Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Betpas

Betpas giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

trendbet giriş

meritking

meritking

trendbet giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking Giriş Güncel

Trendbet

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

vaycasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

matbet

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Betpas

Betpas giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

palacebet

palacebet

yakabet

casibom

meybet

online diyetisyen

vaycasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Trendbet

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Betpas

Betpas giriş

winxbet

casibom

bahislion

Marsbahis

meritking

betboo

vevobahis

holiganbet

holiganbet

slotbar

oslobet

meritking giriş

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinowon

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

vaycasino

Atlasbet Giriş

Wbahis

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

palacebet

bahislion

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

matbet

sekabet

sekabet

imajbet

marsbahis

Wbahis

grandpashabet

betpark

matbet

pusulabet giriş

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

padişahbet

betasus

berlinbet

casinoas

casibom

kingroyal

holiganbet

marsbahis

casibom

queenbet

padişahbet

padişahbet giriş

yakabet

casinolevant giriş

padişahbet

meritking

1xbet

padişahbet

galabet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

kralbet

milanobet

gallerbahis

galabet

royalbet

betkolik

betticket

enbet

suratbet

süratbet

betpas

dinamobet

artemisbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

madridbet

betasus

sekabet

marsbahis

vdcasino

grandpashabet

bahiscasino

casinoroyal

sekabet

jojobet

casibom

casibom giriş

casibom güncel giriş

joybet

kingroyal

yakabet

yakabet

betkolik

betkolik

wbahis

kingroyal

masterbetting

kingroyal

imajbet

sekabet

pusulabet

meritking

vdcasino

betlike

vdcasino

ultrabet

tlcasino

casibom

galabet

ultrabet

tarafbet

madridbet

tarafbet

casino siteleri

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

padişahbet giriş

padişahbet

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

తప్పంతా ‘ఇండిగో’దేనా?

భారతీయ విమాన ప్రయాణికులలో చాలా మందికి ఒక విషయం మీద ఏకాభిప్రాయం ఉంది. ఇండిగో తన సామ్రాజ్యాన్ని ఆర్భాటాల మీద గానీ, ఆకర్షణీయమైన గిమ్మిక్స్ మీద గానీ నిర్మించలేదు. అది అత్యంత సులభమైన ఒకే ఒక్క పనిని అసాధారణ సమర్థతతో చేసింది. సమయానికి టేక్ ఆఫ్ కావడం, సమయానికి ల్యాండ్ కావడం. అదే భారతీయుల విశ్వాసాన్ని సంపాదించింది. రోజుకు సుమారు 2,300 విమానాలు, గడియారంలా నడిచే విధానం, దేశీయంగా 90కి పైగా, అంతర్జాతీయంగా 45 గమ్యస్థానాలకు రోజుకు సగం మిలియన్ ప్రయాణికులను ఎలాంటి హడావుడి లేకుండా, సమంజసమైన చార్జీలతో తరలించడం. ఇదే ఇండిగో బలం. కింగ్‌ఫిషర్, జెట్, గో ఫస్ట్ వంటి ప్రత్యర్థి సంస్థలు కూలిపోయిన వేళ, కఠినమైన సామర్థ్యం అనే తన ఆపరేటింగ్ సిద్ధాంతంతో ఇండిగో మరింత బలపడింది. ఆరు ఈ (6ఈ)అనే కోడ్‌తో అది భారత ఆకాశంలో దాదాపు ఏకాధిపత్య స్థాయికి చేరింది. మార్కెట్ వాటా 60% కంటే ఎక్కువ. ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన మార్కెట్ అయిన అమెరికాలో కూడా అతిపెద్ద దేశీయ విమాన సంస్థకు కేవలం 21శాతం మార్కెట్ వాటా మాత్రమే ఉంది. ఆర్థిక సంవత్సరం 2025లో ఇండిగో లాభం (పన్నుల తర్వాత) రూ. 7,258 కోట్లు. ఏప్రిల్ నెలలో కొద్ది రోజులు ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న విమాన సంస్థగా కూడా నిలిచింది. ఈ విజయంలో పెద్ద భాగం దాని మినిమలిస్ట్ వ్యాపార నమూనాదే. ఖర్చులను గట్టిగా కుదించడం.

ఉత్పాదకతను గరిష్టస్థాయికి తీసుకెళ్లడం. ఆసియా విమాన సంస్థలలోనే అతి తక్కువ ఖర్చుతో కూడిన ‘కాస్ట్ పర్ అవైలబుల్ సీట్ కిలోమీటర్’ (సిఎఎస్క్) రూ.3.71. సాధించడం. దీని రహస్య మంత్రం సొగసైన మితవ్యయం. ఒకే రకం విమానాలపై ఆధారపడటం. దాని సుమారు 400 విమానాల భారీ ఫ్లీట్ అంతా ఎయిర్‌బస్‌దే. విమానం ఎగిరినప్పుడే డబ్బు వస్తుంది. ఇండిగో విమానాలు ఇతరుల కంటే ఎక్కువగా ఎగిరాయి. వేగవంతమైన టర్న్‌రౌండ్లు, రోజుకు 12 గంటల వినియోగ లక్ష్యాలు. సీట్లు ఘనంగా అమరిక. విమానంలో వేడి భోజనం లేకపోవడం వల్ల బరువు తగ్గింది. ఇంధన వినియోగం తగ్గింది. తన సొంత ఐఫ్లై శిక్షణ కేంద్రం లో ప్రమాణీకరించిన సిబ్బంది విధానాలు కార్మిక సామర్థ్యాన్ని పెంచాయి. పైలట్- టు- ఎయిర్‌క్రాఫ్ట్ నిష్పత్తి విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఒక్కో విమానానికి సుమారు 13 మంది పైలట్లు మాత్రమే. ఎయిర్ ఇండియా ప్రధాన ఫ్లీట్‌లో ఇది దాదాపు 34కి ఒకటి. వనరుల కేటాయింపులో ఇండిగో కత్తిరించినంత పదునైన ఖచ్చితత్వం చూపింది. ఈ వారపు మీడియా కవర్ స్టోరీస్ మొత్తం ఇండిగో సంస్థపై నడిచింది.

కేంద్ర ప్రభుత్వం తన విరోధ భావాన్ని ఈ ఇండిగో సంస్థపై రుద్దింది. ఇండిగో సంస్థ ఓ పదునైన అంచుపై విన్యాసం చేసి, తానే దానికి బలైంది. డిసెంబరు మొదట్లో ఒక్కసారిగా ఇండిగో వల్ల చెలరేగిన గందరగోళం అందరినీ షాక్‌కు గురి చేసింది. కొన్ని రోజుల్లోనే లక్షకు పైగా కాదు, దాదాపు పది లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. సుమారు 5,000కి పైగా విమానాలు రద్దయ్యాయి లేదా తీవ్ర ఆలస్యం అయ్యాయి. డిసెంబరు 4 నుంచి 6 మధ్య 2,948 దేశీయ విమానాలు ఆకాశం నుంచి మాయమయ్యాయి. డిసెంబరు 5 ఒక్కరోజే 1,588 రద్దయ్యాయి. ఇది ఇండిగో విమానాల్లో 78 శాతం. విమానాశ్రయాలు రైల్వే స్టేషన్ల కంటే దారుణంగా మారాయి. లగేజ్ ఎక్కడపడితే అక్కడ పేరుకుపోయింది. చాలాసార్లు తప్పు గమ్యస్థానాలకు వెళ్లింది. ప్రత్యర్థి విమాన సంస్థలు సర్జ్ ప్రైసింగ్‌కు దిగాయి. చార్జీలు ఆకాశాన్ని తాకుతుంటే, ఇండిగో ప్రతిష్ఠ నేలచూపులు చూసింది. ఇంత ఘోరంగా ఇండిగో నియంత్రణ కోల్పోవడానికి కారణం ఏమిటి? దీని మూలాలు భారత్ అత్యవసరంగా అవసరమైన ఒక సంస్కరణలో ఉన్నాయి. కొత్త ‘ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్’ (ఎఫ్‌డిటిఎల్), అంటే పైలట్ల అలసట నిర్వహణ నిబంధనలు. పైలట్లు ఎంతసేపు పనిచేయాలి, ఎంత విశ్రాంతి తీసుకోవాలి అన్నది ఇవే నిర్ణయిస్తాయి.

ఎన్నో ఏళ్లుగా భారత్ ఈ విషయంలో అంతర్జాతీయ ప్రమాణాల కంటే చాలా వెనుకబడి ఉంది. న్యాయపోరాటాలు, నిపుణుల సంప్రదింపుల తర్వాత, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) జనవరి 2024లో సవరించిన ప్రమాణాలను జారీ చేసింది. వాటిని అమలు చేసేందుకు విమాన సంస్థలకు దాదాపు రెండు సంవత్సరాల గడువు ఇచ్చింది. పైలట్ల ఫ్లయింగ్ అవర్స్ తగ్గించబడ్డాయి. తప్పనిసరి విశ్రాంతి 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. నైట్ డ్యూటీకి కొత్త నిర్వచనం ఇచ్చారు. వారానికి నైట్ ల్యాండింగ్స్‌ను ఆరు నుంచి రెండు వరకు తగ్గించారు. మొత్తం 22 నిబంధనలు, రెండు దశల్లో… జులై 1, నవంబర్ 1 నుంచి అమలు. ఈ కొత్త నిబంధనల ప్రభావానికి అత్యధికంగా గురైన సంస్థ ఇండిగోనే. ఇంత పూర్తిగా ‘లీన్ ఎఫిషియెన్సీ’ మీద ఆధారపడి నిర్మితమైన మరో విమాన సంస్థ లేదు. అలసట నిబంధనలు పైలట్ల లభ్యతను కత్తిరించాయి. అయితే ఇండిగో సిద్ధమైందా? అందుబాటులో ఉన్న ఆధారాలు ‘లేదు’ అని చెబుతున్నాయి. ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ, పైలట్ల నియామకంలో అది నెమ్మదించింది. ఆశ్చర్యకరంగా, పైలట్ల సంఖ్యను పెంచటానికి బదులు, మార్చిలో ఉన్న 5,463 నుంచి డిసెంబరు నాటికి 5,085కి తగ్గించింది. ఆలస్యంగావచ్చే విమానాల డెలివరీలు, తన స్థాయి వల్ల కొంత వెసులుబాటు దొరుకుతుందనే అంచనాతో అది పందెం కట్టింది. నవంబర్ చివరి నుంచి డిసెంబరు ఆరంభం వరకు వాతావరణం సమస్యలు తెచ్చింది.

దక్షిణంలో సైక్లోన్ దిత్వా, ఉత్తరంలో పొగమంచు. ఇప్పటికే అతి పలుచని మానవ వనరుల బఫర్లు ఉండటంతో, రోస్టరింగ్ సాఫ్ట్‌వేర్ జామ్ అయింది. చట్టబద్ధంగా విశ్రాంతి తీసుకున్న పైలట్లు తక్కువగా ఉండగా, విమానాలు ఎక్కువగా ఉండే అసాధ్య సమస్యను అది పరిష్కరించడానికి ప్రయత్నించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది కేవలం గణిత సమస్య కాదు.తన నిర్మాణ పరిమితులను మించి విస్తరించిన వ్యాపార నమూనా తుదకు తనకు తానే కూలిపోయిన పరిణామం. నియంత్రణ సంస్థ డిజిసిఎ వైఖరి అంత మెరుగ్గా లేదు. పైకి చూస్తే, అది విమాన సంస్థలతో అనేక సమావేశాలు నిర్వహించి, పురోగతిని సమీక్షించినట్టు కనిపించింది. కానీ ప్రధానంగా సంస్థల స్వయం ఘోషణలపైనే ఆధారపడింది. వ్యవస్థ పూర్తిగా కూలిపోయే వరకు ఇండిగో భరోసాలు ఎలా అంగీకరించబడ్డాయి? గణనీయమైన ప్రభావం ఉన్న సంస్థ ఇది. ప్రముఖులతో నిండిన బోర్డు ఉంది. నియంత్రణ సంస్థ పని అందంగా స్వేచ్ఛ ఇవ్వడంకాదు, ఎప్పటికీ అప్రమత్తంగా ఉండటం. అలసట ఆధారిత పని విధానానికి ఇండిగో నిర్వహణ నిజంగా సరిపోతుందా! అని డిజిసిఎ కఠినంగా చూసి ఉంటే, వ్యవస్థ ఈ విధంగా దెబ్బతినేది కాదు.

ఈ గందరగోళానికి కారణాలను స్పష్టంగా చెప్పకుండా ఇండిగో నిర్వహణ కూడా తన ప్రతిష్ఠను కాపాడుకోలేకపోయింది. భారత్‌లో ఆపరేటింగ్ ఖర్చుల్లో 30 నుంచి 40 శాతం పన్నులే. అమెరికాలో ఇది సగటున 25% మాత్రమే. తన ఆధిపత్యం వల్ల నియంత్రికులను బందీలుగా చేసుకోవచ్చనే భావన ఇండిగోకు కలిగివుండవచ్చు. అది దాని సామ్రాజ్యం సామర్థ్యంపై నిర్మితమైంది. ఇప్పుడు అది అతి అంచుకు దగ్గరగా నడవకుండా, లాభాల కంటే భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ మళ్లీ నిర్మించుకోవాలి. భారత్‌కు తన ఏకైక అద్భుతమైన విమానయాన విజయ కథ కూలిపోవడం భరించలేని విషయం. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఇండిగో సంస్థస్థానంలో మరో పోటీ విమానయాన రంగాన్ని అదానీ సంస్థను తీసుకుని రావటానికే ఇండిగోను బలి పశువును చేశారా! అదానీ కోసం ఎంతకైనా తెగించే మోడీ ఇండిగో పతనం వెనుక ఉన్నారు అనే అభిప్రాయం సోషల్ మీడియా మరింత అనుమానాలు వ్యాపిస్తున్నాయి. ఈ క్రీడలో కేంద్ర ప్రభుత్వం అసమర్థతా భారాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి చురుకుగా ఉండే కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుపై పడింది. ఏదిఏమైనా ఈ మబ్బులు ఎక్కువ కాలం అసలు నిజాలు ఏమిటో దాచలేవు (వెలుగు చూడక తప్పదు.). 

డా. కోలాహలం రామ్ కిశోర్

9849328496

క్వాంటమ్ కంప్యూటింగ్ తప్పనిసరి కారాదు

క్వాంటమ్ టెక్నాలజీల్లో ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పడుతుండగా, తదుపరి కంప్యూటింగ్ విప్లవంలో నాయకత్వం సాధించాలని ప్రభుత్వాలు పరుగులు పెడుతున్న నేపథ్యంలో, విద్యావేత్తల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ వంటి సాంప్రదాయ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లను తగ్గించి అన్ని ఇంజినీరింగ్ విద్యార్థులకూ క్వాంటమ్ కంప్యూటింగ్‌ను తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలా? భవిష్యత్తు క్వాంటమ్- సిద్ధమైన గ్రాడ్యుయేట్లు కోరుకుంటోందని కొందరు వాదిస్తున్నారు. మరికొందరు ఇది అకాలికం, విధ్వంసకరం, విద్యార్థులు -పరిశ్రమలకు హానికరమని హెచ్చరిస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అనగా క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలైన సూపర్‌పొజిషన్, ఎంటాంగిల్‌మెంట్‌లను ఉపయోగించి, క్విట్స్ ద్వారా సమాచారాన్ని ప్రాసెస్ చేయడం. ఒకే సమయంలో 0, 1 లేదా రెండూ కాగలిగే క్విట్స్ వల్ల కొన్ని సమస్యలను సాధారణ కంప్యూటర్ల కంటే ఎక్స్‌పోనెన్షియల్ వేగంతో పరిష్కరించవచ్చు. మందుల ఆవిష్కరణ, క్రిప్టోగ్రఫీ, ఆప్టిమైజేషన్ వంటి రంగాల్లో ఇది విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఆశిస్తున్నారు. ఐబిఎం, గూగుల్, ఐఆన్‌క్యు, రిగెట్టి, సైక్వంటం వంటి సంస్థలు క్విట్స్ సంఖ్య పెంచుతూ, ఎర్రర్ కరెక్షన్ మెరుగుపరుస్తున్నాయి. కానీ వాణిజ్యపరంగా విస్తృతంగా ఉపయోగపడే ఫాల్ట్-టాలరెంట్ క్వాంటం కంప్యూటర్లు ఇంకా సంవత్సరాల దూరంలో ఉన్నాయి.

డిసెంబరు 2025 నాటికి క్వాంటమ్ ఉద్యోగ మార్కెట్ చిన్నదైనా, వేగంగా వృద్ధి చెందుతోంది. 2025 మొదటి తొమ్మిది నెలల్లోనే 1.25 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా వెంచర్ ఫండింగ్ వచ్చింది. గత ఐదేళ్లలో ఉద్యోగ ప్రకటనలు 180-500% పెరిగాయి. జీతాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. అయినా, నైపుణ్యం ఉన్న వారు చాలా తక్కువ; ఉద్యోగ ఖాళీలు -అర్హుల నిష్పత్తి 3:1గా ఉంది. ఈ నైపుణ్య కొరత కారణంగా క్వాంటమ్ విద్య విస్తృతంగా చేర్చాలనే డిమాండ్ పెరిగింది. ఎంఐటి, స్టాన్‌ఫోర్డ్డ్, ఐఐటీలు ఇప్పటికే క్వాంటమ్ కంప్యూటింగ్‌ను అడ్వాన్స్‌డ్ ఎలక్టివ్ లేదా స్పెషలైజేషన్‌గా అందిస్తున్నాయి. చైనా, సింగపూర్, కెనడా, భారత్ (2023 నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా) సాంప్రదాయ బ్రాంచ్‌లను తొలగించకుండానే క్వాంటమ్ విద్యను పెంచుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడా ప్రతిష్ఠిత సంస్థ సాంప్రదాయ బ్రాంచ్‌ల స్థానంలో క్వాంటమ్‌ను తప్పనిసరి చేయలేదు. కనీస అవగాహన (క్విట్స్, సూపర్‌పొజిషన్, ఎంటాంగిల్‌మెంట్, షార్/గ్రోవర్ అల్గారిథమ్స్) భవిష్యత్తుకు సిద్ధం చేస్తుందని, 1-2 క్రెడిట్ తేలికైన కోర్సు సరిపోతుందని అంటారు. ఎలక్టివ్ లేదా బలమైన సాంప్రదాయ బ్రాంచ్‌లతో పాటు ఉంటే ఇది ఉత్తమమే.

కానీ సాంప్రదాయ బ్రాంచ్‌లను తగ్గించి అందరికీ తప్పనిసరి చేయడం తీవ్ర వ్యతిరేకతకు గురవుతోంది. ఈ రోజు 99% సాంకేతికత (చిప్స్, విద్యుత్ గ్రిడ్‌లు, వాహనాలు, భవనాలు, విమానాలు) ఇంకా సాంప్రదాయ ఇంజినీరింగ్ సూత్రాలపైనే ఆధారపడి ఉంది. ఈ బ్రాంచ్‌లను తగ్గిస్తే నాలుగైదేళ్లలోనే పరిశ్రమలు తీవ్ర నైపుణ్య కొరతను ఎదుర్కొంటాయి. క్వాంటమ్ కంప్యూటింగ్‌కు లీనియర్ ఆల్జీబ్రా, కాంప్లెక్స్ నంబర్స్, ప్రాబబిలిటీ, క్వాంటమ్ మెకానిక్స్ బలమైన పునాది అవసరం. ఈ విషయాల్లోనే చాలా మంది విద్యార్థులు కష్టపడుతుంటే, బలవంతంగా నేర్పిస్తే భారీగా ఫెయిల్యూర్, గుర్తుపెట్టుకోవడం, నిరాశాజనకంగా ఉంటుంది. టైర్-2, 3కాలేజీల్లో ఫ్యాకల్టీకే కిస్కిట్, సిర్క్ వంటి టూల్స్ అనుభవం ప్రాథమిక అవగాహన లేదు, వీరితో విద్యార్థులకు పాఠాలు బోధించడం అంటే కష్టసాధ్యమే. ల్యాబ్ లు నడపడం దాదాపు అసాధ్యం. గతంలో క్లౌడ్ కంప్యూటింగ్ (2010-15), ఎఐయంఎల్ (2018-22) తప్పనిసరి చేసినప్పుడు చాలా కాలేజీల్లో అధ్యాపకులు లేక మూస ధోరణిలో బోధనా సామర్థ్యాలు లేని వారు బోధించడంవలన జోక్ సబ్జెక్టులుగా మిగిలాయి.

క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంకా కష్టతరమైనది కాబట్టి ఫలితం మరీ దారుణంగా ఉంటుంది. మంచి కళాశాలల్లో, బలమైన సంస్థల్లో సాంప్రదాయ బ్రాంచ్‌లతోపాటు తేలికైన క్వాంటమ్ మాడ్యూల్ విజయవంతమవుతుంది. కానీ బలహీనమైన విద్యావ్యవస్థలో తప్పనిసరి చేయడం విద్యాపరమైన దుర్వినియోగమే. దీనికి సరైన మార్గం, సాంప్రదాయ బ్రాంచ్‌లను బలోపేతం చేస్తూ, అందరికీ తేలికైన అవగాహన కోర్సు, ఆసక్తి ఉన్న టాప్ 10- 20% విద్యార్థులకు డీప్ ఎలక్టివ్స్/మైనర్స్ ఇవ్వడం. ఫ్యాకల్టీ శిక్షణ, పునాది విషయాల బలోపేతం, క్రమంగా అమలు – ఇదే హైప్‌ను అధిగమించి నిజమైన సామర్థ్యం తయారు చేసే మార్గం.క్వాంటమ్ కంప్యూటింగ్ నిస్సందేహంగా భవిష్యత్తు. కానీ ఇప్పుడున్న సుస్థిర పునాదులను పడగొట్టి, ఇంకా పరిపక్వం కాని రంగాన్ని అందరిపై రుద్దడం హేతుబద్ధం కాదు.  

డా. ముచ్చుకోట. సురేష్ బాబు

9989988912

డ్రగ్స్‌పై పోరు.. పెరగాలి జోరు

తెలుగు రాష్ట్రాల్లో చాపకింద నీరులా విస్తరిస్తూ, యువత జీవితాలను నాశనం చేస్తున్న సమస్యల్లో డ్రగ్స్ వినియోగం ముందువరసలో ఉంది. గతంలో పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రాలకు, మెట్రో నగరాలకే పరిమితమైన ఈ జాడ్యం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు, పట్టణాలకు వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్టణం నగరాలలో డ్రగ్స్, గంజాయి వినియోగం బాగా పెరిగిందని పోలీసులు చెబుతున్నప్పటికీ, నిజానికి ఈ జాడ్యం ఉభయ రాష్ట్రాలలోని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు వ్యాపించిందనేది బహిరంగ సత్యమే. వాడుతున్న మత్తుమందుల్లో తేడా ఉండొచ్చేమో గానీ, మత్తు ప్రభావం మాత్రం చాపకింద నీరులా వేగంగా తెలుగు నేల మీద విస్తరిస్తోంది. నగర ప్రాంతాల్లో ఐటి, సేవా రంగాలకు చెందిన కార్పొరేట్ ఉద్యోగులు వారాంతాలలో పబ్‌లలో పార్టీల పేరుతో డ్రగ్స్ తీసుకోవటం కామన్‌గా మారగా, సినీ, వ్యాపార, ఇతర ఉన్నత వర్గాల యువత జీవన శైలిలో ఇదొక భాగంగా మారింది.

ముఖ్యంగా రేవ్ పార్టీల సంస్కృతి, గత ప్రభుత్వాల పట్టింపులేనితనం డ్రగ్స్ వినియోగం నానాటికీ పెరిగేందుకు దోహదపడ్డాయి. పదేళ్ల నాడు హైదరాబాద్‌లోని కొన్ని ఉన్నత వర్గాలకే పరిమితమైన డ్రగ్స్ వినియోగం నేడు రాజధాని శివారులోని ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలకూ పాకి, ఇప్పుడు జిల్లాల ప్రధాన పట్టణాలకూ విస్తరించింది. గంజాయి మొదలు కొకైన్ వినియోగానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు అలవాటు పడ్డారని, చివరికి చాక్లెట్లు, లిక్విడ్ రూపంలోనూ వాడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. గతంలో కేసులు పెట్టి చేతులు దులుపుకోవటం తప్ప చేసిందేమీ లేదని, ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ కేసుల విచారణమీద ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉండటంతో నాటి కేసులు నిర్వీర్యమయ్యాయనేది బహిరంగ సత్యమే. అటు ఎపిలోని మన్యం నుంచి వేలాది కిలోల గంజాయి రవాణా సమయంలో ఇతర రాష్ట్రాలలో పట్టుబడింది. గత ఐదేళ్లలో నేతల అక్రమార్జనకు ఇదొక వనరుగా మారింది. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా ఎపిలో గంజాయి వినియోగం పెరిగిపోయిందని పోలీసులు చెబుతున్నారు. దీనికి బానిసైన యువత పలు హింసాత్మక ఘటనలకు, దోపిడీలకూ పాల్పడటం జరుగుతోంది. గతంలో హై క్లాస్ రేవ్ పార్టీలు, పబ్బుల్లో మాత్రమే దొరికే డ్రగ్స్, గంజాయి వంటివి.. నేడు వీధి చివర కిరాణా దుకాణాలు, పాన్ షాపుల్లో పట్టుబడటం పోలీసుల మాటను బలపరుస్తోంది.

కింది స్థాయి వరకు ఇంతగా డ్రగ్స్ వినియోగం పాకిందంటే.. డ్రగ్స్ రవాణా, పంపిణీ వెనక ఒక బలమైన నెట్‌వర్క్ పనిచేస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. కానీ, నేటి వరకు డ్రగ్స్ వాడే వారినే అరెస్టు చేసి, కోర్టులో విచారణకు నిలపటం తప్ప డ్రగ్స్ రవాణ, పంపిణీలో కీలక సూత్రధారుల్లో ఒక్కరినీ పోలీసులు పట్టుకోలేకపోవటం వెనక బలమైన కారణాలే ఉన్నాయి. తెలంగాణలో గత ఏడాది కాలంగా తరచూ పోలీసులు హోటళ్లు, పబ్‌లమీద దాడులు, తనిఖీలు పెరిగాయి. తెలంగాణలోని సినిమా పరిశ్రమ ప్రభుత్వ సహకారం పొందాలంటే.. సినీ ప్రముఖులంతా డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో భాగస్వాములు కావాల్సిందేనని తెలంగాణ సిఎం గతంలోనే స్పష్టం చేశారు. పరిశ్రమలోని నటీనటులు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తయారయ్యే షార్ట్ ఫిలిమ్స్‌లో తమ సందేశాలను ఇవ్వాలని, వాటిని థియేటర్లు ఉచితంగా ప్రదర్శించాలని, అప్పుడే టికెట్ ధరలు పెంచటానికి అనుమతిస్తామని తనను కలిసిన సినీ పరిశ్రమ ప్రముఖులకు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో డ్రగ్స్ వినియోగంపై మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో తీసి పంపి మిగిలిన నటులకు ఆదర్శప్రాయులుగా నిలిచారు. అలాగే, తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరోకు 27 కార్లు, 59 బైకులు సమకూర్చటం, డ్రగ్స్ కట్టడిలో చురుగ్గా పనిచేసే అధికారులకు ప్రమోషన్లు ఇస్తామని ప్రకటించటమూ ఆహ్వానించదగిన పరిణామాలే.

డ్రగ్స్ వినియోగంపై సమాచారం తెలిసిన వారు 87126 71111 నంబరుకు ఫోన్ చేసి నార్కోటిక్స్ విభాగానికి సమాచారం ఇవ్వాలని కూడా సిఎం పిలుపునిచ్చారు. అటు ఎపిలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వమూ ఈ వ్యవహారంపై గట్టిగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే దీనిపై ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేసి ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తోంది. గంజాయి సాగు చేసే వారి మీద చర్యలు తీసుకోవటమేగాక వారికి పెట్టుబడి పెడుతున్న వ్యక్తులెవరనే కోణంలోనూ విచారణ సాగుతోంది. తీరప్రాంతంలోని నౌకల నుంచి డ్రగ్స్ దిగుమతి కాకుండా చూడటం, ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు గట్టిగా నిఘా పెట్టాలని సూచించటం వంటి చర్యలు తీసుకున్నారు. గంజాయి సేవించి బహిరంగ ప్రదేశాల్లో ప్రజలమీద దాడులు చేస్తున్న బ్లేడ్ బ్యాచ్ ఆగడాలకూ పోలీసులు చెక్ పెడుతున్నారు. ముఖ్యంగా ఎపిలో గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను ఛేదించే దిశగా సర్కారులోని సంబంధిత విభాగాలు అడుగులు వేస్తున్నాయి. మాదక ద్రవ్యాలను సరఫరా చేసేవారు సాధారణంగా యుక్త వయస్కులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, నూటికి 90 శాతం కేసుల్లో ఇది సిగరెట్, మద్యంతో అలవాటవుతోందని నిపుణులు చెబుతున్నారు. మాదకద్రవ్యాల సరఫరా ఒక చెయిన్‌లా సాగుతుందని, ఈ నెట్‌వర్క్‌ను బ్రేక్ చేయగలిగితే తొలినాళ్లలోనే చాలామందికి డ్రగ్స్ అందకుండా చూడొచ్చనేది వారి వాదన.

డ్రగ్ డీలర్లు ఉన్నత వర్గాల యువతను హైక్లాస్ పార్టీలకు పిలిచి ఉచితంగా మద్యం సరఫరాతో మొదలుపెట్టి, వారిని క్రమంగా డార్క్‌వెబ్‌కు కనెక్ట్ చేసి డెలివరీ బాయ్స్ ద్వారా డ్రగ్స్‌ను ఇంటికే సరఫరా చేస్తున్నారని కూడా తమ కౌన్సిలింగ్‌లో తెలుస్తోందని డిఎడిక్షన్ సెంటర్ నిపుణులు వెల్లడిస్తున్నారు. పిల్లల ప్రవర్తనలో అసాధారణ రీతిలో మార్పులు కనిపిస్తున్నా, సాధారణ స్థాయిని మించి డబ్బులు ఖర్చు పెడుతున్నా, ఆ పిల్లలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని, ఇలాంటి లక్షణాలు కనిపించగానే డిఅడిక్షన్ సెంటర్లను సంప్రదించి, చికిత్సతోపాటు మానసిక కౌన్సెలింగ్ కూడా అందించాలని వారు చెప్పారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు కౌన్సిలింగ్, అవసరాన్ని బట్టి చట్టపరమైన చర్యలతో బాటు స్కూలు స్థాయి నుంచే విద్యార్థులకు ఆయా విద్యాసంస్థల్లో కౌన్సిలింగ్, అవగాహనా శిబిరాలు నిర్వహించాలని వారు సూచిస్తున్నారు. డ్రగ్స్ వినియోగం, పంపిణి, సరఫరామీద విశేషమైన ప్రచారం, అవగాహన ఉన్నప్పుడే డ్రగ్స్ వినియోగం కట్టడి అవుతుంది. దీనికోసం అటు ప్రభుత్వాలు, ఇటు స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రముఖులు, విద్యా సంస్థల యాజమాన్యాల చొరవ కూడా కీలకమే. ఈ గలీజు దందా నడిపే వారి పట్ల కఠినంగా ప్రభుత్వాలు వ్యవహరించగలిగితేనే ఈ జాడ్యం దూరమవుతుంది. లేదంటే.. ఈ జాడ్యం మొత్తం సమాజాన్ని పెకలించకమానదు. కనుక ఇకనైనా, మాదకద్రవ్యాల మీద పోరులో మన ప్రభుత్వాలు మరింత దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

గోరంట్ల శివరామకృష్ణ

99852 16695 

సామాన్యుడి కోసం రగిలిన ‘జ్వాలాముఖి’

ప్రముఖ విప్లవకవి కామ్రేడ్ జ్వాలాముఖి 2008 డిసెంబరు 14వ తేదీన మరణించారు. ఆయన 15వ వర్ధంతి సందర్భంగా ఆయనకు అరుణారుణ జోహార్లు చరిత్రలో రెండురకాల కవులు, కళాకారులు మనకు గోచరిస్తారు. ప్రభు వర్గాలను, పాలకవర్గాలను కీర్తిస్తూ వారి దోపిడీ, పీడనలను సమర్థిస్తూ వారి అడుగులకు మడుగులొత్తే కవులు, కళాకారులు ఒక కోవకు చెందినవారు కాగా దానికి భిన్నంగా పాలకవర్గాలను, ప్రభుత్వాలను వారి దోపిడీని వ్యతిరేకిస్తూ ప్రజలపక్షం, పీడితులపక్షం వహించి తమ గళాన్ని, కలాన్ని ప్రజల ప్రయోజనాలకోసం సంధించే కవులు, కళాకారులు రెండోకోవకు చెందుతారు. తన జీవితం చివరిక్షణంవరకు పాలకవర్గాలపై, నేటి దోపిడీవ్యవస్థపై నిప్పులు కురిపిస్తూ తన ప్రతిభాపాటవాలను, శక్తిసామర్థ్యాలను ప్రజలకోసం ధారపోసిన జ్వాలాముఖి రెండోకోవకు చెందిన కవులలో ప్రముఖుడు.

జ్వాలాముఖి 1241938న హైదరాబాదులోని సీతారాంబాగ్ దేవాలయంలో జన్మించారు. చిన్నతనంలోనే తాను నివాసముండే దేవాలయ ప్రాంగణంలోని పేద అర్చకుల ఇండ్లస్థలాల సమస్యపై పోరాటం చేసి పేద ప్రజల ప్రేమకు పాత్రుడయ్యారు. ఎన్నో రుగ్మతలకు ఆలవాలమైన నేటి దోపిడీ వ్యవస్థపై ‘దిగంబరకవి’గా తిరుగుబాటు బావుటాను ఎగురవేసిన ఆయన క్రమంగా తన నిరంతర అధ్యయనం, పరిశీలనద్వారా నేటి సమాజంలోని ప్రజల కడగండ్లకు దేశంలో కొనసాగుతున్న భూస్వామ్య, సామ్రాజ్యవాద దోపిడీ వ్యవస్థే మూలకారణమని, ఈ దోపిడీ నిర్మూలనకు మార్క్సిజంలెనినిజంమావో ఆలోచనావిధానమే శరణ్యమని గ్రహించారు. అంతేగాక భారత విప్లవోద్యమ నాయకులు కామ్రేడ్స్ తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావుల సాంగత్యంతోను; వారి బోధనలు, రచనలతోను ప్రభావితులై భారతదేశంలో అనుసరించవలసిన విప్లవమార్గంపట్ల స్పష్టతను ఏర్పరచుకున్నారు. అప్పటినుంచి తన జీవితాంతం తాను నమ్మిన విప్లవ ఆశయాలకోసం అంకితమై కృషిచేశారు.

ఒక మానవుడు మరో మానవున్ని దోచుకోవటానికి వీలులేని వ్యవస్థకు బాటలువేసే సోషలిస్టు సమాజంకోసం కా॥ జ్వాలాముఖి పరితపించారు. జనచైనా చూచి రావడం తన జీవితంలో సంతోకరమైన సంఘటనగా చెప్పుకున్న జ్వాలాముఖి సోషలిస్టు చైనా దేశం అన్నిరంగాలలో సాధిస్తున్న గణనీయ అభివృద్ధిని, ఈ అభివృద్ధి వెనుకవున్న చైనాదేశపు తాత్విక చింతనను, రాజకీయ విధానాలను దేశవ్యాప్తంగా ఎలుగెత్తి చాటాడు. “బాల్యానికి శిక్షణ, యవ్వనానికి క్రమశిక్షణ, వృద్ధాప్యానికి రక్షణలేని దేశం ఒక దేశమేనా?” అని ప్రశ్నిస్తూ ప్రజలందరికీ ఇటువంటి మౌలిక సౌకర్యాలు సోషలిస్టు సమాజంలోనే సాధ్యపడతాయని, అటువంటి సమాజంకోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని నొక్కి చెప్పేవారు.

కామ్రేడ్ జ్వాలాముఖి చక్కటివక్త. తన కంచుకంఠంతో శ్రోతలను ఉర్రూతలూగించి వారిలో విప్లవోత్తేజం కల్గించి చెరగని ముద్రవేసేవారు. తన వాగ్దాటిద్వారా, తనదైన శైలిలో పాలకవర్గాలపై నిప్పులు కురిపిస్తూ ప్రజలను, విద్యార్థులను, యువకులను నిరంతరం చైతన్యవంతులను చేసేవారు. క్లిష్టసమస్యలపై సరైన అవగాహనను సాధారణ ప్రజలకు, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేరీతిలో అనేక ఉపమానాలతో, కథలతో జోడించి చెప్పేవారు. ఆయన ఉపన్యాసాలు ఉత్తేజకరంగా, విజ్ఞానదాయకంగా వుండటమేగాక ప్రజలను విప్లవకర్తవ్యోన్ముఖులను చేసేవిగా వుండేవి. అన్నిరంగాల ప్రజల హృదయాలలో విప్లవభావాలను గుదిగుచ్చటంలో ఆయనమేటి.

విద్యార్థులను, యువకులను భావి భారతదేశపు ఆశాకిరణాలుగా కా॥ జ్వాలాముఖి అభివర్ణించేవారు. నేటి భూస్వామ్య, సామ్రాజ్యవాద దోపిడీ వ్యవస్థ వెదజల్లే అరాచక, అశ్లీల సంస్కృతి ప్రభావంలో పడకుండా విద్యార్థులు, యువకులు నిరంతరం అప్రమత్తంగా వుండాలని, చైతన్యశీలురు కావాలని ఆయన నిత్యం ప్రబోధించేవారు. పురాణాలలోని, ఇతిహాస కథలలోని, స్వాతంత్య్ర పోరాటంలోని వీరుల త్యాగాలను తరచుగా ఉటంకిస్తూ ఆయన నేటి విద్యార్థులు, యువకులు అటువంటి వీరులనుండి ప్రేరణ, స్ఫూర్తినిపొంది దేశంలో మౌలికమార్పులకోసం, మంచి సమాజ స్థాపనకోసం కృషిచేయాలని ప్రబోధించేవారు. భారత సమాజంలోని సమస్యలన్నంటికీ మౌలిక పరిష్కారమార్గాన్ని చూపిన కామ్రేడ్స్ డివి, టియన్‌ల విప్లవకర జీవితాలనుండి స్ఫూర్తిని పొందాలని చెప్పేవారు. “కామ్రేడ్స్ డివి, టియన్‌లు భారత విప్లవోద్యమంలో కృష్ణార్జునులవంటివారు” అని ఆయన అభివర్ణించేవారు.

పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం మొదలగు అనేక సమస్యలు చుట్టుముట్టినా లెక్కచేయకుండా కా॥ జ్వా విప్లవ ఆశయాలకోసం జీవితం అంతా పోరాడారు. త్యాగనిరతి, అంకితభావం, విప్లవలక్ష్యంపట్ల చిత్తశుద్ధి, ఉన్నతమైన మానవత్వ విలువలు మొదలగు లక్షణాలతో మూర్తీభవించిన కా॥ జ్వాలాముఖి విప్లవకర జీవితం నుండి స్ఫూర్తిని, ప్రేరణనుపొంది ఆయన ఆశించిన నూతన సమాజస్థాపనకోసం కృషిచేయటమే నేటి ప్రజల ముఖ్యంగా విద్యార్థుల, యువజనుల కర్తవ్యం. ఆ విప్లవ తపస్వికి మనమందించే ఉత్తమమైన నివాళులు ఇవే.

సి. భాస్కర్

యుసిసిఆర్‌ఐ(యంయల్)

బిజెపి కోసం ‘అఖండ’ తాండవం

నిరంతరం ప్రజల మధ్య ఉండి వారి కష్టసుఖాలు తెలుసుకొని తమ శక్తి మేరకు వారి అవసరాలు తీర్చి, ప్రజాదరణ పొంది అధికారంలోకి రావాలని రాజకీయ పార్టీలు అహర్నిశలు పాటుపడుతూ ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు రోజులు మారాయి. రాజకీయ పార్టీల పనితీరులో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ‘నువ్వు ప్రజల్లో ఉండడం లేదట’ అని కార్యకర్తలని, కిందిస్థాయి నాయకులను నిలదీసేవారు పెద్ద నాయకులు. ఇప్పుడు ‘నువ్వు సోషల్ మీడియాలో చురుగ్గా లేవట’ అని కోప్పడే స్థితి వచ్చింది. నిజమే, టెక్నాలజీ ఇంత అభివృద్ధి సాధించినప్పుడు నాయకులు నేరుగా వెళ్లి ప్రజలను కలవాల్సిన అవసరం ఏమిటి? సోషల్ మీడియా ద్వారా తాము చెప్పదలచుకున్నది చెప్పొచ్చు, ప్రజల నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవచ్చు అని రాజకీయ పార్టీల అగ్రనాయకులు అనుకుంటున్నారు. దీనికి తాజా ఉదాహరణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తన పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలతో అన్నమాటలు. ‘మీరు సోషల్ మీడియాలో చురుకుగా ఉండటం లేదు, మీకంటే అసదుద్దీన్ ఒవైసి చాలా మేలు. సమర్ధవంతంగా తన సోషల్ మీడియా నడుపుతున్నాడు’ అని వ్యాఖ్యానించారట ప్రధానమంత్రి. సోషల్ మీడియాలో వెనకబడితే ప్రజల మెప్పు పొందటంలో కూడా వెనుకబడిపోతారన్నమాట. ఇదీ ప్రస్తుత రాజకీయాల పరిస్థితి.

తెలంగాణలో బిజెపి పరిస్థితి మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా గత గురువారం ఉదయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన పార్టీ పార్లమెంట్ సభ్యులతో మోడీ బ్రేక్ ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన తెలంగాణ ఎంపీలకు తలంటినట్టు సమాచారం. ప్రధానమంత్రికి- పార్లమెంట్ సభ్యులకు మధ్య ఆ బ్రేక్ ఫాస్ట్ సమావేశంలో జరిగింది ఏమిటి అన్న విషయం అధికారికంగా ఎవరికి తెలియకపోయినా రెండు రాష్ట్రాల ప్రాంతీయ మీడియా అంతటా దాదాపుగా ఒకే రకమైన సమాచారం వార్తగా వచ్చింది. ఇందులో కొత్తగాని, వింతగానీ ఏమీ లేదు. ఆ సమావేశంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు లేదా ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు మీడియాకి సమాచారాన్ని అందించి ఉండవచ్చు. అయితే మీడియాకు ఈ సమాచారం ఎవరు అందించి ఉంటే వారు తమకు అనుకూలంగా ఉండే సమాచారాన్ని మాత్రమే బయటపెడతారు సహజంగా. సరిగా పని చెయ్యడం లేదు, ముఠాలు కడుతున్నారు అని తమను ప్రధాని తిట్టినట్టు తెలంగాణ ఎంపీలు, కేంద్ర మంత్రులు చెప్పుకోరు కాబట్టి ఇది పొరుగు రాష్ట్ర ఎంపీలో, ప్రధాన మంత్రి కార్యాలయంలో లీక్ చేసినదయి ఉండొచ్చు.

ఇక ఆ భేటీలో ప్రధానమంత్రి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బిజెపి పరిస్థితి మీద వెలిబుచ్చిన అభిప్రాయాన్ని గురించి మాట్లాడుకోవాలి. పార్టీ నేతలు సరిగ్గా పనిచేయడం లేదని, ముఠా తగాదాలు పెరిగిపోయాయని ప్రధానమంత్రి తెలంగాణ ఎంపీల మీద ఆగ్రహం ప్రదర్శించారు. వేర్వేరు రాజకీయాలనుండి వచ్చిన వాళ్లంతా ఒక దగ్గర చేరినప్పుడు ముఠాలు ఏర్పడకుండా ఎలా ఉంటాయి? ఆ ముఠాల మధ్య తగాదా లేకుండా ఎలా ఉంటుంది? ఆ విషయం ప్రధానమంత్రికి బాగా తెలుసు. ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కొన్ని పార్టీల కదంబం. భారత రాష్ట్ర సమితి నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన నాయకులు కూడా ఉన్నారు. వారిలో ప్రజాదరణ కలిగిన వాళ్లు కూడా ఉన్నారు. అటువంటప్పుడు సహజంగానే అంతర్గత కలహాలు ఏ రాజకీయ పార్టీకైనా తప్పని బెడదే. తెలంగాణ బిజెపిలో కూడా అదే జరుగుతున్నది. అక్కడ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో ప్రధానమంత్రి తెలంగాణ ఎంపీలకు క్లాస్ తీసుకుంటున్న సమయంలోనే ఇక్కడ తెలంగాణలో ఇద్దరు ఎంపీలకు సంబంధించిన అంతఃకలహం సోషల్ మీడియాలో జోరు అందుకున్నది. సోషల్ మీడియాలో మీరు వెనుకబడి ఉన్నారు,

మీకంటే ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ చాలా నయం, చాలా సమర్థంగా ఆయన సోషల్ మీడియా నిర్వహిస్తున్నారని ప్రధానమంత్రి ఈ బ్రేక్ ఫాస్ట్ సమావేశంలో అన్నట్టు వార్తలు వచ్చాయి. ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకోవడంలో, అంతఃకలహాల్ని బహిరంగం చేసుకోవడంలో తెలంగాణ బిజెపి నాయకులు సోషల్ మీడియాలో వెనుకబడి లేరు. ‘నాకు అన్నీ తెలుసు’ అని ఒక ఎంపీ నోరు మూయించిన ప్రధానమంత్రికి ఈ విషయం తెలిసినట్టు లేదు. మొన్న ముగిసిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఒక ఎంపీ పార్టీ వారిని కాదని తన అనుయాయులను నిలబెట్టి ఓటమి పాలు చేసుకున్నారని బిజెపికి చెందిన కేంద్ర మంత్రి సహాయకుడు ఒకరు సోషల్ మీడియాలో పెట్టిన విషయం ప్రస్తుతం ప్రచారంలో ఉన్నది.

తెలంగాణలో బిజెపి నాయకులు కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం లేదన్నది ప్రధానమంత్రి ఆవేదన. తెలంగాణలో రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీల పరిస్థితి అదే విధంగా తయారవుతున్నది. భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి రెండిటి ప్రస్తుత పరిస్థితి చూస్తే కాంగ్రెస్ నెత్తిన పాలు పోసినట్టే కనిపిస్తున్నది. భారతీయ జనతా పార్టీలో నెలకొన్న అంతఃకలహాలు, భారత రాష్ట్ర సమితిలో రోజురోజుకీ బయట పడుతున్న కుటుంబ తగాదాలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదే పదే చెబుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి రెండవ టర్మ్ ఖాయం చేసినట్టే కనిపిస్తున్నది. ‘మోడీజీ తెలంగాణ మే ఆప్కా కిచిడి పక్ రా నహీ షాయద్’.

ఇక తెలంగాణతోపాటు ప్రధానమంత్రి బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో పాల్గొన్న మిగతా రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ విషయానికొస్తే అండమాన్ గురించి చెప్పుకోవాల్సిందేమీ లేదు పెద్దగా. కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ ఐలాండ్ లో ఒకే ఒక్క లోక్‌సభ స్థానం ఉంది. ఆ ఒక్క స్థానం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచారు. శాసనసభ లేదు కాబట్టి రాజ్యసభ సభ్యులు ఉండే అవకాశం లేదు. ఇక తెలంగాణతో పోలిస్తే సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్‌ను పెద్ద రాష్ట్రంగా భావించాలి. 25మంది లోకసభ సభ్యులు, 11మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయితే కూటమిలో భాగంగా ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఆ రాష్ట్రంలో ముగ్గురు లోకసభ సభ్యులు, నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అలా చూసినట్లయితే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తెలంగాణలోనే బిజెపికి బలం ఎక్కువ పార్లమెంట్లో. సరే తను భాగస్వామిగా ఉన్న కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రం కాబట్టి ప్రధానమంత్రి ఆ రాష్ట్రం గురించి నాలుగు మంచి మాటలు చెప్పినట్టు ఉన్నారు. అందులో ఏపీలో చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయడం మంచి పరిణామం అని ఆయన పేర్కొన్నట్టు, రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి మీద కూడా తనకు మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిందని, పెట్టుబడులు కూడా భారీగా వస్తున్నాయని అన్నట్టు మీడియా ప్రచురించింది. ముందే చెప్పుకున్నట్టు అధికారంలో ఉన్న కూటమిలో భాగస్వామి పార్టీ కాబట్టి ఆ మాత్రం శభాష్ అని వెన్ను చరుచుకోవడంలో తప్పులేదు. అయితే ‘మేరెకో సబ్ కుఛ్ మాలూమ్’ (నాకంతా తెలుసు) అని తెలంగాణ ఎంపీలను గదమాయించిన ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్ లో సబ్ కుఛ్ మాలూమ్ కరేతో (అంతా తెలుసుకుంటే) బాగుండేది. ఆంధ్రప్రదేశ్ లో గతంలో కంటే బిజెపి బలపడుతుందని, ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని కేంద్రమంత్రి భూపతిరాజు చెప్పిన మాటలు విని శభాష్ అనకుండా అక్కడి వాస్తవ పరిస్థితిని కూడా ప్రధానమంత్రి తెలుసుకుంటే బాగుండేది.

ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి బలపడుతున్న మాట ఎలా ఉన్నా, బిజెపి అగ్రనాయకత్వాన్ని సంతుష్టులను చేసుకోవడానికి, అమితానందపరచడానికి కూటమిలోని రెండు మిగతా పక్షాలు పడరాని పాట్లు పడుతున్న మాట మాత్రం వాస్తవం. కూటమి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, కూటమిలోని మరో భాగస్వామ్య పార్టీ జనసేనకు చెందిన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ అధినేత నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తడానికి దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. వేషధారణ కూడా కాషాయానికి మార్చేసి కొద్ది రోజులు ‘ఐయామ్ ఏ అన్ అపాలజిటికల్ సనాతన హిందూ’ అని బహిరంగ ప్రదర్శనలు చేసిన పవన్ కళ్యాణ్ ఈ మధ్య జోరు తగ్గిస్తే ఆ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, నటుడు, ముఖ్యమంత్రి బావమరిది అయినా నందమూరి బాలకృష్ణ బయలుదేరాడు. మూడు రోజుల క్రితం ఆయన నటించిన ఒక సీక్వెల్ ‘అఖండ 2’ విడుదలైంది. అందులో ఆయన చేసిన తాండవం చూస్తే బిజెపిని, ఆ పార్టీకి మార్గనిర్దేశం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ను సంతుష్టిపరచడానికి ఎంత శ్రమ పడ్డాడో అర్థం అవుతుంది. అన్నట్టు ఈ సినిమా విడుదలకు ముందే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మహేష్ భగవత్ ఢిల్లీలోనే ఒక ప్రత్యేక ప్రదర్శన వేయించుకొని చూసి గొప్పగా ఉందని మెచ్చుకున్నారట.

ఈ సినిమాలో మిగతా అసహజ విన్యాసాలనట్లా వదిలేస్తే సర్వమతాలకు నిలయమైన భారతదేశాన్ని కాషాయం కట్టుకున్న దేశం చేసేసాడు. ఒంటిచేత్తో సనాతన హిందూధర్మాన్ని మూడు గంటల్లో కాపాడేసాడు. ఇది కేవలం కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమికి నాయకత్వం వహిస్తున్న బిజెపి పెద్దలను మరింత మచ్చిక చేసుకోడానికే అని సినిమా చూసిన వాళ్లందరికీ అర్థం అవుతుంది. ఇది కేవలం రచయిత, దర్శకుడూ అయిన బోయపాటి బుర్రలో పుట్టిందా అన్నది అనుమానమే. సినిమాలో ఇంత అసహజత్వాన్ని చూసి పెద్దాయన మహేష్ భగవత్ కూడా మొహం పక్కకు తిప్పుకుని నవ్వేసి ఉంటారు. కూటమిలోని బిజెపియేతర పక్షాలు రెండూ పోటీపడి ఇలా హిందుత్వ ప్రచారానికి దిగితే ఆంధ్రప్రదేశ్ లో అసలు బిజెపి ఎదుగుదలకే ఎసరు అవుతుందేమో.

కొసమెరుపు కూడా ఉండాలి కదా. రేపోమాపో ఆంధ్రప్రదేశ్ లో యువరాజుకు పట్టాభిషేకం తప్పదంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఢిల్లీ పర్యటనలను తగ్గించుకొని ఎక్కువ కొడుకు లోకేష్‌నే పంపిస్తున్నారని చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. 15 ఏళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలో ఉంటుందని, ఆ కూటమికి చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి అని పదేపదే ప్రకటిస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ పరిణామాన్ని ఎలా తీసుకుంటాడో కానీ తెలుగుదేశం పార్టీని, ముఖ్యంగా లోకేష్ ను బలంగా సమర్థిస్తున్న ఒక వర్గం మీడియా ఉబ్బితబ్బిబ్బై పోతున్నది. అందులో భాగంగానే ఆ మీడియాకి లోకేశ్ ను పల్లెత్తు మాట ఎవరు అన్నా భోజనం సహించడం లేదు.

ఇటీవల భారత విమానయానంలో ఒక అవాంతరం ఏర్పడింది. దానిమీద బాధ్యులు ఎవరనే చర్చ జాతీయ మీడియాలో జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీలోని లోకేశ్ భక్తుడు ఒకాయన ఈ సంక్షోభం మీద వార్‌రూమ్ ఏర్పాటు చేసి తమ నాయకుడు పర్యవేక్షిస్తున్నాడని చెప్పడంతో రిపబ్లిక్ టివి ముఖ్య సంపాదకుడు అర్నాబ్ గోస్వామి ‘కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉండగా రాష్ట్ర మంత్రి లోకేశ్‌కు ఏం సంబంధం?’ అని నిలదీయడంతో పాపం లోకేశ్ అనుకూల మీడియా తీవ్ర ఆవేదనకు గురైంది. మరునాడు అర్జెంటుగా తమ సాయంకాలపు చర్చాగోష్టుల్లో లోకేశ్ అర్హతలను ప్రశ్నించిన అర్నాబ్ గోస్వామిని ఓ ఆటాడేసుకున్నారు. అంతేకాదు, ఒక న్యూస్ ఛానల్ పెద్దాయన అయితే ఈ విషయంలో లోకేశ్‌ను సమర్థించే విధంగా స్పందించనందుకు చంద్రబాబునాయుడు మీద కూడా అలిగాడు. ఈ మీడియా సంస్థల అతి ఎటుపోయి ఏమవుతుందో చూడాలి.

Delete Edit

చర్చలా! విద్వేష రచ్చలా!

పార్లమెంట్ అన్నది ప్రజాసమస్యలపై విస్తృతంగా చర్చించవలసిన వేదిక. అంతేకాదు ఆ మేరకు పాలనా విధానాలపై మార్గదర్శకాలు రూపొందించేలా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యతాపరమైన చక్కని అవకాశం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం నుంచి జాతీయ గేయం వందేమాతరం, ఎన్నికల సంస్కరణలు అనే రెండు ముఖ్యమైన అంశాలపై చర్చిస్తున్నాయి. వాడిగా, వేడిగా సాగిన ఈ చర్చలు ఎంతవరకు నిజంగా ఫలప్రదమవుతున్నాయన్నది ప్రశ్నార్థకమే. ఉదాహరణకు జాతీయ గేయం వందేమాతరంపై చర్చలో కొంతవరకు చారిత్రక, చట్టబద్ధమైన ప్రస్తావనలు తెరపైకి తీసుకువచ్చి తమ వాదన వినిపించడంలో విపక్షం విజయం సాధించిందనే చెప్పవచ్చు. కానీ పాలక పక్షం అడ్డగోలు వాదనలతో పూర్వ జాతీయ కాంగ్రెస్ నాయకులపై బద్ధ శత్రుత్వాన్ని ప్రదర్శిస్తోంది. వారికి నెహ్రూ ఫోబియా వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. ఇక ఎన్నికల సంస్కరణలపై చర్చ విషయానికి వస్తే ఇదివరకటి ఆరోపణల డ్రామాగానే దారితీసింది. ప్రజాతీర్పును హైజాక్ చేయడానికి ఎన్నికల కమిషన్ స్వతంత్రతను ప్రభుత్వం తన ప్రయోజనాల కోసం బలహీనపర్చి దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఈ విమర్శలను పాలక వర్గం కొట్టి పారేస్తూ అక్రమ చొరబాటుదార్లను, అనర్హులైన ఓటర్లను ఏరివేయడానికే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) దేశమంతా నిర్వహిస్తున్నట్టు సమాధానం ఇచ్చింది.

అక్రమ వలసదారులను ఓటర్ల జాబితాల్లోంచి తొలగిస్తే ఎన్నికల్లో తమకు నష్టం వస్తుందన్న భయంతో విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఈ చట్టబద్ధమైన ప్రక్రియకు లేనిపోని అభ్యంతరాలు తెలుపుతోందని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి ఎదురైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై సందేహాలు వ్యక్తం చేస్తుంటారని, గెలిచినప్పుడు ఈ ప్రస్తావనే తీసుకురాకపోవడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని చాటుతుందని అమిత్ షా ఎద్దేవా చేశారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించలేకపోయింది. ఏదెలాగున్నా అక్రమ వలసదారులను భారత ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి బయటకు పంపడమే ఎస్‌ఐఆర్ లక్షమని అమిత్ షా వాదించారు. ఎన్‌డిఎ ప్రభుత్వం అక్రమ వలసదారుల విషయంలో తన నిఘా (డిటెక్ట్), తొలగింపు (డిలీట్), బహిష్కరణ (డిపోర్టు) విధానాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగ పరమైన వివాదానికి దారితీస్తోంది. వాస్తవానికి ఓటర్ల జాబితాను క్రమబద్ధీకరించడమే ఎస్‌ఐఆర్ విధి. చనిపోయిన ఓటర్లను జాబితానుంచి తొలగించడం, డూప్లికేట్ ఐడికార్డులను తొలగించడం, వలసదారులైన ఓటర్ల సమస్యను పరిష్కరించడం మాత్రమే చేయాలని ఎస్‌ఐర్‌పై పిటిషన్ల విచారణలో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అంతేతప్ప ఓటరు పౌరసత్వం నిర్ణయించే హక్కు ఎన్నికల కమిషన్‌కు లేదు. కానీ అమిత్ షా ఓటరు జాబితాలో ఎవరి పేర్లు ఉండవో వారు బహిష్కృతులవుతారని తన సహజ ధోరిణిలో చెప్పడం వివాదాస్పదమవుతోంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ప్రక్రియను ఎస్‌ఐఆర్‌లో చొప్పించడమేమిటని విపక్షాలు నిలదీస్తున్నాయి. అంతేకాదు ఎస్‌ఐఆర్ పారదర్శకతను ప్రశ్నిస్తున్నాయి. ఇక చీఫ్ ఎలెక్షన్ కమిషనర్‌ను ఎంపిక చేసే ప్యానెల్ నుంచి చీఫ్ జస్టిస్‌ను ఎందుకు తొలగించారన్న ప్రశ్న విపక్షాల నుంచి రాగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎవరినీ సంప్రదించకుండా ఈ ఎంపిక ప్రత్యేకంగా జరిగిందని అమిత్ షా ఉదాహరణ చూపించారు. ప్రధాన మంత్రి, కేబినెట్ మంత్రి, విపక్ష నాయకుడుతో ఉన్న ప్రస్తుత ప్యానెల్ ఎంపికలో తేడా ఏమొచ్చిందని కూడా ప్రశ్నించారు. కొత్త చట్టంలో సిఇసి, ఇసిల మధ్య సమానత్వాన్ని తీసివేసి, ఇసిలను తొలగించే అధికారం సిఇసికి ఎలా కల్పించారు? అన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు. ఇలా చేయడం నిజంగా ఎన్నికల నిర్వహణ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీయడమే అవుతుంది.

విపక్ష నాయకుడు ఓటు చోరీ జరిగిందని అంటూ కొన్ని అవకతవకలు బయటపెట్టారు. వీటికి ఎన్నికల కమిషన్ కానీ, పార్లమెంట్ చర్చల్లో ప్రభుత్వం కానీ వివరణ ఇవ్వకుండా మొఖం చాటేయడమే జరిగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలపై అధికార పక్షం వేలెత్తి చూపించినప్పుడు సరైన నిర్మాణాత్మక వాస్తవాలు కనిపించాలి తప్ప ‘గతంలో మీరేం చేశారు?’ అని ఎదురు ప్రశ్న సరైన విధానం కాదు. అలాగే అధికార, ప్రతిపక్షవర్గాలు ఇంతవరకు ఉభయత్రా జరిగిన పొరపాట్లను గుర్తించి అవి మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకునే మార్గాలేమిటో అన్వేషించాలి. ఎన్నికల నిర్వహణ యంత్రాంగాన్ని జవాబుదారీగా, పారదర్శకంగా బలోపేతం చేయాలి. కానీ ఈ విషయంలో పాలకవర్గాలకు సరైన శ్రద్ధ ఉన్నట్టు తోచడం లేదు. విపక్షాల వాదనలను చిత్తు చేయడానికే పార్లమెంట్ సమావేశాలను వినియోగించుకుంటున్నారు. ద్వేష ప్రసంగాలతో కత్తులు దూసుకుంటున్నారు. స్వాతంత్య్ర పోరా టం కులమత వర్గాలకు అతీతంగా సమైక్య స్ఫూర్తితో ఎలా సాగిందో అందరికీ తెలిసిందే. బ్రిటిష్ ప్రభుత్వ విభజించు పాలించు పన్నాగాలను చీల్చిచెండాడేలా కులమతవర్గాలకు అతీతంగా సమైక్య స్ఫూరితో స్వాతంత్య్ర పోరాటం ఎలా సాగిందో ఎవరికీ తెలియనిది కాదు. కానీ నేడు చారిత్రక వాస్తవాలను పక్కదారి పట్టించి విభజించు పాలించు విధానంతోనే ఓట్ల బ్యాంకు కొల్లగొట్టడానికి బూటకపు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్తుండడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు తీరని కళంకం. పార్లమెంట్ కార్యకలాపాలకు నిమిషానికి రూ. 2.5 లక్షల వరకు ఖర్చవుతుందని గణాంకాలు చెబుతున్నాయి. కానీ మన ప్రజా ప్రతినిధులు వ్యర్థ ప్రసంగాలతోనే కాలం గడిపితే ఎంత దుర్వినియోగం అవుతుందో ఆత్మపరీక్ష చేసుకోవడం మంచిది.

చట్టసభల్లో చర్చలు పెడదారి

వందేమాతరం ఒక పదం. అది ఒక అక్షర సముదాయం మాత్రమే కాదు. అది ఒక నాటి తరాన్ని నిరంతరం నిద్రలేపి ఉద్యమాలలోకి ఉరికించిన అక్షర నినాదం. భారత స్వాతంత్య్ర సమరంలో వందేమాతరం అనే అక్షరాలు కోట్లాది భారతీయులను ఉత్తేజపరిచిన ఆయుధాలు. ఆ అక్షరాల అంకురార్పణకు సరిగ్గా 150 ఏళ్లు నిండాయి. ఇది భాతీయులందరికీ ఒక అద్భుతమైన సందర్భం. అప్పటి ఉద్యమాల జ్ఞాపకాలను నెమరువేసుకొని భవిష్యత్ తరాలకు దాని స్ఫూర్తిని అందించే కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి.

అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాల్లో వందేమాతరంపై చర్చసాగింది. సందర్భం సరైనదే కాని పార్లమెంటుకు ప్రత్యేకించి లోక్‌సభ నాయకుడుగా భారత ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఉద్దేశం మాత్రం దారితప్పింది. వందేమాతరం సంపూర్ణ సారాంశాన్ని కాకుండా కొందరి ప్రయోజనాలకోసం అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పంక్తులను కుదించారని, ఇది దేశ ద్రోహమని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలను గుప్పించారు. ఇది ప్రతి విమర్శలకు, చర్చోపచర్చలకు దారితీసింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సభ్యులు ఎదురు దాడి చేశారు. భారత స్వాతంత్య్ర సమరానికి నాయకత్వం వహించింది, వందేమాతరం గీతాన్ని సమర నినాదంగా మార్చింది కాంగ్రెస్ మాత్రమేనని జవాబు విసిరారు. ఇప్పటి భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ భారతీయ జనసంఘ్, దాని పితృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఊడిగం చేశారని, స్వాతంత్య్ర సమరంలో ఆ శక్తులు ఎప్పుడూ భాగస్వాములు కాలేదని, కాంగ్రెస్ బిజెపిపై ధ్వజమెత్తింది. అయితే ఈ చర్చ పార్లమెంటుకు మాత్రమే పరిమితం కాలేదు. బయటి కూడా దాని ప్రతిస్పందనలు వినవస్తున్నాయి. కొంత కాలం వేరే విషయాలమీద చర్చ ఉండదు. కేవలం ఈ విషయం మీదనే చర్చ సాగుతుంది. ఇది ఏదో యథాలాపంగా నరేంద్ర మోడీ లేవనెత్తలేదు. దీని వల్ల నరేంద్ర మోడీ కొన్ని ప్రయోజనాలను ఆశిస్తున్నారు.

ఇప్పటి తరంలో నెహ్రూను దేశద్రోహిగా నిలబెట్టాలనేది, దీని వల్ల కాంగ్రెస్‌ను కూడా దోషిగా చూపించాలనే ఉద్దేశం. రెండోది పార్లమెంటు జరుగుతున్న సందర్భంలో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించాలి. అవి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉండొచ్చు. అందువల్ల ఈ వివాదాన్ని ముందుకు తెస్తే, ఈ సమావేశాలు మొత్తం దీని మీదనే నడిపించొచ్చు. అవసరమైన బిల్లులను గుట్టుచప్పడు కాకుండా ఆమోదింప జేసుకోవచ్చు. ఇది పాలకవర్గాలలో ఉండే లక్షణం. దీనినే నరేంద్ర మోడీ తన ఎత్తుగడగా భావించారు. దీనిని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకొని వ్యవహరించాలి. వందేమాతరం మీద చర్చను పక్కనపెట్టి ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించాలి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యురాలు ప్రియాంకా గాంధీ సరిగ్గానే వ్యక్తపరిచారు. వందేమాతరం మీద చర్చను పక్క పెట్టి ప్రజల అత్యవసర సమస్యలైన అధిక ధరలు, నిరుద్యోగం, పేదరికం లాంటి సమస్యలపై చర్చించాలని సభలో ప్రస్తావించారు.

ఇక్కడే పౌరసమాజం కూడా స్పందించాలి. పార్లమెంటు సమావేశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు, దాని ప్రభుత్వ సమాధానాలు, పరిష్కారాలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి మాట్లాడాలి. అయితే గత కొంత కాలంగా ఏదో ఒక వివాదాన్ని లేవనెత్తడం, దాని గురించి చాలా తీవ్రంగా మాట్లాడుకోవడం, వాకౌట్‌లు, సస్పెండ్‌లు, సమావేశాలు ముగియడం. ఇది రివాజు. ప్రభుత్వం తన ధోరణిలో తాను పని చేసుకుంటూ వెళ్లడం జరుగుతుందే కాని నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ప్రస్తావన ఉండడంలేదు. ఇది చాలా శోచనీయం. ఇది ఎంత మాత్రం వాంఛనీయం కాదు.

ప్రస్తుతం ప్రజలు చాలా ఆనందంగా ఉన్నట్లు ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. ఇందులో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఎవరూ దీనికి అతీతులు కాదు. ముఖ్యంగా కేంద్రం సంపూర్ణంగా ప్రజల సామాజిక, ఆర్థిక సమస్యలను విస్మరించింది.

ముఖ్యంగా దేశంలోని నూటికి 80 శాతం మందికి పైగా ప్రజలు సామాజిక, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇందులో అందరినీ పట్టిపీడించేది అధిక ధరలు. గత పదేళ్లలో ధరలు ఏ స్థాయిలో పెరిగాయో చెప్పడానికి వీలు లేదు. నేను పేర్కొంటున్న ధరలు జాతీయ స్థాయి గణాంకాల నుంచి తీసుకున్నవి. ఇందులో మన రాష్ట్రానికి కొద్దిగా అటుఇటుగా తేడాలు ఉండవచ్చు. కాని పెరుగుదల మాత్రం సత్యం. నిత్యావసర వస్తువులు అందులో ముఖ్యంగా ఆహార వస్తువుల ధరలను పరిశీలిస్తే ఎంత తీవ్రంగా పెరిగాయో మనం అర్థం చేసుకోవచ్చు. 2014 సంవత్సరంలో కంది పప్పు 70 రూపాయలు ఉంటే 2025 వచ్చేసరికి 150 రూపాయలకు పెరిగింది. మినపపప్పు 64 నుంచి 123 రూపాయలు కూడా దాటింది. శెనగ పప్పు 47 రూపాయల నుంచి 88 రూపాయలు చేరుకున్నది. అట్లాగే ఉల్లిగడ్డ, టమాట, బంగాళా దుంపలు 50 శాతం నుంచి 60 శాతం వరకు పెరిగాయి. వంట నూనెల ధరలు 3 రెట్లు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరిగాయో ప్రత్యక్షంగా మనం రోజూ చూస్తూనే ఉన్నాం.

ఇది ప్రతి భారతీయుడిపై పడుతున్న భారం. అయితే ఇదే స్థాయిలో కార్మికుల, ఉద్యోగుల వేతనాలు పెరగలేదు. ఒక సాధారణ ఉద్యోగి ప్రైవేటు రంగంలో 2014 రూ. 20 వేలు జీతం పొందితే, నేడు ఆ ఉద్యోగి రూ. 30 వేలు మాత్రమే అందుకుంటున్నాడు. అంటే 50 శాతం మాత్రమే పెరుగుదల కనిపిస్తున్నది.ఇది ఉద్యోగ భద్రత కలిగిన కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇందులో 30 నుంచి 40 శాతం ఇంటి అద్దెలకే పోతాయి. ఇద్దరు పిల్లలుంటే ప్రతి నెల మరో 30 శాతం వాళ్ల చదువులకు చెల్లించాలి. మిగిలిన 40 శాతం డబ్బులో తన రోజువారీ ప్రయాణ ఖర్చులు, ఇంట్లో అవసరమైన వైద్యం, మందుల ఖర్చులు. ఇవన్నీ పోను ఇంటి నిత్యావసర వస్తువులను ఎట్లా కొనుగోలు చేస్తాడనేది పెద్ద ప్రశ్న. అందుకే నూటికి 60 నుంచి 70 శాతం మంది ప్రతి రోజు ఒక నరకంలో జీవిస్తున్నారు. డిగ్రీలు, పిజిలు చదివి ప్రైవేటు విద్యాలయాల్లో, కంపెనీల్లో పని చేస్తున్న వందలాది మంది ప్రతి నెల అప్పుల ఊబిలో ఇరుక్కుపోతున్నారు. కొంత మంది రెగ్యులర్ ఉద్యోగంతో పాటు, ఇతర చిన్నచితక ఉపాధిని వెతుకుంటున్నారు. స్విగ్గి, జొమాటో లాంటి సర్వీసులలో కూడా చేస్తున్నారు. రాపిడో ద్వారా బైకులు నడుపుకుంటున్నారు.

ఇవి కదా పార్లమెంటులో చర్చిచాల్సింది. దానికి కదా తమ సమయాన్ని వెచ్చించి పరిష్కారాలను ఆలోచించాల్సింది. దీనితో పాటు మరొక ముఖ్యమైన సమస్య నిరుద్యోగం. ఈ సమస్యకు పరిష్కారం చాలా అత్యవసరం. దేశంలోని కోట్లాది మంది నిరుద్యోగంతో సతమతమవుతున్నారు. మన హేతు విరుద్ధమైన చదువుల వల్ల ఇందులో చాలా మందికి వృత్తి నైపుణ్యం లేదు. రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక, యాంత్రిక పెరుగుదల వల్ల మనిషి పని నుంచి వేరు పడిపోతున్నాడు. దానితో కొద్ది మంది మాత్రమే వృత్తిలోకి అడుగు పెట్టగలుగుతున్నారు. ఇందులో ఇప్పటికే భూములు, వ్యాపారాలు, ఇతర వనరులు ఉన్న వర్గాలు, కులాలు చాలా సులువుగా ఆర్థికంగా నిలుదొక్కగలుగుతున్నారు.ఇది పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా తేడా ఉంది. గ్రామాల్లో మరింత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరిగింది. చిన్న, సన్నకారు రైతులు దివాలా తీస్తున్నారు. ఈ భూములన్నింటిని కంపెనీలు, కార్పొరేట్లు కొనుగోలు చేస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ భూములన్నీ కార్పొరేట్ వ్యవసాయానికి మారబోతున్నాయి. దీని వల్ల ఇప్పటికే నూటికి 60 శాతం మంది యువతీ యువకులు గ్రామాలను వదిలి పట్టణాలకు, నగరాలకు చేరుతున్నారు. దాని ఫలితంగా భారత దేశంలో పట్టణీకరణ, నగరీకరణ వేగం పుంజుకుంటున్నది.

పెరుగుతున్న నిరుద్యోగం మరిన్ని సమస్యలకు కారణమవుతున్నది. ముఖ్యంగా మత్తు పదార్థాలకు, గంజాయికి యువలోకం బానిసగా మారిపోతున్నది. గతంలో లాగా తమ శ్రమతో సంపాదించుకొని కలో గంజో తాగి ఆత్మగౌరవంతో బతికే తరం పోతున్నది. పూర్తిగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలతో పరాన్న జీవులుగా మారిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది.

ఇట్లా చాలా సమస్యలున్నాయి. మహిళలు, బాలికల మీద పెరుగుతున్న లైంగిక దాడులు గతంలో కన్న పెచ్చుమీరిపోయాయి. పట్టణాల్లో, నగరాల్లో ఇది అంతు అదుపు లేకుండా పోతున్నది. 75 సంవత్సరాలు రాజ్యాంగం అమలు తర్వాత ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఒక చెత్త కాగితం లాగా చూస్తున్నయి. తమ వాదనకు పనికి వచ్చే ఆర్టికల్స్‌ను, తమ ప్రయోజనాలను కాపాడే అంశాలను అమలు చేస్తూ ప్రజల్లో మత, ప్రాంత కుల పరమైన విభజనలు తీసుకొచ్చి ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్నారు. పేదల్లో అణగారిన వర్గాల్లో చీలికలను సృష్టించి, ప్రతిఘటన ఆలోచనలను, ఉద్యమాలను బలహీన పరుస్తున్నాయి.

ఇటీవల దళితుల, ఆదివాసుల మీద జరుగుతున్న దాడులు, అత్యాచారాలను పట్టించుకొని వాటిని నిరోధించడానికి చర్యలు లేవు. రిజర్వేషన్ల అంశాన్ని ఆధిపత్య కులాలను రెచ్చగొట్టడానికి వాడుకుంటున్నారు. అదే విధంగా ప్రతి అంశంలో ఒక కేంద్రీకృత వ్యవస్థలను తయారు చేస్తున్నారు. వ్యాపారాలను, వాణిజ్య అవకాశాలను తమ ప్రయోజనాలను కాపాడే వాళ్లకు ధారాదత్తం చేస్తున్నారు. దాని ఫలితంగా ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. జరిగే అవకాశాలు పెరిగాయి. ఇటీవల ఇండిగో విమాన కంపెనీ నిర్వాకం మనకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఏ రంగమైనా, ఏ వ్యాపారమైనా గుత్తాధిపత్యంలోకి వెళితే అది ప్రజల ప్రయోజనాలను మింగేస్తుందని తేలిపోయింది. అదే విధంగా మతం, కులం, ప్రాంతం అన్ని కూడా అదే ఫలితాలను అందిస్తాయి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 38 ప్రకారం, దేశంలోని వనరులు, సంపద అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు, ప్రజలకు సమ న్యాయం అందాలని సూచిస్తున్నది. కాని దీనికి భిన్నంగా ఈ రోజు దేశంలో సంపద ఒక దగ్గర కేంద్రీకృతమవుతున్నది. పేదలు లేరు, పేదరికం లేదు అని అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. కాని గ్రామాలు, బస్తీలు పరిశీలన జరిపితే ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారో మనకు అర్థం కాదు. అన్ని విషయాలను ఇక్కడ ఏకరువు పెట్టడం సాధ్యం కాదు. అన్ని విషయాలను ఇక్కడ ప్రస్తావించడం కూడా నా ఉద్దేశం కాదు. కాని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార బాధ్యత ప్రభుత్వాలదే. దానికి వేదిక పార్లమెంటు. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వాలు, శాసన సభలను, పార్లమెంటు వేదికను పరస్పర దూషణలకు, విమర్శలకు, ప్రతి విమర్శలకు కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం వెచ్చిస్తే మంచిది. 

మల్లేపల్లి లక్ష్మయ్య

ఇకపై ఎవరి భద్రత వారిదే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన సరికొత్త ‘జాతీయ భద్రతా వ్యూహం’ డాక్యుమెంట్‌పై ప్రపంచమంతటా చాలా ఆసక్తిని రేకెత్తించింది. ప్రత్యేకంగా యూరప్‌తో పాటు, అమెరికాకు సంప్రదాయికంగా సన్నిహితమైన ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, జపాన్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా వంటి సుదూర దేశాలలోనైతే పెద్ద కలకలాన్ని సృష్టించింది. అమెరికా మద్దతుపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న తైవాన్‌ను భయపెట్టింది. ఈ ప్రభావాలను గమనించి కూడా ట్రంప్ తన డాక్యుమెంట్‌లో చెప్పిన వైఖరిని మార్చుకోకపోగా, ఇతర దేశాల పరిస్థితి, భవిష్యత్తు ఏ విధంగా ఉన్నప్పటికీ, తమ భవిష్యత్తు కోసం ఈ కొత్త వైఖరి తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు.

ఇంతకూ ఆ డాక్యుమెంట్‌లో ఏమున్నది? దాని ప్రభావాలు ఈ విధంగా ఎందుకున్నాయి? అనే ప్రశ్నలను చర్చించే ముందు కొన్ని మౌలికమైన విషయాలను చెప్పుకోవాలి. అమెరికా, యూరప్, ఇతర దేశాలతో కూడిన పాశ్చాత్య కూటమి, నాటో సైనిక కూటమి పరిస్థితి ఒకప్పటి వలే లేదు. అవి ఆర్థికంగా, సైనికంగా, రాజకీయంగా సుమారు 2010 వరకు మొత్తం ప్రపంచంపై తమ ఆధిపత్యాన్ని సాగించాయి. ముఖ్యంగా 1991లో సోవియెట్ యూనియన్, దానితోపాటు వార్సా సైనిక కూటమి పతనంతో వారికి ఎదురు లేకుండా పోయింది. అది, అంతకు ముందటి ద్విధ్రువ (అమెరికా, సోవియెట్ యూనియన్ రెండు ధ్రువాలుగా) ప్రపంచానికి బదులు కేవలం అమెరికా నాయకత్వాన ఏక ధ్రువ ప్రపంచంగా పరిణమించిన కాలం. కాని సుమారు 2010 వచ్చే సరికి ఆ దశ మారటం మొదలైంది. వ్లాదిమిర్ పుతిన్ బలమైన నాయకత్వంతో రష్యా తిరిగి పుంజుకోవటం మొదలైంది. మరొక వైపు చైనా కొత్త శక్తిగా ఆవిర్భవించింది. ఆ విధంగా మరొక దశాబ్దం గడిచే నాటికి, రష్యా, చైనాలు ఆర్థికంగా, సైనికంగా కూడా అమెరికా కూటమికి సవాలుగా మారసాగాయి. అమెరికాకు గల బలాలలో శాస్త్ర సాంకేతిక రంగం కూడా ముఖ్యమైనది కాగా, రష్యా కాకపోయినా చైనా అత్యాధునికమైన పరిశోధనలు, ఆవిష్కరణలతో అమెరికాకు సాటిగా ఎదగటమే గాక, కొన్ని రంగాలలో అంతకుమించి పోయింది.

ఒకవైపు ఇది జరుగుతుండగా, మరొక వైపు ప్రపంచ వ్యాప్తంగా మరొక విధమైన పరిణామాలు చోటు చేసుకోసాగాయి. అవి బహుళ ధ్రువ ప్రపంచ ధోరణులు. ఇండియా, ఆసియాన్ కూటమి, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, నైజీరియా, కొన్ని అరబ్ దేశాల వంటివి స్వయంగా బలపడుతూ, ఏ కూటమితో నిమిత్తం లేకుండా, స్వతంత్రంగా నిలబడి తమ ప్రయోజనాల కోసం ప్రయత్నిచటం మొదలు పెట్టాయి. అమెరికా కూటమికి ప్రత్యామ్నాయంగా రష్యా, చైనాలు తమకు చేయూత అందిస్తుండటంతో వారి ధైర్యం మరింత పెరగసాగింది. దానితో, అమెరికా ఆదేశాలను గతంలో వలే శిరసావహించే దశ తప్పిపో సాగింది. ఇటువంటి కొత్త పరిస్థితుల మధ్య బహుళ ధ్రువ ప్రపంచం అనే మాట విస్తరించసాగింది. ఈ మార్పుల ఫలితమే బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ వంటివి. అదే పద్ధతిలో ఐక్యరాజ్య సమితిని, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి సంస్థలను అమెరికా నియంత్రణ నుంచి విముక్తం చేసి ఇతర దేశాలకు సమాన భాగస్వామ్యం, హక్కులు కల్పించాలనే వాదనలు పెరుగుతుండటం.

ఈ నేపథ్యాన్ని అంతా ఇంతగా వివరించటం ఎందుకంటే, ఈ పరిణామాలు సృష్టించుతున్న ఒత్తిడుల ప్రభావం వల్లనే అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు తమ జాతీయ భద్రతా వ్యూహాన్ని మార్చుకోక తప్పటం లేదు. అది ఇపుడీ డాక్యుమెంట్ రూపంలో ముందుకు వచ్చినా, వాస్తవానికి ఇంతకు ముందే అందుకు ఆరంభం ట్రంప్ ఇచ్చిన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) నినాద రూపంలో కనిపించింది. అందుకు ఈ డాక్యుమెంట్ కొనసాగింపని స్వయంగా ట్రంప్ బృందం చెప్తున్నదే. వారు బహిరంగంగా ఒప్పుకోని విషయం, పైన పేర్కొన్న పరిణామాల ఒత్తిడి. అసలు ఆ నినాదమే చెప్తున్నదేమిటి? అమెరికా ఒకప్పుడు ‘గొప్పగా ఉండేది. ఆ గొప్పతనాన్ని ఇపుడు కోల్పోయింది. ఆ స్థితిని ‘తిరిగి’ సాధించాలని. ఆ ‘గొప్పతనం’ అంటే ఏమిటి? దానిని కోల్పోవటం ఎందువల్ల జరిగింది? తిరిగి సాధించటం ఏ విధంగా? ఈ విషయాలను మాత్రం వారు దాపరికం లేకుండా వివరించరు. అమెరికా గొప్పతనం పోవటం ట్రంప్ ‘మాగా’ నినాదం ఇచ్చిన 2017 నాటికే మొదలైంది. అందుకు కారణాలు పైన పేర్కొన్నవే. ఆ కారణాలు 2017 కన్న ఇప్పటికి గత ఏడేళ్లలో మరింత తీవ్రమయ్యాయి. వర్తమాన పరిస్థితులను బట్టి చూడగా మునుముందు ఇట్లానే తీవ్రమవుతూ పోగలవని చెప్పటం కష్టం కాదు. ఈ అంచనాలు ఆందోళన కలిగించటం వల్లనే ట్రంప్ బృందం పై డాక్యుమెంట్‌ను రూపొందించిందనాలి.

మరి గొప్పతనాన్ని తిరిగి సాధించటం ఎట్లాగన్నది చివరి ప్రశ్న. ఆ వ్యూహాన్ని అమలు పరచటం ఈ డాక్యుమెంట్‌తో నిమిత్తం లేకుండానే ట్రంప్ ఈ రెండవ సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే అమలు పరుస్తున్నారు కూడా. ఇక యుద్ధాలు చేయకపోవటం, ఇతరుల యుద్ధాలు కూడా మాన్పించటం, బయటి వారిని పంపివేయటం, కొత్తవారిని రానివ్వకపోవటం, బయటి దేశాల పెట్టుబడులను, కంపెనీలను ఆకర్షించటం, బయటకు పోయిన అమెరికన్ కంపెనీలను తిరిగి రప్పించటం, పేద దేశాలకే గాక అమెరికన్ కూటమి దేశాలకు సైతం ఉచిత సహాయాలు ఆపటం, అక్కర లేదనుకునే ఉద్యోగాల రద్దు, అన్ని దేశాలపై విపరీతంగా సుంకాల పెంపు, తమ ఉత్పత్తులు కొని తీరాలని ఇతరులపై ఒత్తిడి వంటివన్నీ ఇందులోకి వస్తాయి. ఇటువంటి చర్యల వల్ల ట్రంప్ లక్షాలు నిజంగా నెరవేరుతాయా అనే దానిపై అమెరికన్ నిపుణులలోనే సందేహాలున్నాయి.

కనుక, చివరకు ఫలితాలు ఏ విధంగా ఉండవచ్చునో ఇంకా స్పష్టత లేకపోయినా, అదే ‘మాగా’ లో భాగంగా ఇప్పుడు ప్రకటించిన కొత్త డాక్యుమెంట్ నిజానికి స్వభావ రీత్యా కొత్తదేమీ కాదు. కాని అందులోని తీవ్రతలు, స్పష్టతలు కొత్తవి. ఇటువంటి తీవ్రతలే అమెరికా మిత్రులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉదాహరణకు ఆ డాక్యుమెంట్‌లోని కొన్ని అంశాలను చూద్దాం. ఉక్రెయిన్ యుద్ధం వల్ల అమెరికాకు ఆర్థిక, సైనిక భారాలే తప్ప ప్రయోజనం లేదనుకున్న ట్రంప్ దానిని ఆపే ప్రయత్నాలు మొదటి నుంచి చూస్తూ రాగా, అందుకు కలిసి రాని ఉక్రెయిన్, యూరప్‌లపై ఇప్పుడు తుది హెచ్చరికలనదగ్గవి జారీ చేస్తున్నారు. ముఖ్యంగా యూరప్ గురించి అయితే, అసలు వారి విధానాల కారణంగా యూరోపియన్ సంస్కృతి, వ్యక్తిత్వం, శక్తి ప్రపత్తులు, స్వాతంత్య్రం అన్నవే క్రమంగా అంతర్ధానమయ్యే పరిస్థితులున్నాయని హెచ్చరిస్తున్నారు. అవి నిలిచి ఉండడం కోసమంటూ అక్కడి తమ తరహా మితవాద పార్టీలను బాహాటంగా సమర్థిస్తున్నారు. అనగా తమ వలెనే అందరూ తక్కిన ప్రపంచంతో సంబంధాలను తగ్గించుకుని ఎవరికి వారుగా వ్యవహరించటమన్న మాట. ఇంత కాలం వలె మొత్తం యూరోపియన్ దేశాలన్నీ ఒక యూనియన్‌గా కొనసాగటం కూడా వృథా అన్నది ఈ డాక్యుమెంటు సూచన. దీనితో అక్కడి మితవాద పార్టీలలోనూ కొన్ని ఏకీభవించటం లేదన్నది, యూరప్‌కు సహజ సంప్రదాయమనుకునే ఉదారవాద ప్రజాస్వామిక విలువలను వదులుకోవటం వారికి ఇష్టం లేదన్నది వేరే విషయం. అయినా ఈ ప్రతిపాదనలు చేస్తున్న ట్రంప్ బృందం, ఇందుకు కొనసాగింపుగా, ఇకపై ఆయా దేశాల భద్రతను అవే చూసుకోవాలి తప్ప ఇంత కాలం వలే అమెరికాకు సంబంధం ఉండదని చెప్పటం వారిని తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తున్నది. ఇప్పటి వరకు సూచనప్రాయంగా చెప్తూ వచ్చిన ఈ మాట ఇప్పుడు డాక్యుమెంట్ రూపంలోకి వచ్చింది. ఆ మేరకు ఇంకా విధానాలనైతే రూపొందించలేదు గాని త్వరలో ఆ పని కూడా జరగవచ్చునన్నది అంచనా.

సరిగా ఇదే వైఖరి ఉక్రెయిన్ విషయంలోనూ కనిపిస్తున్నది. అందుకే పలు ప్రతిపాదనలతో ట్రంప్ ఇటీవల ఉక్రెయిన్‌తోపాటు యూరప్‌పైనా ఒత్తిడిని తీవ్రంగా పెంచారు. ఉక్రెయిన్ తన భూభాగాలను రష్యాకు వదులుకోవటంతోపాటు ఇతరత్రానూ రష్యా షరతులకు తలఒగ్గేట్లు చేయబూనుతున్నారాయన. ఇప్పటికే స్వయంగా ఆర్థికంగా, సైనికంగా బలహీనపడిన యూరప్‌కు దీనితో పాలుపోని పరిస్థితి ఎదురవుతున్నది. అదే సమయంలో మరొక స్థాయిలో ఆలోచించినప్పుడు, అమెరికాకు సంబంధించి గాని, యూరప్‌కు సంబంధించి గాని, కొంత కాలం నుంచి ఎదురవుతున్న ఈ పరిస్థితులన్నీ మౌలికంగా వారి ఉమ్మడి సామ్రాజ్యవాదం క్రమంగా బలహీనపడటం వల్ల ఎదురయ్యే ఒత్తిడుల ఫలితమే.

టంకశాల అశోక్

ఓట్లు కొనే అభ్యర్థులు వద్దే వద్దు

ఇటీవల కాలంలో ఎన్నికల్లో వస్తున్న మార్పులను పరిశీలిస్తే… నోటుతో ఓటు పొందడం నిలబడ్డ అభ్యర్థుల సంస్కృతిగా మారితే.. ఓటుతో నోటు పొందడం సామాన్య ప్రజల హక్కుగా మారిపోతుంది. దీంతో అభ్యర్థులు గెలిచిన తరువాత అధికారంతో అవినీతికి వైపు వెళ్తే, ఓటర్లు ప్రలోభాలకు గురై అంధకారంలోకి వెళ్తున్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చివరికి అభివృద్ధి కూడా శూన్యం అవుతుంది. నిజమైన ప్రజా సేవ చేసే నాయకులు ఎన్నికలకు దూరమవుతున్నారు. ఎన్నికల్లో విచ్చలవిడి డబ్బు, మద్యం ప్రవాహంతో గొప్పగా వర్ధిల్లుతున్న పల్లె సంస్కృతి విధ్వంసం అవుతుంది. స్వార్థ రాజకీ యాలతో ఈర్షా, ద్వేషం, పగ, ప్రతీకారాలు పెచ్చరిల్లుతున్నాయి. నేటికి గ్రామీణ ప్రజల పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అనారోగ్యం వంటి సమస్యలకు తీరలేదు. దీనికి ప్రధాన కారణం ఓటర్లు నీతి, నిజాయితీలతో ఓటు వేయకపోవడమే. మరోవైపు ప్రలోభ పెట్టే రాజకీయ నాయకులను తిరస్కరించకపోవడం కూడా. 

స్వాతంత్య్ర అనంతరం భారత దేశంలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా స్థానిక స్వపరిపాలన కోసం మూడంచెల ‘పంచాయతీ రాజ్ వ్యవస్థ’ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయి. మన దేశంలో గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక, సామాజిక అభివృద్ధిని ఆకాంక్షిస్తూ భారత ప్రభుత్వం 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికనుగుణంగా తెలంగాణ రాష్ట్రం వచ్చాక రెండవసారి పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. సార్వత్రిక వయోజన ఓటు హక్కును భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడికి కల్పించబడింది. ఇది కుల, జాతి, మత,లింగ, భాష వంటి భేదం లేకుండా కల్పించిన సార్వత్రిక సమానత్వ హక్కు. ‘ఒక ఓటు ఒక విలువ’ అనే సూత్రం ద్వారా ప్రజానిధులను ఎన్నుకునే అవకాశం రాజ్యాంగం సామాన్యులకే ఇచ్చింది. ఓటనే ఆయుధంతో ప్రజాస్వామ్య విప్లవానికి పునాది వేసిన వ్యక్తి అంబేద్కర్. అణచివేయబడిన వర్గాల గొంతుకకు ప్రాణం పోసి కుల, మత గోడలను బద్దలుగొట్టే ప్రయత్నం చేశారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఓటు హక్కు కోసం పోరాటాలు జరిగాయి. భారతదేశంలో మాత్రం అంబేద్కర్ ఒక్కరే పోరాటం చేశాడు. ముఖ్యంగా ఈ దేశంలో మనుషులుగానే గుర్తించని బిసి, ఎస్‌సి, ఎస్‌టి సమాజాన్ని ఓటుతో విలువ లభించింది. నేడు ఆ ఓటు ఒక సరుకుగా, ఎన్నికల వ్యవస్థ ఒక మార్కెట్ గా మారి ఒక ధనస్వామ్య వ్యవస్థకు దారితీయడం జరుగుతుంది. తద్వారా అభివృద్ధి, సంక్షేమం ముసుగులో దోపిడీ రాజ్యమేలుతుంది. అంబేద్కర్ ‘నేను నా దేశ ప్రజలకు ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇచ్చాను. అది కత్తి కంటే పదునైంది. దాని సాయంతోనే పోరాడి రాజవుతారో… అమ్ముకుని బానిసలవుతారో తేల్చుకోవాల్సింది వారే’ చెప్పారు. ప్రజలంతా భవిష్యత్ పునర్నిర్మాణానికి నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన సందర్భం ఇది.

ప్రలోభ పెట్టే నాయకుల్ని తిరస్కరిద్దాం

తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి దశ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు రెండవ, మూడవ దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో పోటీలో నిలబడిన అభ్యర్థులు ఓటర్లను విపరీతంగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. సామాన్యుల నుంచి బాగా చదువుకున్న విద్యావంతుల సైతం ప్రలోభాలకు గురికావడం ఆందోళన కలిగిస్తుంది. వివిధ కులాల దళారి నాయకులు తమ కులం ఓట్లు మీకేనని అభ్యర్థులకు చెబుతూ డబ్బులు వసూలు చేస్తూ కులాన్ని తాకట్టు పెడుతున్నారు. మరోవైపు దళారుల సహకారంతో అభ్యర్థులు నిత్యం మందు పార్టీలతో ఓటర్లను మత్తులో ముంచుతున్నారు. ఓటుకు వెయ్యి నుంచి ఐదు, పది వేలు పెట్టి ఓట్లు కొంటున్నారు. ఓటు ఒక వేలం పాటగా మారిపోయింది. అమాయక దళిత, బహుజనుల్ని ఓటు మార్కెట్‌లో బలి చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎన్నికల్లో వస్తున్న మార్పులను పరిశీలిస్తే… నోటుతో ఓటు పొందడం నిలబడ్డ అభ్యర్థుల సంస్కృతిగా మారితే.. ఓటుతో నోటు పొందడం సామాన్య ప్రజల హక్కుగా మారిపోతుంది. దీంతో అభ్యర్థులు గెలిచిన తరువాత అధికారంతో అవినీతికి వైపు వెళ్తే, ఓటర్లు ప్రలోభాలకు గురై అంధకారంలోకి వెళ్తున్నారు.

ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చివరికి అభివృద్ధి కూడా శూన్యం అవుతుంది. నిజమైన ప్రజా సేవ చేసే నాయకులు ఎన్నికలకు దూరమవుతున్నారు. ఎన్నికల్లో విచ్చలవిడి డబ్బు, మద్యం ప్రవాహంతో గొప్పగా వర్ధిల్లుతున్న పల్లె సంస్కృతి విధ్వంసం అవుతుంది. స్వార్థ రాజకీయాలతో ఈర్షా, ద్వేషం, పగ, ప్రతీకారాలు పెచ్చరిల్లుతున్నాయి. నేటికి గ్రామీణ ప్రజల పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అనారోగ్యం వంటి సమస్యలకు తీరలేదు. దీనికి ప్రధాన కారణం ఓటర్లు నీతి, నిజాయితీలతో ఓటు వేయకపోవడమే. మరోవైపు ప్రలోభ పెట్టే రాజకీయ నాయకులను తిరస్కరించకపోవడం కూడా. ప్రజల సంక్షేమం, అభివృద్ధి అనేది ప్రజలు ప్రతి వస్తువుపై కట్టే పన్నుల డబ్బుల ద్వారా జరుగుతుంది. ఇది ఏ పార్టీ, ఏ రాజకీయ నాయకులు సొమ్ము కాదు. దీన్ని ఓటర్లు గుర్తెరగాలి. ఎన్నికలు ప్రతీ ఐదేళ్లకోసారి వస్తుంటాయి. ఈ ఐదు సంవత్సరాల కాలానికి అభ్యర్థులిచ్చే డబ్బు, మందు రోజుకు ఒక రూపాయి విలువ కూడా కాదు. కావున ఓటర్లు యాచకులుగా మారవద్దు. మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టవద్దు. అసలు ప్రలోభ పెట్టే నాయకుడు ఎప్పటికీ ప్రజానేత కాదు. కావున మందు, డబ్బుతో ప్రలోభాలకు గురిచేసే నాయకులను తిరస్కరిద్దాం. ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగమై నిజాయితీగా ఓటేసి గ్రామాభివృద్ధికి పాటుపడదాం.

సంపతి రమేష్ మహారాజ్

79895 79428 

పైరసీ.. ఎందరికో ప్రేయసి

ఇమంది రవి అలియాస్ ఐబొమ్మరవి అరెస్ట్ కన్నా చాలా ముందు నుంచే సినిమా పైరసీ గురించిన విస్తృత చర్చ జరుగుతోంది. పైరసీ సీడీల రోజులనుంచీ ఆన్ లైన్ పైరసీ రోజుల్లోకి ప్రవేశించాం. పైరసీ నా ప్రేయసీ అనే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. పైరసీకి కారణం కూడా సినిమా పరిశ్రమే. సీడీల పైరసీ రోజుల్లో సింగిల్ స్క్రీన్స్ విస్తృతంగా ఉన్నాయి. జనాలు పైరసీ సీడీల వైపు పెద్దగా చూసేవాళ్లు కాదు. కారణం సీడీ కొంటే అది చూడడానికి పరికరాలు కావాలి. అందుకని కొద్దిమంది మాత్రమే వాటివైపు చూసేవారు. ఈ గోల కన్నా హాయిగా సినిమా హాలుకు పోయి సినిమా చూడడమే బెటర్ అనుకునేవారు జనం. ఆన్‌లైన్ పైరసీ వచ్చిన తర్వాత జస్ట్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ ప్రశాంతంగా చూసుకోవచ్చు అనే అభిప్రాయం కలిగాక సీడీల కన్నా ఇది జనామోదం పొందింది. కోవిడ్ తర్వాత రోజుల్లో సింగిల్ స్క్రీన్స్ మూసివేత వేగంగా పెరిగింది. అదే సమయంలో ఓటీటీ అనే సినిమా ప్లాట్ ఫామ్ మన జీవితాల్లోకి ప్రవేశించింది. లాక్ డౌన్ పుణ్యమా అని బాగా దగ్గరయ్యింది. సినిమా హాళ్లకు టీవీ అనే ప్లాట్ ఫామ్ ఇబ్బందికరం అనుకున్నాం ఒకప్పుడు.. నిజానికి ప్రైవేటు ఛానల్స్ మొదలయ్యాక చాలా ఊళ్లల్లో సినిమా హాళ్లు ముఖ్యం సింగిల్ స్క్రీన్స్ కళ్యాణ మండపాలుగా మారాయి. దాన్ని మించిన స్థాయిలో ఓటీటీ వచ్చాక సినిమా హాలు నిలబడడం కష్టసాధ్యంగా మారిపోయింది.

ఒకప్పుడు సినిమా మీద ఇన్‌కమ్ అంటే బుకింగులో అమ్ముడయ్యే టిక్కెట్ల నుంచి మాత్రమే వచ్చేది. ఇప్పుడు అలా కాదు రకరకాలుగా డబ్బులు వస్తున్నాయి. ఒకటి డిజిటల్ అమ్మకం. అంటే సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ దగ్గర నుంచీ జరిగే అన్ని ప్రీరిలీజ్ ఈవెంట్స్ ప్రసార హక్కులూ డిజిటల్ గానూ, శాటిలైట్ గానూ, ఓటీటీగానూ కూడా అమ్మేసుకుంటున్నారు. అక్కడ నుంచీ వ్యాపారం మొదలు. ఫైనల్ గా సినిమా తయారయ్యాక థియేట్రికల్ రైట్స్ అమ్ముతారు. ఓటీటీ హక్కులు అమ్ముతారు. శాటిలైట్ హక్కులు అమ్ముతారు. యుట్యూబ్ లాంటి ప్లాట్‌ఫామ్ లకు కూడా అమ్ముతారు. ఇప్పుడు థియేట్రికల్ రైట్స్ అనేది సినిమా వ్యాపారంలో ఓ భాగం మాత్రమే. పైరసీ వల్ల నష్టపోయేది ఈ థియేట్రికల్ హక్కుల కొనుగోలుదారులే. ఈ పైరసీ కంటెంట్ చూసేవాళ్లల్లో ప్రధాన వాటా ఎవరూ? అంటే సింగిల్ స్క్రీన్ ఆడియన్సే. నిజానికి ఈ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ వాళ్ల వినోద కేంద్రాలైన సింగిల్ స్క్రీన్స్ మాయం అయిపోయాక ఎక్కడకిపోవాలి? వెళ్తే మల్టీప్లెక్సులకు పోవాలి.

లేకపోతే ఓటీటీలకు పోవాలి. వీళ్లు ఆర్థిక స్తోమత సహకరించక మల్టీ ప్లెక్సులకు పోవడం లేదు. కారణం సినిమా టిక్కెట్ల రేట్లు కాదు. అక్కడ అమ్మే స్నాక్స్ రేట్లు. అవి జనాన్ని భయపెట్టేస్తున్నాయి. అలా భయపడిన సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఓటీటీలకు పోకుండా మధ్యలో ఐబొమ్మ వైపు ప్రయాణం అవుతున్నారు. జనాలు థియేటర్లకు రావడం లేదూ అని గగ్గోలు పెడతారు. వచ్చిన ప్రేక్షకులనేమో స్నాక్స్ రూపంలో దోచుకుంటారు. పాప్ కారన్, కూల్ డ్రింకు కలిపి ట్రే తీసుకుంటే పదిహేడు వందల వరకూ వసూలు చేస్తున్న పరిస్థితి. బైట లీటర్ మంచినీళ్ల సీసా ఇరవై రూపాయలైతే మల్టీ ప్లెక్సుల్లో అరలీటర్ అరవై రూపాయలు. ఇక్కడ అమ్మే నీళ్లు మల్టీప్లెక్స్ వారి బ్రాండే. బైట బ్రాండులు అయితే అలా అమ్మడానికి అవకాశం ఉండదు కనుక వారే అమ్ముతారు. పిల్లలతో సినిమాకు వెళ్లాలంటే మధ్య తరగతివారు బ్యాంకు లోనుకు పోవాల్సిన పరిస్థితి. దీంతో వారు సినిమా చూడాలంటే కుదిరితే ఓటీటీలో చూస్తున్నారు. లేకపోతే ఐ బొమ్మ వైపు కదులుతున్నారు. యుఎఫ్ వో క్యూబ్ లాంటి సినిమా వాహకాల సర్వర్లు హ్యాక్ చేయడం ద్వారా క్వాలిటీ సినిమాలు పైరసీదారుల చేతుల్లోకి వస్తున్నాయనేది చాలా మంది అభిప్రాయం. సరే పైరసీ ఎలా జరిగినా క్వాలిటీ కంటెంట్ సినిమా విడుదలైన ఓ రెండు గంటల్లో ఈ పైరసీ వెబ్ సైట్లలో దర్శనం ఇస్తోందనేది వాస్తవం. మల్టీప్లెక్సులకు వెళ్లలేని, ఓటీటీలకు వెళ్లాల్సిన మధ్య తరగతి దిగువ మధ్య తరగతి అంతకన్నా కింద ఉన్న ఇతర తరగతులు ఇవన్నీ కూడా పైరసీ కాంపౌండ్ లో చేరి సినిమా చూసేస్తున్నాయి.

సినిమా అద్దిరిపోయింది థియేటర్లో చూస్తే తప్ప కిక్కు రాదు లాంటి టాక్ వస్తే మాత్రమే మల్టీ ప్లెక్సులకు వెళ్లడానికి ఉత్సాహపడుతున్నారు. నిర్మాతలు అమ్ముకున్న ప్లాట్ ఫామ్స్ మీదే జనం సినిమా చూస్తే ఆ కొనుక్కున్నవాడికి డబ్బులు వస్తాయి. అలా కాక జనం ఇంకెక్కడో సినిమా చూస్తే మరి నిర్మాత దగ్గర హక్కులు కొనుక్కున్న వాళ్లకు నష్టం వస్తుంది. దీంతో నిర్మాతలు డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. అందుకని చేయాల్సినదేమిటి? ఒకటి మల్టీ ప్లెక్సులను కూడా ఆడియన్ ఫ్రెండ్లీగా మార్చడం. అలా మార్చలేని పరిస్థితిలో కమ్యూనిటీ థియేటర్లను ప్రమోట్ చేయడం. అం బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వాలు కట్టి ఇస్తున్న గృహసముదాయాల్లో కమ్యూనిటీ థియేటర్ల నిర్మాణం చేయవచ్చు. అలాగే అపార్ట్ మెంట్స్ లోనూ గేటెడ్ కమ్యూనిటీల్లోనూ కూడా ఏర్పాటు చేయవచ్చు. వాంబే కాలనీల్లాంటి బడుగు బలహీన వర్గాల కాలనీల్లో క్ట కమ్యూనిటీ థిటయేర్లలో సినిమా టిక్కెట్టు ధర యాభై రూపాయలుగా నిర్ణయించి మీ ఇంట్లో వండుకున్న వస్తువులే తెచ్చి ఇక్కడ కూర్చుని తింటూ సినిమా చూడండి అని చెప్పొచ్చు.

అలాగే అపార్ట్ మెంట్లలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ థియేటర్లలో టిక్కెట్ల ధర వంద నూటయాభై చేయవచ్చు. అక్కడ కూడా వారి వారి తినుబండారాలు వారే తెచ్చుకుని వచ్చి కూర్చుని తింటూసినిమా చూసి పోతారు. గేటెడ్ కమ్యూనిటీ లాంటి రిచ్ ఏరియాల్లో రెండు వందల వరకూ టిక్కెట్ రేట్లు పెట్టి అక్కడ కూడా ఎవరి తిండి వారే తెచ్చుకుని తినండి అనొచ్చు. అలా కొత్తసినిమా నేరుగా క్యూబ్ యుఎఫ్ ఓ ల ద్వారా ఆ కమ్యూనిటీ హాళ్లకు పంపిణీ చేస్తాం. ఒక రోజు రెండు రోజుల్లో అక్కడి జనం అంతా సినిమా చూసేస్తారు. డబ్బులు వచ్చేస్తాయి. ఇంత చేసినా జనం పైరసీ అం మాత్రం అప్పుడు కొరడా పట్టుకోవడమే మార్గం. పైరసీ సినిమా చూసేవాళ్లపై కేసులు పెడతాం డ్రంక్ అండ్ డ్రైవ్ లాగా అన్నారు మొన్న హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన్నార్. అలా కేసులు పెట్టుకోవచ్చు. ఈ ఏర్పాట్లు చేయకుండా అరెస్టులు చేస్తాం అం మాత్రం కుదరదు. టిక్కెట్ రేట్ లో కనీసం సగానికన్నా తక్కువే స్నాక్స్ రేట్లు ఉండాలి అనే నిబంధన తీసుకురాగలిగితే మంచిదే. ఏమి ఏమైనా థియేటర్లను ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చాలి. లేదా కమ్యూనిటీ థియేటర్ల నిర్మాణానికి కదలి ముందుకువెళ్లిపోవాలి. అది ఒక్క పైరసీని అడ్డుకునే మార్గం. 

– భరద్వాజ రంగావఝల

(సీనియర్ జర్నలిస్ట్)