ఆ విషయం దాచి పెళ్లి చేసినందుకు… వైద్యురాలిని చంపిన వైద్యుడు
బెంగళూరు: భార్యకు అనారోగ్య సమస్యలు దాచి పెళ్లి చేసినందుకు ఓ వైద్యుడు తన భార్యను మత్తు ఇంజక్షన్లు ఇచ్చి చంపేశాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహేందర్ రెడ్డి అనే వ్యక్తి జనరల్ సర్జన్ డాక్టరుగా పని చేస్తున్నాడు. కృతికా రెడ్డి అనే యువతి డెర్మటాలజిస్టుగా విక్టోరియా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తోంది. మహేందర్ రెడ్డికి కృతికా ఇచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. పెళ్లి కూతురుకు గ్యాస్ట్రిక్, లోషుగర్, అజీర్ణం సమస్యలు దాచి పెళ్లి చేయడంతో మహేందర్ రెడ్డి ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. భార్యను ఆమె పుట్టింటికి తీసుకెళ్లాడు. చికిత్స పేరుతో ఆమెకు అనస్తీషియా డోసులు పెంచుతూ వచ్చాడు. ఇంట్లో హఠాత్తుగా పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. అనారోగ్య సమస్యలతోనే చనిపోయిందని శవ పరీక్ష నిర్వహించారు. అధిక మోతాదులో అనస్తీషియా డోసులు ఇవ్వడంతోనే మృతి చెందిందని శవ పరీక్షలో తేలింది. వెంటనే వైద్యుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.