రంగారెడ్డి జిల్లాలో మూడు కార్లు ఢీ.. భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పివి ఎక్స్ ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్ నంబర్ 253 వద్ద ఒకదానికొకటి మూడు కార్లు ఢీకొనడంతో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పర్ పల్లి నుంచి ఆరంఘర్ చౌరస్తా వరకు ట్రాఫిక్ జామ్ అయింది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో కావడంతో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.