Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Betpas

Betpas giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

trendbet giriş

meritking

meritking

trendbet giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking Giriş Güncel

Trendbet

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

piabellacasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Betpas

Betpas giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

palacebet

palacebet

yakabet

casibom

meybet

online diyetisyen

piabellacasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Trendbet

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Betpas

Betpas giriş

winxbet

casibom

bahislion

Marsbahis

meritking

betboo

vevobahis

holiganbet

holiganbet

slotbar

oslobet

meritking giriş

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinowon

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

piabellacasino

Atlasbet Giriş

piabellacasino

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

palacebet

bahislion

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

matbet

sekabet

sekabet

imajbet

marsbahis

piabellacasino

grandpashabet

betpark

matbet

pusulabet giriş

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

padişahbet

betasus

berlinbet

casinoas

casibom

kingroyal

holiganbet

marsbahis

casibom

queenbet

padişahbet

padişahbet giriş

yakabet

casinolevant giriş

padişahbet

meritking

1xbet

padişahbet

galabet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

kralbet

milanobet

gallerbahis

galabet

royalbet

betkolik

betticket

enbet

suratbet

süratbet

betpas

dinamobet

artemisbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

madridbet

betasus

sekabet

marsbahis

vdcasino

grandpashabet

bahiscasino

casinoroyal

sekabet

jojobet

casibom

casibom giriş

casibom güncel giriş

joybet

kingroyal

yakabet

yakabet

betkolik

betkolik

wbahis

kingroyal

masterbetting

kingroyal

imajbet

sekabet

pusulabet

meritking

vdcasino

betlike

vdcasino

ultrabet

tlcasino

casibom

galabet

ultrabet

tarafbet

madridbet

tarafbet

casino siteleri

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

padişahbet giriş

padişahbet

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

vevobahis

ఎన్నికల తీరు మారితేనే కల నెరవేరేది!

‘తెలంగాణలోని గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడిగా నడుస్తున్నది. ఎన్నికలు మూడు దశల్లో నడుస్తున్న తరుణంలో ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు రాజకీయ పార్టీలు కాలంతో పోటీపడి పనిచేస్తూ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. రెండు సంవత్సరాల నుండి పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన సమస్యలకు పరిష్కారాల్ని చూపే అసలైన గ్రామ స్వపరిపాలన కోసం పల్లెలన్నీ ఆశగా ఎదురుచూస్తున్నాయి. తెలంగాణలో 12,728 గ్రామ పంచాయతీలకు, 1,12,242 వార్డులకు 1 కోటి 60 లక్షల ఓటర్లతో ఎన్నికల రణరంగం సిద్ధమైనది. గ్రామంలోనే దేశం ఉంది. అవి అంతరించిపోతే దేశమే అంతమయ్యే ప్రమాదం ఉన్నది. పల్లెసీమలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తేనే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది. అలా నడవాలంటే ఎన్నికల ప్రక్రియనే కీలకం. అలాంటి కీలకమైన ఈ దేశ ఎన్నికల ప్రక్రియలో గ్రామస్థాయినుంచే సమూలమైన మార్పులు తేవాలి. కానీ మన దగ్గర అది పంచాయతీ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా వాటి తీరు ‘ప్రలోభాల’ పర్వమే తప్ప ప్రగతి సూత్రంగా లేదు.రోజులు గడుస్తున్నా కూడా పార్టీల జెండాలే తప్ప ప్రజా ‘ఎ’జెండాలు ముందుకు వెళ్లే పరిస్థితులు కనబడడం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభంగా, నాయకుడి ఎంపికలో నిర్ణయాత్మకమైన శక్తిగా నిలిచే ‘ఓటు’ను డబ్బుతో, మద్యంతో, పరపతి, ప్రలోభాలతో చట్టవిరుద్ధమని తెలిసిన కూడా యథేచ్ఛగా లాక్కుంటున్నారు. ప్రజల నిజాయితీని పక్కదారిపట్టించి ప్రలోభాల రొంపిలోకి దించారు. వీరి ప్రవర్తన, విధానాల వలన ఈతరమే కాదు భవిష్యత్తు తరాలు కూడా తీవ్రంగా నష్టపోతాయి. ఈ ధోరణి ఇప్పటికే సమాజంలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది ఇలానే కొనసాగితే రానురాను ఎటువైపు దారి తీస్తుందో..? ఏ రూపు దాలుస్తుందో..? రేపటికి ఏ సంకేతం ఇస్తుందో..?

ఊహిస్తేనే ఆందోళన కలిగిస్తున్నది. మనదేశ ప్రజాస్వామ్య వ్యవస్థనే మరింత ప్రమాదంలోకి నెట్టుతున్నది. వీటన్నిటికి మన రాజకీయ పార్టీల ఎన్నికల విధానాలు, వైఖరినే కారణం. స్వరాజ్యం కొద్దిమంది అధికారాన్ని చేజిక్కించుకున్నంత మాత్రానరాదు, అధికార దుర్వినియోగాన్ని అడ్డుకున్నచోట అడ్డుపడనప్పుడు మాత్రమే వస్తుంది. నేడు ఆ స్వరాజ్యం లేదు.. రాజ్యం చేజిక్కించుకోవడం కోసం ఎలాంటి అధికార దుర్వినియోగానికైనా సిద్ధపడడమే ఉంది. వ్యూహ, ప్రతివ్యూహాలు, ఎత్తులకు పైఎత్తులు, పొత్తులు, జిత్తులు, జిమ్మిక్కులు, రాజకీయాల సహజ స్వభావాన్ని మార్చేశారు. ఎవరు ఏ పార్టీలో ఉంటారో.. ఎప్పుడు మారుతారో.. అధికార దాహం కోసం ఏం చేయడానికి అయినా ఎలా సిద్ధపడతారో ఎవరికి అర్థం కానీ స్థితి ఉన్నది. ఈనాటి రాజకీయ ప్రక్రియలో తమ స్వార్థం, రాజకీయ దాహం తప్ప ప్రజల కోణం లేదు. కుట్రలు, కుతంత్రాలు, స్వార్థం, స్వప్రయోజనాలే కానీ మంచికి మానవత్వానికి, నీతికి, నిజాయితీకి అవకాశం లేదు అన్నట్టుగా ఉంది.

నేటి రాజకీయ పరిస్థితులను గమనిస్తే, సామాన్యుడికి రాజకీయాల్లో స్థానం లేదని, భవిష్యత్తులో కూడా రాదని స్పష్టంగా కనబడుతున్నది. ఎన్నికల్లో పోటీకి నిలబడితే ఏం చేస్తావు..? ఎలా చేస్తావు..? అని అడిగే పద్ధతులు పోయి నీ వద్ద ఎన్ని పైసలు ఉన్నాయి..? ఎంత పెడతావు..? ఎంత ఇస్తావు..?అని బహిరంగంగా మాట్లాడే దుస్థితికి వచ్చింది. అభివృద్ధికి పాటుపడే వ్యక్తుల విధానపరమైన ప్రవర్తన, పని విధానం, నిజాయితీ, నిబద్ధతలను పరిగణనలోకి తీసుకోకుండా అభ్యర్థుల కుల, ధన, బల, బలగాలను బేరీజు వేసుకొని ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా నడిచే దుస్థితి ఉన్నది. అభ్యర్థులను ఎంపికచేసే దగ్గర కూడా కొద్దిమంది వ్యక్తులే కూర్చొని శాషిస్తూ అభ్యర్థుల భవితవ్యాన్ని ఖరారు చేసే రాచరికపు పోకడలకు నిలయంగా మారింది. చివరికి విలువలతో బతకాల్సిన విద్యావంతులు సైతంజెండా, ఎజెండాలు ఏమీ లేక ఎవరికి పడితే వారికి జై కొట్టే అయోమయ పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా సమాజ అభివృద్ధికి పురోగమనం కాదు తిరోగమనమే.

మనదేశంలో రాజకీయ వ్యవస్థ పెట్టుబడిదారి వ్యవస్థగా రూపాంతరం చెందుతుంది. ఎలక్షన్ అంటేనే కలెక్షన్ అన్నట్టుగా ఎంత పెట్టాలి..? గెలిచిన తర్వాత తిరిగి ఎంత రాబట్టాలి ..? అని ముందే లేక్కలు వేసుకొని రంగంలోకి దిగే పరిస్థితులు వచ్చాయి. సేవ చేసేందుకు కాదు సంపాదించేందుకే రాజకీయాలను వాడుకుంటున్నారు. రాజకీయాల్లో వ్యక్తి, గుణగణాలు, వయస్సు తదితర రాజ్యాంగ నియమాలకు సంబంధించిన హక్కులు పోయి ‘డబ్బే’ ప్రధాన హక్కుగా నేడు మారింది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బే ఉండాలి, డబ్బు ఉన్నోళ్లే కావాలి అనే పరిస్థితులు వచ్చాయి. డబ్బు చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే సామాన్యులకు రాజకీయాల్లో స్థానం లేదని, భవిష్యత్తులో కూడా రాదనేది అక్షర సత్యం.

కాళోజీ లాంటి మహనీయులు జరుగుతున్న తీరును గమనించే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, ఏ పాటివాడో చూడు, ఎన్నుకుంటే ఏం చేస్తాడో కాదు ఇప్పటివరకు ఏం చేశాడో చూడు, పెట్టిన టోపీని కాదు.. పెట్టే టోపీని చూడు అంటూ చైతన్యం చేశాడు. అయినా ప్రజలు చైతన్యం కాలేదు.. ప్రజల్ని విభజించి వారి ఆలోచన శక్తిని చంపి తమ అనుచరులుగా మలుచుకున్నారు. కాబట్టే పార్టీల జండాలే తప్ప వారికి మరొకటి అర్థం కాదు. వారి అభివృద్ధి, అభ్యున్నతి ఆలోచన రాదు. అందుకే ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడనే మిగిలారు. అభివృద్ధి కూడా అలానే మిగిలింది. కానీ మనల్ని ఏలే నాయకులు మాత్రం కోట్లాది రూపాయలకు అధిపతులుగా మారారు. అందువల్లనే నాయకుల్లో ఎదుగుదల ఉన్నది కానీ ప్రజల్లో ఎదుగుదల లేదు. ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలే ఎన్నుకోబడే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. వారి నిర్ణయాధికారం మీదనే పాలన వ్యవస్థ ఆధారపడి ఉన్నది. కానీ ప్రజలు ఆ నిర్ణయాధికార శక్తి ఏంటో..? ఒక్కసారి ఉపయోగిస్తే ఎలా ఉంటుందో..? ఎలాంటి మార్పులు తెస్తుందో.. తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. తాత్కాలిక ప్రయోజనాల గురించి ఆలోచించడం మాని దీర్ఘకాలిక ప్రయోజనాలు మార్పుపై దృష్టిపెటి ప్రజాస్వామ్యయుతంగా, విశ్వజనీయమైన, స్వేచ్ఛాయుత నిష్పక్షపాత పద్ధతిలో ప్రజలు ప్రలోభాలకు గురికాకుండా ఓటును వినియోగించుకుంటే మహోత్తరమైన మార్పులు ఎన్నో జరుగుతాయి. ఆ మార్పులన్నింటికీ వజ్రాయుధం మన ఓటే. నా జాతి ప్రజలకు కత్తిని ఆయుధంగా ఇవ్వలేదు.. ఓటునే ఆయుధంగా ఇచ్చాను, పోరాడి రాజులవుతారో లేక ఓడిపోయి (అమ్ముకొని) బానిసలు అవుతారో తేల్చుకోవాలని అంబేద్కర్ సందేశం ఇచ్చారు.. ఓటు హక్కు సాధించిన అనంతరం ఓటు ఆవశ్యకతను, అవసరతను వివరించారు. కానీ దురదృష్టవశాత్తు రాజ్యాంగంలో ఓటు హక్కు వచ్చి 75 ఏళ్లు దాటిన కూడా ఇంకా ఓటు అవసరతను, ఆవశ్యకతను ప్రజలు గ్రహించడం లేదు. ప్రభుత్వ పరిధిలో ఉన్న అన్ని రాజ్యాంగ సంస్థలు, అధికారులు ఓటుపై ప్రజల్లో అవగాహన పెంచాలి. ఫోటో వరకే పరిమితమై చైతన్యం తెచ్చామంటే కాదు ఫోటో షూట్లు మానీ అధికార యంత్రాంగమంతా పల్లెబాట బట్టి ప్రజలకు ఓటు ఆవశ్యకతను వివరించాలి. ‘ఓటర్లు చైతన్యమైనప్పుడు మాత్రమే పరిపాలన వ్యవస్థలో కానీ, పాలకుల ఆలోచన ధోరణుల్లో కానీ మార్పు వస్తుంది. ఓటరులో మార్పు రానంత కాలం సమాజంలో మార్పురాదు..’ కాబట్టి ఓటరు పూర్తిగా మారాలి.. ఆ దిశగా మార్పు జరగాలి. నాయకుడి ఎంపికలో ఓటరే కీలకమైనప్పుడు అసమర్ధున్ని ఎన్నుకొని బాధపడే కంటే ఎన్నికకు ముందే అన్ని ఆలోచించి సమర్థవంతమైన నాయకుడిని మాత్రమే ఎన్నుకోవాలి. అలా ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఈ వ్యవస్థలో మార్పుతో పాటు ప్రజల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రశ్నించే స్వభావం పెరుగుతుంది. పాలనలో కూడా జవాబుదారీతనం ఉంటుంది. పాలన సరిగ్గా చేయకపోతే ప్రజలు నిలదీస్తారని భయం పాలకుల్లో కూడా ఉంటుంది. ఇవన్నీ ఓటు మీదనే ఆధారపడి ఉంది.

ఇది జరగాలంటే ప్రస్తుత రాజకీయాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. స్వార్థంతో కాదు సామాజిక బాధ్యతతో పరిపాలించే వ్యవస్థ రావాలి. ప్రజలకు జవాబుదారీగా లేకుంటే, ప్రజలు వద్దనుకుని పాలకులను నేరుగా తొలగించే ‘రీకాల్ సిస్టం’ రావాలి. మన రాజకీయ వ్యవస్థలో వారసత్వ పోకడలు పోవాలి. అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో ఉన్నట్టుగా పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు రెండుసార్లు మాత్రమే పోటీ చేసేలా నిబంధనలతో పకడ్బందీ చట్టాన్ని తేవాలి. రాజకీయాల్లో యువతరం, కొత్త రక్తం ఎదిగేలా ప్రోత్సహించాలి. ప్రజల్లో రాజకీయాలపై పేరుకుపోయిన చెత్తను, భ్రమల్ని పోగొట్టాలి. క్షేత్రస్థాయిలో వీటిని ఆచరణలో అమలు చేయాలి. అలా సంస్కరించినప్పుడే రాజకీయాలు రేపటి తరానికి ఆదర్శవంతంగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.. ఇలా జరిగినప్పుడే ధనంతో సంబంధం లేకుండా చట్టం ప్రకారం ఒక సామాన్యుడు కూడా సమాజం కోసం పాటుపడతాడని, సేవ చేస్తాడనే విశ్వాసం పెరుగుతుంది. పార్టీలు సైతం ఎన్నికల్లో పోటీ చేయాలంటే అర్హత సేవా గుణమే కానీ ధనం కాదని గుర్తిస్తే, సంపాదన కోసం కాదు సమాజ బాగు కోసమే రాజకీయాలు అన్నట్టుగా మారితేనే అవి నీతివంతమైన రాజకీయాలు అవుతాయి. వాటివల్ల రేపటి తరానికి మేలు జరుగుతుంది. ప్రజలకు కూడా సమన్యాయం, సామాజిక న్యాయం అందుతుంది. కావున రేపటి తరం నిలబడాలంటే ఎన్నికల తీరు పూర్తిగా మారాలి, అది పంచాయతీ ఎన్నికల నుండే ప్రారంభం కావాలి. ఆ దిశగా పాలకవర్గం క్షేత్రస్థాయిలో పలు సంస్కరణలు తీసుకురావాలి. అలా చేస్తేనే ఎన్నికల తీరు మారుతుంది. ప్రగతి వైపు నడుస్తుంది.

రాగల్ల ఉపేందర్ (మాదిగ)

ఢిల్లీకి దారేది?

‘రష్యా అధినేత పుతిన్ ఢిల్లీ సందర్శించారు’ అని ఇది చారిత్రక యాత్ర అని జబ్బలు చరుచుకుంటున్న ప్రభుత్వం, విశ్వనగరాలలో నివాసయోగ్యం కాని నగరం ఏదైనా ఉందా అంటే అది ఢిల్లీ అని పిల్లల దగ్గర నుంచి చాట్‌జిపిటి ఒకే సమాధానం చెబుతున్నారు. ఢిల్లీ, శనివారం నాడు మరోసారి విషజన్య వాయువు పొగతిమ్మడుతో మగ్గిపోయింది. నగరంలో వాయు ప్రమాణం 330 వద్ద నిలిచిపోయింది. ఇది ‘చాలా చెడు’ విభాగంలో ఉంటుందని సూచిస్తుంది. ఇది 24 గంటల సగటు ఎక్యుఐ గా నమోదయింది. ఢిల్లీ నగరంలో 40 వాయు గమన కేంద్రాల్లో 31 కేంద్రాలు ‘చాలా చెడు’ స్థాయిలో నమోదయ్యాయి.

సిబిపిబి సమీర్ యాప్ ప్రకారం నెహ్రూనగర్ అతి పెద్ద ఎక్యుఐ స్థాయిని 369గా నమోదుచేసింది. శనివారం ఉదయం ఢిల్లీవాసులు మరోసారి గాలి కంటే చూర్ణమైన వాయు ద్రవ్యరాశిని తట్టుకున్నారు. ఉదయం 9 గంటలకు ఎక్యుఐ 335కి చేరుకుంది. మొత్తం 36 గమన కేంద్రాలు ‘చాలా చెడు’ స్థాయిలో ఉన్నాయి. ముంఢకా 387వరకు అత్యంత హానికరమైన గాలి నాణ్యతను నమోదు చేసింది. వాయు నాణ్యతపై ప్రభావం వరుసగా చాలా రోజులు దరిద్రంగా తయారైంది. సిబిపిబి ప్రకారం, 0-50 ఎక్యుఐ మంచి గా, 51-100 సంతృప్తికరమైనగా, 101-200 మోడరేట్‌గా, 201-300 చెడుగా, 301-400 చాలా చెడుగా, 401-500 తీవ్రమైనగా పరిగణించబడుతుంది. శనివారం రాత్రి, ఢిల్లీ వాయు నాణ్యత 330 వద్ద నమోదైంది. ఇది ఢిల్లీ గురించి తీవ్రమైన కాలుష్యాన్ని సూచిస్తుంది. వాయు నాణ్యత దిగజారడానికి అనేక కారణాలు ఉన్నాయని సమాచారం.

ఢిల్లీ వాయు నాణ్యత నిర్వహణ కోసం నిర్ణయ సహాయ వ్యవస్థ ప్రకారం, రవాణా వాయు కాలుష్యానికి ప్రధాన కారణం కావడం గమనించబడింది. ఇది మొత్తం కాలుష్యలో 14.8% కంటే ఎక్కువ బాధ్యత వహిస్తుంది. దీనికి తరువాతి కారణాలు ఢిలీ, పరిసర ప్రాంతాలలో ఉన్న పరిశ్రమలు (7.3%), గృహకాలుష్య మూలాలు (3.6%), నిర్మాణాలు (2%) అని గుర్తించబడ్డాయి. గత రెండురోజులు ప్రజారోగ్యపట్ల భయంకరమైన ప్రభావం చూపుతోంది. దీని కారణంగా ఢిల్లీవాసుల ఆరోగ్యం తీవ్రమైన ప్రభావాలను ఎదుర్కొంటున్నాయి. 2022, 2024 మధ్య ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2,00,000కి పైగా ప్రాథమిక శ్వాసకోశ సంబంధిత రోగాల కేసులు నమోదయ్యాయి. ఈ గడువులో 30,000 మందికిపైగా ప్రజలు ఆసుపత్రిలో చేరినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో పేర్కొంది.

పార్లమెంట్ లో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఢిల్లీలో ఉన్న శ్వాసకోశ సంబంధిత కేసులు 2022లో 67,054, 2023లో 69,293, 2024లో 68,411 గా నమోదు అయ్యాయి. 2025 నవంబర్ నాటికి లక్ష దాటినట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీనికి తోడు చల్లని వాతావరణం ఢిల్లీని మరింత ఇబ్బందిపెడుతోంది. పరిసర వాతావరణం కూడాఢిల్లీని బాధిస్తోంది. శుక్రవారం ఉదయం ఢిల్లీ వాతావరణ శాఖ ప్రకారం, ఢిల్లీ నూతన సంవత్సరానికి ముందు చల్లని ఉదయం గమనించింది. బుధవారం 5.6 డిగ్రీల సెల్సియస్ (3.9 డిగ్రీలు సాధారణం కంటే తక్కువ) నమోదైంది. వాతావరణం కారణంగా ఢిల్లీ వాయు నాణ్యత మరింత దిగజారిపోయింది. శనివారానికి వాయు నాణ్యత ఇంకా పడిపోయింది. ప్రభుత్వాలు అవలంబిస్తున్న పారిశ్రామిక, సాంకేతిక విధానాలు ప్రకృతి విధ్వంసానికి కారణాలు అవుతున్నాయి.

ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్, నీటి ఆవిరి సమతుల్యంగా ఉంటేనే వన్యప్రాణి, వ్యవసాయానికి, మానవుని అభివృద్ధికి తోడ్పడుతుంది. వాయు కాలుష్యం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు కారణమయ్యే పియం 2.5, పియం 0.5 వంటి చక్కటి రేణువుల హానికరమైన పదార్థాలను కలిగి ఉంది. ఎసిలు, రిఫ్రిజిరేటర్లు విపరీతంగా వాడడం వలన క్లోరోఫ్లోరో కార్బన్లు, ద్రావకాలు, రిఫ్రిజిరేటర్లకు ఉపయోగించే వాయువుల ద్వారా ఓజోన్ పొరను నాశనం చేసి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ వాయువు సాంద్రత పెరగడం వల్ల గ్రీన్హౌస్ ప్రభావం వాతావరణంలో పర్యావరణ విధ్వంసం సమస్యగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఢిల్లీని పాలిస్తున్న ప్రభుత్వాలు కాలుష్య సమస్యను పరిష్కరించడానికి తక్షణ చర్యలు చూపాల్సిన అవసరం ఉంది. దీనితో పాటు ప్రభుత్వాలు, పరిశ్రమలు, మీడియా, ప్రజల సహకారం అవసరం. 

డా. ముచ్చుకోట సురేష్ బాబు

9989988912 

నిర్లక్షం నిప్పు.. ఎవరిది తప్పు?

గోవా క్లబ్‌లో ఆదివారం (7.12.2025) అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదం గ్రామ పంచాయతీ వ్యవస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వరకు భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు ఎలా జరిగాయో బట్టబయలు చేసింది. ఈ ప్రమాదానికి దారితీసిన భద్రతా వైఫల్యాల్లో బాధ్యులైన వారందరూ “తిలాపాపం తలా పిడికెడు” అన్న చందంగా వ్యవహరించారు. బూడిద కుప్పల సాక్షంగా పాతిక ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మృతుల్లో 20 మంది నైట్‌క్లబ్ సిబ్బందే. వీరంతా వలస కార్మికులు, వీరిలో నలుగురు నేపాల్, ఐదుగురు ఉత్తరాఖండ్ నుంచి, జార్ఖండ్, అసోం నుంచి ముగ్గురేసి, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి ఇద్దరేసి, పశ్చిమబెంగాల్ నుంచి ఒకరు వచ్చారు. వీరితోపాటు ఐదుగురు టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. టూరిస్టుల్లో ఢిల్లీకి చెందిన ఒకే కుటుంబం లోని ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం. మృతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, ప్రధాని రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2 లక్షలు వంతున ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం ఆనవాయితీగా జరిగింది. అంతటితో ఈ ప్రమాదాలకు ముగింపు పలికినట్టు కాదు.

ఇది దేశం మొత్తం మీద భద్రతా ప్రమాణాలపై నేరపూరిత నిర్లక్షం మళ్లీ వెలుగు లోకి తెచ్చింది. ఈ ప్రమాదానికి దారి తీసిన భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు మీవల్ల కాదు మీవల్లనే అంటూ గ్రామ పంచాయితీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు అధికారుల పరస్పర నిందారోపణలు స్వైర విహారం చేస్తున్నాయి. గోవా అర్పోరా వద్ద బిర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్ ఏర్పాటైన స్థలమే పర్యావరణ పరిరక్షణ జోన్‌లో ఉంది. గోవా చట్టం ప్రకారం ఈ స్థలాన్ని వ్యవసాయేతర సంస్థలకు వినియోగించరాదు. ఈ స్థలాన్ని అమ్మడం కానీ కొనడం కానీ చేయకూడదు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ప్రమాణాలను పట్టించుకోకుండా బగానది నుంచి వెలువడిన నిల్వనీటిపై అంటే నీటికయ్యపై ఈ క్లబ్‌ను నిర్మించారు. సాధారణంగా ఈ ఉప్పునీటి కయ్యల్లో రొయ్యలు సాగు చేస్తుంటారు. ఈ క్లబ్ నుంచి మెయిన్ రోడ్డుకు అనుసంధానంగా సన్నని ఇరుకు రోడ్డు నిర్మించారు. ఈ క్లబ్ చిన్న నీటి కొలనుకు విభజనగా నిర్మాణమైంది. ఒకవైపు చిన్న నీటి కొలను ఉండగా, మరోపక్క బగానది ఆనుకుని ఉంది.

భవన భద్రతా నిబంధనలకు విరుద్ధంగా ఈ క్లబ్‌ను నిర్మించారని పంచాయతీ అధికారులు భవనం కూలగొట్టడానికి సిద్ధం కాగా, రాష్ట్ర పంచాయతీ రాజ్ అధికారులు అడ్డుకున్నారని అర్పోరా గ్రామ పంచాయతీ అధ్యక్షుడు రోషన్ రేడ్కర్ ఆరోపించారు. అయితే ఎంఎల్‌ఎ మైకేల్ లోబో పంచాయతీ అబద్ధాలు చెబుతోందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెస్టారెంట్ నడపడానికే అనుమతి ఇవ్వగా, గ్రామ పంచాయతీ రెస్టారెంట్‌కు, నైట్‌క్లబ్‌కు కూడా అనుమతించిందని ఆరోపించారు. నైట్‌క్లబ్‌కు అనుమతి ఇవ్వాల్సింది ఎక్సైజ్ డిపార్టుమెంటే తప్ప పంచాయతీ బాధ్యత కాదని వ్యాఖ్యానించారు. 20 ఏళ్ల నాటి ఈ క్లబ్‌కు తాజాగా 2023లో గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చింది. గత ఇరవై ఏళ్లలో ఈ క్లబ్ యాజమాన్యం అనేక చేతులు మారింది. ఆదివారం రాత్రి క్లబ్ దగ్గర ఎలాంటి జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకోకుండా పైరోగన్‌లు, బాణాసంచా కాల్పుల ప్రదర్శన నిర్వహించారు. దీనికి తోడు కొబ్బరి ఆకులతో తాత్కాలిక షెడ్ నిర్మించడం, మండే వస్తువులు ప్లాస్టిక్, ఫైబర్, ఫోమ్ ప్యాకేజింగ్ వంటి అలంకరణలు అగ్నికి మరింత ఆజ్యం పోశాయి.

క్లబ్ ప్రవేశమార్గం చాలా సన్నగా, ఇరుగ్గా ఉండడంతో అగ్నిమాపక యంత్రాలు లోపలికి వెళ్లడానికి వీలు కలగక, 400 మీటర్ల దూరంలోనే అవి ఉండిపోవలసి వచ్చింది. క్లబ్‌కు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు లేవు. ప్రమాద సమయంలో ఫస్ట్‌ఫ్లోర్‌లో డాన్స్ ఏరియాలో 100 మంది వరకు ఉన్నారు.కమ్ముకున్న పొగ వల్ల చాలామంది ఊపిరాడక పోవడం వల్లనే చనిపోయారని తేలింది.2023లో ఈ క్లబ్ నిర్వహణకు వీలు కల్పించిన బాధ్యులైన ముగ్గురు అధికారులను ఆదివారం రాత్రి సస్పెండ్ చేశారు. క్లబ్ యజమానులు ఇంకా పట్టుబడలేదు. ప్రమాదంపై దర్యాప్తునకు సిఎం ప్రమోద్ సావంత్ ముగ్గురు అధికారులలతో కమిటీ వేశారు. ఈ కమిటీ వారం లోగా దర్యాప్తు నివేదిక సమర్పించవలసి ఉంది. ఈ ప్రమాదం మళ్లీ దేశం మొత్తం మీద అగ్ని ప్రమాదాల నివారణకు ఎంతవరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారో సమగ్రంగా సమీక్ష జరగవలసిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.

గత ఏడాది రాజ్‌కోట గేమింగ్ జోన్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంనుంచి ఇటీవల అక్టోబర్‌లో జైపూర్ సవాయి మాన్‌సింగ్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం వరకు సమీక్షించవలసిన అవసరం కనిపిస్తోంది. భద్రతా ప్రమాణాలపై నిర్లక్షం నిప్పు ఈ ప్రమాదాలకు దారితీస్తోందని సర్వసాధారణంగా తెలిసిన విషయమే. నోయిడా అధికార యంత్రాంగం గత ఏడాది 131 సొసైటీలు సరైన అగ్ని ప్రమాద భద్రతా ప్రమాణాల లోపంతో ఉన్నాయని గుర్తించింది. మంటలను ఆర్పే సామర్ధం, సాంకేతిక సౌకర్యాలు దేశం లోని ఫైర్ స్టేషన్లలో 96 శాతం లోపించాయని ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించడం గమనార్హం. కొన్ని ఫైర్ స్టేషన్లు కాలం చెల్లిన పరికరాలతో అల్లాడుతున్నాయి. వీటి నిర్వహణలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అగ్నిమాపక శకటాల్లో చాలా వాటికి ఇంధనం నింపేందుకు తగిన ఆర్థిక వనరులు కూడా లేకపోవడం పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తుంది. భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించిన వారెంతవారైనా సరే కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవడం ప్రారంభమైతేనే కొంతవరకైనా ప్రమాదాలను నివారించిన వారవుతారు. ఈ విషయంలో ప్రభుత్వాలు మేల్కోడానికి మరెన్ని విషాద సంఘటనలు చోటు చేసుకోవాలి ? 

అక్రమ బహిష్కరణలు ఆగేదెన్నడు?

బంగ్లాదేశ్‌లో ఆరు నెలల నిర్బంధం తర్వాత 25 ఏళ్ల సునాలి ఖాతుర్ మాల్టాలోకి అడుగుపెట్టింది. ఇది కొంత ఉపశమనం కలిగించినా, సామూహిక అవమానంగా భావించి ఉండాలి. ఆమె అక్రమ వలసదారు కాదు, చొరబాటుదారు కాదు. వీసా గడువు ముగిసినా మన దేశంలో ఉంటున్న విదేశీ పౌరురాలు కాదు. అమె పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్త్రీ, గర్భిణి. చిన్న కొడుకుతో ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి న్యాయపరమైన అనుమతి లేకుండా భారతీయ అధికారులు బలవంతంగా అంతర్జాతీయ సరిహద్దులను దాటించారు. న్యాయవాదులు, వలసహక్కు సంఘాల జోక్యం, ఆమె కేసు కోర్టు ముందుకు తెచ్చేందుకు చేసిన యత్నాల పుణ్యమా అని ఆమె తిరిగి రావడం సాధ్యమైంది. దీనిపై ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ చట్టాల గురించి అస్పష్ట సూచనలు తప్ప ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఆ సూచనలు కూడా సరైన ప్రక్రియ లేకుండా భారతీయ పౌరులను మరో దేశానికి నెట్టివేయడాన్ని ఏమాత్రం సమర్థించవు. సునాలీకి ఎదురైన కఠిన పరీక్ష చిత్రం ఏమీ కాదు. అసోం, చుట్టుపక్కల జిల్లాలనుంచి వచ్చిన పేద బెంగాలే మాట్లాడే ముస్లింలను అనుమానిత అక్రమ వలసదారులుగా ముద్రవేసి, చట్టబద్ధమైన బహిష్కరణలకు బదులుగా రహస్యంగా బహిష్కరణ మాదిరిగా సరిహద్దుల నుంచి నెట్టివేయబడుతున్న ఎన్నో కేసులలో ఇది ఒకటి. కేసు తర్వాత.. బంగ్లాదేశ్ ఈ వ్యక్తులను తమ పౌరులుగా అంగీకరించేందుకు నిరాకరించడం, వారు బంగ్లాదేశ్ జాతీయులు కాదని నొక్కి చెప్పి భారతదేశానికి తిరిగి పంపడం మామూలయింది.

పదేపదే ఇలా పలువురు తిరిగి రావడం పలు ప్రశ్నలకు దారితీస్తున్నది. బంగ్లాదేశ్ వారిని కోరుకోకపోతే, భారతదేశం వారిని గుర్తించడానికి నిరాకరిస్తే, వారి చట్టబద్ధమైన, మానవ పరమైన హోదా ఏమిటి? ఏ ప్రభుత్వం తమ సొంత పౌరులను భౌతికంగా తొలగించి, వదిలి వేయాల్సినంతగా భారంగా భావిస్తుంది. 2025 మే లో అసోంకు చెందిన ఇద్దరు మహిళలు -సోనా భాను, రహిమా బేగం- ను వారి ఇళ్లనుంచి తీసుకెళ్లి మిలిటరీ జోన్ మీదుగా తరలించి, భారతదేశం బంగ్లాదేశ్ మధ్య ఉన్న నో మ్యాన్ లాండ్ -నిర్జన ప్రదేశంలో వదిలి వేశారు. వారికి తిండిలేదు. నిలువ నీడలేకుండా కొన్నిరోజుల తరబడి బయటపడ్డారు. బంగ్లాదేశ్ అధికారులను వారిని తిరిగి తీసుకువచ్చి సరిహద్దు గార్డులకు అప్పగిస్తే, వారి నుంచి వేధింపులు భరించాల్సి వచ్చింది. అదే సమయంలో మాజీ పాఠశాల టీచర్ బైరుల్ ఇస్లాంను సుప్రీం కోర్టులో అప్పీలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్‌కు బలవంతంగా తరలించారు. చాలా కాలం క్రితం డి- ఓటరుగా గుర్తించబడిన హజేరా ఖాతున్ అనే వృద్ధ మహిళను ఇదే విధంగా బహిష్కరించారు. బంగ్లాదేశ్ ఆమెను తమ దేశంలో చేర్చుకోవడానికి నిరాకరించే వరకూ ఆమె తనను తాను రక్షించుకుంటూ బతకాల్సివచ్చింది.

ఇవి చట్టపరమైన బహిష్కరణలు కావు. అవి భారత చట్టం ప్రకారం అవసరమైన డాక్యుమెంట్లు, విచారమలు, పర్యవేక్షణ లేకుండా చేసిన బహిష్కరణ చర్యలు. వారు తగిన సాక్ష్యాలు లేకుండా సామాజిక పరమైన కమ్యూనిటీలపై కేవలం అనుమానంతో ఈ చర్యలకు దిగారు. అసోం సంక్లిష్ట వలస చరిత్ర చాలా కాలంగా రాజకీయ పరంగా రూపుదిద్దుకున్నది. ఈ మధ్య కొద్ది కాలంగా అక్రమ వలసపై పాలనాపరమైన ధ్రువీకరణ మరింత దూకుడుగా, నిర్ణయాత్మకంగా మారుతున్నట్లు కన్పిస్తోంది. చట్టపరమైన ప్రక్రియను కానీ, పేదల వాస్తవిక జీవితాలను కానీ అంతగా పట్టించుకోవడం లేదు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం, వలసదారుల (అసోం నుంచి బహిష్కరణ) చట్టం 1950 కింద వందలాది మంది సరైన పత్రాలులేని వ్యక్తులను వెనక్కి నేట్టివేసిన విషయాన్ని బహిరంగంగా ప్రకటించుకుంటోంది. ఇలాంటి ప్రకటనలు రాజకీయంగా నియోజకవర్గాల్లో బాగా పనిచేస్తాయి. కానీ, ఏకపక్ష బహిష్కరణలు చట్టబద్ధంగా అసాధ్యం అన్న అంశాన్ని మరుగుపరుస్తాయి.

భారతదేశం – బంగ్లాదేశ్ మధ్య పరస్పరం వ్యక్తులను స్వదేశాలకు పంపించే ఒప్పందం లేదు. బహిష్కణకు స్పష్టమైన డాక్యుమెంట్‌లు, రుజువులు, వారిని స్వీకరించే దేశం అంగీకారం చాలా అవసరం. ఇవి లేకుండా నెట్టివేతలు నాటకాల వంటివే. దీనివల్ల తలెత్తే పరిణామాలు ప్రభుత్వాలకన్నా, ఆ పౌరుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జీవితాలే తల్లకిందులైపోతాయి. నెట్టివేతకు లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులు.. పేదవారై ఉంటారు. వారి చదువు అంతంత మాత్రమే. ఎక్కువ నిరక్షరాస్యులై ఉంటారు. అక్రమ వలస విషయంలో ఎలాంటి చిక్కులు ఎదురైనా, తమను తాము రక్షించుకునే సామర్థ్యం కూడా వారికి తక్కువే ఉంటుంది. రాజకీయపరంగా వాయిస్ లేని వారి వలసలకు, భాషా, -మతపరమైన మైనారిటీలకు మధ్య ఉండే తేడా తక్కువ. బెంగాలీ మాట్లాడే వారిని ఇప్పటికీ అనుమానితులు గానే చూస్తారు. ఒకప్పుడు రాజ్యాంగ పరమైన హామీగా ఉన్న పౌరసత్వం, కొన్ని కమ్యూనిటీల విషయంలో తాత్కాలిక హోదా మాదిరిగా ఉంది. ఇది డాక్యుమెంటేషన్ పై కాకుండా రాజకీయాలపై ఆధారపడి ఉంటోంది.

సునాలీ కేసు ఈ లోపాలను స్పష్టం చేస్తోంది. ఆమె కుటుంబానికి ఓటర్ల కార్డులు, రికార్డులు, రేషన్ కార్డులు ఉన్నాయి. కుటుంబానికి పశ్చిమబెంగాల్, అసోం రెండు రాష్ట్రాలతో సంబంధాలు ఉన్నాయి. ఇంతవరకూ ఆమెకు అనుకూలంగా తీర్పురాలేదు. అయినా, ఆమెను, ఆమె భర్త, ఇద్దరు పిల్లలనుంచి వేరు చేసి తీసుకెళ్లారు. గర్భిణి అయి కడుపులో బిడ్డను మోస్తున్న సమయంలో ఆమెను సరిహద్దులు దాటించి పంపివేశారు. ఆమె, చిన్నకొడుకు అర్థం చేసుకోలేని కష్టాల చిక్కుకుని, అతని కుటుంబం చట్టపరమైన సహాయం కోసం ఇబ్బంది పడుతుండగా, నెలల పాటు విదేశీ గడ్డపై బతకాల్సి వచ్చింది. ఆమె వివరాలు పరిశీలించిన తర్వాత, బంగ్లాదేశ్ అధికారులు ఆమె బంగ్లా జాతీయురాలు కాదని నిర్ధారించి. ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. సునాలీ విషయంలో ఆమె పౌరసత్వం ఉన్న దేశం కంటే నెట్టివేయబడిన పొరుగు దేశం ఆమెకు తగిన ప్రక్రియకు కట్టుబడి ఉండడం విశేషం.

తీవ్ర ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, అధికారుల ఓవర్ యాక్షన్ మాత్రమే కాదు, దేశం లో చట్టాలను గౌరవించకపోవడం. ప్రభుత్వ అధికారులు న్యాయవ్యవస్థను అతిక్రమించడం, రాజ్యాంగం కల్పించిన రక్షణలను ఇబ్బందికరంగా పరిగణించిన పక్షం అసలు పౌరసత్వం వ్యవస్థే దుర్బలంగా తయారవుతుంది. అనేక సందర్భాల్లో, కోర్టులు జోక్యం చేసుకుని సంజాయిషీ కోరడంతోపాటు, బహిష్కరణలను ఆపాయి. తప్పిపోయిన వ్యక్తులుగా ప్రకటించిన వారిని వెతికి పట్టుకుని హాజరుపరచాలని ప్రభుత్వాలను ఆదేశించాయి. న్యాయవ్యవస్థ జోక్యం, ప్రక్రియ చాలా ఆలస్యం అవుతుంది. ఈలోగా బాధితులు నెలల తరబడి వేదన అనుభవిస్తారు. ప్రజాస్వామ్య గణతంత్రం లో ఏ పౌరుడూ ఎదుర్కోకూడని పరిస్థితులు అనుభవిస్తాడు. ఆ తర్వాత అందే న్యాయం వల్ల ఏం లాభం. మనదేశంలో కోర్టులు, లాయర్ల ఫీజులు ఖరీదైనవి, చాలా కుటుంబాలకు కేసులు ఏళ్ల తరబడి కొనసాగించే అవకాశాలు లేవు, అలాంటి వారు తక్కువే. రాజకీయ పరమైన చిక్కులు చాలా విస్తృతంగా ఉంటాయి మతం, భాష, సామాజిక ఆర్థిక స్థితి ఆధారంగా పౌరసత్వాన్ని తలగించడం చేస్తే, అది గందరగోళానికి దారితీస్తుంది. కొందరు పౌరుల విషయంలో వివక్షకు దారితీస్తుంది.

అది సాంకేతిక పరమైన, లేదా పాలనా పరమైన సమస్య కాదు, గణతంత్ర దృక్పథంలోనే మార్పునకు దారితీస్తుంది. స్వాతంత్య్రం అంతరం భారత రాజ్యాంగం విలువలపై ఆధారపడిన సమ్మిళిత వర్గంగా పౌరసత్వాన్ని పరిగణించాలని ఆకాంక్షించింది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, పౌరసత్వాన్ని అప్పుడప్పుడు చట్టవిరుద్ధ బలవంతం ద్వారా బహిష్కరణలకు సాధనంగా మార్చే ప్రమాదం ఉంది. ముందుకు సాగాలంటే, చట్టవిరుద్ధమైన బహిష్కరణలు వెంటనే నిలిపివేయాలి. ప్రభుత్వం ఎంతమంది ఇలాంటి ఇబ్బందులకు గురయ్యారో బహిర్గతం చేయాలి. ప్రతి కేసుకు చట్టపరమైన ఆధారం అందించాలి. విదేశీయుల ట్రిబ్యునళ్లకు నిర్మణాత్మక సంస్కరణలు, న్యాయపరమైన పర్యవేక్షణ అవసరం. పేదలకు పౌరహక్కు కోల్పోకుండా చట్టపరమైన సహాయాన్ని విస్తృతం చేయాలి. అన్నిటికంటే ముఖ్యం ఒక వర్గం పౌరులను శాశ్వత అనుమానితులుగా భావిస్తే, ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తుంది. మత పరమైన అంతరాలను తీవ్రతరం చేస్తుందని రాజకీయ నాయకులు గుర్తించాలి. సునాలి ఖాతున్, ఇతరుల పునరాగమన ఉదంతం కోర్టులు, పౌర సమాజం, సాధారణ పౌరులు అన్యాయాన్ని తిప్పికొట్టగలరని రుజువు చేసింది. సరిహద్దులను దాటడం భౌగోళికం మాత్రమే కాదు ఓ హెచ్చరిక కూడా. గణతంత్ర రాజ్యం ఈ హద్దును మరచిపోకూడదు.  

– గీతార్థ పాఠక్ (ఈశాన్యోపనిషత్)

(రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయాల అంశాల విశ్లేషకుడు)

నెలసరి సమస్యలపై గురిపెట్టి..!

వైద్య విద్యార్థినిగా ఉన్నప్పుడే కుటుంబం నిర్వహిస్తున్న “కడియం ఫౌండేషన్‌” ద్వారా పాఠశాల విద్య మానేసే బాలికల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతున్నట్లు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గమనించారు. గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వైద్యురాలిగా పనిచేసేటప్పుడు, మహిళలు తమ నెలసరి చక్రం సమయంలో శుభ్రత పాటించే విధానంపై అవగాహన పెంచారు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు నెలసరి సమయంలో అవసరమైన ప్యాడ్లను ఉచితంగా అందించే పథకానికి పునాది వేసారు. అదే ధోరణి కొనసాగిస్తూ, ప్రస్తుత లోక్‌సభ సభ్యురాలిగా మహిళలు, ముఖ్యంగా ఉద్యోగిణులు పనిచేసే స్థలాల్లో అవసరమైన సౌకర్యాలపై చట్టసభను కదిలించేలా ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు వరంగల్ ఎంపి డాక్టర్ కడియం కావ్య. 2025 డిసెంబర్ 5న, వరంగల్ నుంచి కాంగ్రెస్ ఎంపిగా ఉన్న డాక్టర్ కడియం కావ్య ఒకే సమావేశంలో రెండు ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టిన తొలి తెలంగాణ మహిళగా నిలిచారు. వీటిలో ఒకటైన మెన్‌స్ట్రువల్ బెనిఫిట్స్ బిల్ -2024, మహిళల నెలసరి ఆరోగ్యం పట్ల చట్టబద్ధత కల్పించడానికి చేసిన ధైర్యవంతమైన అడుగు. ఈ బిల్లులో ప్రభుత్వం, ప్రైవేటు రంగాలతోపాటు అన్ని కార్యాలయాల్లో సురక్షిత, శుభ్రమైన టాయిలెట్స్ తగిన ఆరోగ్య వసూలు కల్పించే విధంగా, ఉచిత/ రాయితీ ధరల ద్వారా శానిటరీ నాప్కిన్స్‌ను అందించాలని, అలాగే నెలకు రెండు రోజుల చెల్లింపులతో కూడిన విశ్రాంతి ఇవ్వాలని ఎంపి డా. కడియం కావ్య ప్రతిపాదించారు.

మహిళల్లో తీవ్రమైన నెలసరి నొప్పి హార్ట్ అటాక్ నొప్పికీ సమానమనే యూనివర్శిటీ కాలేజ్ లండన్ పరిశోధనను ఎంపి డాక్టర్ కావ్య ఆధారంగా చూపించారు. ఇది ఒక సాధారణ బిల్లు కాదు; మహిళల నెలసరి గురించి భారతీయ సమాజంలో శతాబ్దాలుగా నెలకొన్న నిశ్శబ్దం, అపహాస్యం, నిర్లక్ష్యానికి ఇది ధైర్యమైన సవాలు. భారతదేశంలో పరిస్థితి ఎంత తీవ్రమో గణాంకాలు చెబుతున్నాయి. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5 ప్రకారం, 15 -24 ఏళ్ల యువతుల్లో కేవలం 58% మంది మాత్రమే పరిశుభ్రమైన శానిటరీ నాప్కిన్స్‌ను ఉపయోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ శాతం మరింత తగ్గుతుంది -అక్కడ 60% కంటే ఎక్కువ మంది ఇప్పటికీ పాత బట్టలపై ఆధారపడుతున్నారు. ఇవి సరైన రీతిలో శుభ్రం చేయకపోవడంతో ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. పలువురు బాలికలు నెలలో నాలుగు- ఐదు రోజుల పాటు పాఠశాలకు దూరమవుతారు. నొప్పి, అవసరమైన శానిటరీ నాప్కిన్స్ లభ్యత లేకపోవడం, మరుగుదొడ్లు లేని దుస్థితి ఇవన్నీ కారణాలు ఉన్నాయి. వీటి కారణంగా విద్యార్థుల పాఠశాలకు గైర్హాజరు కావడంతో పిల్లల విద్యలో లింగ వ్యత్యాసం మరింత పెరుగుతోంది. ఆర్థిక భారం కూడా చిన్నది కాదు. ఒక సానిటరీ ప్యాక్ ధరే రూ. 30 -నుంచి రూ. 50 ఉండటం వల్ల లక్షల కుటుంబాలకు ఇది నెలనెలా వారికి భారం అవుతుంది. కొవిడ్ సమయాల్లో సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో అనేక మంది మహిళలు చిరిగిన బట్టలతో గడపాల్సిన పరిస్థితికి చేరుకున్నారు. నెలసరి సమయంలో రక్తనష్టం, పోషకాహార లోపంతో మహిళల్లో రక్తహీనత మరింత తీవ్రమైంది.

ఇది భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా అరబిలియన్ మహిళలు పిరియడ్ పావర్టీతో బాధపడుతున్నారు. అమెరికాలో ప్రతి నాలుగురు టీనేజ్ అమ్మాయిల్లో ఒకరు ఈ సమస్య వల్ల పాఠశాలకు వెళ్లలేరు. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ప్రపంచ పార్లమెంట్లు చర్యలు చేపడుతున్నాయి. స్కాట్లాండ్ 2020లో అందరికీ ఉచిత శుభ్రతా ఉత్పత్తులు అందించే చట్టం చేసింది. స్పెయిన్ 2023 నుండి నెలసరి విశ్రాంతిని అమలు చేస్తోంది. జపాన్ 1947 నుంచే ఈ విధానాన్ని అమల్లో ఉంచింది. అమెరికాలో అనేక రాష్ట్రాలు ‘ట్యాంపాన్ ట్యాక్స్’ ను రద్దు చేశాయి. భారతదేశం కూడా కొన్ని ప్రయత్నాలు చేసింది. ఎఎస్సేఎ వర్కర్ల ద్వారా రాయితీ ధరల పంపిణీ, పాఠశాలల్లో వెండింగ్ మెషిన్లు, ఇన్సినిరేటర్లు ఏర్పాటు, శుభ్రతా ఉత్పత్తుల వినియోగం 42% నుంచి 58% కి పెరగడం వంటి పురోగతి ఉంది. కానీ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కవరేజ్ ఇంకా చాలా తక్కువగా ఉంది. ఈ నెలసరికి సంబంధించిన సౌకర్యాలు, విశ్రాంతి హక్కుగా ఇచ్చే కేంద్ర చట్టం ఇప్పటికీ లేదు.

ఈ సమస్యలన్నిటికి చెక్ పెట్టే ప్రయత్నమే డాక్టర్ కావ్య బిల్లు. ఫ్యాక్టరీ కార్మికులు నుంచి వైద్యులు, ఉపాధ్యాయుల నుంచి గృహ సహాయకులు వరకు- అన్ని రంగాల మహిళలకు రక్షణ కల్పించేలా ఇది రూపుదిద్దుకుంది. మహిళల నెలసరి అనేది వ్యక్తిగత సిగ్గు విషయం కాదని, ఇది ప్రజారోగ్యానికి, లింగ న్యాయానికి సంబంధించిన అంశమని స్పష్టం చేస్తుంది. వ్యతిరేకాలు, వ్యయభారం వంటి అభ్యంతరాలు వచ్చినా, ఇతర దేశాల అనుభవాలు ఈ సౌకర్యాలు ఉత్పాదకతను పెంచుతాయని చూపాయి. పాఠశాల్లో ప్యాడ్లు అందిస్తే బాలికల హాజరు పెరిగిందన్న ఉదాహరణలు స్పష్టంగా ఉన్నాయి. వరంగల్ వంటి ప్రాంతాలనుంచి వచ్చిన ఈ చట్టప్రయత్నం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. అంచున ఉన్న వర్గాల వాయిస్ కూడా జాతీయ విధానాలను మార్చగలవని ఇది నిరూపిస్తోంది. ఈ నెలసరి ప్రక్రియను గౌరవంతో చూడడం, దానికి అవసరమైన సౌకర్యాలను హక్కుగా ఇవ్వడం -ఇవి విలాసం కాదు; ప్రాథమిక మానవ హక్కులు. డాక్టర్ కడియం కావ్య వేసిన ఈ చిన్న దీపకాంతిని ఇప్పుడు ప్రభుత్వం, పార్లమెంట్, సమాజం కలిసి పిరియడ్ షేమ్ ని శాశ్వతంగా ముగించే జ్వాలగా మార్చాల్సిన సమయం ఇది.

– కేశిరెడ్డి మాధవి

ఇండిగో సంక్షోభం.. ఇదిగో పరిష్కారం

ఇండిగో సంక్షోభం కారణంగా ఇప్పుడు దేశం మొత్తం పబ్లిక్ రంగం ప్రాధాన్యతపై చర్చ మొదలైంది. వేలాదిమంది సోషల్ మీడియాలో పబ్లిక్ రంగం పాత్ర ఈ దేశ విమానయాన రంగంలో షోషించిన నిర్మాణాత్మక పాత్రపై అనేక చర్చలు జరుగుతున్నాయి. పబ్లిక్ రంగం పాత్రను చరిత్రలోనే మనం తొంగిచూస్తే అనేక విజయాలు మనకు కనిపిస్తాయి. భారత దేశంలో పబ్లిక్ రంగం అనేది సాధారణ ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యపు సామాజిక, ఆర్థిక బలాన్ని నిలబెట్టే స్తంభం. స్వాతంత్య్రం తర్వాత ఈ దేశం సమగ్ర అభివృద్ధి సాధించాలంటే ప్రజల అవసరాలను కేంద్రంగా పెట్టుకున్న ఆర్థిక నిర్మాణం అవసరమైంది. అదే బాధ్యతను పబ్లిక్ రంగం నెరవేర్చింది. బ్యాంకింగ్ నుంచి రైల్వేలు, విమానయానం, కోల్ ఇండియా నుంచి స్టీల్ అథారిటీ వరకు, కోట్లాది ప్రజల ప్రయాణాలు, పొదుపులు, ఉపాధి, జీవన ప్రమాణాలు పబ్లిక్ రంగాలపై ఆధారపడి ఉన్న వాస్తవం. లాభాలను కంటే ప్రజల అవసరాలను ముందుకు పెట్టడం, దూరప్రాంతాలకు సేవలు చేర్చడం, సామాజిక సమానత్వాన్ని చూపించడం ఇవన్నీ పబ్లిక్ రంగం నుంచే సాధ్యమయ్యాయి.

కానీ నేడు ఈ రంగం దాడులు పెరుగుతున్నాయి. ప్రైవేటీకరణను అభివృద్ధి అని అమ్మే ప్రభుత్వాలు పబ్లిక్‌రంగ సంస్థలను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తున్నాయి. లాభాల్లో ఉన్న సంస్థలకూ ‘స్ట్రాటజిక్ డిస్‌ఇన్వెస్ట్‌మెంట్’ పేరుతో వేలం వేయడం సాధారణమైంది. ప్రజల సొమ్ముతో నిర్మించిన సంస్థలను కొంతమంది కార్పొరేట్ వర్గాలకు అప్పగించడం ద్వారా ప్రజాస్వామ్య ఆర్థిక వ్యవస్థను క్రిమినలైజ్ చేస్తున్నాయి. బ్యాంకులను విలీనాలు, మూసివేతల దిశగా నెట్టడం, బొగ్గు బ్లాకులను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం, రైల్వే, ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలను విడదీసి ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడం ఇవన్నీ ప్రజలపై భారాలు మోపే నిర్ణయాలే. ప్రైవేటు రంగం లాభాలను మాత్రమే చూసే క్రమంలో సామాజిక బాధ్యతలు, ధర నియంత్రణ, గ్రామీణ సేవలు అన్నీ అరుదైపోయే ప్రమాదం ఉంది. భారతదేశం లాంటి అసమానతలున్న దేశంలో పబ్లిక్‌రంగం కేవలం వ్యాపారం కాదు. అది సామాజిక సమీకరణ యంత్రాంగం.లాభాలు లేకున్నా సేవలను విరమించకుండా కొనసాగించగల రంగం ఇదొక్కటే.

ప్రైవేటీకరణ పేరుతో పబ్లిక్ రంగాన్ని ముసుగులో హరించడం నేరం. ఒక తరానికి చెందిన సొమ్ము, శ్రమ, కలలతో నిర్మించిన ఈ ఆస్తులు దేశ భవిష్యత్తుకు కేవలం పెట్టుబడులు కాదు, రక్షణ. ప్రస్తుత అసమానతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో పబ్లిక్ రంగం బలోపేతం అత్యవసరం. ఉపాధి తగ్గిపోతున్న సమయంలో పబ్లిక్ రంగ విస్తరణ తప్ప మరే ప్రత్యామ్నాయం లేదు. చిన్న, పెద్ద, మధ్యతరగతి ప్రజలందరూ ఆధారపడే భద్రతా వల ఈ రంగమే. కాబట్టి పబ్లిక్ రంగాన్ని రక్షించడం అనేది కేవలం గతాన్ని కాపాడడం కాదు, భవిష్యత్తును కాపాడడం. కానీ పాలకులు ప్రజలకంటే, దేశం అవసరాల కంటే పెట్టుబడి దారుల అవసరాలే మిన్నగా ఉంటున్నాయి. అందుకు ఉదాహరణే ఈ ఇండిగో సంక్షోభం అన్నది వాస్తవం. ఇండిగోలో ఇటీవలే బయటపడిన యాజమాన్య, వాటాదారుల మధ్య అధికార పోరు దేశ విమానయాన రంగం ఎంత అస్థిరంగా మారిందో ప్రత్యక్షంగా చూపిస్తున్న సంఘటన. మార్కెట్‌లో 60 శాతానికి పైగా వాటా ఉన్న సంస్థ ఒక్కరోజు అంతర్గత ఒడిదుడుకులకు లోనైతే దేశవ్యాప్తంగా వేలాది ఫ్లైట్లు రద్దయ్యే ప్రమాదం, ప్రయాణికులు ఇరుక్కుపోయే పరిస్థితి, షేర్ మార్కెట్‌లో కోట్లు ఆవిరయ్యే అనిశ్చితి, ఇవి అన్నీ ఒక్కసారిగా వెల్లువెత్తాయి. ఇది కేవలం ఒక కంపెనీ గొడవ కాదు; ఇది విమానయాన రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించిన ప్రభుత్వ విధానాల ఘోర వైఫల్యం.

ఆ వైఫల్యాన్ని ప్రశ్నించే ఆలోచనే పాలకవర్గానికిలేదు. ఎయిర్ ఇండియాను భారాలు అవుతున్న పబ్లిక్ రంగం అని తక్కువ చేసి, నష్టాలను ఉద్దేశపూర్వకంగా పెంచిన తరువాత అతి తక్కువ ధరకు ప్రైవేటు చేతుల్లో వదిలేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇండిగో సంక్షోభం గురించి పెదవి విప్పడానికి కూడా ముందుకు రావడం లేదు. ఒక పబ్లిక్‌రంగ విమానయాన సంస్థ పనిచేసేది కేవలం లాభాల కోసం కాదు; అది జాతీయ అవసరాలను తీర్చే బాధ్యతను కూడా మోసేది. దూరప్రాంతాలకూ, లాభం రానివాటికీ సేవలందించేది. అత్యవసర సమయాల్లో విదేశాల్లో ఇరుక్కున్న భారతీయులను కొలువరించేది. విపత్తుల సమయంలో రక్షణ చర్యల్లో పాల్గొనేది. ఇవన్నీ ప్రైవేట్ రంగం చేయగలదా? వారి బోర్డు సమావేశాల్లో వాటాదారుల ఒత్తిడి ఒక మూలను ఇరుకోబెడితే, ఆ రాత్రే ధరలు ఎగసిపడతాయి;సేవలు నిలిచిపోతాయి.

ఇండిగో సంక్షోభం తర్వాత మార్కెట్ ఎలా స్పందించిందో చూస్తే భారత గగనయాన రంగం అనిశ్చితి ఎంత తీవ్రమో అర్థమవుతుంది.షేర్ ధర పతనంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందినా, సాధారణ ప్రజల సమస్య మాత్రం మరింత సూటిగా మెదులుతుంది. ప్రయాణ ఖర్చులు పెరగటం, టికెట్లు అకస్మాత్తుగా దొరక్కపోవటం, సేవా నాణ్యత పడిపోవడం, మార్గాల ఎంపిక పూర్తిగా సంస్థల ఖజాన, లాభాల లెక్కల ఆధారంగా నిర్ణయించబడటం. విమానయాన రంగంలాంటి కీలక రంగాన్ని పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడం ఒక దేశ భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి ముప్పే. విమాన రూట్ల కేటాయింపు, అత్యవసర ఎయిర్‌లిఫ్ట్‌లు, అభివృద్ధి చెందని ప్రాంతాలకు కనెక్టివిటీ వంటి సేవలను ప్రైవేట్ కంపెనీలు తమ బ్యాలెన్స్ షీట్‌లను చూసుకుని మాత్రమే నిర్వహిస్తాయి.

అలా లాభం రాకపోతే, ఆ సేవలు నిలిచిపోతాయి. పబ్లిక్ రంగం ఉన్నప్పుడు మాత్రం లాభ-నష్టాలతో సంబంధం లేకుండా ప్రజా ప్రయోజనాలే కేంద్రంగా నిలిచేవి. ఇది పబ్లిక్ రంగం ప్రాధాన్యతను సాక్ష్యాలతో రుజువు చేసే ముఖ్యమైన ఉదాహరణ. ఇండిగోలో జరిగిన మేనేజ్‌మెంట్ విభేదాలు, వాటాదారుల మధ్య అధికార యుద్ధాలు, అంతర్గత చెత్త పాలన దేశ విమానయాన రంగంలో ఒకే సంస్థ ఆధీనత ఎలా ప్రమాదకారకమో చూపుతున్నాయి. ప్రైవేట్ సంస్థల అప్రతిహత అధికారం, ప్రభుత్వ మౌన సమ్మతి రెండూ కలిపి ప్రజలకే భారమయ్యాయి. ఒక సంస్థ గందరగోళం కారణంగా దేశవ్యాప్తంగా వందల ఫ్లైట్లు ఆలస్యం కావటం అంటే, కొద్దిమంది పెట్టుబడిదారుల మీద దేశం మొత్తం ఆధారపడి ఉన్నదని అర్థం. ఇది అస్వాభావికమైన ఆర్థిక నిర్మాణం. ఇండిగో సంక్షోభం ఒక సంఘటన కాదు, అది ఒక సందేశం. దేశ విమానయాన రంగాన్ని పూర్తిగా ప్రైవేటు ఆధీనానికి అప్పగించినప్పుడు ఏమి జరుగుతుందో ఇది స్పష్టంగా చెబుతోంది. పబ్లిక్ రంగం మరింత బలపడాల్సిన అవసరం ఉంది. విమానయానాన్ని ప్రజా సేవగా తిరిగి నిర్వచించాల్సిన సమయం వచ్చింది. అప్పుడే ప్రజల ప్రయాణం సురక్షితం, అందుబాటు, సమానత్వం కలిగినదిగా ఉంటుంది. లేకపోతే ఇండిగో నేటి సంక్షోభం రేపటి మరింత పెద్ద దుర్ఘటనలకు పునాది మాత్రమే అవుతుంది.

– టి.నాగరాజు

9490098292

వెనుజువెలా వినాశనానికి అమెరికా కంకణం

వెనుకబడిన, బలహీమైన చిన్న దేశాలను, ఆ దేశాల ప్రభుత్వాలను ఆయుధ బలంతో తన చెప్పుచేతుల్లో పెట్టుకోవడం, తన మాటవినని ప్రభుత్వాలు కూలిపోయేలా చేయడం, అది సాధ్యంకాకపోతే దురాక్రమణ, యుద్ధం ద్వారా తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తద్వారా ఆ దేశాల సహజ వనరులను తరలించుకుపోవడం అమెరికా సామ్రాజ్యవాదం అవలంబిస్తున్న విధానంగా ఉంది. నేడు వెనిజువెలాపై దాని యుద్ధ సన్నాహాలు ఆ విధానంలో భాగమే. దక్షిణ అమెరికా దేశమైన వెనిజువెలాపై దాడి చేయడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరేబియన్ దీవులకు 8 వార్ షిప్‌లతో పాటు అతిపెద్ద విమాన వాహక నౌకను, క్షిపణులు మొదలైన ఆయుధ సామాగ్రితోపాటు 10 వేలమంది సైనికులతో కరేబియన్ సముద్రంలోకి ట్రంప్ పంపాడు. వీరిలో 22వ మెరైన్ యూనిట్ కమాండోలు 2,200 మంది ఉన్నారు. ఇది ఇలా ఉండగా 2-9-20 25న వెనిజువెలా నుంచి పోతున్న పడవలపై అమెరికా దాడి చేసి 11మంది ప్రాణాలు తీసింది. ఈ దాడికి కారణం పడవల్లో వెనిజువెలా మారకద్రవ్యాల రవాణా చేస్తున్నదని సాకులు చెబుతున్నది.

మారకద్రవ్యాలకు నిలయంగా ఉన్న వెనిజువెలా అమెరికా వినాశనానికి కంకణం కట్టుకున్నదని, అందుకే దానిపై దాడి చేస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రచారం చేస్తూ, దాని దోపిడీ విధానాలను, యుద్ధోన్మాదాన్ని మరుగుపరుస్తున్నది. వెనిజువెలా దేశంపై అమెరికా వ్యతిరేకత చాలా కాలంగా కొనసాగుతున్నది. ఆ దేశ భూగర్భంలో చమురు, సహజ వాయువు నిక్షేపాలు, వజ్రాలు, బంగారం మొదలైనవి అపారంగా ఉన్నాయి. తన బహుళజాతి సంస్థల ద్వారా వాటిని తరలించుకుపోతున్న అమెరికాకు 1999 లో తొలిసారి ఆటంకం ఎదురైంది. 1999లో హ్యూగో చావేజ్ వెనిజువెలా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు. ఒక సంవత్సరం తర్వాత తనను సోషలిస్టు గాను, సామ్రాజ్యవాద వ్యతిరేకిగా ఆయన ప్రకటించుకున్నాడు. అమెరికా దోపిడీకి అడ్డుకట్ట వేశాడు. ప్రభుత్వ సంస్థలను జాతీయం చేయడాన్ని వ్యతిరేకిస్తున్న పెట్టుబడిదారీ అనుకూల ముఠా చావేజ్ పై తిరుగుబాటు ప్రయత్నాన్ని ఆనాటి జార్జిబుస్ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని వెనిజువెలా పేర్కొంది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

బొలీవియా దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక సమూహాలకు ఒక అమెరికా రాయబారి సహకరించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ దేశానికి మద్దతుగా 2008లో వెనిజువెలా అమెరికా రాయబారిని దేశం నుంచి బహిష్కరించింది. దీని ద్వారా అమెరికా చర్యలను వెనిజువెలా వ్యతిరేకించింది. చావేజ్ మరణం తర్వాత 2013 ఏఫ్రిల్ లో జరిగిన ప్రత్యేక ఎన్నికల్లో నికోలస్ మదురో విజయం సాధించి వెనిజువెలా అధ్యక్షుడు అయ్యాడు. 2024లో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచి మూడవ సారి అధ్యక్షునిగా కొనసాగుతున్నాడు.ఈయన పాలనలో ప్రభుత్వరంగ సంస్థలు, పెట్రోలియం పరిశ్రమల వంటివి ప్రభుత్వ నిర్వహణలో కొనసాగుతున్నాయి. ఇది అమెరికాకు కోపం తెప్పించింది. 2014లో దేశంలో హింసను ప్రోత్సహించిన ముగ్గురు అమెరికా దౌత్యవేత్తలను దేశం నుంచి మదురో ప్రభుత్వం బహిష్కరించింది. 2019లో వెనిజువెలా సంక్షోభ సమయంలో మదురో ప్రభుత్వ వ్యతిరేకి అయిన జువాన్ గైడోనూ తాత్కాలిక అధ్యక్షుడిగా గుర్తిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నికోలస్ మదురో ప్రభుత్వం అమెరికాతో సంబంధాలు తెచ్చుకున్నట్లు ప్రకటించింది. 2023లో ప్రతిపక్ష జాతీయ అసెంబ్లీ గైడ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని గుర్తించరాదని ఓటు వేయడంతో ఆ వాదన వెడల అమెరికా మౌనం వహించింది.

అమెరికా తమ చమురు నిల్వలను లక్ష్యంగా చేసుకుంటున్నదని వెనిజువెలా వెల్లడించడంతో అమెరికాకు చెందిన డెలా వేర్ న్యాయమూర్తి అప్పులు తీర్చడానికి చమురు అమ్మకం గురించి వెనిజువెలాను ఆదేశించాడు. బిలియన్ల డాలర్ల అప్పు తీర్చడానికి మోసపూరితంగా చమురు కంపెనీ సిట్గోను విక్రయించడానికి అధికారం ఇస్తూ అమెరికా కోర్టు నిర్ణయాన్ని వెనిజువెలా ఉపాధ్యక్షుడు, ఆ దేశ పెట్రోలియం మంత్రి డెల్సీ రోడ్రిగ్జ్ ఖండించి ఆ తీర్పును తిరస్కరించాడు. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ అయిన వెనిజువెలా పెట్రోలియోన్ డి వెనిజులా (పిడియుఎస్‌ఎ) హ్యూస్టన్‌కు చెందిన అనుబంధ సంస్థ అయిన సిట్గో, రుణదాతలకు 20 బిలియన్ల అమెరికా డాలర్లకు పైగా బాకీ ఉందనే ప్రచారం జరుగుతున్నది. ఇంతకు ముందు ఇది లాభదాయకంగా ఉన్న చమురు పరిశ్రమ. దీన్ని లక్ష్యంగా చేసుకున్న అమెరికా పెట్టిన అనేక ఆంక్షల వల్ల సంక్షోభంలో ఉండి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. కంపెనీల రుణదారుల్లో కెనడియన్ సంస్థ క్రిస్టలిక్స్ కూడా ఉంది. బంగారం, వజ్రాలు, ఇనుము, ఇతర ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న క్రిస్టినాస్ గనిని 2008లో స్వాధీనం చేసుకుని జాతీయం చేసినందుకు 2019లో వెనిజువెలా ప్రభుత్వం క్రిస్టలెక్స్‌కు 1.2 బిలియన్లు బాకీ ఉందని మరొక అమెరికా కోర్టు పేర్కొంది.

సార్వభౌమాధికారం గల ఒక స్వతంత్ర దేశం ఆ దేశానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు, ఆ దేశ ప్రభుత్వం తీసుకునే హక్కు ఉంటుంది. వెనిజువెలా అలాంటి దేశం కాబట్టి పరిశ్రమలను, ఖనిజాల గనులను జాతీయం చేసింది. ఆ దేశ నిర్ణయాలపై అమెరికా కోర్టులు తీర్పులు ఎలా ఇస్తాయి. తీర్పు ఇచ్చే అధికారం కూడా వెనిజువెలా కోర్టులకే ఉంటుంది. అమెరికా ప్రపంచ పోలీసు పాత్ర పోషిస్తూ లేని అధికారాలను తీసుకుంటున్నది. 2023 నాటికి 303 బిలియన్ బ్యారెళ్ల్లగా అంచనాతో ప్రపంచం లోనే అత్యధిక చమురు నిల్వలను వెనిజువెలా కలిగి ఉంది. అయినా ఆ దేశం 2023లో కేవలం 4.05 బిలియన్ల ముడిచమురును మాత్రమే ఎగుమతి చేసింది. ఇది ఇతర చమురు ఉత్పత్తి దేశాల ఎగుమతి కన్నా చాలా తక్కువ. ఇంతకు ముందు ట్రంప్ ప్రభుత్వ పాలనలో ఇతర దేశాలు వెనిజువెలా నుంచి చమురు కొనవద్దని చేసిన హెచ్చరికలే అందుకు కారణంగా ఉంది. ఈ విధంగా వెనిజువెలా దేశాన్ని సైనికంగా బెదిరించడమే కాకుండా దాని ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసే కుట్రలు అమెరికా చేసింది. వెనిజువెలాపై యుద్ధానికి సిద్ధమై ఆ దేశ గగన స్థలాన్ని మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. అధ్యక్షుడు నికోలస్ మదురో దేశం విడిచిపెట్టిపోవాలని, అతని మంత్రి వర్గ ముఖ్య సహచరులను కాపాడుకోమని ట్రంప్ బెదిరించినట్లు హెరాల్ అనే అంతర్జాతీయ పత్రిక పేర్కొంది.

ట్రంప్ ప్రభుత్వం ప్రకటనను వెనిజువెలా తీవ్రంగా ఖండించింది. ఇది ఏకపక్ష చర్యను చూపిస్తోందని పేర్కొంది. డ్రగ్ మాఫియాపై పోరాటం పేరుతో అమెరికా హద్దులు దాటుతోందని, తమ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నంచేలా ఉందని మండిపడింది. వెనిజువెలా ప్రభుత్వాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా ట్రంప్ చర్యలు ఉన్నాయని పేర్కొంది. సార్వభౌమాధికారం గల ఒక దేశ గగన స్థలాన్ని మరొక దేశం మూసివేస్తున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయ ఒడంబడికలకు విరుద్ధమైనది. అమెరికా ఎప్పుడు అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించకుండా ఉల్లంగిస్తూనే ఉంది. వాస్తవంలేని సాకులతో ఇరాక్ దాడి చేసింది. కొద్ది నెలల క్రితం ఇరాన్‌పై దాడి చేసింది. ఒక స్వతంత్ర దేశమైన వెనిజులా అధ్యక్షుణ్ణి పట్టి అప్పగించమని అమెరికా కోరడం, నికోలస్ మదురో సమాచారం ఇస్తే ఏకంగా 50 మిలియన్ల డాలర్లు (430 కోట్ల రూపాయలు) బహుమతి ప్రకటించడం దాని హంతక మనస్తత్వానికి నిదర్శనం. ఇలాంటి బెదిరింపుల ద్వారా వెనుకబడిన దేశాలన్నీ తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలన్నదే అమెరికా విధానం. వెనిజువెలాపై సైనిక చర్యను 70% మంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారని సిబిఎన్ సర్వే వెల్లడించింది. సైనిక జోక్యాలతో ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ గుల్ల అయ్యిందని, వెనిజువెలాపై సైనిక జోక్యం చేసుకోవద్దని అమెరికన్లు కోరుతున్నారు. వెనిజువెలాపై అమెరికా ఆంక్షలను, దాడి చేసే ప్రయత్నాలను తక్షణమే విడనాడాలని, ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోరాదని, వెనుకబడిన దేశాలను బెదిరించే విధానాలను మానుకోవాలని ప్రపంచ ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా ఉద్యమించాలి.

బొల్లిముంత సాంబశివరావు

98859 83526 

‘సాగు’ను ముందుకు సాగనిద్దాం

స్వాతంత్య్రానంతరం దేశ వ్యవసాయ అభివృద్ధే లక్ష్యంగా ఆహార స్వయం సమృద్ధిని సాధించడం వైపుగా సాగింది. అందుకు అనుగుణంగా దేశ బడ్జెట్‌లో గణనీయమైన భాగాన్ని గ్రామీణ మౌలిక సదుపాయాలు, నీటిపారుదల ప్రాజెక్టులు, వ్యవసాయోత్పత్తిని పెంచడానికి కేటాయించబడ్డది. అప్పటి దేశ సాగు లక్ష్యాలకు అనుగుణంగా దేశసాగులో గణనీయమైన విజయాలు సాధించి, నేడు దేశ ఆహార భద్రతకు ఎలాంటి లోటు లేకుండా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సవృద్ధ్దిని సాగించగలిగాం. అయితే, ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్న జనాభా, మారుతున్న వాతావరణం అనేక సమస్యలకు మూలకారణమవుతున్నాయి. ఈ రెండింటి ప్రభావం ప్రతి రంగంపై ప్రతికూలంగా ప్రభావం చూపుతున్నాయి. అందులోను వ్యవసాయ రంగం మారుతున్న వాతావరణ పరిస్థితులకు అత్యంత దుర్బలమైనది. వాతావరణంలోని మార్పులు సాగులో చూపే ప్రభావాలను మనదేశంలో నేడు మనం ప్రత్యక్షంగా అకాల వర్షాలు, విపరీతమైన ఎండలు, చలిరూపంలో చూస్తున్నాం. వీటి వల్ల రైతాంగం అనేక రకాల సమస్యలతో నిత్యం కొట్టుమిట్టాడుతున్నారు. వివిధ అధ్యయనాల ప్రకారం భారతదేశంలోని 75% కంటే ఎక్కువ జిల్లాలు వరదలు, కరువులు, వేడిగాలులు, తుఫానుల వంటి తీవ్రమైన వాతావరణ సంఘటనలకు గురవుతున్నాయి.

ఇక మన రాష్ట్రంలో కూడా ఈ ప్రభావాలు ప్రస్తుతం నిత్యకృత్యమవుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో వర్షాల లోటుతో మొదలై చివరిలో అధిక వర్షాలతో చేతికివచ్చిన పంటలు క్షణాల్లో అధిక వర్షాల కారణంగా లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నాబ్కాన్స్ అధ్యయనం ప్రకారం భారతదేశంలో 2020- 2022 కాలంలో వివిధ రకాల పంట ఉత్పత్తులలో పంటకోత తర్వాత ఇంచుమించు 3%15% వరకు నష్టం జరువుతుంది. ఇది దాదాపుగా 68.90 మిలియన్ మెట్రిక్ టన్నుల ధాన్యం కాగా, దాని వల్ల కలిగిన ఆర్థిక నష్టం రూ. 1.5 లక్ష కోట్లుగా అంచనా. ఈ విధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సమస్యలు రైతులను నిత్యం వెంటాడుతున్నాయి. ఒక వైపు ప్రకృతి వైపరీత్యాలతో పంటనష్టం కొనసాగుతుంటే, మరోవైపు దేశ సాగు సామర్ధ్యాన్ని, సాగు తోడ్పడే వనరులను వినియోగించడంలో ఆశించిన రీతిలో ముందుకు సాగలేకపోతున్న. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో సరైన వర్షాలు కురవక పోవడంవల్ల విత్తిన విత్తనాలను మొలకెత్తడానికి రైతులు నానాతిప్పలు పడడం కళ్లారా చూసాం.

నేటి సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కాలంలో కూడా రైతులు కనీస విత్తిన పంటను మొలకెత్తించుకో లేకపోతున్నారు అంటే అందుకు మన వ్యవసాయ సాగునీ అసమర్థ నిర్వహణను చూసిస్తుంది. అందులో ప్రధానంగా, దేశ సేద్యపు నీటి పారుదల సామర్థాన్ని చూస్తే దేశంలో దాదాపు 139.5 మిలియన్ హెక్టార్ల నీటిపారుదల సామర్థ్యం ఉంది. అయితే, 2021 నాటికి వినియోగించుకున్న సాగునీరు దాదాపు 76 మిలియన్ హెక్టార్లకు మాత్రమే. ఇది మొత్తం సాగులో దాదాపు 55% మాత్రమే. నేటికీ దేశంలో సుమారుగా 45% సేద్యం వర్షాధారంగానే సాగుతుంది. అందువల్ల వర్షాలు కురవడంలో ఏ చిన్న మార్పు వచ్చిన పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. ఇక సాగునీటి వినియోగ పద్ధతులను చూసినట్లయితే దేశ నీటిపారుదల వనరులలో గొట్టపు బావులు అత్యంత ముఖ్యమైనవి. తరువాత కాలువలు, సాంప్రదాయ బావులు, ట్యాంకులు, స్ప్రింక్లర్, బిందు సేద్యం వంటి ఆధునిక పద్ధతులు ఉన్నాయి. ఇక విఫణి వ్యవస్థ చూస్తే, పంట కోత తర్వాత సరైన మార్కెట్ సదుపాయాలు కీలకం. రైతులు పండించిన ధాన్యాన్ని సరైన సమయంలో సరైన వేదికలు, సరిపడ దూరంలో మార్కెట్లు ఏర్పాట్లు చాలా ప్రాముఖ్యమైనవి.

జాతి రైతు కమిషన్- 2006 ప్రకారం దేశ సాగు ఉత్పత్తి అవసరాలకై ప్రతి 80 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి ఒక నియంత్రిత మార్కెట్ ఉండాలి. కానీ ప్రస్తుతానికి దేశంలో సగటు 407 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి ఒక నియంత్రిత మార్కెట్ సేవలు అందిస్తుంది. దేశం మొత్తంమీద నియంత్రిత టోకు మార్కెట్లు దాదాపుగా 7085 కాగా, అందులో 2599 ప్రధాన మార్కెట్ యార్డులు (పిఎంవై), 4486 ఉప-మార్కెట్ యార్డులు (ఎస్‌ఎంవై) ఉన్నాయి. ఇక తెలంగాణలో మొత్తం 282 నియంత్రిత మార్కెట్ల ఉండగా, అందులో 195 ప్రధాన మార్కెట్ యార్డులు (పిఎంవై), 87 ఉప-మార్కెట్ యార్డులు (ఎస్‌ఎంవై) ఉన్నాయి. రాష్ట్రంలో మార్కెట్ల సాంద్రత చూసినట్లయితే సుమారుగా 397 చదరపు కిలోమీటర్లకు కేవలం ఒక నియంత్రిత మార్కెట్ మాత్రమే ఉంది. ఈ విధంగా రైతులకు సరిపడా మార్కెట్లు అందుబాటులో లేకపోవడం వల్ల రైతు పండించిన పంటను దీర్ఘకాలం నిల్వ చేసుకోలేక దళారులకు కనీస మద్దతుకంటే తక్కువ అమ్ముకుంటున్నారు. మరొక అంశం సాగులో యాంత్రీకరణ, దేశ సాగు నేటికీ ఆధునిక సాగుకి ఆమడదూరంలో ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సాగులో యంత్రీకరణ 80 90 శాతం ఉండగా, మన దేశంలో మాత్రం సాగులో యంత్రీకరణ నేటికీ కేవలం 45% మాత్రమే ఉంది.

ఒకవైపు సాగుకు సరిపడా వ్యవసాయ కూలీలు గ్రామాల్లో క్రమంగా తగ్గడంతోపాటు, వ్యవసాయ కూలీల రోజువారీ కూలీ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. దేశంలో ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే సాగులో నిర్మాణాత్మకమైన మౌలిక సదుపాయాలు అత్యంత ప్రముఖమైనవి. దేశ వ్యవసాయం వైవిధ్యతకు అనుగుణంగా, చిన్న సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకొనే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సాగులో మౌలిక సదుపాయాలు, నూతన సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించి దేశంలో ఉన్న ప్రతి వనరులను ముఖ్యంగా నీటి వనరులను సమర్ధవంత వినియోగించడానికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రతి నీటి బిందువును సమర్ధవంతగా సాగుకు వినియోగించే విధంగా కృషి చేయాలి. అంతేకాక, పంట విత్తినప్పటి నుండి పంటకోత తర్వాత వివిధ స్థాయిలలో నష్టాలను అరికట్టేందుకు నిర్మాణాత్మకమైన మౌలిక సదుపాయాల కల్పించడంలో ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు ప్రోత్సహిస్తే చిన్న సన్నకారు రైతుల కష్టాలను కొంతవరకు తగ్గించవచ్చు.

డా. రేపల్లె నాగన్న

7990842149 

గందరగోళంలో గగనయానం

అవసరాలకు తగినట్టు ఇటీవల కాలంలో విమాన ప్రయాణాల రద్దీ రానురాను ఎక్కువవుతున్నా అనేక సమస్యలు ఎదురై గగనయానం గందరగోళంగా తయారవుతోంది. గత వారం రోజులుగా స్వదేశీ విమానయాన సంస్థలు పైలట్ల కొరత, సాంకేతిక సమస్యలు, ప్రతికూల వాతావరణం, చలికాలం వల్ల షెడ్యూల్‌లో మార్పులు, తదితర సంక్షోభంలో తేలియాడుతున్నాయి. స్వదేశీ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో ప్రతిమూడు విమానాల్లో రెండు ఆలస్యంగానే నడుస్తున్నాయి. గత రెండు రోజుల్లో ఈ సంస్థకు చెందిన దాదాపు 300 కు పైగా విమానాలు రద్దు కావడం తెలిసిందే. ఇండిగో రోజుకు మొత్తం 2200 విమానాలను నడుపుతున్నా వీటిలో కేవలం 35 శాతం మాత్రమే డిసెంబర్ 2 న సరైన సమయానికి నడిచాయి. అదే రోజున ప్రభుత్వ అధీనం లోని అలయన్స్ ఎయిర్ సంస్థ విమానాలు 38 శాతం సరైన సమయానికి నడిచాయంటే ఇండిగో సంస్థ విమానాల నిర్వహణ ఎలా ఉందో తెలుస్తుంది. ఈ సంక్షోభంపై పౌర విమానయాన శాఖ రంగం లోకి దిగి పరిశీలించగా అనేక అపసవ్య పరిస్థితులు బయటపడ్డాయి. కొందరు పైలట్లు డ్యూటీ రోస్టర్స్ (షిఫ్ట్ టైమ్)ను పాటించడం లేదని, మరికొందరు శెలవులు పెట్టి ఇతర విమానయాన సంస్థల్లో ఇంటర్వూలకు హాజరవుతున్నారని వెల్లడైంది.

శెలవులను రద్దు చేసుకుని వస్తే జీతానికి 1.5 రెట్లు చెల్లిస్తామని ఆఫర్ చేసినా ఇండిగో సంస్థకు సహాయపడలేదని తెలిసింది. ఈ కారణం గానే ఇండిగో మంగళవారం 130 విమానసర్వీసులు, బుధవారం 200 విమాన సర్వీసులను బలవంతంగా రద్దు చేయవలసి వచ్చింది. గురువారం కూడా ఈ పరిస్థితి కొనసాగుతోంది. రోజుకు దాదాపు 150 కి పైగా విమాన సర్వీసుల షెడ్యూల్ మారడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. పైలట్లు, ఇతర సిబ్బంది ఆరోగ్య పరిస్థితులు మెరుగుపర్చడానికి డిజిసిఎ ఆయా సిబ్బంది టైమింగ్స్‌లో మార్పులు చేసింది. వారంలో విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. రాత్రి పనివేళలను అర్ధరాత్రి నుంచి వేకువ జాము ఐదు గంటలకు మార్చారు. వరుసగా రెండు రాత్రులకు మించి సిబ్బందికి డ్యూటీలు వేయకూడదు. 14రోజుల్లో మొత్తం పనిగంటలు 95 మించకూడదు. గతంలో ఇది 100 గంటలుగా ఉండేది. ఒక్క రోజులో డ్యూటీ టైమ్ 12 గంటల వరకు ఉండగా, దీన్ని 10 గంటలకు తగ్గించారు. నైట్ డ్యూటీ ముగించుకున్న తరువాత ఇది వరకు 10 గంటలు మాత్రమే విశ్రాంతి ఉండగా, ఇప్పుడు కనీసం 12 గంటల వరకు ఉండాలని సవరించారు.

రాత్రిపూట విమానాశ్రయాల్లో ల్యాండింగ్ అయ్యే విమానాల సంఖ్య ఇదివరకు ఆరు ఉండగా, ఇప్పడు రెండుకు కుదించారు. ఈ నిబంధనలను డిజిసిఎ 2024 మేలోనే నోటిఫై చేయగా ఈ ఏడాది జులైలో మొదటి దశలో కొన్ని, నవంబర్ 1 నుంచి రెండోదశలో మరికొన్ని నిబంధనలను ఇండిగో అమలులో తీసుకొచ్చింది. ఈ నిబంధనలను స్వదేశీ విమాన సంస్థలు ఇండిగో, ఎయిర్ ఇండియా మొదట్లో వ్యతిరేకించినా, తరువాత ఢిల్లీ హైకోర్టు మార్గదర్శకాలతో తలవంచక తప్పలేదు. ఇండిగో సంస్థ మొదటి నుంచీ నిబంధనల అమలు విషయంలో నిర్లక్షం వహిస్తున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ ఆరోపిస్తోంది. విమాన సంస్థల్లో సిబ్బందికి తగిన విశ్రాంతి అవసరం. ముఖ్యంగా సరిగ్గా నిద్రపోకుంటే అనేక సమస్యలు ఎదురై ప్రయాణికుల భద్రత గాలిలో దీపంలా తయారవుతుంది. గత సెప్టెంబర్ నెలలో పారిస్ నుంచి కోర్సికా ద్వీప రాజధాని అజాక్సియోకు బయలుదేరే విమానం దిగుతున్న సమయంలో ఎయిర్‌పోర్టు కంట్రోల్ టవర్ నుంచి సిగ్నల్ రాక గాలిలోనే 18 నిమిషాల పాటు విమానం చక్కర్లు కొట్టవలసి వచ్చింది.

ఇలా జరగడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది ఆ సమయంలో నిద్రపోవడమేనని తరువాత బయటపడింది. దీన్ని బట్టి నిబంధనల ప్రకారం సిబ్బందికి విశ్రాంతి కల్పించక తప్పదు. ప్రస్తుతం మనదేశం లోని పలు విమాన సంస్థలు 650 కి పైగా విమాన సర్వీస్‌లను నడుపుతున్నాయి. వీటిని నడిపేందుకు 8 వేల మంది పైలట్లు అందుబాటులో ఉన్నా సరిపోవడం లేదు. మరోవైపు భారతీయ పైలట్లకు ఆగ్నేయాసియా, పశ్చిమాసియా దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. దేశీయ విమాన సంస్థలతో పోలిస్తే ఈ దేశాల విమానయాన సంస్థలు వీరికి అత్యధికంగా జీతభత్యాలు ముట్టచెబుతున్నాయి. అందుకనే కొంతమంది భారతీయ పైలట్లు విదేశీయాన సంస్థల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సమస్యలతో పాటు వాతావరణ మార్పులు విమాన సర్వీసులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో గత నవంబర్ 28, 29 తేదీల్లో ఎ320 నమూనా విమానాలు ఎదుర్కొన్న అనూహ్య పరిణామాలను గుర్తు తెచ్చుకుందాం.

సౌర ధార్మిక ప్రభావానికి గురై ఆ గ్రూపు విమానాల్లోని ఎలివేటర్ ఎయిలెరాన్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ దెబ్బతింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఎ 320 విమానాలు దాదాపు 6000 స్తంభించిపోయాయి. సౌర ధార్మికత ప్రభావంతో విమానాలు 35,000 అడుగుల కిందకు అమాంతంగా దిగజారిపోవడంతో కొంతమంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ను సరిచేయడానికి రెండు రోజులు పట్టింది. మరోవైపు సైబర్ దాడులు కూడా విమాన సర్వీసులను గందరగోళ పరుస్తున్నాయి. దేశం లోని ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అమృత్‌సర్, హైదరాబాద్ వంటి ఏడు ప్రధాన విమానాశ్రయాల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ స్పూఫింగ్ జరిగినట్టు గతంలో కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. జిపిఎస్ స్పూఫింగ్ అంటే తప్పుడు సిగ్నల్స్‌ను ప్రసారం చేసి విమానాల నావిగేషన్ వ్యవస్థలను దారి తప్పించే సైబర్ దాడి. ఈ దాడుల మూలాలు గుర్తించేందుకు ప్రభుత్వం పరిశోధన చేపట్టింది. 

విప్లవోద్యమ ఆటుపోట్లు చారిత్రక మలుపులు

చరిత్ర పరిణామక్రమంలో ఒక సమాజపు లేదా ఉద్యమపు మలుపుల ప్రభావాన్ని అంచనా వేయడానికి చాలా కాలం పడుతుంది . చరిత్ర నిర్మాణం అవుతున్నప్పుడు ఆ నిర్మాణంలో కీలకపాత్ర నిర్వహిస్తున్న ఉద్యమాల పాత్రను సరిగ్గా అంచనా వేయడం కూడా అంత సులభం కాదు. గత అర్ధ శతాబ్ద కాలంగా విప్లవోద్యమం ప్రధానంగా నక్సలైట్ పోరాటం ఒకవైపు, రాజ్యాన్ని మరొకవైపు సమాజాన్ని నిరంతరంగా ప్రభావితం చేస్తున్నది. ఈ విప్లవోద్యమాలు.. ముఖ్యంగా ఆదివాసీ ఉద్యమాలు గత రెండు వందల ఏళ్లుగా రాజ్యానికి వ్యతిరేకంగా జరగుతూనే ఉన్నాయి. ఆదివాసీల జీవనవిధానం, అడవితో వాళ్ళకున్న అనుబంధం చాలా లోతైనది. అడవిలోకి ఎవరు బయట నుండి వచ్చినా ప్రశ్నించడం, ప్రతిఘటించడం చరిత్ర రికార్డు చేసి ఉంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో ప్రధాన స్రవంతిలో జరుగుతున్న ఉద్యమానికి సమాంతరంగా ఎన్నో ఆదివాసి పోరాటాలు జరిగాయి. వలస పాలనకు, దోపిడీకి వ్యతిరేకంగా చాలా మిలిటెంట్ పోరాటాలు జరిగాయి. ఒక వారం క్రితం బిర్సా ముండా జన్మదినాన్ని సమాజమే కాక రాజ్యం కూడా నిర్వహించింది.

ఆయన విగ్రహాలకు పూల దండలు వేయడం, వార్తాపత్రికల్లో పెద్దయెత్తున ప్రకటనలు చేయడం ఆయన అమరత్వాన్ని జ్ఞాపకం చేసుకోవడమే . బిర్సా ముండా అప్పటి రాజ్యంతో పోరాడినవాడే. వలస పాలకులు ఆయనను, ఆయన ఉద్యమాన్ని వెంటాడి, వేటాడి బిర్సా ముండాను బలి తీసుకున్నారు. ఆయన త్యాగాన్ని ఇప్పటి పాలకులు గౌరవప్రదంగా సెలబ్రేట్ చేశారు. నిజానికి బిర్సా ముండా అడిగిన ప్రశ్నలు ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. బయటివాళ్లు మా అడవిలోకెందుకు వస్తున్నారు? మా సంపదని ఎందుకు దోచుకుంటున్నారు? మా అనుమతి లేకుండా మా వనరులను కొల్లగొట్టే అధికారం వాళ్లకు ఎక్కడినుంచి వచ్చింది? అని సమకాలీన ఆదివాసీ ఉద్యమాలు అడుగుతున్నాయి.

బిర్సా ముండా, రాంజీ గోండ్, కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు వంటి నాయకులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. రాజ్యమే వాళ్ళ ప్రాణాలను తీసుకుంది. ఈ త్యాగాల వలన భారత రాజ్యాంగం రూపకల్పన జరుగుతున్న క్రమంలో రాజ్యాంగ సభలో ఆదివాసీ నాయకుడు జయపాల్ సింగ్ కీలకమైన ప్రశ్నలు అడుగుతూ గతంలో తాము ఏ రాజ్యాన్నీ విశ్వసించలేదని, మొదటిసారిగా ఈ రాజ్యాన్ని కొంత నమ్ముతున్నామని సంశయాత్మకంగానే అన్నాడు. దీనికి జవాబుగా నెహ్రూగారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అంగీకరిస్తున్నామని అన్నాడు. ఆయన వ్యాఖ్యలలో వందల సంవత్సరాల ఆదివాసీ పోరాటాల స్ఫూర్తిని, చైతన్యాన్ని గమనించవచ్చు. ఈ పోరాటాల ఫలితంగానే రాజ్యాంగంలో షెడ్యూల్ 5, 6 చేర్చబడ్డాయి.

రాజ్యాంగంలో ఆదివాసీల హక్కులను చేర్చి బ్రిటిష్ పాలకులు రూపొందించిన ఎమినెంట్ డోమైన్ (eminent domain) అనే భావనను రద్దు చేయలేదు . ఎమినెంట్ డొమైన్ అంటే రాజ్యానికి, ఆదివాసీలకు మధ్య ఘర్షణ ఏర్పడితే దేశ ప్రయోజనాలరీత్యా రాజ్యానిదే పైచేయి అన్న వలస పాలన ఫార్ములాని కొనసాగించడంపై ఆదివాసీల ఆత్మీయుడు, బస్తరు కలెక్టర్ గా పనిచేసిన బి.డి. శర్మ నిరంతరంగా తన అభ్యంతరాన్ని, ఆగ్రహాన్ని తన రచనలలో, ప్రసంగాలలో వెలిబుచ్చేవాడు. ఆదివాసీలు తమ జీవన విధానాన్ని, సంస్కృతిని, స్వయంపాలనను కోరుకుంటారని, దాన్ని గౌరవించవలసిన బాధ్యత రాజ్యం మీద, సమాజం మీద ఉన్నదని శర్మగారు నమ్మేవారు. 1960 చివరలో దేశవ్యాప్తంగా భిన్న రకాల ఉద్యమాలు వెలుగు చూశాయి. వాటిలో ఉధృతంగా పైకి వచ్చినదే మావోయిస్టు ఉద్యమం. దాదాపు గత ఆరు దశబ్దాలుగా ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇది హింసాయుత ఉద్యమం అనే ప్రచారం విస్తృతంగా జరిగింది. హింస గురించి జరిగే చర్చలో హింస ఎక్కడ ప్రారంభమైందనే మౌలిక ప్రశ్నలోకి వెళ్లకపోవడం ఈ ప్రచారానికి ఊపునిచ్చింది.

ఉద్యమం కూడా కొన్ని చర్యల వల్ల ఈ ప్రచారానికి కొంత బలాన్ని ఇచ్చింది. సమాజంలోని వ్యవస్థీకృత హింస మీద జరగవలసినంత చర్చ జరగలేదు. హింస నిర్వచనంలో భౌతిక హింస తప్ప సామాజిక సంబంధాలలో పాతుకుపోయిన ఆధిపత్య అణిచివేత, కులపర హింస, కుటుంబంలో హింస, గ్రామాలలో పెత్తందారుల హింస అవగాహనలో భాగం కాలేదు. హింస, ప్రతిహింస గురించి ప్రజాసంఘాలలో కూడా జరగవలసినంత చర్చ జరగలేదు. ఇక ఆదివాసీ ప్రాంతాలలో అభివృద్ధి పేరిట రాజ్యాంగం గతంలోలాగానే ప్రవేశించడం, దీనికి ఆదివాసీల ప్రతిఘటన పెరుగుతూ వచ్చాయి. ప్రభుత్వాలు ఒకవైపు పాజిటివ్ గా స్పందించి కొన్ని ఆదివాసీల హక్కుల కోసం చట్టాలు చేసాయి. షెడ్యూల్ 5ఏ కాక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం, వన్ ఆఫ్ సెవెంటీ చట్టం, 2006లో అటవీ హక్కుల చట్టాలు వచ్చాయి. కానీ ఈ హక్కులను క్షేత్రస్థాయిలో గౌరవించలేదు. అమలు చేయలేదు. ఆదివాసీలు ప్రతిఘటించినకొద్దీ బల ప్రయోగాన్ని పెంచారు. ఇలా బల ప్రయోగంలో భాగంగా ఎన్కౌంటర్ అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించి ఇద్దరి మధ్య జరిగిన కాల్పులుగా చిత్రీకరిస్తూ వచ్చారు. ఇరువైపులా ప్రాణ నష్టాన్ని కేవలం విప్లవోద్యమ హింసగా ప్రచారం చేయడంలో రాజ్యం చాలావరకు సఫలీకృతం అయింది.

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పౌరస్పందన వేదిక ఏర్పడటం, శంకరన్ గారి లాంటి ఒక అరుదైన ఐఏఎస్ అధికారి సారథ్యంలో సమాజంలో ప్రతిష్ఠ కలిగిన 15 మంది వ్యక్తుల కృషి వల్ల విప్లవోద్యమ నాయకులకు ప్రధానంగా మావోయిస్టు పార్టీ, జనశక్తి పార్టీలకు, ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగాయి. చర్చలలో భాగంగా ఆయుధం పాత్ర తగ్గాలంటూ ప్రజా సమస్యలే కేంద్రంగా చర్చ విస్తృతంగా జరిగింది. ఈ చారిత్రక ప్రయోగం అర్ధంతరంగా ముగిసినా విప్లవోద్యమానికి, రాజ్యానికి మధ్య శాంతి చర్చలు సాధ్యమే అన్న ఒక అద్భుత అనుభవాన్ని సమాజానికి అందించింది. గత మూడు దశాబ్దాలుగా అమల్లోకి వచ్చిన సామ్రాజ్యవాద కార్పొరేటు అభివృద్ధి నమూనా భారతదేశ దిశను దశను చాలా వరకు మార్చింది. అభివృద్ధి నమూనాలో ఖనిజ వనరుల ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఏ అడవిలోని వనరుల రక్షణ కోసం బిర్సా ముండా పోరాడి అమరుడయ్యాడో ఆ ఘర్షణ తీవ్రతరమై కార్పొరేట్ వత్తిడి వలన రాజ్యం మొత్తం విప్లవోద్యమాన్ని పూర్తిగా నిర్మూలించాలని దృఢ నిశ్చయంతో ఉంది.

విప్లవోద్యమ హింసకు లేదా వాళ్ళ ఆయుధానికి చట్టబద్దత లేదని, రాజ్య బలప్రయోగాన్ని అనుమతిస్తుందని అంటూ తమ ఆయుధాన్ని చట్ట పరిధులు దాటి ఉపయోగిస్తున్నారు. రెండు వైపులా ఆయుధాలు చట్ట వ్యతిరేకమే. రాజ్యం చట్టబద్ధ పాలనను గౌరవించకుండా బల ప్రయోగం చేస్తే దానిని సమాజం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లేదా మౌనంగానో అంగీకరిస్తే ఈ ప్రయోగం కేవలం సాయుధులయిన వారిని చంపడం దగ్గర ఆగదు. ఆ విచ్చలవిడి అధికారం త్వరలోనే సమాజం పైకి వస్తుంది. తమ అధికారాన్ని ఏ మాత్రం ప్రశ్నించినా, విమర్శించినా పౌరులని, ప్రజాస్వామ్యవాదులని, చివరికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కూడా మావోయిస్ట్ అని ముద్ర వేస్తున్నారు. ఐదు దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటం కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నది. మావోయిస్టు నాయకత్వం జరుపుతున్న ఆదివాసీ ఉద్యమం అనుకోని చారిత్రక మలుపు తిరిగింది. మావోయిస్టు ఉద్యమాన్ని ఆదివాసీల మనుగడతో భిన్నంగా చూసిన కార్పొరేట్లు అడవిలో ఖనిజ వనరులనాక్రమించుకొని తవ్వడం ప్రారంభిస్తే అభివృద్ధిలో ఆదివాసీలకు ఏమైనా భాగస్వామ్యం ఉంటుందా? వాళ్లు నిర్వాసితులుగా మారితే పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న చర్చకు రాలేదు. చర్చలు జరిగితే ఈ సమస్య లోతుల్లోకి వెళ్లడానికి అవకాశం ఏర్పడేది.

నిజమైన సమస్య ఆదివాసీల భవిష్యత్తు. ఆదివాసీ సమాజాలు బయట సమాజంతో పోలిస్తే చాలా ప్రజాస్వామ్య సమాజాలు. ఏ స్వార్థం లేకుండా సమిష్టితత్వం కలిగిన జీవనశైలి వాళ్లది. సొంత ఆస్తి లేని సమాజం అది. ఒక పార్శ్వం నుండి ఆదివాసీ మానవతా విలువలకి, స్వయంపాలన ఆకాంక్షకి, బయటి సమాజపు అమానుష ఆలోచనకి జరుగుతున్న పోరాటంగా కూడా చూడవచ్చు. మన సమాజపు ఏ మౌలిక సమస్యలకూ పరిష్కారం లేని ఈ నమూనా కొనసాగడం సాధ్యం కాదు. చారిత్రకంగా ఆదివాసి పోరాటాలు ఒక గణనీయమైన మలుపు తిరుగుతున్నవి. ఇది చరిత్రలో నిలిచే ఘట్టమే. రాబోయే తరాలు ఈ మలుపును ఎలా అంచనా వేస్తాయో, చరిత్ర ఈ మలుపును ఎలా చూస్తుందో అన్నది కూడా ఒక ప్రశ్న. ఈ పోరాటాలు అంతిమంగా ఒక మానవీయ, ప్రజాస్వామ్య, సహజీవన, శాంతియుత సమాజం ఏర్పడే దాకా ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంటాయి.

– ప్రొఫెసర్ జి. హరగోపాల్

(ప్రముఖ విద్యావేత్త, పౌర నాయకుడు)