ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
నల్లగొండ జిల్లా, మండలంలోని చర్లపల్లి సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న శివాని అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శుక్రవారం మధ్యాహ్న సమయంలో కళాశాలలోని మూడవ ఫ్లోర్ నుండి ఆమె కిందకి దూకింది.ఈ ఘటనలో శివానికి తీవ్ర గాయలయ్యాయి. శివానికి తల, మెడ ప్రాంతంలో తీవ్ర గాయాలయ్యాయి. బిల్డింగ్‌పై నుండి దూకిన శివానిని గుర్తించిన సహచర విద్యార్థినులు, అధ్యాపకులు వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలికి చేరుకొని విచారించారు.శివాని స్వగ్రామం చండూరు మండలం, జోగిగూడెం గ్రామం కాగా, జీవితంపై విరక్తి చెంది తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శివాని సూసైడ్ లెటర్ రాసిందని రూరల్ ఎస్‌ఐ సైదా బాబు తెలిపారు. శివానికి తగిలిన గాయాలపై విద్యార్థినులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.