తాజా వార్తలు,మల్కాజ్గిరి (మేడ్చల్)
Auto Added by WPeMatico
అప్పుడు కొట్టుకపోయాడు… ఇప్పుడు మృతదేహం లభ్యం
హైదరాబాద్ లో భారీ వర్షాలు కురవడంతో వరదలలో కొట్టుకుపోయిన మరో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. 13 రోజులు తర్వాత నాగోల్ సమీపంలోని మూసీ నద వద్ద మృతదేహం లభించింది. ఒక్క మృతదేహాన్ని కూడా వెతలేకపోయారని కుటుంబ సభ్యులు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్‌నగర్ ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలకు వరదలు ముంచెత్తడంతో మామ, అల్లుడ్లు అర్జున్, రామా కొట్టుకపోయిన విషయం తెలిసిందే. అర్జున్ మృతదేహం 75 కిలో మీటర్ల దూరంలోని వలిగొండలో లభించింది. శుక్రవారం నాగోల్ సమీపంలోని మూసీలో గుర్తుతెలియని మృతదేహం ఉందని పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని వెలికితీసి ఈ నెల 14వ తేదీన కొట్టుకుపోయిన రామాగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.