కన్నతల్లిదండ్రులపై సైకో కత్తి దాడి
రంగారెడ్డి: అర్ధరాత్రి కన్నతల్లిదండ్రులపై సైకో కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా గండిపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గండిపేటలోని ఇఐపిఎల్ అపెలా అపార్ట్ మెంట్ లో తల్లి భారతి, తండ్రి రవీందర్ రెడ్డిలు నివసిస్తున్నారు. దంపతుల కుమారుడు రఘుపాల్ రెడ్డి కాలేజీలో ఎల్ఎల్ బి చదువుతున్నాడు. గత అర్థరాత్రి రఘుపాల్ రెడ్డి తన తల్లిదండ్రులను కత్తితో విచక్షణరహితంగా పొడిచాడు. ఇంట్లో నుంచి కేకలు వినపడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్ర గాయాలు కావడంతో వెంటనే దంపతులకు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. రఘు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్నాడు. తల్లిదండ్రులు తనను మానసికంగా వేదిస్తున్నారని, తనకు మతి స్థిమితం సరిగ్గా లేదని, తనకు వైద్యం చేయించాలని చూస్తున్నారని తెలియజేశారు. తనకు ఏమి కాలేదని, తనని తల్లిదండ్రులు కావాలనే మానసికంగా వేదిస్తుండడంతో తల్లిదండ్రులపై కత్తితో దాడి చేశానని వివరించాడు. దీంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.