న్యూఢిల్లీ : దీపావళి పండుగను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ జాతి ప్రజలకు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను అందులో పేర్కొన్నారు. ఈ దీపావళికి ఎంతో ప్రాధాన్యత ఉందని, మావోయిస్టుల నుంచి విముక్తి పొందిన మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు దీపావళి పండుగ జరుపుకున్నారని అన్నారు. అడవి బిడ్డలకు ఇది నిజమైన దీపావళిగా అభివర్ణించారు. గిరిజన ప్రాంతాల్లో వెలుగులు నిండాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. దేశ రాజ్యాంగంపై విశ్వాసంతో ఆయుధాలు, హింసను విడనాడి జనంలోకి వందలాది మంది మావోయిస్టులు వచ్చారని, దేశానికి నిజంగా ఇది గొప్ప విజయం అన్నారు. ఆపరేషన్ సింధూర్‌కు రాముడే స్ఫూర్తి అన్నారు. ఆపరేషన్ ద్వారా ధర్మాన్ని కాపాడుకోగలిగామని పేర్కొన్నారు. తద్వారా ఉగ్రవాదంపై ప్రతీకారం తీర్చుకున్నామని మోడీ తెలిపారు. అంతకు ముందు రోజు సోమవారంనాడు భారత సైనిక బలగాల ధైర్య సాహసా ల వల్లనే దేశంలో నక్సల్ – మావోయిస్ట్ తీవ్రవా దం దాదాపు నిర్మూలించే దశకు చేరిందని ప్రధా ని నరేంద్రమోదీ వెల్లడించారు. కొన్ని తరాల పా టు భయాందోళనలు, హింస చూసిన వేలాది మం ది ప్రస్తుతం అభివృద్ధి పథంలో పయనించేందుకు ప్రధాన జీవన స్రవంతిలో చేరుతున్నారని మోదీ అన్నారు.
ప్రధాని మోదీ సోమవారం భారత నౌ కాదళం విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాం త్‌లో భద్రతా దళాలతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా జవాన్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రధాని దీపావళిని సైనిక దళాలతో జరుపుకునే సాంప్రదాయాన్ని కొనసాగించారు. 2014కు ముందు దేశవ్యాప్తం గా చాలా రాష్ట్రాలలోని 125 జిల్లాలలో నక్సలి జం ప్రబలంగా ఉండేదని, మావోయిస్ట్‌లు చెలరేగి పోయేవారని, ప్రస్తుతం 11 జిల్లాలకే ఈ సం ఖ్య పరిమితమైందని, కేవలం మూడు జిల్లాలలో మాత్రమే తీవ్రంగా ప్రభావితమయ్యాయని ప్రధా ని మోదీ వివరించారు. 100కు పైగా జిల్లాలు మావోయిస్ట్ ఉగ్రవాదం నీడ నుంచి బయటపడి పూర్తి స్వేఛ్ఛగా ఊపిరిపీల్చుకుంటూ దీపావళి సంబరాలు జరుపుకుంటున్నాయన్నారు. ఒకప్పుడు మావోయిస్ట్‌లు చాలా ప్రాంతాల్లో రోడ్లు నిర్మించడానికి, స్కూళ్లు, ఆస్పత్రులు ఏర్పాటుకు అడ్డుకున్నారని, పలు చోట్ల స్కూళ్లను, దవాఖానాలను పేల్చివేసి, వైద్యులను హతమార్చారని ప్రధాని గుర్తుచేశారు. ఆ ప్రదేశాలలో నేడు రహదారులను నిర్మించి, పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారని, పాఠశాలలను, ఆసుపత్రులను, నిర్మించి విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దే కార్యక్రమం సాగుతోందని ఆయన తెలిపారు.
దండకారణ్య ప్రాంతం, ముఖ్యంగా దక్షిణ చత్తీస్‌గఢ్ లో కొందరు మావోయిస్ట్ అగ్రనాయకులతో సహా 200 మందికి పైగా నక్సల్స్ లొంగిపోయి, ఆయుధాలను సమర్పించిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ఇప్పటికే కష్టా ల్లో ఉంది. ఈ మధ్య పెద్దఎత్తున నాయకులు, కేడర్ పోలీసులు, అధికారుల ముందు లొంగిపోవడంతో తీవ్రంగా దెబ్బతింది. ప్రధాని గోవా లో ఆదివారం నావికులు ప్రదర్శించిన దీపావళి సాంసృ్కతిక కార్యక్రమానికి హాజరయ్యారు. నౌకా దళం జవాన్లతో విందులో పాల్గొన్నారు. పణజి తీరానికి సమీపంలో స్వదేశీ క్యారియర్‌లో రాత్రి గడిపారు. కొచ్చిన్ షిప్ యార్డ్ లో నిర్మించిన విమాన వాహక నౌకపై మిగ్ -20 విమానాలతో దూ సుకువెళ్తూ నౌకాదళం ప్రదర్శించిన వైమానిక శక్తిని ఆయన తిలకించారు. భారత సముద్ర తీర రక్షణతో పాటు సముద్ర మార్గాల కమ్యునికేషన్‌ను పరిరక్షించడంలో నౌకాదళం పాత్రను ప్రధాని మోదీ కొనియాడారు. ప్రపంచ చము రు సరఫరాలో 66శాతం, కంటైనర్ షిప్ మెంట్ లో 50 శాతం హిందూ మహా సముద్రం గుండా వెళ్తుంటాయని, భారత నౌకాదళం పాత్రను విజయవంతంగా పోషిస్తోందని అన్నారు.