క్రీడలు
Auto Added by WPeMatico
లంకతో రసవత్తర పోరు.. సూపర్ ఓవర్ లో భారత్ విజయం
పాకిస్థాన్ ఫిర్యాదు.. సూర్యకుమార్ యాదవ్‌కు జరిమానా
బాధగా ఉంది.. ఒక్క సిరీస్‌లో విఫలమైతే జట్టులో నుంచి తీసేస్తారా?: కరుణ్
ఇండియాఎదే టెస్టు సిరీస్
లక్నో: ఆస్ట్రేలియాఎ టీమ్‌తో జరిగిన రెండో, చివరి టెస్టులో ఆతిథ్య ఇండియా టీమ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇండియా ఎ జట్టు రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 10తో సొంతం చేసుకుంది. 413 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఇండియా జట్టు ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ అజేయ శతకంతో జట్టును గెలిపించాడు. గురువారం మూడో రోజు ఆటలో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన రాహుల్ చివరి రోజు మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న రాహుల్ 210 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లతో 176 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. యువ ఆటగాడు సాయి సుదర్శన్ కూడా శతకం సాధించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన సుదర్శన్ 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 100 పరుగులు చేశాడు. కెప్టెన్ ధ్రువ్ జురెల్ 56 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 420 పరుగులు చేయగా ఇండియా 194 పరుగులకే కుప్పకూలింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో ఆస్ట్రేలియాను 185 పరుగులకే పరిమితం చేశారు. ఇక క్లిష్టమైన లక్ష్యాన్ని ఇండియా టీమ్ అలవోకగా ఛేదించి సిరీస్‌ను దక్కించుకుంది.
ముచ్చటగా మూడోసారి.. ఆసియాకప్‌లో అనూహ్య పరిణామం
ఆసియాకప్ టైటిల్ పోరులో భారత్ vs పాక్..

దుబాయి: ఆసియాకప్‌లో పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్4 కీలక మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 136 పరుగుల లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఆదివారం జరిగే ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో పాకిస్థాన్ తలపడుతుంది. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది మూడు, రవూఫ్ మూడేసి వికెట్లను పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 […]
ఆసియా కప్ సూపర్ 4.. నేడు లంకతో భారత్ ఢీ

దుబాయి: వరుస విజయాలతో ఇప్పటికే ఆసియాకప్‌లో ఫైనల్‌కు చేరుకున్న టీమిండియా శుక్రవారం శ్రీలంకతో జరిగే సూపర్4 చివరి మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌ను ఫైనల్‌కు సన్నాహకంగా ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తోంది. శ్రీలంక ఇప్పటికే ఫైనల్ రేసుకు దూరమైంది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడడంతో లంక టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి కాస్తయిన పరువును కాపాడు కోవాలనే లక్షంతో లంక ఉంది. అయితే అసాధారణ ఆటతో ఆసియాకప్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న […]
విండీస్‌తో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన

శుభ్‌మన్‌కే పగ్గాలు వైస్ కెప్టెన్‌గా జడేజా, నాయర్, శార్దూల్‌లకు ఉద్వాసన విండీస్‌తో టెస్టులకు టీమిండియా ఎంపిక దుబాయి: సొంత గడ్డపై వెస్టిండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం గురువారం టీమిండియాను ఎంపిక చేశారు. శుభ్‌మన్ గిల్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆసియాకప్ టోర్నమెంట్ కోసం శుభ్‌మన్ గిల్, ప్రధాన కోచ్‌లు దుబాయిలోనే ఉన్న విషయం తెలిసిందే. వారితో గురువారం భేటి అయిన […]
కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లా

ఆసియాకప్ సూపర్ 4 మ్యాచ్‌లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఇరు జట్లు ఇప్పటివరకూ సూపర్ 4లో ఒక మ్యాచ్‌లో విజయం సాధించి.. ఒక మ్యాచ్‌లో ఓడిపోయాయి. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో భారత్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం బంగ్లాదేశ్ (Bangladesh) తమ జట్టులో మూడు మార్పులు చేసింది. సైఫుద్దిన్, […]