పేట్ బషీరాబాద్ లో విద్యార్థిపై టెన్ విద్యార్థులతో దాడి చేయించిన ప్రిన్సిపాల్
కొంపల్లి: హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో దారుణం వెలుగులోకి వచ్చింది. తన మాట వినడం లేదని ఓ విద్యార్దిని 10వ తరగతి విద్యార్ధులతో విచక్షణారహితంగా ప్రిన్సిపాల్ కొట్టించాడు. కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి విద్యార్ధి సూర్యను 10వ తరగతి విద్యార్థులు చితకబాదారు. తన మాట వినడం లేదని సూర్యను 10వ తరగతి విద్యార్ధులతో విచక్షణారహితంగా దుండిగల్ ఇంచార్జ్ ఎంఇఒ, కొంపల్లి పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణ కొట్టించినట్టు తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. బాధిత విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.