ముఖ్యమంత్రి ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధం: దానం నాగేందర్
ఎన్నికల్లో పోటీ చేసి, గెలవడం తన రక్తంలోనే ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శుక్రవారం హిమాయత్ నగర్ డివిజన్ లో రూ. 1.40 కోట్లతో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీ పనులకు కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే అనర్హత వేటు అంశంపై దానం నాగేందర్ స్పందించారు. రాజీనామా ప్రస్థావన ఇంకా రాలేదని, సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. తనకు ఎన్నికలు కొత్త కాదని, ఇప్పటికి 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర తనకి ఉందని చెప్పారు. అనర్హత కేసు అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయని, తన వైపు నుండి వాదనలు వినిపిస్తానని తెలిపారు. రేవంత్ రెడ్డి మరో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. రైజింగ్ తెలంగాణ కోసం తలపెట్టిన గ్లోబల్ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ఎమ్మెల్యే వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పవన్, ప్రవీణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జి.రామన్ గౌడ్, అశోక్, యాదగిరి, యతితిరాజ్, ప్రభాకర్, నయీమ్, రాజేంద్రప్రసాద్, గణేష్, మన్సూర్, జాకి, సోహెల్, అజార్, ఫారుక్, ఓం ప్రకాష్, జ్ఞాని, నందు, మల్లేష్, సర్ఫరాజ్, శ్రీనాథ్, అశ్విన్, అనీష్, ప్రియ రాజ్, పూర్ణచందర్, రమేష్, బాలకృష్ణ, మహేష్,జ్యోతి రెడ్డి, మాధవి, సుజాత,హమీద్, పాషా, అఖిల్, హాసన్, అభిషేక్, జై కృష్ణ, మోసిన్, శేఖర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.