusulabet

meritking

casinolevant

galabet

pusulabet

padişahbet

casinolevant

casinolevant

vdcasino

betcio

jojobet

Sweet Bonanza

bahiscasino

bahiscasino giriş

masterbetting

masterbetting giriş

winxbet

winxbet giriş

Sugar Rush 1000 Oyna

cratosroyalbet

kalebet

kalebet giriş

spinco

kralbet

marsbahis

grandpashabet

madridbet

madridbet giriş

casinolevant

grandpashabet

meritking

marsbahis

betpipo

meritking

casinolevant

kralbet

casinolevant

meritking

casinolevant

madridbet

casibom giriş

Sweet Bonanza Oyna

casibom giriş

teosbet

lunabet

Hiltonbet giriş

vdcasino

matbet

kralbet

vdcasino

prizmabet

wbahis

కెసిఆర్ దీక్షపై కొంతమంది సోయిలేని మాటలు మాట్లాడుతున్నారు: తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ భవన్‌లో శనివారం(నవంబర్ 29) దీక్షా దివాస్ ను ఘనంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ 2001లో ఉద్యమం ప్రారంభించి అన్ని వర్గాలకు ఏకతాటిపైకి తెచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఆమరణ దీక్ష చేపట్టారని, కెసిఆర్ దీక్ష ఒక చరిత్ర అని వ్యాఖ్యానించారు. దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్‌లో శనివారం జరిగే కార్యక్రమ ఏర్పాట్లను తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కెసిఆర్ దీక్షపై కొంతమంది సోయిలేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ మీద అవాకులు చెవాకులు పేలినంత మాత్రాన కెసిఆర్ చరిత్ర మారదు అని పేర్కొన్నారు. తెలంగాణ రాకపోతే కాంగ్రెస్ ఎక్కడిది…తెలంగాణ ప్రభుత్వం ఎక్కడిది అని ప్రశ్నించారు.

కొత్త బిచ్చగాళ్ళు పొద్దు ఎరగరు అన్నట్లుగా కొంతమంది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్ర తెలియనివాళ్ళు మాట్లాడుతున్నారని, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు తెలంగాణ ఏర్పాటుప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. బతుకమ్మ పేరుతో ఆనాడు చీరలు పంచితే ఇప్పుడు ఇందిరమ్మ చీరలు అని పేరు మార్చారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారని నిండు అసెంబ్లీలోనే కెసిఆర్ చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ వాళ్ళ లాగా మూర్ఖుల్లా తాము మాట్లాడము అని పేర్కొన్నారు. కెసిఆర్ ఆమరణ దీక్షకు సంబంధించిన దీక్షా దివస్ డాక్యుమెంటరీని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ చేపట్టిన ఆమరణ దీక్షకు సంబంధించిన అన్ని విషయాలు నెమరువేసుకోవడంతోపాటు ఈ తరానికి దీక్షా దివస్ గురించి తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

పోలీసుల అదుపులో దేవ్‌జీ

మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యులు దేవ్‌జీతో సహా 50 మంది మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నారని, వారందరినీ కోర్టు హాజరుపరచాలని డిమాండ్ చేస్తూ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) పేరుతో ఈ నెల 22వ తేదీన విడుదల అయిన లేఖ శుక్రవారం వెలుగులోకి వచ్చింది. లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లు అడవిలో జరిగింది నకిలీ ఎన్‌కౌంటర్ అని, దీనికి వ్యతిరేకంగా ఈ నెల 30వ తేదీన నిర్వహించే చత్తీస్‌గఢ్, దండకారణ్యం బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్ట్ బిజెపి నరేంద్ర మోడీ, అమిత్ షా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కుమ్మక్కై, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, డికె స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మా, ఆయన జీవిత భాగస్వామి కామ్రేడ్ రాజేలను బంధించి దారుణంగా హింసించి హత్య చేసి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారన్నారు. దీన్ని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని, న్యాయ విచారణకు డిమాండ్ చేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాల వల్ల కలిగే నష్టానికి నిరసనగా, గిరిజన ప్రజలు నీరు, అడవులు, భూమి, ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతున్నారన్నారు. ఈ విషయంపై పోరాడుతున్న సిసి సభ్యులు కామ్రేడ్ కోసా దాదా, కామ్రేడ్ రాజు దాదా నకిలీ ఎన్‌కౌంటర్‌లో హత్యకు గురయ్యారని తెలిపారు. దండకారణ్యమంతా అన్యాయమైన యుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటోందని, జాతీయ, అంతర్జాతీయ చట్టాలు తీవ్రంగా ఉల్లంఘింస్తున్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్న ప్రజా ఉద్యమాలను తుపాకీతో బెదిరించి అణిచివేస్తున్నారన్నారు. ఈ నెల 18, 19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామారాజు జిల్లాలో జరిగిన రెండు నకిలీ ఎన్‌కౌంటర్లను ప్రజలంతా ఖండించాలని కోరారు. ఈ ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరపాలని లేఖలో డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో బిసి రిజర్వేషన్లను అడ్డుకున్నది బిజెపి నేతలే:ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాష్ట్రంలో బిసి రిజర్వేషన్లను అడ్డుకున్నది బిజెపి నేతలేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పగటిపూట బిసిల గొంతు కోసిన బిజెపి నాయకులు ఇప్పుడు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. బిసిలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నది బిజెపి నాయకులేనని ఆయన అన్నారు. వారు బిసి ద్రోహులు, వెన్నుపోటు దారులని విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందన్నారు. తాము పంపిన బిల్లులను ఆమోదించకుండా బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడ్డుపడటం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించకుండా నోరు మూసుకున్న బిజెపి నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డిపై ఎగిరెగిరి పడుతుండటం హాస్యాస్పదమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి ఎంపి లక్ష్మణ్‌కు సిఎంపై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. అసెంబ్లీలో బిసిబిల్లుకు మద్దతు ఇచ్చి ఢిల్లీలో మాట మార్చింది బిజెపి కాదా అని ఆయన ప్రశ్నించారు.

బిసిలకు తీరని అన్యాయం చేసింది బిజెపినేనని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో బిసి బిల్లులను ఆమోదించాలని రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకత్వం జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోసం పడిగాపులు కాశాయన్నారు. బిజెపి ద్రోహులను బిసిలు గమనించి సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. బిసి బిడ్డగా చెలామణి అవుతున్న లక్ష్మణ్ ఆ బిసిలకే తీరని ద్రోహం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బిజెపి ఓబిసి సెల్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ బిసి బిల్లు ఆమోదించా లని ప్రధాని మోడీపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదన్నారు. తన పదవిపైన తప్ప బిసిలపైన ఇసుమంత ప్రేమ కూడా లక్ష్మణ్‌కు లేదన్నారు. గాంధీ కుటుంబం గురించి ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ప్రధాని పదవినే త్యాగం చేసిన చరిత్ర వాళ్లదని ఆయన అన్నారు. ఎప్పటికైనా తెలంగాణలో బిసి రిజర్వేషన్లు సాధించేది కాంగ్రెస్ పార్టీనేనని ఆది శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.

విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకే అన్న బెదిరింపులేమయ్యాయి..?: హరీష్‌రావు

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు అని డబ్బా కొట్టుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ముందు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పురుగులు లేని అన్నం పెట్టాలని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఇక నుంచి తానే సమీక్షలు చేస్తానన్న ముఖ్యమంత్రి మాటలేమయ్యాయి..విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకే అన్న బెదిరింపులేమయ్యాయి..? అని ప్రశ్నించారు. బడి పిల్లలకు పురుగుల అన్నం పెట్టిన ఘటనపై శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండేళ్లలో సిఎం వద్దనే ఉన్న విద్యాశాఖపై ఎన్ని సార్లు సమీక్షలు చేసారు.. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడుతున్న ఎంత మందిని జైలుకు పంపారు..? అని నిలదీశారు. సిఎం మాటలకు విలువ లేదు, ఆచరణకు దిక్కులేదని విమర్శించారు.

బడిలో చదువుకోవాల్సిన విద్యార్థులు.. పురుగులన్నం మాకొద్దు అని రోడ్లెక్కి నిలదీస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు.. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి చేస్తున్నట్లు..? అని ప్రశ్నించారు. చిల్లర మాటలు.. చీప్ పాలిటిక్స్..స్కీంలు లేవుగానీ.. ఎందులో చూసినా స్కాంలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందిన కాడికి దండుకునే ప్లాన్లు.. వాటాలు, కమీషన్ల కోసం మీటింగులు..ఇదే కదా 23 నెలలుగా రేవంత్‌రెడ్డి చేస్తున్నది అని పేర్కొన్నారు. బడి పిల్లలకు సరిగ్గా అన్నం పెట్టలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండి ఏం లాభం..? అని అడిగారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు పురుగులన్నం పెట్టిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హరీష్‌రావు బిఆర్‌ఎస్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పంచాయతీ ఎన్నికలు.. సిఎం రేవంత్‌ రెడ్డి జిల్లాల పర్యటన

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల సందడి నెలకొంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎన్నికలతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి.. పార్టీ లీడర్లు, కార్యకర్తలను కలిసేందుకు జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ ౧వ తేదీ నుంచి జిల్లా పట్టణాల్లో సిఎం రేవంత్ పర్యటించనున్నట్లు సమాచారం.

కాగా, ఈసారి రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మొదటి విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఏకగ్రీవంగా సర్పంచ్ లను ఎన్నుకుంటున్నారు.

రాష్ట్రాభివృద్ధికి త్రిముఖ వ్యూహం

మనతెలంగాణ/హైదరాబాద్:ప్రపంచంతోనే పోటీపడేలా స్కిల్ యూత్ కొత్త రంగాల్లో, కొత్త మార్గాల అన్వేషణ చేపట్టే లా, తెలంగాణ అభివృద్ధి ప్రతిబింబించేలా తెలంగాణ రైజిం గ్- 2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ ను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ ఈ డాక్యుమెంట్‌లో కనిపించాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ల్ తెలంగాణ రైజిం గ్- 2047 పాలసీ డాక్యుమెంట్‌పై మంత్రులు, అధికారులతో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ పాలసీ డాక్యుమెంట్ గురించి అధికారులకు సిఎం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకాన మి (క్యూర్), పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్), రూ రల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్)గా మూడు రీజియన్లను విభజించుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ మూడు రీజియన్‌లలో ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి ఉండాలో డాక్యుమెంట్‌లో పొందుపరచాలని ముఖ్యమంత్రి సూచించారు. హెల్త్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, జీసిసిలు, ఫార్మా, అగ్రికల్చర్‌తో పాటు వివిధ రంగాల్లో ఎక్కడెక్కడ ఏయే రంగం అభివృద్ధి ఉండాలో ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు, పోర్ట్, కనెక్టివిటీ ముఖ్యమైనవని చెప్పారు.

ప్రతి రంగానికి సంబంధించి పాలసీ డాక్యుమెంట్‌లో స్పష్టంగా ఉండాలి

సంక్షేమం, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, ఎనర్జీ డిపార్ట్ మెంట్ ఇలా ప్రతి రంగానికి సంబంధించి పాలసీ డాక్యు మెంట్‌లో స్పష్టంగా ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. తెలంగాణలో పాలసీ పెరాలసిస్ ఉండదని చాటి చెప్పేలా తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కొత్తగా ఏర్పాటయ్యే ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులతో పాటు కార్గో సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వాస్తవిక దృక్పథం కనిపించేలా డిజైన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం రేవంత్ పేర్కొన్నారు.

పెట్టుబడుల అవకాశాలు ప్రపంచ పెట్టుబడిదారుల ముందు

తెలంగాణలో ఉన్నఅపారమైన పెట్టుబడుల అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారుల ముందు ఉంచటంతో పాటు, ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ రెండు రోజుల్లో ప్రదర్శించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతుందని సిఎం రేవంత్ తెలిపారు. అందుకే ఈవెంట్‌ను కూడా భవిష్యత్ ఫోర్త్ సిటీలో ప్రభుత్వం ప్లాన్ చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ రైజింగ్ విజన్ 2047 దార్శనిక భవిష్యత్ పత్రం, రాష్ట్ర భవిష్యత్‌కు సమగ్ర రూపంగా మారనుందన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ఈ డాక్యుమెంట్ తయారుచేశారన్నారు. సమాన వృద్ధి, మహిళా సాధికారత, యువశక్తి , స్థిరమైన అభివృద్ధి – ఈ మూడు ప్రధాన రంగాలపై రాష్ట్ర అభివృద్ధి వ్యూహాన్ని ప్రభుత్వం ప్లాన్ చేసిందని సిఎం రేవంత్ తెలిపారు. తెలంగాణను భారత దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడం ఈ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

చైనా, జపాన్‌లతోనే పోటీ పడే లక్షంతో

చిన్న రాష్ట్రమైనా ఇక్కడ ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి తెలియజేయాలని ప్రజా ప్రభుత్వం సంకల్పించిందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అభివృద్దిలో పక్క రాష్ట్రాలతో కాదు చైనా, జపాన్‌లతోనే పోటీ పడే లక్షంతో ముందుకుపోతున్నామన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, క్వాంటమ్ టెక్నాలజీ, కృత్రిమ మేథస్సు (ఏఐ), స్టార్టప్, ఎంఎస్‌ఎంఈలు, టూరిజం, ఎగుమతులు వంటి రంగాలు రానున్న రెండు దశాబ్దాల్లో ఆర్థిక వృద్ధికి కీలక రంగాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, సులభ అనుమతులు, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు రాష్ట్రాన్ని పెట్టుబడిదారుల మొదటి గమ్యస్థానంగా నిలబెట్టనున్నాయన్నారు. ఈ బలాలే పునాదిగా మరింత పెట్టుబడులను ఆకర్షించే విధంగా విజన్ డాక్యుమెంట్‌గా ఉండబోతోందని సిఎం తెలిపారు.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా వ్యవసాయ కార్యాచరణ

గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతం చేసేందుకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా వ్యవసాయ కార్యాచరణ కూడా ఈ విజన్ డాక్యుమెంట్‌లో భాగమవుతోందన్నారు. రాష్ట్ర అభివృద్దిలో మహిళా సాధికారత కూడా అత్యంత ప్రధానమైన అంశంగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. అందుకే కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. డెవలప్‌మెంట్ ఎకానమీలో కాలుష్యం వల్ల కలిగేనష్టాలపై కూడా ఈ విజన్ డాక్యుమెంట్ ఫోకస్ చేయనుంన్నారు. అందుకే నెట్-జీరో తెలంగాణను అవిష్కరించనుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బ్లూ అండ్ గ్రీన్ హైదరాబాద్ లక్ష్యంగా తెలంగాణ 2047 డాక్యుమెంట్‌లో మూసీ పునరుజ్జీవనానికి రూపకల్పన చేశామని అందులో భాగంగా 2,959 చెరువులు, పార్కులు, అటవీ ప్రాంతాలను వాటి పూర్వ స్థితికి తీసుకురావటం లక్ష్యంగా పెట్టుకున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో రీజనల్ రింగ్ రైల్, 4 ఇండస్ట్రీయల్ కారిడార్లు, 11 రేడియల్ రోడ్లు

గ్రామాల్లో స్వచ్చమైన తాగునీరు, పరిశుభ్రమైన రోడ్లు, సౌర విద్యుత్ వెలుగులతో విలేజ్ 2.0 లక్ష్యంతో పనిచేయాలని నిర్ణయించామని, మరో లక్ష్యంగా ఆధునిక రవాణ మౌలిక సదుపాయాల కల్పనను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో తెలంగాణకు మణిహారంలా రీజనల్ రింగ్‌రోడ్డును ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని, హై-స్పీడ్ మొబిలిటీ కారిడార్లను నిర్మించ నున్నట్టు సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రైల్, 4 ఇండస్ట్రీయల్ కారిడార్లు, 11 రేడియల్ రోడ్లను నిర్మించనున్నట్టు ఆయన తెలి పారు. వీటితో పాటు వరంగల్, నిజామాబాద్, అదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెంలో కొత్త విమానాశ్రాయాలను ఏర్పాటు చేయబోతున్నట్టుగా సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి బందర్‌పోర్టు వరకు ఆధునిక హైవేను నిర్మించి సీపోర్టుకు అనుసంధానం చేయబోతున్నామని ఆయన తెలిపారు.

హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ కేంద్రాలుగా స్పోర్ట్ విలేజీలు

గ్లోబల్ వర్క్ ఫోర్స్‌తో పోటీపడేలా ప్రతి ఏడాది రెండు లక్షల తెలంగాణ యువతకు, లక్షమంది నిపుణులకు విదేశీ ఉపాధికి అవసరమైన నైపుణ్య అభివృద్ధి టార్గెట్ గా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సిఎం రేవంత్ తెలిపారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ కేంద్రాలుగా స్పోర్ట్ విలేజీలు నిర్మిస్తామన్నారు. మానసిక ఆరోగ్యం, యోగా, ధ్యానం, క్రీడలు, సాంస్కృతిక అవగాహనతో సమతుల్య యువత అభివృద్ధి కోసం హోలిస్టిక్ వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించటమే లక్ష్యంగా టూరిజం ప్రాంతాల అభివృద్ది, నైట్ ఎకానమీ సిటీగా హైదరాబాద్ ఇమేజ్ ను క్రియేట్ చేయటం, బతుకమ్మ, బోనాలు, డెక్కన్ క్రాఫ్ట్ గ్లోబల్ పండుగలతో బ్రాండ్ తెలంగాణను విశ్వవ్యాప్తం చేయాలని సంకల్పించినట్టు సిఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రపంచ సినిమా రంగాన్ని ఆకర్షిస్తూ యానిమేషన్, గేమింగ్, ఫిలిం-టెక్ పరిశ్రమలకు తెలంగాణ కొత్త గమ్యంగా రూపొందే లక్ష్యంతో పనిచేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంతో పాటు గ్లోబల్ సిటీ హైదరాబాద్ దాకా సమాన అవకాశాలు, స్థిరమైన అభివృద్ధి అనే లక్ష్యంతో ఈ విజన్ డాక్యుమెంట్ -2047 మార్గదర్శకంగా ఉండబోతోందన్నారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, అజారుద్దీన్, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సీనియర్ ఐఏఎస్‌లపై సిఎం సీరియస్

మనతెలంగాణ/హైదరాబాద్:తనకు తెలియకుండానే ఐఏఎస్‌లను బదిలీ చేయడంపై సీనియర్ ఐఏఎస్‌లపై సిఎం రేవంత్‌రె డ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఇద్దరు ఐ ఏఎస్‌లు తమ బదిలీ గురించి సిఎంకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఈ విషయం వివాదాస్పదం అయినట్టుగా సమాచా రం. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వచ్చిన రోజునే అంతర్గతం గా ఐదుగురు ఐఏఎస్‌లను బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ బదిలీ అయిన ఐఏఎస్‌లు బుధవారం విధుల్లో చేరడానికి వెళ్లినప్పుడు ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు ట్రాన్స్‌ఫర్‌లకు సంబంధించి అభ్యంతరం చెప్పడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నుంచి అనుమతి తీసుకొని రావాలని వారి కి సూచించడంతో ప్రస్తుతం ఈ విషయం బయటకు వచ్చినట్టుగా తెలిసింది.

దీంతోపాటు ఒక ఐఏఎస్‌ను అడిషనల్ సీఈఓగా బదిలీ చేసే సమయంలో ఆయన పేరును ప్రతిపాదించే ముందు కనీసం సిఎం రేవంత్‌రెడ్డికి ఆ ఐఏఎస్ నుంచి కూడా అనుమతి తీసుకోకుండా ఈ బదిలీ చేశారని ఈ నేపథ్యంలో ఆ ఐఏఎస్ కూడా సిఎంకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. దీంతో జిఏడిలోని ఓ అధికారి నుంచి సిఎం రేవంత్‌రెడ్డి పూర్తి వివరాలు తెప్పించుకున్నట్టుగా సమాచారం. అందులో భాగంగా ఆయన సీనియర్ ఐఏఎస్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు ఎలా తీసుకొస్తారని సీనియర్ ఐఏఎస్‌లపై సిఎం రేవంత్‌రెడ్డి మొట్టికాయలు వేసినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ తరువాత కొందరు సీనియర్ ఐఏఎస్‌లపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

బిసి కోటా కోసం ఉమ్మడి కార్యాచరణ

మన తెలంగాణ/హైదరాబాద్ : బీసీలకు సంబంధించిన 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం తొమ్మిదవ షెడ్యూ ల్లో సవరణ జరగాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ అంశంపై పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేకం గా చర్చకు తీసుకురావాలని కోరారు. నిర్దేశిత ఫార్మేట్ లో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు తీసుకురావాలని సూచించారు. ప్రధానమంత్రిని కలిసి అన్ని పార్టీల ఎంపీలు ఒక వినతి పత్రాన్ని ఇవ్వాలని, ప్రధానమంత్రి సమయం ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించాలన్నారు. గురువారం హైదరాబాద్ ప్రజాభవన్‌లో నిర్వహించిన ఎంపీల సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్‌కు సంబంధించి రాష్ట్రంలో ఎపిక్ సర్వే జరిగిందని, ఎంపిరికల్ డాటా ఆధారంగా అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టగా పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఆమోదించారని, బిల్లు గవర్నర్ నుంచి కేంద్రానికి వెళ్లి అ క్కడ పెండింగ్ లో ఉందని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా పార్లమెంట్ సభ్యులు అందరూ పార్టీల కు అతీతంగా ఒక బృందంగా ఏర్పడి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను విజ్ఞప్తులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీలు అడిగిన సమాచారం నిమిషాల్లో లేదా గంటల్లో అందించేందుకు ఢిల్లీలో 

ప్రణాళిక ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామని, దీనిని ఎంపీలు వినియోగించుకోవాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రభుత్వ శాఖలు ఏ విధంగా పూర్తి సంసిద్ధంగా ఉంటాయో పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉండి సమాచారం అందించేందుకు ఏర్పాటు చేశామని భట్టి చెప్పారు. ఎవరైనా రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో ప్రశ్నించడం, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు ఇవ్వాలనుకుంటే విషయాన్ని వివరిస్తే చాలు నిర్దేశిత ఫార్మాట్లో సమాచారాన్ని, విజ్ఞాపన పత్రాలను ఢిల్లీలోని రాష్ట్ర అధికారులు ఎంపీలకు అందిస్తారని తెలిపారు. నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ, జీఎస్టీ తదితర విషయాలకు సంబంధించి కేంద్ర నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులు, పథకాలకు సంబంధించి గతంలో లేఖలు రాశామని, ఆలేఖలు ఢిల్లీలోని ప్రత్యేక విభాగంలో ఎంపీ లకు అందుబాటులో ఉంటాయని, వాటి ఆధారంగా ఎంపీలు ఫాలోఅప్ చేసే అవకాశం ఉంటుందన్నారు. డిసెంబర్ 9 నాటికి ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సాధించిన విజయాల వివరించడంతోపాటు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించి 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ చేయబోతున్నామన్నారు. దేశంలో, ప్రపంచంలో ప్రముఖులను దిగ్గజ కంపెనీలను ఆహ్వానిస్తున్నామని, 2047 కల్లా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యసాధనకు అవసరమైన వనరులు, ప్రణాళిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయన్నారు.

ఈ కార్యక్రమం విజయవంతానికి కమిటీలు వేస్తున్నామని, కేంద్ర మంత్రులను, ఎంపీలందరినీ ఆహ్వానించాలని భావిస్తున్నామని చెప్పారు. ఆసక్తి ఉన్న ఎంపీలు పేర్లు ఇస్తే కమిటీలు సభ్యులుగా నమోదు చేస్తామని, దేశంలో, ప్రపంచంలో ప్రముఖ వ్యక్తులు, సంస్థలతో ఎంపీలు ఎవరికైనా పరిచయం ఉంటే వివరాలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం వారిని గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానిస్తామన్నారు. సమావేశంలో కేంద్రానికి సంబంధించిన 12 శాఖల ద్వారా 47 అంశాలను గుర్తించామని, వీటితోపాటు సెమీ కండక్టర్లకు సంబంధించిన అంశం సమావేశంలో చర్చకు వచ్చిందని తెలిపారు. అలాగే పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన అంశాలు, వ్యూహంపై డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా చర్చించారు. 12 శాఖలకు సంబంధించిన 47 అంశాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ భేటీకి కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య తదితరులు, బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, నగేష్, సీఎస్ రామకృష్ణ రావు హాజరయ్యారు.

ప్రధానిని సమిష్టిగా కలుద్దాం : మెదక్ ఎంపీ రఘునందన్ రావు

రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఇతర సమస్యలపై ప్రధాన మంత్రి సమయం తీసుకుని సమిష్టిగా కలుద్దామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. అంతేకాక ఆదిలాబాద్ పటాన్ చెరు రైల్వే లైన్‌పై సాధ్యాసాధ్యాలు, డీపీఆర్ ఏమైనా చేశారా అని అడిగారు. రాష్ట్రానికి కేటాయించిన ఐఎఎస్, ఐపిఎస్ కేడర్ అలాట్‌మెంట్ గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తే సంబంధిత మంత్రిని పార్టీలకు అతీతంగా కలిసి లేఖ ఇద్దామని ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అందరం కలసికట్టుగా ముందుకు వెళదామని చెప్పారు. అంతేకాక రాష్ట్రానికి అవసరమైన బొగ్గు గనుల విషయంలో అందరం కలిసి కోల్ మినిస్టర్‌ను కలుద్దామని ప్రతిపాదించారు.

కేంద్రానికి లేఖ రాయాలి : నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి

మహబూబ్ నగర్ ఎయిర్‌పోర్టుపై పూర్తి సమాచారానికి సంబంధించి కేంద్రానికి లేఖ రాయాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. గద్వాల డోర్నకల్ రైల్వేపైనా సమాచారాన్ని ఆయన కోరారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రతిపాదించిన విషయం అత్యంత ఆహ్వానించదగ్గ విషయమని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఇతర రహదారులు, పెండిగ్ అంశాలపై అఖిలపక్ష సభ్యులంతా కలిసి నేరుగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి లేఖ ఇద్దామని మల్లు రవి చెప్పారు.

పోలవరం బ్యాక్ వాటర్‌తో ప్రజలు నష్టం : మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్

పోలవరం ప్రాజెక్టు పూర్తయితే బ్యాక్ వాటర్ వల్ల తమ నియోజక వర్గ ప్రజలు తీవ్రంగా నష్ట పోతారని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ అన్నారు. ప్రాజెక్టులో నీరు నింపితే వచ్చే బ్యాక్ వాటర్ ముంపు వల్ల లక్ష మందికి పైగా ముంపు బారిన పడే అవకాశం ఉందని, ఈ సమస్య పైనా పరిష్కారం కావాలన్నారు. ములుగు, ఏటూరు నాగారం రహదారిని కేంద్రం మంజూరు చేసినా ఇప్పటికీ టెండరు ఖరారు కాలేదని చెప్పారు. అటవీ, పర్యావరణ అనుమతులు రాకపోవడం వల్లనే ఆలస్యమవుతోందని చెప్పారు. దీనిపై కేంద్రానికి లేఖ రాయడం కానీ, పార్లమెంట్‌లో ప్రస్తావన చేయడం కానీ చేయాలన్నారు.

పేదలకు ఉపాధి కరువు : జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్

రాష్ట్రంలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ కార్యక్రమంలో పనిదినాలు బాగా తగ్గుతున్నాయని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ చెప్పారు. పని దినాలు తగ్గడం వల్ల పేదలకు ఉపాధి లేకుండా పోవడంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచి పోతాయన్నారు. అంతేకాక లోక్‌సభ పరిధిలోని జహీరాబాద్ బీదర్ రహదారి అత్యంత కీలకమైందని, దీనిపై కేంద్రానికి లేఖ రాయడంతోపాటు పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావన తీసుకురావాలని కోరారు.

విమానాశ్రయానికి 800 ఎకరాలు అవసరం : ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్

ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణం కోసం 800 ఎకరాలు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసిందని ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ చెప్పారు. ఇప్పటికే అక్కడ 369 ఎకరాలు ఉన్నాయని, ప్రభుత్వం పేర్కొన్న 700 ఎకరాల్లో ఈ 369 ఎకరాలు అంతర్భాగమేనా లేక 700 ఎకరాలు అదనంగా సేకరిస్తున్నారా అని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధిత అధికారులు ఇతర అవసరాలకు మొత్తంగా వెయ్యి ఎకరాలు అవసరమవుతామని లేఖ రాశాన్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఉన్న 369 ఎకరాలకు అదనంగా మరో 700 ఎకరాల భూ సేకరణ చేయాలని చెప్పారు. అలాగే వరంగల్ నగరంలో భూగర్భ డ్రైనేజీ కోసం ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా అని ఎంపీ కడియం కావ్య అడిగారు. ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాయడంతో పాటు సమావేశాల్లో లేవనెత్తాలని కోరారు.

రేవంత్.. రియల్ ఏజెంట్

మనతెలంగాణ/హైదరాబాద్: రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిలా కాకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవం త్ రెడ్డి హిల్ట్ పాలసీ పేరుతో మరో భారీ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. మొదట మూ సీ భూములు, ఆ తర్వాత రీజినల్ రింగ్ రోడ్డు, సెంట్రల్ యూనివర్సిటీ భూములపై పడ్డ రేవంత్ దృష్టి.. ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక భూములను దోచుకోవడంపై పడిందని విమర్శించారు. ఒకప్పుడు ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అ వకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నుంచి పారిశ్రామికవేత్తలు చవకగా భూములు తీసుకున్నార ని, ఇప్పుడు ఆ భూముల్లో అపార్ట్‌మెంట్లు, విల్లాలు కట్టుకునేందుకు రేవంత్ రెడ్డి అతి తక్కువ ధరకే అ నుమతులు ఇస్తూ రియల్ దందా చేస్తున్నారని ఆ గ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం మాజీ ఎంఎల్‌ఎ జైపాల్ యాదవ్ ఆధ్వర్యం లో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్‌ఎస్ పార్టీ లో చేరారు. వారికి కెటిఆర్ గులాబీ కండువాలు క ప్పిపార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రె స్ ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు.

దాదా పు 9,300 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ, 600 మంది కోసం 5 లక్షల కో ట్ల రాష్ట్ర ప్రజల ఆస్తిని తాకట్టు పెడుతున్నారని ఆ రోపించారు. ఈ వ్యవహారంలో సగం డబ్బులు రే వంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయని అన్నారు. ఎవరి అబ్బ సొత్తని ఈ భూములను ధారాదత్తం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రైవే ట్ వ్యక్తులకు భూములను అప్పజెప్పే ఈ పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు మోసం చేసిందని కెటిఆర్ దుయ్యబట్టారు. గత ప్రభుత్వం 24 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 17 శాతం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. రిజర్వేషన్ల పేరుతో నాటకాలాడుతున్న కాంగ్రెస్ పార్టీకి బిసి సోదరులు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

పాలమూరుకు రేవంత్ చేసింది శూన్యం

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కెసిఆర్ హయాంలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని కెటిఆర్ గుర్తుచేశారు. వలసల జిల్లాగా పేరుబడ్డ పాలమూరులో రివర్స్ మైగ్రేషన్ సాధ్యమైందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన 10 శాతం పనులను కూడా రేవంత్ రెడ్డి పూర్తి చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. నర్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్ వంటి రిజర్వాయర్లను పూర్తి చేసి, పంపులు ఆన్ చేసి నీళ్లు ఇచ్చిన ఘనత కెసిఆర్‌దేనని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డను అని చెప్పుకోవడం, ప్రాజెక్టులకు మామగారి పేరు పెట్టుకోవడం తప్ప.. ఇప్పటివరకు రైతులకు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఎన్‌టిఆర్ రామారావు వంటి మహానాయకుడే కల్వకుర్తిలో ఓడిపోయారని గుర్తు చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అని పేర్కొంటూ కెటిఆర్ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యధిక వ్యవసాయ పంపుసెట్లు ఉన్న ప్రాంతమని, అక్కడ కరెంట్ కష్టాలు లేకుండా సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసి 24 గంటల కరెంట్ ఇచ్చిన చరిత్ర బిఆర్‌ఎస్‌ది అని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంట్ కోతలు, రైతుల కష్టాలు మళ్ళీ మొదలయ్యాయని, ప్రజలు కెసిఆర్ పాలనను గుర్తుచేసుకుంటున్నారని అన్నారు. చరిత్రలో ఏ ప్రభుత్వంపైన లేనంత ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్‌పై ఉందని, ప్రజల వెంట మనం ఉంటే.. వారే తిరిగి కెసిఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు, క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలను వేసుకోబోతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, అవినీతి, హామీల వైపల్యంపై ప్రజల్లోకి వెళ్లేలా కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాడుతూ ఐక్యంగా ముందుకు సాగాలని కెటిఆర్ బిఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ విధానాలపై విషప్రచారం

మనతెలంగాణ/హైదరాబాద్:ఇండస్ట్రీయల్ పాలసీపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని ఇరిగేషన్, సివిల్ సప్లయ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్యనగరాన్ని పొ ల్యూషన్ ఫ్రీగా చేయడమే తమ ప్రభుత్వ పాలసీ ల క్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పాలసీలో కుంభకోణానికి ఆస్కారమే లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తె చ్చింది పారదర్శకమైన పాలసీ అని ఆయన చెప్పుకొచ్చారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీ డియాతో మాట్లాడుతూ బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీల కు తాము తెచ్చిన ఇండస్ట్రీయల్ పాలసీ అర్థం కా లేదన్నారు. ప్రతిపక్షాల నేతలు కావాలనే తమ ప్రభుత్వంపై బు రద జల్లుతున్నారని ఆయన ధ్వ జమెత్తారు. నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ఇండస్ట్రీలను ఓఆర్‌ఆర్ బయటకు పంపాలన్న డిమాండ్ ఉంద ని ఆయన గుర్తుచేశారు.

ఈ పాలసీ తమ ప్రభు త్వం కొత్తగా తెచ్చింది కాదని, కెసిఆర్ ప్రభుత్వం లో కూడా ఈ పాలసీపై చర్చ జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చేది లేదని పాలసీ మార్చేది లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీయల్ పాలసీ రూపకల్పనలో తాను కూడా భాగమై ఉన్నానని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వివరించారు. కొత్త ఇండస్ట్రీయల్ పాలసీతో రాష్ట్రానికి అదనపు ఆదాయం వస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా ప్రతిపక్షాల నేతలకు వ్యతిరేకించాలన్న ఉద్దేశ్యం తప్పా ఏం లేదని ఆయన విమర్శించారు. అయి తే, నల్లగొండ డిసిసి నియామకంపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. పార్టీ ఇంటర్నల్ విషయాలను బయట మాట్లాడనని పేర్కొన్నారు.

కెసిఆర్ హయాంలో పెద్ద కుంభకోణం

తమ ప్రభుత్వంలో విద్యుత్ శాఖలో ఎలాంటి కుంభకోణం జరగలేదన్నారు. పవర్ గ్రిడ్‌లో ల్యాండ్ స్కాం జరుగుతోందని బిఆర్‌ఎస్ చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ ఖండించారు. ఓ పెద్దమనిషి తాము వస్తే పాలసీ మారుస్తామని అంటున్నారని, వారు మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు పాలసీ మార్చబోయేది లేదని బిఆర్‌ఎస్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంలో రూ.50 వేల కోట్లు కాదు, 50 వేల రూపాయల కుంభకోణం కూడా జరగలేదని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. 2014 విభజన చట్ట ప్రకారం ఎన్టీపిసి ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో 4 వేల మెగా వాట్ల పవర్ పాంట్ ఏర్పాటు చేస్తామని అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పిందని, ఇప్పటివరకు ఎందుకు పూర్తి కాలేదో ఈ పెద్దమనుషులే జవాబు చెప్పాలని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు. కెసిఆర్ హయాంలోనే భద్రాద్రి కొత్తగూడెం పవర్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం ఇండియా బుల్ అనే కంపెనీ దగ్గర ఉపయోగంలో లేని ఎక్వీప్‌మెంట్ ఎందుకు కొన్నదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. భద్రాద్రి ప్రాజెక్టులో ఔట్ డేటెడ్ టెక్నాలజీ వాడాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు. భద్రాద్రి ప్రాజెక్టు అనవసరంగా తెలంగాణ ప్రజలపై రుద్దిన ప్రాజెక్టు అని ఉత్తమ్ విమర్శించారు.