నకిలీ నెయ్యి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
నకిలీ నెయ్యి విక్రయిస్తున్న వ్యక్తిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్, మార్కెట్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 200కిలోల నకిలీ నెయ్యి, వేయింగ్ మిషన్, ప్యాకింగ్ మిషన్, కవర్స్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…సికింద్రాబాద్, సెకండ్ బజార్‌కు చెందిన అన్నామాలి సాయినాథన్(68) మార్కెట్‌లో నెయ్యికి భారీగా డిమాండ్ ఉండడంతో నకిలీ నెయ్యి తయారు చేసి విక్రయిస్తున్నాడు. గతంలో నిందితుడు మోండా మార్కెట్ ప్రాంతంలో టిఫిన్ సెంటర్ నిర్వహించాడు, నష్టాలు రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు. ఈ క్రమంలోనే ఆవు నెయ్యికి మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ ఉన్న విషయం గమనించాడు. దానిని తయారు చేసి విక్రయించాలని ప్లాన్ వేసిన నిందితుడు కొబ్బరి నూనే, పాం ఆయిల్, డాల్డా, ఫుడ్ కలర్ కలిసి నకిలీ నెయ్యి తయారు చేసి విక్రయిస్తున్నాడు. స్థానికంగా ఉన్న మార్కెట్లు, పూజా స్టోర్లలో రూ.600 కిలో చొప్పున విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో పోలీసులు దాడి చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ చంద్రశేఖర్, రామచందర్, ఎస్సై సాయినాథ్ రెడ్డి తదితరులు అరెస్టు చేశారు.