ఫ్రెండే రేప్ కు పాల్పడ్డాడు
తన స్నేహితుడే తనకు మత్తుమందు ఇచ్చి, అత్యాచారానికి పాల్పడ్డాడని, అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు తీశాడని ఓ ఎంబిబిఎస్ విద్యార్థిని ఆరోపించింది. ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలోని ఒక హోటల్ లో 20 ఏళ్ల యువకుడు తనకు మత్తుమందు ఇచ్చి, అత్యాచారం చేశాడని 18 ఏళ్ల ఎంబిబిఎస్ విద్యార్థిని ఆరోపించింది. సెప్టెంబర్ 9న ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.నిందితుడు – తన తోటి వైద్య విద్యార్థి – స్నేహం పేరుతో తనను హోటల్ ఆపిల్ కు రప్పించాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అక్కడికి చేరుకున్న తర్వాత తనకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. తన అశ్లీల చిత్రాలు, వీడియోలు చిత్రీకరించిన వాటని వైరల్ చేస్తానని బెదిరించాడని కూడా ఆ అమ్మాయి ఆరోపించింది. నేరం చేస్తున్నప్పుడే వాటిని చిత్రీకరించాడని పేర్కొన్నాడు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. దీంతో అతడిని అరెస్ట్ చేయలేదు. ఆ మహిళ హర్యానాలోని జింద్ నివాసి, ఆమె ఢిల్లీలోని రోహిణిలోని బాబా సాహెబ్ అంబేద్కర్ మెడికల్ కాలేజీ హాస్టల్ లో నివసిస్తోంది.