నేడు ఆస్ట్రేలియాతో పోరు.. పాకిస్థాన్ కు సవాల్
కొలంబో: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బుధవా రం ఆస్ట్రేలియాతో జరిగే పోరు పాకిస్థాన్‌కు చావో రేవోగా మారింది. ఇప్పటి వరకు పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచుల్లో నూ ఓటమి పాలైంది. దీంతో ఆసీస్‌తో పోరు పాక్‌కు సవాల్ గా తయారైంది. ఇక ఆస్ట్రేలియా మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. అయితే శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్ వర్షం వల్ల కనీసం టాస్ పడకుండానే రద్దయ్యింది. కాగా, పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫే వరెట్‌గా బరిలోకి దిగుతోంది. పాక్‌తో పోల్చితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా చాలా బలంగా ఉందనే చె ప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. కివీస్‌తో జరిగినపోరులో అష్లే గార్డ్‌నర్ కళ్లు చెదిరే శతకం సాధించింది. ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగేందుకు సిద్ధమైంది. ఓపెనర్లు అలీ హీలీ, లిచ్‌ఫీల్డ్‌లతో పాటు ఎలిసె పేరి, బెథ్ మూని, సదర్లాండ్ వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు జట్టులోఉన్నారు. వీరిలో ఏ ఇద్దరు నిలదొక్కుకున్న పాక్ బౌలర్లకు కష్టాలు ఖాయం.
ఇక ఈ మ్యాచ్ లో కెప్టెన్ హీలీ, ఎలిసె పేరి, బెథ్‌మూని జట్టుకు కీలకంగా మారారు. అంతేగాక సెంచరీ స్టార్ గార్డ్‌నర్‌పై కూడా జట్టు కు భారీ అంచనాలే ఉన్నాయి. ఇక పాకిస్థాన్ ఈ వరల్డ్‌కప్ లో అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. తొ లి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. బంత్లా బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక కేవలం 129 పరుగులకే కుప్పకూలింది. ఇక భారత్‌తో జరిగిన మ్యా చ్‌లోనూ ఓటమి పాలైంది. బౌలర్లు బాగానే రాణించినా బ్యా టింగ్ వైఫల్యంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. కీలక బ్యాటర్లు విఫలం కావడం పాక్‌కు ప్రతికూలంగా మారింది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన పాకిస్థాన్ పటిష్టమైన ఆస్ట్రేలియాకు ఎలాంటి పోటీ ఇస్తుందో వేచి చూడాల్సిందే.