సిపిఎం నేత సామినేని దారుణహత్య
మన తెలంగాణ/చింతకానిః సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని రామారావు దారుణంగా హత్యకు గురయ్యా రు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా, మధిర నియోజకవర్గం, చింతకాని మం డలం, పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పాతర్లపాడు గ్రామంలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో సామినేని వాకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మాటువేసి కత్తులతో పొడిచి గొంతు కోసి అతికిరాతకంగా చంపేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఉద్దేశపూర్వకంగానే కిరాయి గుండాలతో హత్య చేయించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పార్టీలో నీతి, నిజాయితీతో గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వారికి పార్టీని ముందుండి నడిపిన వ్యక్తి సామినేని రామారావు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం పోలిబ్యూరో సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు.
సామినేని రామారావు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీకి ఎనలేని సేవలు చేశారని తెలిపారు. ఆయన మృతికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర కమిటీ సభ్యుడు పోతినేని సుదర్శన్, ం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదిని రమేష్, జిల్లా కమిటీ సభ్యుడు బండి రమేష్, సిపిఎం నేత సామినేని రామారావును హత్య చేసిన దుండగులను వెంటాడి, వేటాడి కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సామినేని రామారావు హ త్యకు గురవడంతో యన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీస్ అధికారులు స్నిఫర్ డాగ్స్, క్లూస్‌టీమ్స్, సైబర్ వర్గాలు పట్టుకోవాలని ఆదేశించారు.