Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Betpas

Betpas giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

trendbet giriş

meritking

meritking

trendbet giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking Giriş Güncel

Trendbet

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

vaycasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Betpas

Betpas giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

palacebet

palacebet

yakabet

casibom

meybet

online diyetisyen

vaycasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Trendbet

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Betpas

Betpas giriş

winxbet

casibom

bahislion

Marsbahis

meritking

betboo

vevobahis

holiganbet

holiganbet

slotbar

oslobet

meritking giriş

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinowon

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

vaycasino

Atlasbet Giriş

Wbahis

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

palacebet

bahislion

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

matbet

sekabet

sekabet

imajbet

marsbahis

Wbahis

grandpashabet

betpark

matbet

pusulabet giriş

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

padişahbet

betasus

berlinbet

casinoas

casibom

kingroyal

holiganbet

marsbahis

casibom

queenbet

padişahbet

padişahbet giriş

yakabet

casinolevant giriş

padişahbet

meritking

1xbet

padişahbet

galabet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

kralbet

milanobet

gallerbahis

galabet

royalbet

betkolik

betticket

enbet

suratbet

süratbet

betpas

dinamobet

artemisbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

madridbet

betasus

sekabet

marsbahis

vdcasino

grandpashabet

bahiscasino

casinoroyal

sekabet

jojobet

casibom

casibom giriş

casibom güncel giriş

joybet

kingroyal

yakabet

yakabet

betkolik

betkolik

wbahis

kingroyal

masterbetting

kingroyal

imajbet

sekabet

pusulabet

meritking

vdcasino

betlike

vdcasino

ultrabet

tlcasino

casibom

galabet

ultrabet

tarafbet

madridbet

tarafbet

casino siteleri

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

padişahbet giriş

padişahbet

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

మేఘమథనం.. ఢిల్లీ వ్యర్థ ప్రయత్నం

దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని పట్టిపీడిస్తున్న వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ బిజెపి ప్రభుత్వం చేపట్టిన మేఘమథనం (క్లౌడ్ సీడింగ్) అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. బుధవారం(29.10.25) ఉదయం ఐఐటి కాన్పూర్ సహకారంతో ఢిల్లీలోని బురారి, ఉత్తర కరోల్‌బాగ్, మయూర్ విహార్, బద్లి తదితరప్రాంతాల్లో క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించారు. కాన్పూర్ ఐఐటి నుంచి ప్రయోగ విమానం బయలుదేరి 6000 అడుగుల ఎత్తులో రసాయనాలు వెదజల్లినా ఫలితం దక్కలేదు. ఈ ప్రక్రియ పూర్తయి నాలుగు గంటలైనా వర్షాలు కురవలేదు. గత ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం 2023లో ఢిల్లీలో పొగమంచు సీజన్‌లో మేఘమథనం చేపట్టాలని ప్రయత్నించినా వాతావరణం అనుకూలించక విరమించుకుంది. 2024 లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఢిల్లీ వాయునాణ్యతను అత్యవసరంగా మెరుగుపర్చడానికి మేఘమథనం ఆచరణ సాధ్యం కాదని పార్లమెంట్‌కు వెల్లడించడం ఈ సందర్భంగా గమనార్హం.

లాహోర్, బ్యాంకాక్, కౌలాలంపూర్, బీజింగ్ తదితర ప్రపంచం లోని అనేక నగరాల్లో మేఘమథనం ప్రయోగాలు నిర్వహించినా అనుకున్న లక్షాలు సాధించలేక దీన్ని విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఎంతో వ్యయంతో ఈ ప్రయోగాన్ని చేపట్టడం వ్యర్థ ప్రయత్నమే తప్ప ఏమాత్రం ఉపయోగం జరగలేదు. ఆకాశంలో మేఘాలు దట్టంగా ఆవరించి ఉన్నప్పుడే మేఘమథనం పనిచేస్తుంది తప్ప స్వయం సహజ సిద్ధంగా వర్షాన్ని అందించదు. అందువల్ల పొడిగాలులు లేని శీతాకాలంలో కాకుండా వర్షాకాలం లోనే దీన్ని వినియోగిస్తారు. 2023 లో లాహోర్‌లో మేఘమథనం వల్ల కొద్దిసేపు కురిసిన వర్షం గాలి నాణ్యతను మెరుగుపర్చినా, కొన్ని గంటలకే పరిమితమైంది. ఆ తరువాత పరిస్థితి మళ్లీ మామూలే అయింది.ఈ కారణంగా ప్రపంచం లోని చాలా దేశాలు మేఘమథనాన్ని నమ్ముకోవడం లేదు. అత్యవసరంగా వాయు కాలుష్యాన్ని నియంత్రించవలసి వచ్చినా దీని గురించి ఆలోచించడం లేదు. ప్రభుత్వాలకు ఈ వాస్తవాలు తెలిసినవే.

బిజెపి ప్రభుత్వానికి కూడా ఈ సంగతి తెలిసినా ఎందుకు మేఘమథనం చేపట్టిందో అర్థంకావడం లేదు. శీతాకాలంలో మేఘాలు చాలావరకు పశ్చిమ వైపు అలజడులనుంచి ఉత్తరాదికి వ్యాపిస్తుంటాయి. అవి స్వల్పకాలమే ఉన్నా అప్పటికే సహజంగా వర్షాలను తీసుకొస్తాయి. అందువల్ల మేఘమథనం అవసరం ఉండదు. ఎయిర్‌క్రాఫ్ట్ పరిమితుల బట్టి 5 6 కి.మీ మించి ఎక్కువ ఎత్తులో ఉన్న మేఘాలు మేఘమథనానికి వీలుపడవు. మేఘమథనం సరిగ్గా, సమర్థవంతంగా జరగాలంటే ఆకాశం దట్టమైన మేఘాలతో, అనుకూల వాతావరణంతో ఉండాలి. ఢిల్లీలో శీతాకాలం నాడు అలాంటి వాతావరణం కనిపించదు. వర్షం జల్లులు కురియడానికి సిద్ధంగా ఉన్నా అవి నేలపై రాలడానికి ముందే మేఘాల కింద ఉన్న పొడిగాలి వాటిని ఆవిరిగా దహించేస్తుంది. మరో ముఖ్యమైన విషయం మేఘమథనానికి ఉపయోగించే రసాయనాల సామర్థం విషయంలో ఆందోళన నెలకొంటోంది. ఊహించని పర్యవసానాలు ఎదురవుతున్నాయి. సూక్ష్మం గా చెప్పాలంటే అవి ఏమాత్రం పనిచేయవు. ఈ విధంగా నిరాశపరిచే ఈ ప్రయోగం కోసం ఢిల్లీ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోంది? దీనికి సమాధానం ఢిల్లీ ప్రభుత్వ బిజెపి వర్గాల్లోనే ఉంది.

గత ఆప్ ప్రభుత్వం 2023లో చేయలేకపోయిందని, ఇప్పుడు తాము చేసి చూపిస్తామని బిజెపి ప్రభుత్వం పంతం పెట్టుకుంది. ఇది సైన్స్ గురించి తగిన పరిజ్ఞానం లేక, రాజకీయంగా సాధించాలన్న ఆలోచన తప్ప మరేం కాదని తెలుస్తోంది. ఐఐటి కాన్పూర్ ఇందులోకి తనకు తాను ప్రవేశించి అన్నివర్గాలను ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తోంది. భారత్ మొట్టమొదట 1950 లో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెయిటొరాలజీ నేతృత్వంలో పశ్చిమ కనుమల్లో మేఘమథనం జరిగింది. థాయ్‌లాండ్‌లో కృత్రిమ వర్షపాతం సృష్టించేందుకు డిపార్టుమెంట్ ఆఫ్ రాయల్ రెయిన్ మేకింగ్, అండ్ అగ్రికల్చరల్ ఏవియేషన్ అనే ప్రత్యేక విభాగమే ఉంది. ప్రపంచం లో చైనా, అమెరికా దేశాలు భారీ ఎత్తున వాతావరణ మార్పు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా వర్షాకాలంలో దుర్భిక్ష నివారణకోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. కానీ వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించే మార్గాల్లో మేఘమథనం కూడా ఒకటిగా అనుసరిస్తున్నారు. ఢిల్లీలోని వాయు కాలుష్యాన్ని, అలాగే యమునా నదీ జల కాలుష్యాన్ని శ్రీఘ్రగతిలో పరిష్కరిస్తామని బిజెపి గత కొన్నేళ్లుగా వాగ్దానాలు చేస్తోంది. యమునా నదీ కాలుష్యంపై ఆప్ ప్రభుత్వ కాలంలో ఎన్నో వివాదాలు, సవాళ్లు చెలరేగిన సంగతి తెలిసిందే.

పర్యావరణ సమస్యల పరిష్కారానికి దగ్గరి మార్గాలంటూ ఏవీ లేవు. ప్రపంచంలో ఎక్కడైనా, క్రమబద్ధమైన, శాస్త్రీయ, వైజ్ఞానిక, సాంకేతిక, పద్ధతులు, పాలకవర్గాల జవాబుదారీతనం, దీర్ఘకాలిక ప్రణాళికల అమలు వంటి చర్యలతోనే పర్యావరణ పురోగతి ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ విస్మరించి కేవలం రాజకీయ ప్రాబల్యంతో వాస్తవాలను పక్కనపెట్టి అప్పటికప్పుడు నిర్ణయాలతో ఏదీ సాధ్యం కాదు. ఈ పాఠాన్ని ఢిల్లీ బిజెపి ప్రభుత్వం వంట పట్టించుకోవడం తప్పనిసరి. ప్రయోగాలు, ఆవిష్కరణలకు వాటి స్థానం వాటికి ఉంటుంది తప్ప ఆవిష్కరణలు, రాజకీయ సిద్ధాంత భావజాలాన్ని భర్తీ చేయలేవు. మనం పటిష్టమైన మౌలిక సదుపాయాలను, వ్యవస్థలను ముందుచూపుతో నిర్మించుకోలేకుంటే ఆకాశం, ప్రకృతి వనరులు, నదులు, పర్వతాలు ఇవన్నీ కలుషితమవుతూనే ఉంటూ మనం మాత్రం పురోగతి అనే భ్రమలో చిక్కుకుపోతుంటాం.

మిము మరువదు ఈ దేశం

వర్తమాన రాజకీయాలు గత చరిత్ర చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. గతం లేనిదే వర్తమానం నడవదని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం ఏముంటుంది? గొప్ప వ్యక్తులు ఏ రాజకీయ పక్షానికి చెందిన వారైనప్పటికీ, వారిని గౌరవించడం మన కనీస ధర్మం. ఒకే రాజకీయ పక్షానికి చెందిన ఇరువురు రాజకీయ ఉద్దండులను దేశ పాలక, ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారు తమకు సంబంధించిన వ్యక్తులుగా భావించడం విశేషం. ఇది ఆ వ్యక్తుల విశిష్టతను చాటి చెబుతున్నది. మరణించిన మహా నాయకులను స్మరిస్తూనే వారి చరిత్రను మాత్రం జాతికి చెందిన మహోన్నత సంపదగా భావించలేకపోవడం కేవలం రాజకీయాంశంగానే పరిగణించాలి. స్వర్గీయ ఇందిరా గాంధీ, సర్దార్ పటేల్‌లు భారత దేశానికి అందించిన సేవలు నిరుపమానం. స్వర్గీయ ఇందిరా గాంధీ దేశానికి మహిళా ప్రధానమంత్రి గా పని చేసి, విశేష ఖ్యాతినార్జించారు. దేశం గర్వించదగిన ఎంతోమంది భరత భూమిపై జన్మించారు. ఒక్కొక్కరు ఒక్కో రంగంలో విశేషమైన ప్రతిభ కనబరిచి, చరిత్రలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఏ రంగంలోనైనా రాణించాలంటే ఆయా రంగాల్లో కనబరిచే ప్రతిభతో కూడిన విశేషమైన కృషి, పట్టుదల మాత్రమే పేరు ప్రఖ్యాతులకు సంపాదించి పెడుతుంది. భారతదేశంలో ఒకప్పుడు మహిళలు సాంప్రదాయాల ముసుగులో కేవలం ఇంటికి మాత్రమే పరిమితమై, బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు దూరంగా బతుకీడ్చేవారు. అలాంటి పరిస్థితుల్లో కూడా తమదైన శైలిని ప్రదర్శించి ఎన్నో అడ్డంకులను అధిగమించి, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థికరంగా ల్లో రాణించి, దేశ ఖ్యాతిని నలుచెరగులా విస్తరింపచేసారు. అలాంటి కోవకు చెందిన వారిలో ఇందిరా గాంధీ స్థానం ప్రత్యేకమైనది.

తండ్రి జవహర్ లాల్ నెహ్రూ రాజకీయ వారసత్వం ఇందిరా గాంధీ రాజకీయ ప్రవేశానికి కారణం కావచ్చునేమో కాని, రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి కేవలం ఆమె ప్రతిభా సామర్ధ్యాలే ప్రధాన భూమిక పోషించాయి. పరిపాలనలో ఆమె చూపిన తెగువ, దేశ సమగ్రత పట్ల ఆమె చిత్తశుద్ధి అత్యంత ప్రశంసనార్హం. నాటి రాజకీయాల్లో అనేక మంది ఉద్దండుల మధ్య, తలలు పండిన రాజనీతిజ్ఞుల మధ్య నిలబడి, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ప్రధానిగా సుదీర్ఘకాలం పని చేయడం సాధారణమైన విషయం కాదు. అసాధారణ ప్రజ్ఞతో, అనన్య సామాన్యమైన కృషితో, అతిరథ, మహారథులను నిలువరించి, భారత రాజకీయ యవనికపై కీలక పాత్ర పోషించి, నెహ్రూ తర్వాత అత్యధిక కాలం భారత దేశానికి ప్రధానిగా పని చేసి, దేశానికి మూడో ప్రధానిగా, మొదటి మహిళా ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టి అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి, ధైర్యసాహసాలకు మారు పేరుగా నిలిచి, జనం గుండెల్లో స్థానం సంపాదించిన ఇందిరా గాంధీ రాజకీయ చరిత్రను ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి. అలహాబాద్‌లో పుట్టి, హస్తినకు ఏలికై, చిన్నతనంలోనే స్వాతంత్య్ర సంగ్రామంలోకి అడుగుపెట్టి, జైలులో నుండి నెహ్రూ పంపే ఉత్తరాల ద్వారా రాజకీయ ఓనమాలు దిద్దుకుని, దాదాపు 16 సంవత్సరాల పాటు భారత దేశ ప్రధానిగా దేశ ఔన్నత్యానికి, దేశ సమైక్యతకు పాటుబడి, ఒకానొక సమయంలో ఇండియా అంటే ఇందిర, ఇందిర అంటే ఇండియా అనే విధంగా జనహృదయాల్లో చోటు సంపాదించుకుని, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ధీర వనిత ‘ఇందిరా గాంధీ’. రాజకీయాలను సమగ్రంగా వంట బట్టించుకుని, మహామహులనుకున్న వారిని రాజకీయంగా మట్టిగరిపించి, తన శక్తిసామర్థ్యాలతో, ధైర్యసాహసాలతో భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింప చేసిన ధీర వనిత ఇందిర. లాల్ బహదూర్ శాస్త్రి హఠాన్మరణం తర్వాత ప్రధాన మంత్రి పదవి కోసం జరిగిన పోటీలో విజయం ఇందిరాగాంధీనే వరించింది. ఇందిర మంత్రి వర్గంలో మొరార్జీ దేశాయ్ ఉపప్రధానిగా పని చేసారు.

కేవలం ధనిక వర్గాలకు మాత్రమే పరిమితమైన బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా సన్న, చిన్నకారు రైతుల మన్ననలు పొందడమే కాకుండా, సామాన్యులకు సైతం బ్యాంకు సేవలు అందుబాటులోకి రావడానికి ఇందిర చూపిన చొరవ ప్రశంసనీయం. భారత స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయవాది, దేశఐక్యతకు అహరహం శ్రమించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. దేశ మొదటి హోం మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన పోషించిన పాత్ర అమోఘం. పటేల్ చూపిన తెగువ వలన భారతదేశం సమైక్యంగా నిలబడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారతదేశంలో 565 సంస్థానాలుండగా హైదరాబాద్, జునాగఢ్, కశ్మీర్లు మినహా మిగిలినవి ఇండియన్ యూనియన్‌లో విలీనం కాబడ్డాయి. నైజాం నవాబు అనుమానాస్పద వైఖరి, రజాకార్ల దుశ్చర్యల వల్ల హైదరాబాద్ పాకిస్తాన్ వశమౌతుందని శంకించి పటేల్ సైనిక చర్య చేపట్టాడు. స్వల్ఫకాలం మాత్రమే పదవిలో ఉన్నా, భారతదేశ సమైక్యతకు ఆయన చేసిన కృషి అమోఘం. సర్దార్ పటేల్ జాతీయ వాదానికి, దేశభక్తికి, దేశఐక్యతకు చేసిన కృషికి గుర్తింపుగా ఆ ఉక్కు మనిషి జన్మదినోత్సవమైన అక్టోబర్ 31 వ తేదీని జాతీయ సమైక్యతా దినోత్సవం(రాష్ట్రీయ ఎక్తా దివస్)గా భారత ప్రభుత్వం ప్రకటించింది. మరణానంతరం కేంద్ర ప్రభుత్వం సర్దార్‌ను భారతరత్న బిరుదుతో సత్కరించింది. ఇందిరాగాంధీ, పటేల్ లాంటి సమర్థులకు జన్మనిచ్చిన భారత ధాత్రి చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడి శాశ్వతంగా వెలుగొందుతుంది.  

సుంకవల్లి సత్తిరాజు

9704903463

బీహార్ పాఠాలు ఇసి నేర్చుకుందా?

బీహార్ తరువాత, ఎన్నికల కమిషన్ 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో నవంబర్ 4 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)ను చేపట్టడానికి సిద్ధమైంది. ఈ ఎక్సర్‌సైజులో ఎన్నికలు త్వరలో జరగనున్న తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి కూడా ఉంది. ఈ సంవత్సరం తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అసోంను ఇప్పుడు విస్మరించడం పెద్ద లోపం.ఈ జాబితాలో ఉన్న ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపం, చత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. గతంలో ఆఖరి సారిగా 2002 2004 లోనే ఓటర్ల సర్వే జరగడంతో ఇప్పుడు ఈ ప్రక్రియను చేపట్టారు. ఇదివరకటి ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లు అంతా ఇప్పటి జాబితాలో కూడా సాధ్యమైనంత వరకు ఉండేలా ఎన్నికల కమిషన్ అధికారులు ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేస్తారని చెబుతున్నారు. జాబితాలో ఎవరి పేర్లయినా గల్లంతయితే ఆధార్‌తో సహా సూచించిన 12 ధ్రువీకరణ డాక్యుమెంట్లలో దేని ద్వారానైనా తిరిగి జాబితాలో నమోదు చేయించుకోవచ్చని ఎన్నికల కమిషన్ సూచిస్తోంది.

ఈ సర్వేకు సంబంధించిన మొదటి జాబితా నమూనా డిసెంబర్ 9న, తుది జాబితా ఫిబ్రవరి 7న ఎన్నికల కమిషన్ వెలువరిస్తుంది. అప్పటికీ బాధిత ఓటర్లు ఎవరైనా ఉంటే జిల్లా మెజిస్ట్రేట్‌లకు, రాష్ట్రాల ఎన్నికల ముఖ్య అధికారులకు అప్పీలు చేసుకోవచ్చు. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న రెండోదశ ప్రక్రియ ఇది. మొదటిదశ బీహార్‌లో పూర్తయింది. బీహార్‌లో అనుభవమైన పాఠాల బట్టి తాము విధానాలను సవరించుకున్నామని ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఓటర్ల జాబితా తయారీ అన్నది సమ్మిళిత ప్రక్రియగా ఉండాలి తప్ప ఓటర్లను మినహాయించేలా ఉండకూడదని సుప్రీం కోర్టు సూచించిన సూచనలను ఈసారి ఎన్నికల కమిషన్ ఎంతవరకు పాటిస్తుందో చూడాలి. బీహార్‌లో తరచుగా ఇతర ప్రాంతాలకు వలసలు, మృతి చెందిన ఓటర్లు, ఇతర తప్పుడు సమాచారం, ఇవన్నీ ఓటర్ల జాబితాల్లో గజిబిజిని సృష్టించినా, ఎన్నో లోపాలు ఉన్నాయని ముఖ్యంగా కాంగ్రెస్‌తో సహా విపక్షాలు ఎత్తి చూపినా, వాటిని సరిదిద్ది జాబితాలను సంసిద్ధం చేయడం తమ విజయంగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. బీహార్‌లోని అనుభవం చెప్పిందేమంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఓటర్లు తమ హక్కును కోల్పోయే రిస్కును తెచ్చిపెట్టిందని స్పష్టమైంది.

అక్కడ చాలా తక్కువ వ్యవధిలో ఓటర్ల జాబితా సవరణ చేపట్టారు. ఒక నెల వివరాల సేకరణకు, మరో నెల అభ్యంతరాలు, వివాదాల స్వీకరణకు వినియోగించారు. ఇప్పుడు వచ్చిన చెప్పుకోదగిన మార్పు అభ్యంతరాలు విచారించడానికి, పరిశీలించడానికి దాదాపు 54 రోజులు అధికారికంగా గడువు ఇవ్వడం. బీహార్‌లో ఆదరాబాదరాగా జాబితాల సవరణ చేపట్టడం తుది జాబితాలో గణాంక క్రమ రాహిత్యాలను బయటపెట్టింది. సవరణ చేపట్టక ముందు లింగ నిష్పత్తి ప్రతి వెయ్యిమంది పురుషులకు 907 మంది మహిళలు ఉండగా, సవరణ చేపట్టిన తరువాత 892 మంది మహిళలుగా సంఖ్య పడిపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పురుషులు కన్నా మహిళలే ఓటింగ్‌లో పాలొన్నారు. కానీ ముఖ్యంగా 18 నుంచి 29 ఏళ్ల వయసు గ్రూపు వారు ‘పెర్మనెంట్లీ షిఫ్టెడ్’ కేటగిరి కింద మహిళా ఓటర్లు విచక్షణా రహితంగా జాబితాల నుంచి తొలగింపబడటం గమనార్హం.

తక్కువ రిజిస్ట్రేషన్‌తో పోలిస్తే అధిక మహిళా ఓటింగ్ సాధారణంగా పురుషుల వలసలను సూచిస్తుంది. సాధారణ నివాసులను తొలగించలేదని వలసవాదులను మాత్రమే తొలగించాలన్నదే తమ టార్గెట్ అని ఎన్నికల కమిషన్ చెబుతున్నప్పటికీ ఎక్కువ శాతం మహిళలు తొలగింపబడ్డారు. ఈ క్రమరాహిత్యాలు ఎన్నికల కమిషన్ విధానపరమైన చట్రంలో రూపొందినట్టు కనిపిస్తున్నాయి. ధ్రువీకరణ ప్రాథమిక బాధ్యత బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లు కాకుండా పౌరులు, పార్టీ ప్రతినిధులు అనవసరంగా భరించవలసి వచ్చింది. రాజకీయ పోటీగురించి ఎక్కువ ఆందోళన చెందుతున్న పార్టీల సభ్యులు అర్హత ఉన్న ఓటర్లందరినీ జాబితాలో చేర్చడం సమస్యాత్మకమే అని నిర్ధారించడం గమనార్హం. జాబితాలో గల్లంతయిన ఓటర్లు ఎవరైనా బూత్‌లెవెల్ ఏజెంట్ల ద్వారా నమోదు చేయించుకోవచ్చు. కానీ ఈ క్రమ రాహిత్యాలకు ఎన్నికల కమిషన్ స్పందించిన తీరు సరిగ్గా ఉండడం లేదు. సుప్రీం కోర్టు జోక్యం తరువాత ఎన్నికల కమిషన్ ఓటర్ల తొలగింపులో కారణాలను వివరిస్తూ సవరణలకు పూనుకుంది. సవరించిన నమూనా ఇప్పుడు విస్తృతంగా ప్రతిబింబించబడుతోంది.

బూత్ స్థాయి అధికారులు ఇప్పుడు మూడు సార్లు ఇంటింటా పరిశీలించాలని ఎన్నికల కమిషన్ నిబంధన విధించడం స్వాగతించదగింది. అయితే తాత్కాలిక వలసవాదులు చట్టప్రకారం సాధారణ నివాసిగా ఉన్నప్పటికీ ఇంటింటా సర్వే చేసే సమయంలో ఎవరైతే గైరుహాజరవుతారో వారికి ఓటరు జాబితాలో చోటు లేకుండా పోయే వీలుంటుంది. అయితే ఈ పరిస్థితిని నివారించడానికి అలాంటి ఓటర్లు ఆన్‌లైన్‌నలో ఎన్యూమరేషన్ ఫారంను నింపే వీలు కల్పించినట్టు ఎన్నికల కమిషన్ సూచిస్తున్నా అది సరిపోదు. ఈ నిబంధన డిజిటల్ అంతరాన్ని, అక్షరాస్యత సవాళ్లను విస్మరిస్తోంది. ఎన్యూమరేషన్ సమయంలో బూత్‌స్థాయి అధికారులకు సహకరించేందుకు ప్రత్యక్షంగా హాజరు కాని ఓటర్లపై అనవసర భారాన్ని మోపుతోంది. ఈ కసరత్తు భారత దేశ ఎన్నికల ప్రజాస్వామ్య సమగ్రతను ప్రభావితం చేసేలా పౌర సమాజంపైన, మీడియాపైన, పార్టీలపైన తీవ్రమైన నిఘా పాత్రను స్వీకరించే బాధ్యతను ప్రస్ఫుటం చేస్తోంది.

బీహార్ రాజకీయాల్లో కొత్తనీరు

1970వ దశకంలో మార్పు కోసం లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ దేశంలోని యువతలో ఓ నూతన భావావేశం రగల్చడంతో జాతీయ రాజకీయాలే పూర్తిగా మారిపోయాయి. అప్పటి వరకు జాతీయ రాజకీయాలపై ఆధిపత్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ క్రమంగా కుంచించుకు పోతూ రావడమే కాకుండా, మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం కేంద్రంలోనే కాకుండా అనేక పెద్ద రాష్ట్రాలలో కూడా ఏర్పడుతూ వచ్చింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలలో నూతన నాయకత్వంను కూడా బీహార్‌లో ప్రారంభమైన యువత ఉద్యమం కారణమైంది. అయితే, అప్పటి నుండి బీహార్ రాజకీయాలు మాత్రం, ముఖ్యంగా గత 35 ఏళ్లుగా కేవలం ఇద్దరు నాయకుల చుట్టూ పరిమితం అవుతూ వస్తున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్‌లలో ఎవ్వరో ఒకరు లేకుండా అక్కడ ఎవ్వరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా 20 ఏళ్లుగా ఎన్నికల్లో ఎవ్వరు గెలుపొందినా ప్రభుత్వం ఏర్పాటు చేసేది మాత్రం నితీశ్ అన్న విధంగా బీహార్ రాజకీయాలు మారుతూ వచ్చాయి.

ఇప్పుడు మొదటిసారిగా బీహార్ రాజకీయ మార్పు వైపు ప్రయాణిస్తున్నట్లు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సరళి వెల్లడిస్తున్నది. లాలూ ప్రసాద్ ఇప్పటికే ఎన్నికల రాజకీయాలకు దూరం అయ్యారు. ఇక నితీశ్ కుమార్‌కు సైతం దాదాపుగా ఇవే చివరి ఎన్నికలు అయ్యే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా ఆయనలో భరోసా కనిపించడం లేదు. ‘జంగిల్ రాజ్’ గా ముద్రపడిన లాలూ ప్రసాద్ కుటుంబం నుండి బీహార్‌కు విముక్తి కలిగిస్తాననే నినాదంతో 2005 లో అధికారంలోకి వచ్చిన ఆయన శాంతిభద్రతలు, మహిళలకు రక్షణ, నేరస్థులను కట్టడిచేయడం, ప్రాథమిక విద్య, ఆరోగ్యం వంటి సదుపాయాలు కల్పించడంలో పేరొందారు. బహుశా దేశం మొత్తం మీద మహిళా ఓటర్ల మద్దతుతో సుదీర్ఘకాలం రాజకీయాలలో నెట్టుకు వచ్చిన నేత ఆయనే అని చెప్పవచ్చు. 2020 బీహార్ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఎన్‌డిఎ కేవలం .03% ఓట్ల తేడాతో మహాఘట్‌బంధన్‌ను ఓడించింది. గత ఏడాది లోక్‌సభ ఎన్నికలు సైతం ఎన్‌డిఎకు సంతృప్తికరంగా లేవు. అందుకనే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తి పెరుగుతుంది. ఈ కారణంతోనే గతంలో మాదిరిగా నితీశ్ కుమార్‌ను పక్కకు నెట్టే సాహసం బిజెపి చేయలేకపోతుంది. గతంలో ఎల్‌కె అద్వానీ హయాంలో రామ్ విలాస్ పాశ్వాన్‌ను, మోడీ హయాంలో చిరాగ్ పాశ్వాన్‌ను ప్రయోగించి నితీశ్‌ను కట్టడి చేసే విఫల ప్రయత్నం చేశారు.

మొదటిసారిగా బీహార్ లో ఆధిపత్యం కోసం యువ నాయకత్వం పోటీపడుతున్నది. తేజస్వి యాదవ్, చిరాగ్ పాశ్వాన్, ముఖేష్ సహాని లేదా ప్రశాంత్ కిషోర్ వంటి వారు బీహార్ రాజకీయాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తేజస్వి యాదవ్‌ను ఇండియా కూటమి తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. మరోవంక, ముఖేష్ సహానీని ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి ప్రకటించారు. బీహార్ రాజకీయాలలో తమకంటూ ప్రజాకర్షణ కలిగిన నాయకుడు లేని బిజెపి చిరాగ్ పాశ్వాన్‌ను ప్రోత్సహిస్తున్నది. ఒక దశలో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలిచే ప్రయత్నం చేశారు. అతని బలానికి మించి 29 సీట్లు అతని పార్టీకి కేటాయించింది. ఇక మొన్నటి వరకు ఎన్నికల వ్యూహకర్తగా పలు పార్టీలకు సేవలు అందించిన ప్రశాంత్ కిషోర్ తానే స్వయంగా ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. రెండేళ్లపాటు పాదయాత్ర ద్వారా ప్రజలలో బలమైన ముద్ర వేయించుకొనే ప్రయత్నం చేశారు. తన పార్టీ గెలిస్తే 150 సీట్లు, లేకపోతే 10 లోపు సీట్లు మాత్రమే పొందుతుందంటూ ‘గాలివాటం’పైన ఆధారపడుతున్నట్లు చెప్పకనే చెప్పారు.

ఒక విధంగా ఎన్నికలకు రెండు నెలల ముందు రాహుల్ గాంధీ నేతృత్వంలో చేపట్టిన ‘ఓటరు అధికార్ యాత్ర’కు విశేషమైన స్పందన లభించింది. నితీశ్ కుమార్ ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్టు, ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు సంకేతాలు లభించాయి. కాంగ్రెస్ తన ఇండియా కూటమి భాగస్వాములతో కలిసి మద్దతును ఏకీకృతం చేయాలని లక్ష్యంగా చేపట్టిన ఈ యాత్రలో తేజస్వి యాదవ్, అఖిలేశ్ యాదవ్, ఎంకె స్టాలిన్ లతో సహా కూటమికి చెందిన అగ్ర నాయకులందరూ పాల్గొన్నారు. అయితే, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా ఆ తర్వాత రెండు నెలలపాటు రాహుల్ గాంధీ బీహార్ వైపు చూడలేదు. మరోవంక, సీట్ల సర్దుబాటులో ప్రతిపక్ష కూటమి చతికలపడింది. అధికారికంగా సీట్ల సర్దుబాట్ల గురించి ప్రకటించలేకపోయారు. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ను ప్రకటించడం ద్వారా ఎన్‌డిఎ కూటమిని ఆత్మరక్షణలో పడవేశారు. చిరాగ్ పాశ్వాన్‌ను ప్రోత్సహించడం ద్వారా నితీశ్ కుమార్ ను ఎన్నికల అనంతరం వదిలివేసి, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు వైపు బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం కూడా ఎన్నికలకు నితీశ్ కుమార్ నేతృత్వంలో వెడుతున్నామని చెబుతూనే ఎన్నికల అనంతరం ఎన్‌డిఎ ఎంఎల్‌ఎలు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అయితే తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపక్ష కూటమి ప్రకటించగానే ఆత్మరక్షణలో పడిన బిజెపి సైతం నితీశ్‌ను కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పక తప్పలేదు. ఆ మరుసటి రోజే బీహార్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయమై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదేమైనా, నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగడం బిజెపి శ్రేణులలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. తమ పార్టీ నాయకుడే ముఖ్యమంత్రి కావాలనే పట్టుదల వారిలో ఉంది. అదే విధంగా జెడియు శ్రేణులలో సైతం బిజెపి పట్ల సానుకూలత కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయా పార్టీల మధ్య ఓట్ల మార్పిడి ఏమేరకు సవ్యంగా కొనసాగుతుందో చూడాల్సి ఉంది. ఏదేమైనా బీహార్‌లో కులాల ప్రాతిపదికనే పార్టీల బలాలు ఆధారపడి ఉన్నాయి. 57 శాతం మంది పార్టీ, అభ్యర్థ్డిని కాకుండా కులాన్ని చూసి ఓటు వేస్తారని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

ముఖేష్ సహానిని ఉపముఖ్యమంత్రిగా ప్రకటించడం ద్వారా బాగా వెనుకబడిన వర్గాలలో బిజెపి మద్దతుకు గండికొట్టే ప్రయత్నం తేజస్వి చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. నితీశ్ పాలనలో కొంతకాలంగా శాంతిభద్రతలు ఆందోళనకరంగా మారడం, అభ్యర్థుల ఎంపిక రెండు ప్రధాన కూటమిలలో సైతం గందరగోళాలకు దారితీయడం, బిజెపి ప్రచారం చేస్తున్న ‘జంగిల్ రాజ్’ (లాలూ కుటుంబం పాలన) గురించి ఏమాత్రం తెలియని ఓ కొత్త తరం ఓటర్ల ప్రస్తుత ఎన్నికల్లో కీలకంగా మారడం వంటి పరిణామాలు కొత్త కొత్త అంశాలను తెరపైకి తీసుకు వస్తున్నాయి. వాస్తవానికి బీహార్ లో పట్టు సంపాదించుకోవడం కోసం ప్రధాని మోడీ 2014 నుండే విశేషంగా కృషి చేస్తున్నారు. మౌలిక సదుపాయాలకు సంబంధించి అనేక కొత్త ప్రాజెక్టులను చేపట్టారు. అయినప్పటికీ బలమైన నాయకత్వం బిజెపికి లోపించడంతో బీహార్ లో గట్టి పట్టు సంపాదించుకోలేకపోతుంది. నితీశ్ లేకుండా బిజెపిని బలోపేతం చేయడంకోసం ప్రయత్నించారు. అయితే, అటువంటి ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు నితీశ్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ ఎటువంటి ప్రభావం చూపుతారని ప్రశ్న ఇప్పుడు తలెత్తుతున్నది. దేశంలో ఎన్నికల గందరగోళాన్ని మొదట అర్థం చేసుకున్న కొద్దిమందిలో కిషోర్ కూడా ఉన్నారు. ఇప్పుడు నాయకుడిగా కూడా, అతను చాలా తక్కువ సమయంలోనే పార్టీని నిర్మించాడు. ఎంతగా అంటే అతను ఇప్పుడు 243 నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలబెట్టాడు. అయితే, జన్ సురాజ్ అభ్యర్థులలో ముగ్గురిని ఉపసంహరించుకోవాలని బిజెపి బలవంతం చేసిందని ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకులు అధికారంలోకి రావడానికి కండలవీరులను ఉపయోగించుకునేవారు. తర్వాత, చాలా మంది కండలవీరులు తామే రాజకీయ నాయకులుగా మారారు. అదే విధంగా, రాజకీయ నాయకులకు నిధులు సమకూర్చే కొంతమంది వ్యాపారవేత్తలు కూడా విధానాలను నేరుగా ప్రభావితం చేయడానికి రాజకీయ రంగంలోకి ప్రవేశించడం ప్రారంభించారు. అలాంటప్పుడు ఎన్నికల వ్యూహకర్త ఎందుకు రాజకీయ నాయకుడిగా మారలేరు? అనుకుంటూ ఆయన సొంతంగా పార్టీ పెట్టారు.

ఒక దశలో బీహార్‌లో పికె కింగ్ మేకర్ కాబోతున్నారని చాలామంది భావించారు. 8 నుండి 10 శాతం ఓట్లతో ఆయన మద్దతు లేకుండా ఎన్నికల అనంతరం ఎవ్వరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవచ్చని కూడా అంచనా వేశారు. అయితే, ఎప్పుడైతే తాను సొంతంగా ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదని ప్రకటించారో అప్పటి నుండి ఆయన ప్రాధాన్యత తగ్గుతున్నట్లు సంకేతాలు వెల్లడి అవుతున్నాయి. ఆయనకు లభించే ఓట్లు గణనీయంగా తగ్గిపోయే అవకాశాలున్నట్లు స్పష్టం అవుతుంది. పైగా, ఎన్నికల వ్యూహకర్తగా మీడియాలో సంచలనాలకు పేరొందిన ప్రశాంత్ కిషోర్ గురించి బీహార్‌లో సాధారణ ప్రజలకు పెద్దగా తెలియదు. అయితే మొదట్లో నరేంద్ర మోడీ, తర్వాత ప్రియాంక గాంధీ, మమతా బెనర్జీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంకె స్టాలిన్ వంటి విభిన్న నేతలకు ఎన్నికల ప్రచార వ్యూహాలు జరిపించారు. రాజకీయ ప్రత్యర్థులపై బురదచల్లడం ఆయన మార్క్ ప్రచారంగా పేరొందింది. ప్రజాక్షేత్రంలో ఏనాడూ విశ్వసనీయ నేతగా గుర్తింపు పొందలేకపోవడమే కాకుండా ఆయన పనిచేసిన నాయకుల వైరుధ్యం గమనిస్తే ఆయనకు సైద్ధాంతిక నిబద్ధత కూడా లేదని స్పష్టం అవుతుంది.

మరోవంక, వివాదాస్పదంగా మారిన ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) రాజకీయంగా బిజెపికి ఏమాత్రం ప్రయోజనం కలిగిస్తుందో అనేది ప్రశ్నార్థకంగా మారింది. 65 లక్షల మంది ఓటర్లను తొలగించగా, వారిలో తమ మద్దతు దారులు కూడా ఉన్నట్లు ఆ పార్టీ స్థానిక నేతలే వాపోతున్నారు. ఒక విధంగా ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ రాజకీయ భవిష్యత్ కు సవాల్ అని చెప్పవచ్చు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి సొంతంగా మెజారిటీ తీసుకు రావడంలో విఫలం చెందారు. ఆ తర్వాత మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి సాధించిన విజయాలలో సైతం ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల పట్టుదల కారణంగా ఎక్కవు లాగా భావిస్తున్నారు. బీహార్ లో బిజెపిని గెలిపించలేకపోతే వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది.

– చలసాని నరేంద్ర, 98495 69050

ప్రజాధనం దుర్వినియోగమా?

భారత ఆర్థిక వ్యవస్థలో కార్పొరేట్ -ప్రభుత్వ సంబంధాలు ఎప్పుడూ వివాదాస్పదమే. ఇటీవల వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఒక దర్యాప్తు నివేదికలో మోడీ ప్రభుత్వం అదానీ గ్రూపును ఆదుకోవడానికి ప్రజానిధులను ఉపయోగించినట్లు వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, అమెరికా లాంటి విదేశీ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనకడుగు వేసిన సమయంలో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) నుంచి దాదాపు 3.9 బిలియన్ డాలర్లు (సుమారు రూ.33000 వేల కోట్ల రూపాయలు) అదానీ సంస్థల్లో పెట్టుబడులుగా మళ్లించారు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ప్రభుత్వం ఒక ప్రైవేటు సమూహానికి అనుకూలంగా చేసిన చర్యగా కనిపిస్తోంది. ఈ విషయం భారత రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా అదానీపై అమెరికాలో జరుగుతున్న దర్యాప్తుల నేపథ్యంలో అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీకి మోడీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. 2023 లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక అదానీ సంస్థల్లో స్టాక్ మానిప్యులేషన్, ఆర్థిక అవకతవకలు ఉన్నాయని పేర్కొంది.

దీంతో అదానీ షేర్లు భారీగా పడిపోయాయి. ఇప్పుడు అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ (డిఒజె), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఇసిసీ) అదానీపై మరిన్ని ఆరోపణలు చేశాయి. 2024 నవంబర్‌లో వెలువడిన ఇండిక్ట్‌మెంట్ ప్రకారం, అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ సోలార్ ప్రాజెక్టుల కోసం భారత అధికారులకు 250 మిలియన్ డాలర్ల లంచాలు ఇచ్చినట్లు ఆరోపించారు. ఈ లంచాలను దాచి, అమెరికా పెట్టుబడిదారుల నుంచి 2 బిలియన్ డాలర్లు సేకరించినట్లు తెలిపారు. ఇంకా 2025 అక్టోబర్ నాటికి భారత అధికారులు అమెరికా సమన్లు అందించడంలో విఫలమయ్యారని ఎస్‌ఇసి కోర్టుకు తెలిపింది. ఇవి అదానీ గ్రూపు ఆర్థిక స్థితిని మరింత బలహీనపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ పోస్ట్ నివేదిక మరింత ఆసక్తికరం. మే 2025 లో ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ, నీతిఆయోగ్, ఎల్‌ఐసి సమన్వయం తో ఒక ప్లాన్ రూపొందించారని అది పేర్కొంది.

అదానీ పోర్ట్ కోసం 585 మిలియన్ డాలర్ల బాండ్ ఇష్యూ జరిగింది. దీనిని ఎల్‌ఐసి మాత్రమే సబ్‌స్క్రైబ్ చేసింది. ఇంకా, అదానీ గ్రీన్ ఎనర్జీ, అంబుజా సిమెంట్స్ లాంటి సంస్థల్లో 3.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెంచారు. ఈ చర్యలు అదానీ గ్రూపు రుణాలు (2024లో 20% పెరిగాయి) తగ్గించడానికి సహాయపడ్డాయి. కానీ, ఇది ప్రజా నిధుల దుర్వినియోగమని విమర్శకులు అంటున్నారు. ఎల్‌ఐసికు 30 కోట్ల మంది పాలసీ హోల్డర్లు ఉన్నారు. వీరు ఎక్కువగా మధ్యతరగతి, గ్రామీణ ప్రజలు. వారి పొదుపులను రిస్కీ పెట్టుబడుల్లో పెట్టడం సరికాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు, హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత ఎల్‌ఐసి అదానీ షేర్లలో రూ.7,850 కోట్ల రూపాయల నష్టపోయింది. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్, మల్లికార్జున ఖర్గేలు ఇది ‘క్రోనీ క్యాపిటలిజం’ అని పిలుస్తున్నారు. పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దర్యాప్తును ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎక్స్ (ట్విట్టర్)లో కూడా ఈ విషయం హాట్ టాపిక్. కొన్ని పోస్టులు మోడీ -అదానీ బంధాన్ని ‘గుజరాత్ మాఫియా’ అని వర్ణిస్తున్నాయి. మరికొన్ని ఎల్‌ఐసి పెట్టుబడులు మార్కెట్ ఆధారితమని డిఫెండ్ చేస్తున్నాయి.

అయితే, అదానీ గ్రూపు ఈ ఆరోపణలను ‘నిరాధారం’ అని ఖండించింది. ఎల్‌ఐసి కూడా తమ పెట్టుబడులు డ్యూ డిలిజెన్స్‌తో చేస్తామని, ఎలాంటి ప్రభుత్వ ఒత్తిడి లేదని చెప్పింది. అదానీ బాండ్లు 10- సంవత్సరాల ప్రభుత్వ సెక్యూరిటీల కంటే 8.02 శాతం అధిక రాబడి ఇస్తున్నాయని వారు వాదిస్తున్నారు. విశ్లేషణాత్మకంగా చూస్తే ఇది భారతదేశంలో క్రోనీ క్యాపిటలిజం సమస్యను హైలైట్ చేస్తుంది. అదానీ గ్రూపు ఓడరేవులు, విద్యుత్, మౌలిక సదుపాయాల్లో విస్తరణ జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. కానీ, దాని కోసం ప్రజా సంస్థలను ఉపయోగించడం సరికాదు. సెబీ హిండెన్‌బర్గ్ ఆరోపణల్లో కొన్నింటిని తోసిపుచ్చింది. కానీ, యుఎస్ దర్యాప్తులు కొనసాగుతున్నాయి. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఆస్ట్రేలియా ఎనర్జీ ఫైనాన్స్ డైరెక్టర్ టీమ్ బక్లీ లాంటి నిపుణులు ఇది ‘క్రోనీ క్యాపిటలిజం సజీవంగా ఉంది’ అని అంటున్నారు. చివరగా, ఈ వివాదం ప్రభుత్వం, కార్పొరేట్ల మధ్య సమతుల్యత గురించి ప్రశ్నలు లేవనెత్తుతుంది. పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా ప్రజాధనం దుర్వినియోగం అయితే, అది సామాన్యులకు నష్టం. స్వతంత్ర దర్యాప్తు అవసరం, లేకపోతే ఇలాంటి సమస్యలు మరిన్ని వస్తాయి.

– కోలాహలం రామ్ కిశోర్

– 9849328496

సాగర జలాలతో సాగు సాధ్యమేనా?

ప్రపంచంలో మంచినీటి కొరత నానాటికీ తీవ్రమవుతున్నది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మంచినీటి లభ్యతను పెంచడం ఎలా అన్నది ప్రస్తుతం ప్రభుత్వాలు, విధానకర్తల ముందున్న ప్రధాన సమస్య. 95 శాతం ఉన్న ఉప్పునీటి సముద్ర జలాలను మంచినీటిగా మార్చే అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా మంచినీరు, ఆహార కొరతను తీర్చవచ్చని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా లభించే జలాలతో 97.43 శాతం ఉప్పునీరు కాగా, మంచినీటి లభ్యత కేవలం 2.57 శాతం మాత్రమేనని గణాంకాలు ఘోషిస్తున్నాయి. ఈ స్వచ్ఛజలాలలో నదుల ద్వా రా లభించేది కేవలం 0.0002 శాతం మాత్రమే. ఈ పరిమిత నీటితోనే విశ్వవ్యాప్తంగా మానవులు, జంతువుల ఆకలిదప్పులు, పంటల సాగు అవసరాలు తీర్చవలసి వస్తోంది. అయితే ప్రస్తుతం 800 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా 2050 నాటికి 1000 కోట్లు దాటుతుంది. పరిమితంగా ఉన్న మంచినీటి లభ్యతను పెంచకపోతే భవిష్యత్తులో జీవావళి తీవ్ర నీటికొరతను ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాతావరణంలో వస్తున్న పెనుమార్పులవల్ల దుర్భిక్షాలు, కరవులు ఏర్పడి నీటిలభ్యత తగ్గడం, దశాబ్దాల క్రితం నిర్మించిన భారీ జలాశయాలు ఒండ్రు మట్టి చేరడంవల్ల పూడికపెరిగి నిల్వ సామర్థ్యం తగ్గి ఆయకట్టు చివరి ప్రాంతాలకు నీరు చేరకపోవడం తెలిసిందే. భారీవర్షాలు, వరదలు వచ్చినపుడు నీరు నిల్వ చేసుకోలేని దుస్థితి వల్ల ఏటా వేల టిఎంసిలు వృథాగా ఉప్పు సముద్రాలలో కలసి పోవడం, అయినా రాష్ట్రాల మధ్య జలజగడాలు ఎడతెగకుండా కొనసాగడం, ఒక ప్రధాన ప్రాచీన పార్టీ నేతలు వాస్తవాలను గమనించకుండా 90% వాటా నీరు తమకే కావాలని కోరుతూ జాతీయ సమైక్యతకు చేటు తెస్తూ ఉండటం చూస్తున్నాం. నీటి సంక్షోభం ముంచుకొస్తున్నా ప్రత్యామ్నాయ మంచినీటి వనరుల కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఏమంత ఆశాజనకంగా లేవు. రానున్న కాలంలో ఆహారం, మంచినీటి అవసరాలు మరింత పెరుగుతాయి. నీటికొరత ఉన్న ప్రాంతాలలో సేద్యానికి, మంచినీటికోసం అధికాధికంగా తోడటం వల్ల పెక్కు చోట్ల భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి.

లభ్యమయ్యే ఉపరితల నదీ జలాల కోసం వివిధ ప్రాంతాల మధ్య ఎడతెగని వివాదాలు, వైషమ్యాలను పెంచుతున్నాయి. ప్రపంచ జనాభాలో ఇప్పటికే సగం మంది నీటికొరతను ఎదుర్కొంటున్నట్లు యునిసెఫ్ పేర్కొన్నది. భారత్‌లో 60 కోట్లమంది (జనాభాలో 45%) నీటి కొరతను ఎదుర్కొంటున్నట్లు కేంద్ర విధాన నిర్ణాయక మండలి నీతిఆయోగ్ వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో నీటి అవసరాలు రెండింతలు పెరగనుండటం, మరోవైపు జలాశయాలలో పూడికపెరిగి నీటి నిల్వ సామర్థ్యం తగ్గి నీటికి కటకట ఏర్పడింది. ఉప్పునీటిలో లీటరుకు టిడిఎస్ స్థాయిలు వెయ్యి మి.గ్రా కంటే ఎక్కువగా ఉండటం వల్ల అవి తాగడానికి, సేద్యానికి, పారిశ్రామిక వినియోగానికి పనికి రావనే అభిప్రాయం ఉంది. అందువల్ల అన్ని అవసరాలకు మంచినీటినే వాడటం వల్ల గిరాకీ కంటే నీటి లభ్యత తక్కువగా ఉండటంవల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి.

నీటిసంక్షోభం తీవ్రమవుతున్నా నీటి పొదుపు, పరిమితంగా ఉన్న మంచినీటి పునఃపంపిణీ గురించే మాట్లాడుతున్నారే గానీ ప్రత్యామ్నాయాల గురించి పట్టించుకోవడం లేదు. ఉప్పునీటి నుండి క్షారాన్ని యోలగించి మంచినీటిగా మార్చడం, సేద్యానికి ఎలా వాడాలి అనే దానిపైనే పరిశోధనలు సాగుతున్నాయి. వాస్తవ మేమంటే ప్రపంచ నీటిలో 98% ఉప్పునీరే. అందువల్ల అత్యాధునిక శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను వినియోగించి పెరుగుతున్న మానవాళి అవసరాలు తీర్చే రీతిలో ప్రపంచ దేశాలు క్షార జలాలను ఎలా మార్చాలి అనే ప్రధానాంశంగా పరిశోధనలు సాగిస్తే అది ఎంతో మేలు. రక్షణ బడ్జెట్లు, ఆయుధ పోటీలు పెంచి, లాభాలు దండుకుంటున్న సంపన్న దేశాలు మానవాళికి అత్యవసరమైన మంచినీటిపై దృష్టి సారించకపోవడం తగదు. భారీ జలాశయాలలో నీటినిల్వ, నీటి ఆదాకు మాత్రమే పరిష్కారాలను పరిమితం చేశారు. ఉప్పునీటిని శుద్ధి చేసి ఆహారోత్పత్తికి, మంచినీటి సరఫరా మెరుగుకు నిర్దిష్ట ప్రయత్నాలు లేవు. ఉప్పునీరు వాడకానికి పనికి రావనే నమ్మకాలు బలంగా ఉన్నా యుగయుగాలుగా మానవాళి ఆక్షార జలాలను వాడటం తెలిసిందే. 1900 పోషకాలతో లభించే సముద్ర ఉత్పత్తులు మానవ ఆహారంలో ప్రధాన భాగం.

మన సాగరాలు, మహాసముద్రాలు ఎన్నో ఖాద్య యోగ్యమైన మొక్కలకు నెలవులు. వివిధ వర్ణాల, రకాల నాచు, ఆలగే (aalge), గవ్వలరకాలు, తూర్పు, ఆగ్నేయాసియా, పసిఫిక్ తీరదేశాల్లో ఎక్కువగా వాడే సముద్ర ద్రాక్ష తదితర మొక్కలు ఆహారంగా ఎంతో ఉపయోగమవుతున్నాయి. ఆర్థిక దృక్కోణం నుండి చూస్తే మంచినీటితో సాగయ్యే ఎన్నో పంటలను కొన్ని ప్రక్రియలతో ఉప్పునీటితో సాగు చేసే వీలుం ఉంటుందని అంటున్నారు. క్షారాన్నీ తట్టుకుని పెరిగే తుమ్మ, జమ్మి తదితర సముద్ర మాన్లు మేలి కలపగా పనికొస్తాయని చెబుతున్నారు. హాలో ఫైట్స్ ప్రత్యామ్నాయంగా వస్తున్న పంటలు వంట నూనెల ఉత్పత్తికి, మొక్కజొన్న, చెరకు, పామాయిల్‌కు ప్రత్యామ్నాయంగా అక్కరకొస్తాయంటున్నారు. ఉప్పునీటితో పెరిగే పూవులు, ఉద్యాన పంటలు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడతాయని నిపుణుల అభిప్రాయం.

క్షారాజలాన్ని మెరుగైనరీతిలో వాడితే పురోభివృద్ధి సాధ్యం కాగలదని భావన బలంగా ఉంది. ప్రపంచ జనాభాలో 38% మంది సముద్ర తీరానికి 100 కి.మీ దూరంలోనే నివసిస్తున్నందున (అంటార్కిటికా మినహా) తీరప్రాంతం 24 లక్షల కి.మీ మీరు ఉంటుంది. వాతావరణ పెనుమార్పు వల్ల సముద్రాలు చొచ్చుకువచ్చి తీర ప్రాంతాలను కలిపేసుకుంటున్నాయి. భారత ద్వీపకల్పం 11 వేల కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ 972 కి.మీ సాగరతీరాన్ని కలిగి, లక్షలాది మంది కడలి పుత్రులకు జీవనోపాధి కల్పిస్తున్నాయి. వారికి మరింత మెరు గయిన జీవనోపాధుల కల్పనకు సాగరతీరాన్ని, జలాలను ఆహారోత్పత్తి, పంటల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి ఎలాంటి చర్యలు అవసరమో నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపట్టాలి. విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న గూగుల్ డేటా కేంద్రాల శీతలీకరణకు రోజుకు కోటి 90 లక్షల లీటర్ల నీరు అవసరమని, సాగర జలాలను శుద్ధి చేసి వాడతారని చెబుతున్నారు. ఈ ఘనత కూటమి ప్రభుత్వానిదేనని సిఎం చంద్రబాబు, ఐటి మంత్రి లోకేష్ చెబుతున్నారు. సాగర జలాలను మెరుగైన రీతిలో వినియోగించడంపై ప్రజలకు అవగాహన కల్పించి, వారి జీవన ప్రమాణాలు పెంచడానికి మోడీ ప్రభుత్వ సహకారంతో ముందడుగు వేయాలి.

– పతకమూరు దామోదర్ ప్రసాద్

94409 90381

కౌలు రైతుల్ని గాలికొదిలేశారు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, అవశేష ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతులను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అత్యధిక శాతం మంది కౌలురైతులు భావిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం, పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ కలిసి నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది.- కౌలురైతుల సమస్యలను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోవట్లేదని 92.1 శాతం మంది కౌలురైతులు తెలుపగా, పట్టించుకుంటున్నారని కేవలం 6.1, తెలియదని 1.9 శాతం మంది తెలిపారు.- రాష్ట్రవ్యాప్తంగా కౌలురైతుల సమస్యలపై 20 సెప్టెంబర్ నుండి 20 అక్టోబర్ వరకు ఒక నెలరోజులపాటు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం క్షేత్రస్థాయిలో 26 జిల్లాల్లో సర్వే నిర్వహించి దాదాపు 3000 శాంపిల్స్ సేకరించింది. ఒక్కొక్క జిల్లానుండి 100 నుండి 125 శాంపిల్స్ సేకరించడం జరిగింది.- క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వే ప్రకారం కౌలురైతుల్లో దాదాపు 70 శాతం మంది బిసి, ఎస్‌సి, ఎస్‌టి, సామాజిక వర్గాలకు చెందినవారే ఉన్నట్లు వెల్లడైంది.- ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం సభ్యులు సేకరించిన డేటాను పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డేటా ఎంట్రీ చేసి, అనాలసిస్ చేసి నివేదికను రూపొందించింది.- కౌలురైతులకు గుర్తింపుకార్డు ఇచ్చిందా అని ప్రశ్నించినప్పుడు 87.7 శాతం మంది ఇవ్వలేదని, కేవలం 12.3 శాతం మాత్రమే ఇచ్చిందని తెలిపారు.- రాష్ట్రంలో కౌలురైతులు కూటమి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దానికి ప్రధాన కారణం 2024 ఎన్నికల్లో కౌలురైతులకు ఇస్తామన్న గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడమే. కౌలురైతుల గుర్తింపునకు ప్రతిబంధకంగా తయారైన పంట సాగుదారు హక్కు చట్టం (సిసిఆర్సి) స్థానంలో కొత్తగా చట్టం తెస్తామని కూటమి హామీ ఇచ్చినా ఇది అమలుకాకపోవడంపట్ల కౌలురైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది. కూటమి ప్రజాగళం పేరిట విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి అన్నీ సంక్షేమ పథకాలతో పాటు, పంటల బీమాను వర్తింపజేస్తామని హామీ ఇచ్చి 17 నెలలు కావొస్తున్నా… ఇది కార్యరూపం దాల్చకపోవడంతో కౌలు రైతులు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు.- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలోనే కౌలురైతుల కోసం చట్టం తీసుకొస్తామని ప్రకటించినా ఈ చట్టాన్ని తీసుకురాకపోవడం పట్ల కౌలురైతులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కౌలురైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రశ్నిస్తే తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయాలని 27.4 శాతం, గుర్తింపు కార్డు ఇవ్వాలని 22.7 శాతం, పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని 12.9 శాతం, పెట్టుబడికి రుణాలు మంజూరు చేయాలని 10.9 శాతం, రుణమాఫీ చేయాలని 10.5 శాతం మంది కోరారు. సామాజికంగా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా అని ప్రశ్నించినప్పుడు, భూయజమానులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉచితంగా సర్వీస్ చేయవలసి వస్తుందని, బడుగు బలహీనవర్గాల వారి నుండి ఎక్కువ వడ్డీ వసూలు చేస్తూ తమ సామాజికవర్గానికి మాత్రం తక్కువ వడ్డీకే అప్పులు ఇస్తున్నట్లు కౌలురైతులు తెలిపారు. కౌలు రేట్ల విషయంలో కూడా ఇటువంటి వ్యత్యాసాలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.- ఒక్కరికే ప్రతి సంవత్సరం కౌలుకు ఇస్తే భూమి మీద కౌలురైతులకు హక్కులు వస్తాయనే ఆందోళనలో భూయజమానులకు ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది.- కౌలుకు ఇచ్చిన భూములపై భూయజమాని ముందుగానే పంటరుణాలు తీసుకుంటున్నారని, భూయజమానులు బ్యాంకుకు బకాయి ఉంటే వారి భూములు సాగుచేస్తున్న కౌలురైతులకు పంటరుణాలు ఇవ్వడం లేదని సర్వేలో తేలింది.- క్షేత్రస్థాయిలో సర్వే సందర్భంగా కౌలురైతులతో మాట్లాడినప్పుడు నూతనంగా తీసుకొస్తామని చెప్పిన కౌలు చట్టంపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందనే భావనలో అత్యధిక శాతం మంది కౌలురైతులు ఉన్నారు.- రాష్ట్రప్రభుత్వానికి కౌలు చట్టాన్ని తీసుకురావాలనే చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలు లేకపోయినా ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాన్ని తీసుకొని రావచ్చనే పలుచోట్ల కౌలురైతులు తెలిపారు.- కౌలుదారులకు కొత్త చట్టం తీసుకురావడం కోసం కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 5 సదస్సులు నిర్వహించి కౌలు రైతులు, రైతు సంఘాలు, స్వచ్ఛంద సేవాసంస్థల నుండి అభిప్రాయాలు సేకరించారు. ఈ సేకరించిన సమాచారాన్ని చెత్తబుట్టలో వేశారా? లేక పరిగణనలోనికి తీసుకుంటారా? అనే విషయంపై స్పష్టత లేదని పలుచోట్ల రైతులు తెలిపారు.- ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా కౌలు రైతులకు భూయజమాని ప్రమేయం లేకుండా గుర్తింపు కార్డులు జారీ చేస్తామని చెప్పినప్పటికీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు కావొస్తున్నా కౌలు చట్టం అమలు కాలేదు, గుర్తింపు కార్డులు అందలేదు. గుర్తింపు కార్డులు లేకపోవడంతో బ్యాంకులు కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వడం లేదు, దీంతో వడ్డీకి అప్పులు తీసుకోవాల్సి వస్తోంది, అప్పుల భారం పెరుగుతోంది.- ఈ పంటలో నమోదు చేసుకోలేకపోవడంతో వరదలు, తుఫానుల వల్ల పంట నష్టపోయిన కౌలు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీలు అందడం లేదు, ఆర్థికంగా నష్టపోతున్నారు.- ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కౌలురైతులు పంటలు అమ్ముకునే అవకాశం లేకుండాపోయింది, గుర్తింపు లేకపోవడంతో దళారులకు తక్కువధరకు అమ్మాల్సి వస్తోంది.- వర్షాభావం, తెగుళ్లవల్ల దిగుబడి తగ్గుతోంది. కానీ కౌలు రైతులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందడం లేదు.- చాలా మంది కౌలు రైతులు నోటిమాటతో ఒప్పందాలు చేసుకుని భూమిని తీసుకుంటారు. దీనివల్ల భూయజమానులతో వివాదాలు వచ్చినప్పుడు వారికి చట్టపరమైన రక్షణ లభించడం లేదు, ఫలితంగా సాగుచేయడానికి భూమిని, భూమిలోపెట్టిన పంటను కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు.- ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు చేయడం గురించి కౌలురైతులకు తగిన శిక్షణ లేదా సాంకేతిక సమాచారం అందడం లేదు, దీంతో దిగుబడి తగ్గుతోంది.- కౌలు రైతులు పంటల బీమా పథకాల్లో చేరలేకపోతున్నారు, ఎందుకంటే వారి వద్ద భూమి యాజమాన్య పత్రాలు లేవు. దీనివల్ల పంట నష్టపోయినప్పుడు వారికి ఎలాంటి భరోసా లేదు.- రైతు భరోసా పథకం కౌలు రైతులకు సహాయం చేయడానికి ప్రవేశపెట్టబడినప్పటికీ, అర్హత పత్రాలు లేకపోవడం, అవగాహన లోపం వల్ల చాలా మందికి ఈ పథకం ప్రయోజనం అందడం లేదు.- భూయజమాని తీసుకునే రుణంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డు కలిగిన ప్రతీ కౌలు రైతుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలను మంజూరు చేయాలని కౌలు రైతులు కోరుతున్నారు.- కౌలు రక్షణ చట్టాన్ని ఆర్డినెన్స్ ద్వారా కూటమి ప్రభుత్వం వెంటనే తీసుకొచ్చి కౌలు రైతులకు భరోసా ఇవ్వాలని, అవసరమైతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించైనా ఈ చట్టాన్ని తీసుకొనిరావాలని అత్యధిక శాతం మంది కౌలురైతులు కోరుతున్నారు.

కోనసీమ జిల్లా… ఐ. పోలవరం గ్రామంలో ఒక సామాన్య రైతు చెప్పిన ఈ యదార్థ కథ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కౌలు రైతుల పరిస్థితి అద్దం పడుతుంది. దాదాపు రాష్ట్రంలోని కౌలు రైతులంతా ఇదే దుస్థితిని ఎదుర్కొంటున్నారు. – కౌలుకు సాగు చేస్తే రెండు ఎకరాలకు దిగుబడి 140 బస్తాలు వస్తాయి. (మొదటి పంటకు 60బస్తాలు, రెండో పంటకు 80బస్తాలు) ఒక బస్తా 75 కేజీలని మన గమనంలో ఉండాలి.- రెండు ఎకరాలు కలిగిన భూ యజమానికి రూ. కౌలు నిమిత్తం 48 బస్తాలు ఇవ్వాలి.(అంటే రెండు పంటలకు కలిపి ఎకరాకు 24బస్తాలు) కౌలు పోను102 బస్తాలు మిగులుతుంది.- 102 బస్తాలు రూ.1600లకు అమ్మితే వచ్చే ఆదాయం రూ.163,000. (ఒక బస్తాను రూ.1600లకు అమ్మితే)- పెట్టుబడి రెండు ఎకరాలకు రెండు పంటలకు కలిపి రూ.1,40,000. (మొదటి పంటకు రూ. 60వేలు, రెండో పంటకు రూ. 80వేలు)- పెట్టబడికి తెచ్చిన అప్పుకు వడ్డీ సుమారు రూ. 20వేలు కలుపుకుంటే మొత్తం రూ.1,60,000. మొత్తం ఆదాయంలో నుంచి ఖర్చులు తీసివేస్తే రూ. 3000వేలు మిగులుతుంది.- సంవత్సరం మొత్తం కష్టపడితే ఒక రైతు కుటుంబానికి రూ. 3000, రోజుకు రూ. 8లు మిగులుతుంది.- భూమి సారం, విత్తన నాణ్యత, నీటి లభ్యత, వాతావరణం అనుకూలం, తెగుళ్లు లేకుండా ఉండి కూలీలు తక్కువ ఉపయోగించుకుని, సాంకేతిక పరిజ్ఞానం వాడుకుంటే ఆ సమయంలో మార్కెట్ లో కనీసం మద్దతు ధరలు దక్కించుకుంటే ఆ మేరకు అప్పులు లేకుండా బయట పడతాడు లేకపోతే కోలుకోలేని దెబ్బ తింటాడు.కౌలు దోపిడీ,వడ్డీ దోపిడీ, మార్కెట్ దోపిడీ, ఇన్‌పుట్ ధరల దోపిడీ (విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ధరలు నిరంతరం పేరుగుదల) వీటికి తోడు ప్రకృతి విపత్తులతో కౌలురైతులు అల్లాడిపోతున్నారు.- చెమట చుక్క చిందించకుండానే భూయజమాని అనేక ప్రయోజనాలు పొందుతున్నాడు. పంట వేసినప్పుడు దిగుబడి వస్తుందో రాదో, మద్దతు ధర దక్కుతుందో లేదో, కనీసం పెట్టిన పెట్టుబడి వస్తుందో, రాదో అని తీవ్రమైన ఆందోళనతో కౌలురైతు మానసికంగా కృంగిపోతుంటారు. తద్వారా అనేక రోగాలకు, రుగ్మతలకు గురవుతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక వేరే మార్గం లేక ప్రభుత్వాలు కనుకరించక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బాధిత కుటుంబాలకు కౌలుగుర్తింపు కార్డు (భూ యజమాని కార్డు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో) లేకపోవడం చేత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎక్స్‌గ్రేషియా అందనటువంటి దయనీయమైన స్థితిలో కౌలు ఉన్నారు.- ఓట్ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీ పథకం పెడితే బ్యాంకులో ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తున్నారు. దీని వల్ల కౌలురైతులకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ పథకాల ద్వారా భూ యజమానులే లబ్ధి పొందుతున్నారు.- ఒక మాటలో చెప్పాలంటే యజమానిని బతికించడం కోసమే కౌలురైతులు బతుకుతున్నారా? అన్నఆలోచన రాకతప్పడం లేదు. భూమిని కౌలుకు ఇచ్చిన భూ యజమానులకు (వ్యవసాయానికి సంబంధించిన) ఎటువంటి ఆందోళనలు, మానసిక వత్తిడి లేకుండా ప్రశాంతంగా, ఏ రోగాలు లేకుండా జీవితం గడుపుతున్నారు. పైగా కౌలురైతులపై వివిధ ఆరోపణలు చేస్తుంటారు.- ప్రస్తుతం రాష్ట్రంలో 25% మంది భూయజమానులే సొంతంగా వ్యవసాయం చేసుకుంటున్నారు.- మరి కొంత మంది సొంత భూమితోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని పంటలు పండిస్తున్నా రు.- ముఖ్యంగా సొంత భూమిలేని పేదలు కౌలుకు భూమి తీసుకుని సాగుచేసే వారు గణనీయంగా ఉన్నారు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతుల ప్రాథమిక స్థితి!

దిలీప్‌రెడ్డి

సమకాలీనం

(రచయిత పొలిటికల్ అనలిస్ట్,

డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)

ఆర్థిక నేరగాళ్ల అప్పగింతలో పురోగతి

వేల కోట్ల రుణాలు తీసుకుని దేశం విడిచి పరారైన ఆర్థిక నేరస్థులను తిరిగి స్వదేశానికి రప్పించడం పెద్ద సవాలుగా మారింది. ఈ నేరస్థులను తిరిగి రప్పించడంలో 35 శాతం వరకు విజయం సాధించినట్టు తెలుస్తోంది. ఆర్థిక నేరాలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి. ప్రజల నమ్మకాన్ని తగ్గిస్తాయి. ప్రభుత్వ ఆర్థిక వనరులపై ఒత్తిడిని పెంచుతాయి. అభివృద్ధికి నిరోధకాలుగా పరిణమిస్తాయి. ఇది గ్రామీణ, పేద ప్రజలపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. ఆర్థిక నేరాల కేసులు చాలా ఏళ్ల పాటు విచారణలో ఉండడంతో న్యాయ వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం చూపడమే కాక, నేరస్థులు తప్పించుకోడానికి దారులు వెతికే పరిస్థితి ఏర్పడుతుంది. మహా నగరాల్లో ఆర్థిక నేరాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఉదాహరణకు 2018తో పోలిస్తే 2023లో ఈ నేరాలు దాదాపు 31% పెరిగాయని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం విదేశాలకు భారత్ నుంచి పరారైన ఆర్థిక నేరగాళ్ల జాబితాలో పుష్పేష్‌బైద్, ఆశిష్ జోబన్‌పుత్ర, విజయ్ మాల్యా, సన్నీకల్రా, సంజయ్ కల్రా, సుధీర్ కుమార్ కల్రా, ఆర్తికల్రా, జతిన్‌మెహతా, ఉమేష్ పరేఖ్, కమలేష్ పరేఖ్, నీలేష్ పరేఖ్, నీలవ్ మోదీ గారవ్, ఏక్నాలవ్ గార్గ్ మోడీ, మెహుల్ చోక్సీ, సబ్యాసేథ్, రాజీవ్ గోయల్, అల్కా గోయల్, లలిత్ మోడీ, నితిన్ జయంత్‌లాల్ సందేశర, చేతన్‌కుమార్ సందేశర, రితేష్ జైన్, హితేష్ నరేంద్రభాయ్ పటేల్, మయూరి బెన్ పటేల్, ప్రీతి ఆశిష్ జోబన్‌పుత్ర తదితరులు సుమారు 75 మంది ఉన్నారు. ఈ మోసగాళ్ల నుంచి ఇప్పటివరకు 15.113 కోట్ల రూపాయలను రికవరీ చేసినట్టు కేంద్రం తెలియజేసింది. ఇంకా వీరిలో చాలా మందిని తిరిగి రప్పించి శిక్షించడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగించడానికి బెల్జియం కోర్టు అంగీకరిస్తూ తీర్పు చెప్పడం భారత్ చేసిన ప్రయత్నాల్లో ముఖ్యమైన పరిణామం. చోక్సీ 2018లో భారత్ నుంచి పరారైన దగ్గర నుంచి భారత్ అతడ్ని వెనక్కు రప్పించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్ అభ్యర్థనపై చోక్సీని బెల్జియం నిర్బంధంలో ఉంచింది. భారత్‌కు తనను అప్పగిస్తే అక్కడ తాను నరకం అనుభవించవలసి వస్తుందని చోక్సీ వాదిస్తూ సమర్పించిన డాక్యుమెంట్లు సరిగ్గా లేవని బుధవారం బెల్జియం కోర్టు వెల్లడించింది. చోక్సీ భద్రతకు, అందుకు తగినట్టు జైళ్ల ఏర్పాట్లకు హామీ భారత్ ఇచ్చిన నేపథ్యంలో భారత్ జైళ్లలో తనను సరిగ్గా చూడరన్న చోక్సీ వాదనను బెల్జియం కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు భారత్‌కు చోక్సీ అప్పగింత ఫలప్రదమైతే ప్రపంచం మొత్తం మీద గత రెండు దశాబ్దాలుగా భారత్‌కు అప్పగించిన మూడో వంతు ఆర్థిక నేరస్థుల సుదీర్ఘ జాబితాలో చోక్సీ పేరు చోటు చేసుకుంటుంది. ఈ ఏడాది భారత్ సాధించింది చోక్సీ కేసు ఒక్కటే కాదు. గత నెల బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ ప్రతినిధి వర్గం జైళ్ల పరిస్థితిని సమీక్షించడానికి తీహార్ జైలును సందర్శించింది. విజయ్ మాల్యా, నిరావ్ మోడీ వంటి ఆర్థిక నేరస్థులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను బ్రిటన్ నుంచి భారత్‌కు అప్పగించడానికి కావలసిన వెసులుబాటు కల్పించడానికే ఇదంతా. ఇటువంటి ఆర్థిక నేరస్థులపై దర్యాప్తులు, విచారణ సాగించడానికి లేదా శిక్షించడానికి ఆయా దేశాల్లో ఉన్న నేరస్థులను భారత్‌కు అప్పగించాలన్న అభ్యర్థనలు జోరందుకుంటున్నాయి. ఈ మేరకు 48 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాలతో నేరస్థుల అప్పగింతలకు సంబంధించిన ఒప్పందాలను భారత్ కుదుర్చుకుంది. అలాగే 12 దేశాలతో అప్పగింత ఏర్పాట్లు చేసుకుంది. గత ఐదేళ్లలో 133 నేరస్థుల అప్పగింతల అభ్యర్థనలను భారత్ చేసింది. 2020 నుంచి 2024 కాలంలో ఒక్క 2024 లోనే 39 అభ్యర్థనలను చేయడం విశేషం. అలాగే భారత్ నుంచి పరారైన నేరస్థుల అప్పగింతలకు సంబంధించి విదేశాల నుంచి 79 అభ్యర్థనలను 202024 లో అందుకోగలిగింది. విదేశాల నుంచి భారత్‌కు ఆర్థిక నేరస్థులను, మోసగాళ్లను, ఫోర్జరీ కేసుల నేరస్థులను అప్పగించడంలో 2022 నుంచి 35 శాతం వరకు సాధించడమైంది. అగస్టావెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ ఒప్పందం స్కామ్‌కు సంబంధించి ఆర్థిక నేరాలకు పాల్పడిన నిందితుడు క్రిస్టియన్ మేకేల్ యునైటెట్ అరబ్ ఎమిరేట్స్ నుంచి భారత్‌కు అప్పగించడమైంది. మొత్తం కేసుల్లో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకున్న లేదా ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందించిన, భారత్‌కు వ్యతిరేకంగా దాడులకు పాల్పడే ప్రయత్నం చేస్తున్న నేరస్థుల కేసులు 27.5 శాతం వరకు ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో 26/11 ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహవూర్ రాణాను అమెరికా ఈ ఏడాది భారత్‌కు అప్పగించింది. భారత్‌కు అప్పగించనున్న నేరస్థుల మొత్తం కేసుల్లో హత్య లేదా హత్యాయత్నం కేసులు 21.3 శాతం ఉన్నాయి. మాదకద్రవ్యాలు, లైంగిక నేరాలు వంటి కేసులతో సహా మొత్తం కేసులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ జాబితా తయారు చేసింది. 2002 నుంచి 2018 మధ్యకాలం లోను, 2024 నుంచి 2025 కాలం లోనూ విదేశాల నుంచి అప్పగించిన నేరస్థుల జాబితాను దేశాల వారీగా వేర్వేరుగా ప్రదర్శించింది. ఈ రెండు దశల్లోనూ మొత్తం 26 దేశాల నుంచి నేరస్థులను భారత్ రప్పించుకోగలిగింది. అలాంటి మొత్తం కేసుల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా దేశాలు కలిపి మొత్తం 46 శాతం ఉన్నాయి. క్రమంగా కనీసం 25, 12 మంది పరారీ నేరస్థులను ఆ రెండు దేశాల నుంచి రప్పించుకోగలిగింది.  

అడవిబిడ్డల జీవన పోరాటం

వాతావరణ మార్పు ఆదివాసీ సమాజానికి ఎప్పుడో సంభవించే ప్రమాదం కాదు, -అది ఇప్పుడు వారి జీవనానికి ముప్పుగా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్థిర వర్షపాతం, తరచూ జరిగే అడవి అగ్నిప్రమాదాలు ఇవన్నీ ప్రకృతి- మనిషి మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. -ఈ మార్పులు అత్యంత బలహీన వర్గాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా వర్షాధార వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, సంప్రదాయ వృత్తులపై ఆధారపడే ఆదివాసీల జీవనోపాధులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాయి. ఆదివాసీ రైతుల జీవితం ఎప్పుడూ రుతువుల లయకు అనుగుణంగా సాగేది. కానీ ఇప్పుడు ఆ లయ తప్పిపోయింది – వాతావరణం అస్థిరంగా, ఊహించలేనిదిగా మారింది. వేడి పెరగడంతో నేల తేమ తగ్గిపోతోంది, అకాల వర్షాలు పంటలను నాశనం చేస్తున్నాయి. వరి, పప్పుధాన్యాలు వేడిని తట్టుకోలేక దిగుబడి తగ్గిస్తున్నప్పటికీ, చాలాకాలంగా విస్మరించబడిన సిరిధాన్యాలే (మిల్లెట్స్) తట్టుకోగలుగుతున్నాయి.

భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (2012), భారత వ్యవసాయ పరిశోధన మండలి (2019) ప్రకారం, మిల్లెట్స్ తక్కువ వర్షపాతం ఉన్నా పండుతాయి. అందువల్ల అవి ఎండప్రాంతాల ఆహార భద్రతకు అత్యవసరమైనవని చెబుతున్నాయి. వాతావరణ మార్పు కార్యాచరణ ప్రణాళిక ప్రకారం, రబీ పంటల సీజన్‌లో వర్షపాతం క్రమంగా తగ్గే అవకాశం ఉంది. అయితే ఒక్కసారిగా కురిసే భారీ వర్షాలు నేల క్షీణత, కొండవాగుల వరదలతో హానిని కలిగిస్తున్నాయి. అందువల్ల నీటి నిల్వ వ్యవస్థలను బలోపేతం చేయడం, సంప్రదాయ కుంటలు, చెక్‌డ్యామ్‌ల పునరుద్ధరణ ఆదివాసీ ప్రాంతాల్లో అత్యవసరం. లయ అనే స్వచ్ఛంద సంస్థ సర్వే ప్రకారం, ఎఎస్‌ఆర్, మన్యం జిల్లాల్లోని చెక్‌డ్యామ్‌లు, వాగులు, కుంటల (81) ద్వారా సుమారు 177 ఎకరాలకే సాగు నీరు అందుతోంది. వాటిని మరమ్మతులు చేస్తే సుమారు 6,918 ఎకరాల వరకూ సాగు విస్తరించవచ్చని పేర్కొంది. ఈ నిర్మాణాలను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేదా సంబంధిత పథకాల ద్వారా పునరుద్ధరించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి. పశుసంవర్థక, మత్స్య సంపద కూడా వాతావరణ మార్పుల ప్రభావానికి లోనవుతున్నాయి.

అధిక ఉష్ణోగ్రతల వల్ల పశువుల పాలు, ప్రసవ సామర్థ్యం తగ్గుతోంది. అస్థిర వర్షపాతం వల్ల చెరువుల్లో చేపల పెంపకం దెబ్బ తింటోందని నాబార్డ్ (2019) నివేదిక తెలిపింది. కొండలపై కురిసే వర్షాలతో రసాయన ఎరువులు, పురుగు మందులు కొండ వాగు నీటిలో కలసి తాగునీటి వనరులు కలుషితమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అడవులు ఆదివాసీల ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవితాలకు మూలాధారం. కానీ అవి కూడా వాతావరణ మార్పుల ముప్పు నుండి తప్పించుకోలేకపోతున్నాయి. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (2019) ప్రకారం అటవీ ప్రాంతాల్లో 53 శాతం అగ్నిప్రమాదాల ముప్పులో ఉన్నాయి. వాటిలో పావు వంతు అత్యధిక ప్రమాద వర్గంలో ఉన్నాయి. తరచూ సంభవించే అగ్నిప్రమాదాలు, వేసవి కాలం పెరగడంతో తేనె, వెదురు, పండ్లు, ఔషధ మూలికల ఉత్పత్తి తగ్గిపోతోంది. ఒకప్పుడు అడవుల్లో వేలాడే తేనెగూళ్లు ఇప్పుడు అరుదుగా కనిపిస్తున్నాయి. వెదురు పునరుత్పత్తి తగ్గడంతో కళాకారులు, గృహనిర్మాణ పనులకు ఇబ్బంది కలుగుతోంది. ఔషధ వనమూలికలు ఇప్పుడు ఎత్తైనచల్లని కొండప్రాంతాల్లో మాత్రమే లభిస్తున్నాయి.

సహజ అడవుల స్థానంలో వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ఒకే రకం చెట్ల పెంపకం (మోనో కల్చర్) చేపట్టడంతో సమతుల్యం దెబ్బతింటోంది. ఆక్రమణ జాతులు విస్తరించడం వల్ల సహజ వనాల పెంపుకు ఆటంకం కలుగుతోంది. ఇవన్నీ పర్యావరణ సమతుల్యాన్ని మాత్రమే కాదు, నీటి మట్టాన్ని తగ్గించి ఎడారీకరణకు దారితీస్తున్నాయి. ఆదివాసీలకు ఇది కేవలం పర్యావరణ నష్టం కాదు – సాంస్కృతిక ఉనికిపై దెబ్బ. భారీ నీటి ప్రాజెక్టులు వాతావరణ మార్పుల ప్రభావాన్ని మరింత పెంచుతున్నాయి. వేలాది ఆదివాసీ కుటుంబాలను అడవులనుంచి వేరుచేసి, వారి సాంప్రదాయ వారసత్వాన్ని నాశనం చేస్తోంది. అడవులు తగ్గిపోవడం, నీటి వనరులు మృగ్యం కావడం వల్ల వన్యప్రాణులు గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. పంటలు, పశువులు నాశనం అవుతున్నాయి. ఒకప్పుడు ప్రకృతి- మనిషి సహజ సంబంధం ఉన్న చోట ఇప్పుడు బతుకుబాట కష్టమవుతోంది.

తూర్పు కనుమలు ఒకప్పుడు దట్టమైన హరితం, తేమతో నిండిన ప్రాంతాలు. కానీ ఇప్పుడు జీవవైవిధ్యం వేగంగా తగ్గిపోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి – వాతావరణ మార్పులు, భూమి వినియోగ మార్పులు కలిసి మొక్కల పెరుగుదలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. గత 100 సంవత్సరాల్లో (1920- 2015) తూర్పు కనుమల్లో 15.83% అటవీ ప్రాంతం నశించింది. అందులో 7.92% వ్యవసాయ భూమిగా, 3.8% పొదల భూమిగా మారింది. నేల సారవంతత తగ్గి, పంటల కాలచక్రం భగ్నమవుతోంది. వర్షాభావం వల్ల జీవనోపాధి కోసం మైదాన ప్రాంతాలకు ఆదివాసీ వలసలు పెరుగుతున్నాయి. జీవవైవిధ్యం కోల్పోవడం అంటే వారి సంప్రదాయ పర్యావరణ జ్ఞానం కోల్పోవడమే. ఈ కఠిన పరిస్థితుల్లో కూడా ఆదివాసీ సమాజాలు వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ముందంజలో ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సేంద్రియ ఎరువులు, మిశ్రమ పంటలు, విత్తన బ్యాంకులు, సిరిధాన్యాలు, పప్పులు, నూనె గింజల పంటల పునరుద్ధరణ వంటి పద్ధతులు అవలంబిస్తున్నాయి. ఇవి పోషకాహార భద్రతకు దోహదం చేస్తున్నాయి.

వాతావరణ మార్పు, ఆరోగ్య రంగంలో రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక (2022- 27) స్థానిక వ్యాధి పర్యవేక్షణ, ఆరోగ్య సిబ్బంది శిక్షణ, సంప్రదాయ -ఆధునిక వైద్య సమన్వయం అవసరాన్ని గుర్తించింది. అటవీ హక్కుల గుర్తింపు చట్టం, 2006 ప్రకారం గ్రామ సభలకు సముదాయ అటవీ వనరుల నిర్వహణ హక్కు ఉంది. చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తే, వెదురు, పండ్లు, ఔషధ మొక్కల పెంపకం ద్వారా ఆదాయం పెరగడమే కాకుండా పర్యావరణ సమతుల్యం కూడా కాపాడుతుంది. ఆదివాసీలకు వాతావరణ మార్పులు కేవలం పర్యావరణ సమస్య కాదు – అది న్యాయం, జీవనాధారం, ఉనికికి సంబంధించిన ప్రశ్న. వారి భూములు, అడవులు, సంప్రదాయ జ్ఞానం ప్రమాదంలో ఉన్నాయి.

కానీ ప్రకృతితో ఉన్న అనుబంధమే వారికి ప్రతిఘటనకు బలం. సాంప్రదాయ జ్ఞానాన్ని శాస్త్రీయ సాంకేతికతతో మిళితం చేస్తే సమగ్ర వాతావరణ చర్య సాధ్యమవుతుంది. ఇది అడవులను పునరుద్ధరిస్తుంది, వ్యవసాయాన్ని బలోపేతం చేస్తుంది, నీటి భద్రతను కాపాడుతుంది, పునరుత్పాదక శక్తిని ప్రోత్సహిస్తుంది. వాతావరణ ప్రణాళిక గ్రామస్థాయిలోనే రూపుదిద్దుకోవాలి. షెడ్యూల్డ్ ప్రాంత పంచాయతీ (విస్తరణ) చట్టం (PESA), అటవీ హక్కుల చట్టం కింద గ్రామ సభలను ప్రణాళిక, పర్యవేక్షణలో భాగస్వామ్యం చేయాలి. వాతావరణ మార్పు ప్రతిఘటనలో ఆదివాసీ నాయకత్వం నిలపడమే కాదు -అది సుస్థిర భవిష్యత్తుకూ అత్యవసరం. గిరిజన సంక్షేమ, వ్యవసాయ, అటవీ, నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేసి, గణాంకాలకే కాకుండా ఆదివాసీ విజ్ఞాన ఆధారిత వాతావరణ చర్యకు ప్రభుత్వం పూనుకోవాలి.  

డా. పల్లా త్రినాథరావు

96182 96682

కృత్రిమ మేధ ఒక వరం

కృత్రిమ మేధ అన్నీ రంగాలనూ ఉప్పెనలా తాకుతోంది. సర్వాంతర్యామిగా మారింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోనూ తనదైన ముద్రను చూపుతోంది. ఈ క్రమంలో విద్యా రంగంలోకి కూడా ఈ సాంకేతికత వచ్చి చేరుతోంది. తాజాగా ‘ఎఐ ఫర్ యంగ్ మైండ్స్ -ది ఫ్యూచర్ స్టార్ట్ నౌ’ పుస్తకం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందింది. గ్లోబల్ ఎఐ నివేదిక-2023 ప్రకారం ఎఐ నైపుణ్యాల అభివృద్ధిలో భారత్ ప్రథమ స్థానంలో నిలిచింది. అమెరికా, జర్మనీలు తరువాత స్థానాల్లో ఉన్నాయి. 2025 నాటికి భారతదేశ ఎఐ మార్కెట్ విలువ 7.8 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం ఆరోగ్యం, వ్యవసాయం, బ్యాంకింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి అనేక రంగాల్లో ఎఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ, విద్యా రంగంలో దాని ప్రభావం అత్యంత కీలకమైనదిగా మారుతోంది.

విద్యా రంగంలోకి కృత్రిమ మేధను తీసుకొచ్చేందుకు పలు దేశాలు పోటీ పడుతున్నాయి. చైనాలో మూడవ తరగతి నుంచే ఎఐని తప్పనిసరి పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, స్పీచ్ రికగ్నిషన్ వంటి అంశాలను చిన్న వయసులోనే పరిచయం చేస్తోంది. స్మార్ట్ క్లాస్‌రూమ్స్ కూడా అభివృద్ధి చేసింది. ఇక దక్షిణ కొరియాలో కంప్యూటేషనల్ థింకింగ్, ఎఐ లిటరసీని ప్రాథమిక స్థాయిలోనే సాధారణ పాఠ్యాంశాలలో కలిపింది. సింగపూర్‌లో మాధ్యమిక స్థాయి నుంచే AI Literacy, Code for Fun వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టి విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవం కల్పిస్తోంది. అమెరికాలో రాష్ట్రాలవారీగా ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఎఐ విద్యను అమలు చేస్తోంది. స్టెమ్ ఎడ్యుకేషన్, నైతిక ఎఐ వినియోగంపై ఎక్కువ దృష్టి. ప్రైవేట్ రంగంలో గూగుల్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.కరోనా తర్వాత డిజిటల్ బోధన పెరిగింది. ఎఐ టూల్స్ (ChatGPT, Gemini, Generative AI) తరగతులలో సాధారణమయ్యాయి. ఇవి సమాచారం అందించినా, విశ్వసనీయతను నిర్ణయించేది మనిషే. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఒక క్లాసులో 30 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు వ్యక్తిగత శ్రద్ధ చూపడం కష్టం. కానీ కృత్రిమ మేధతో ఈ సవాల్‌కు పరిష్కారం లభిస్తుంది. విద్యపై కృత్రిమ మేధ సానుకూల ప్రభావం చూపుతోందని ఇటీవల ఒక సర్వే వెల్లడించింది. విద్యా రంగంలో సమగ్రత కోసం పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ టర్న్‌టిన్ ఈ సర్వే నిర్వహణకు ప్రోద్బలం అందించగా, ఇంగ్లాండ్‌కు చెందిన మార్కెట్ రిసెర్చ్ సంస్థ వాన్సన్ బోర్న్ సర్వే నిర్వహించింది.

ఇందులో భాగంగా భారత్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, మెక్సికో, ఐర్లాండ్, అమెరికాలకు చెందిన 3500 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్థల నిర్వాహకుల అభిప్రాయాలు సేకరించారు. భారత్‌లో నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 93 శాతం విద్యపై కృత్రిమ మేధ సానుకూల ప్రభావం చూపుతోందని అభిప్రాయపడ్డారు. భారత్‌లో కృత్రిమ మేధ లభ్యత చాలినంతగా ఉందని సర్వేలో పాల్గొన్నవారు వెల్లడించారు. చదువులో, ఇతరత్రా పనుల్లో కృత్రిమ మేధను ఉపయోగించి ఏ విధంగా ప్రయోజనం పొందవచ్చో తమకు తెలియదని భారత్‌లో సర్వేలో పాల్గొన్న వారిలో 50శాతం మంది పేర్కొన్నారు. ‘కృత్రిమ మేధ వల్ల కలుగుతున్న సానుకూల పరిణామాలు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, విద్యాసంస్థల నిర్వాహకులకు అద్భుత అవకాశాన్ని అందిస్తున్నాయి’ అని టర్న్‌టిన్ సంస్థ దక్షిణాసియా ప్రాంతీయ డైరెక్టర్ చైతాలి మొయిత్రా అన్నారు. ఎఐ టీచర్‌కు ప్రత్యామ్నాయం కాదు. ఈ సాంకేతికతను సహాయక సాధనంగా వాడితే విద్యను బలోపేతం చేస్తుంది.

కానీ ప్రత్యామ్నాయంగా తీసుకుంటే మనిషి యంత్రాల బానిసగా మారే ప్రమాదం ఉంది. ఎఐ విద్యను విజయవంతంగా అమలు చేయడానికి, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను స్థానిక అవసరాలకు అనుగుణంగా రూపొందించాలి. సాంకేతిక సౌకర్యాలను అందరికీ అందుబాటులో ఉంచడం, డేటా గోప్యతను రక్షించడం, గురుశిష్య సంబంధాలను బలోపేతం చేయడం అవసరం. కృత్రిమ మేధస్సు విద్యా రంగానికి అపారమైన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇది అభ్యాసనాన్ని మరింత వ్యక్తిగతీకరించినదిగా, సమర్థవంతమైనదిగా, అందరికీ అందుబాటులో ఉండేలా చేయగలదు. అయితే, ఈ సాంకేతికతను బాధ్యతాయుతంగా, నైతికంగా, సమానత్వ దృక్పథంతో అమలు చేయడం చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఎఐ విద్యా వ్యవస్థలో అంతర్భాగంగా మారనుంది. ఉపాధ్యాయుడి పాత్ర ‘సమాచారాన్ని అందించే వ్యక్తి’ నుండి ‘అభ్యాసనకు మార్గనిర్దేశం చేసే ఫెసిలిటేటర్’ గా మారుతుంది. కృత్రిమ మేధస్సు విద్యా రంగానికి ఒక శక్తివంతమైన వరం. ఈ సాంకేతికతను సరిగ్గా ఉపయోగించుకుంటే, మనం ఉజ్వలమైన, విజ్ఞానవంతమైన భవిష్యత్ తరాలను నిర్మించగలం.

దయ్యాల అశోక్, 95508 89907