కాలికి ఫ్యాక్చర్.. అయినా షూటింగ్ పూర్తి చేసిన రష్మిక
పాన్ ఇండియా సినిమాలతో వరుస హిట్లు అందుకుంటోంది రష్మిక. రీసెంట్ ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ‘థామా’ అనే హారర్, కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ సక్సెస్‌ని అందుకుంది. రష్మిక తన అందంతో యువతను ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘తుమ్ మేరీ నా హుయే’ పాటలో డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఈ నేపథ్యంలో ఈ పాట షూటింగ్‌కి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని రష్మిక వెల్లడించింది.
తన కాలికి ఫ్యాక్చర్ అయినా కూడా ఈ పాట షూటింగ్ పూర్తి చేసినట్లు తెలిపింది. ఈ ఏడాది జనవరిలో తాను జిమ్ చేస్తూ గాయపడినట్లు రష్మిక స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కాలికి కట్టుకట్టుకొన్న ఫోటోను షేర్ చేస్తూ వెల్లడించింది. తన వల్ల షూటింగ్‌కి ఆలస్యం అవుతున్నందుకు దర్శకులకు క్షమాపణ చెప్పింది. ‘‘వైద్యులు మూడు నెలలు విశ్రాంతి తీసుకోని చెప్పారు. అప్పుడు ‘ఛావా’ ప్రమోషన్స్ కోసం 30 రోజులు తిరుగుతూనే ఉన్నా. కాలి నొప్పి తీవ్రం కావడంతో మళ్లీ డాక్టర్ వద్దకు వెళ్లాను. ఆయన విషయం తెలుసుకుని నన్ను మందలించారు. కాలు వాచి, మొత్తం రూపు మారిపోయింది. అప్పటికే సాంగ్‌కు సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయడంతో నొప్పితోనే ఈ సాంగ్ చేశాను. ఈ రోజు ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తుంటే. అప్పుడు పడిన బాధ మర్చిపోయాను. ఎప్పుడూ నేను ప్రశాంతంగా ఉంటాను. ఎందుకంటే నేను ఏది చేసినా అది ప్రేక్షకుల కోసమే. వారి ముఖాల్లో ఆనందం నింపడం కోసమే’’ అని రష్మిక పేర్కొంది.