మోత్కూర్ మండల సర్పంచ్ లు వీరే….
మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలో మూడో విడత జరిగిన గ్రామపంచాయితీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. దాచారం సర్పంచ్ గా (కాంగ్రెస్) కర్నె జ్యోతి వీరేశం 795 ఓట్ల భారీ మెజార్టీతో, అనాజీపురం సర్పంచ్ గా బీసు వెంకన్న 678 ఓట్ల మెజార్టీతో, పాలడుగు సర్పంచ్ గా అంతటి భగవంతు 168 ఓట్ల మెజార్టీతో, ముశిపట్ల సర్పంచ్ గా ఫైళ్ల నర్సిరెడ్డి 400 ఓట్ల మెజార్టీతో, పాటిమట్ల సర్పంచ్ గా బండ రమ విజయ్ రెడ్డి 41 ఓట్ల మెజార్టీతో, సదర్శాపురం సర్పంచ్ గా మునుకుంట్ల నీలకంఠం 113 ఓట్ల మెజార్టీతో, రాగిబావి సర్పంచ్ గా మెండు శ్రీవాణి చంద్రశేఖర్ రెడ్డి 126 ఓట్ల మెజార్టీతో, పనకబండ సర్పంచ్ గా లోతుకుంట రేణుక అనిల్ 81 ఓట్ల మెజార్టీ తో దత్తప్పగూడెం సర్పంచ్ గా గుండు యాదగిరి, పొడిచేడు సర్పంచ్ గా జిట్ట సైదులు గెలుపొందారు.