అనిశ్చితిలోనూ పురోగతి
చెక్కుచెదరని ఇండియాఆసియాన్ భాగస్వామ్యం
2026 మారిటైమ్ సహకార సంవత్సరం కాబోతుంది
ఆసియాన్ సదస్సునుద్దేశించి వర్చువల్‌గా ప్రధాని మోడీ ప్రసంగం
ఆసియాన్ సభ్య దేశంగా ఈస్ట్ తైమూర్
న్యూఢిల్లీ: భారత్ ఆసియాన్ సమగ్ర, ప టిష్ట వ్యూహాత్మక సహకార భాగస్వామ్యం ప్రపంచ సుస్థిరత, ప్రగతికి బలీయ పు నాది అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. సముద్ర మార్గాల సహకారం ది శలో వచ్చే ఏడాది 2026 ఆసియాన్ ఇండియా సంవత్సరం అవుతుందని చెప్పారు. మలేసియాలోని కౌలాలంపూర్ లో ఆదివారం ఆరంభమైన రెండు రోజుల ఇండియా ఆసియాన్ సదస్సును ఉద్ధేశిం చి ప్రధాని మోడీ వర్చువల్‌గా మాట్లాడా రు. భారతదేశపు విన్నూత తూర్పు ప్రాంత సహకార దృక్పథం దిశలో ఆసియాన్ వేది క అత్యంత కీలకమైనదని తెలిపారు. ఆసియాన్ కేంద్రీకృత విధానాలను, దృక్పధా న్ని భారత్ ఎప్పుడూ గౌరవిస్తూ వస్తోందిని చెప్పారు. ప్రస్తుత అనిశ్చితతల దశలోనూ ఇండియా ఆసియాన్ భాగస్వామ్యం చెక్కుచెదరకుండా నిలిచింది. ఎంతగానో పురోగతి సాథించిందని తెలిపారు. ఇటువంటి విశిష్ట సమ్మేళన ప్రక్రియతో ప్రపంచ స్థాయిలో ప్రగతి సుస్థిరతకు మరింత సజావైన బాటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పరస్పర సహకారం అనేది మిత్రబంధాలను బలోపేతం చేస్తుంది. ఇందుకు భారత్ ఆసియాన్ కలిసికట్టు పయనం ఉపయుక్తం అవుతుంది.
ప్రస్తుత సవాళ్ల దశలో సముద్ర జలమార్గాల భద్రత, సముద్ర వనరుల ఆర్థిక రంగం బ్లూ ఎకానమి అత్యంత కీలకం అయింది. అందుబాటులో ఉన్న విస్తారిత సముద్ర తీర ప్రాంతాలు, సముద్ర మార్గాల ఉనికి నేపథ్యంలో ఇండియా ఆసియాన్ రెండంచెల సహకారం దోహదకారి అయిందని ప్రధాని చెప్పారు. దీనిని పరిగణనలోకి తీసుకునే 2026 మారిటైం సహకార సంవత్సరం అవుతుందని ప్రధాని ప్రకటించారు. విద్యా, పర్యాటకం, శాస్త్ర సాంకేతికత , ఆరోగ్యం, హరిత ఇంధనం, సైబర్ సెక్యూరిటీలలో పరస్పర సహకారం విస్తృతం అవుతోందని తెలిపారు. ఇక మానసిక మానవ సంబంధాల దిశలో ప్రధానమైన సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ , ప్రజల మధ్య సత్సంబంధాల దిశలో కూడా సహకారం ఇనుమడిస్తుందని ప్రధాని తెలిపారు.
ఈ ప్రాంతంలో ఆసియాన్ అత్యంత ప్రధాన శక్తివంతమైన బలీయ వేదిక అవుతుంది. భారత్‌తో పాటు, అమెరికా, చైనా , జపాన్, ఆస్ట్రేలియాలు కూడా ఈ సంప్రదింపుల ప్రక్రియలో ఉన్నాయి. ఆగ్నేయాసియా దేశాల వేదిక అయిన ఆసియాన్ తొలుత కేవలం ఐదు దేశాలతో 1967 ఆగస్టులో ఏర్పడింది. ఇప్పుడు 11 దేశాలు సభ్యదేశాలు ఉన్నాయి. భారత్ ఈ ఆసియాన్ వేదిక సభ్య దేశం కాకపోయినా ప్రతి ఏటా జరిగే సదస్సులో సంప్రదింపుల క్రమంలో పాల్గొనడం, నిర్మాణాత్మక పాత్రతో వెలుపలి కీలక శక్తిగా మారింది.
ఆసియాన్‌లోకి ఈస్ట్ తైమూర్..
కౌలాలంపూర్ ఆసియాన్ దశలో ఈ గ్రూప్‌లో ఈస్ట్ తైమూర్ సభ్యదేశంగా చేరింది. ఈ చేరికను వేదిక ద్వారా స్వాగతించారు. ఇన్నేళ్ల తమ కల ఇప్పటకీ నెరవేరిందని ఈ నేపథ్యంలో తైమూర్ ప్రధాని క్సనానా గుసామా ఆనందం వ్యక్తం చేశారు. 1990 తరువాత ఆసియాన్ విస్తరణ ఇదే తొలిసారి. ఈ చేరికతోనే ఇక్కడ ఆసియాన్ సదస్సు ఆరంభం అయింది. ఈ సదస్సుకు భారత్, చైనా, రష్యా, అమెరికా , దక్షిణ కొరియా దేశాల ప్రతినిధి బృందాలు ఉన్నత స్థాయి నేతల సారధ్యంలో పాల్గొంటున్నారు. ఈ సదస్సు ఆరంభంలోనే థాయ్‌లాండ్, కాంబోడియాలు సరిహద్దు ఘర్షణల తాత్కాలిక విరమణను పొడిగించే ఒప్పందంపై సంతకాలకు దిగాయి. సమావేశానికి అమెరికా అధ్యక్షులు ట్రంప్ హాజరయ్యారు. ఘర్షణల నిలిపివేత అత్యంత కీలకమైన విషయం అన్నారు.