పేద విద్యార్థిని విద్యా రుణం కోసం హరీశ్ ఇల్లు తాకట్టు
మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్: ప్రజలకు ఆప ద వస్తే అండగా తానున్నానని, ఆపదకు మరోపేరుగా నిలిచిన హరీశ్‌రావు మరోమారు తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో తన క్యాంపు కార్యాలయంలో మమత అనే పిజి వై ద్య విద్యార్థినికి విద్యా రుణం కోసం బ్యాంక్‌లో తన స్వగృహాన్ని మార్ట్‌గేజ్ చేసి రూ.20లక్షలు మంజూరు చేయించారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం టైలరింగ్ వృత్తి చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయన పెద్ద కుమార్తె మమత ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఉచితం గా ఎంబిబిఎస్ సీటు సాధించి చదువు పూర్తి చేసిం ది. పిజి ఎంట్రన్స్ పరీక్ష రాయగా మహబూబ్‌నగ ర్ ఎస్‌విఎస్ మెడికల్ కళాశాలలో ఆప్తమాలజీ వి భాగంలో ఆమెకు సీటు వచ్చింది. ప్రభుత్వ కన్వీన ర్ కోటాలోనే సీటు వచ్చినప్పటికీ మూడేళ్ల పాటు ప్రతి సంవత్సరం రూ.7.50 లక్షల చొప్పున ట్యూ షన్ ఫీజు చెల్లించాలి. ఈనెల 18వ తేదీ చివరి గడువు. దీంతో ఆర్థిక స్తోమత లేని ఆమె తండ్రి రామచంద్రం గతంలో
తన కుమార్తెలకు ఎంబిబిఎస్ సీట్లు వచ్చినప్పుడు హరీశ్‌రావు ఆర్థిక సహాయం చేసిన విషయం గుర్తుకొచ్చి మళ్లీ ఆయనే ఆదుకుంటారని భావించి ఈ విషయాన్ని ఆయనకు సమాచారం చేరవేశారు. విషయం తెలియగానే వెంటనే హరీశ్ రావు స్పందించి సిద్దిపేటలోని తన ఇంటిని మార్టిగేజ్ చేసి మూడేళ్లకు సరిపడా దాదాపు రూ. 20 లక్షల రూపాయల ఎడ్యుకేషన్ లోను మంజూరు చేయించారు. దీంతో ఆ డబ్బులను కళాశాలలో చెల్లించి ఆ విద్యార్థిని సీటు దక్కించుకుంది. మొదటి సంవత్సరం హాస్టల్‌కు లక్ష రూపాయలు అవుతుందని హరీశ్ రావు దృష్టికి రాగా మళ్ళీ హాస్టల్ ఫీజుకు ఎలాంటి అప్పు చేయొద్దని అ లక్ష రూపాయలు కూడా తానే చెల్లిస్తానని అందజేశారు.
పిజి అసాధ్యం.. చదవలేనేమో అని బాధపడ్డా: మమత (వైద్య విద్యార్థిని)
మా అమ్మానాన్నలు కష్టపడి టైలరింగ్ చేస్తూ నన్ను ఎంబిబిఎస్ దాకా చదివించారు. అహర్నిశలు శ్రమించి పిజి ఎంట్రన్స్‌లో సీటు దక్కిందని సంతోషపడ్డాను. ఉచితంగానే సీటు వచ్చినా ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు రూ.7.50 లక్షల చొప్పున మూడేళ్లు రూ.22.50 లక్షలు కట్టాలని చెప్పడంతో ఇక సీటు అసాధ్యమని అనుకున్నా. పిజి చదివే యోగ్యం లేదని బాధపడ్డా. కానీ ఆనాడు నాతో పాటు నా చెల్లెళ్ళకు ఎంబిబిఎస్ చదవడానికి హరీశ్‌రావు సార్ హెల్ప్ చేశారు. మేము అడగడమే ఆలస్యం.. ఆయన ఇంటిని బ్యాంకులో మార్టిగేజ్ చేసి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తానని వెంటనే బ్యాంకు వారికి కూడా ఫోన్ చేసి చెప్పారు. ఆయన రుణం తీర్చుకోలేనిది.