Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Betpas

Betpas giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

trendbet giriş

meritking

meritking

trendbet giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking Giriş Güncel

Trendbet

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

vaycasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Betpas

Betpas giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

palacebet

palacebet

yakabet

casibom

meybet

online diyetisyen

vaycasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Trendbet

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Betpas

Betpas giriş

winxbet

casibom

bahislion

Marsbahis

meritking

betboo

vevobahis

holiganbet

holiganbet

slotbar

oslobet

meritking giriş

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinowon

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

vaycasino

Atlasbet Giriş

Wbahis

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

palacebet

bahislion

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

matbet

sekabet

sekabet

imajbet

marsbahis

Wbahis

grandpashabet

betpark

matbet

pusulabet giriş

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

padişahbet

betasus

berlinbet

casinoas

casibom

kingroyal

holiganbet

marsbahis

casibom

queenbet

padişahbet

padişahbet giriş

yakabet

casinolevant giriş

padişahbet

meritking

1xbet

padişahbet

galabet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

kralbet

milanobet

gallerbahis

galabet

royalbet

betkolik

betticket

enbet

suratbet

süratbet

betpas

dinamobet

artemisbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

madridbet

betasus

sekabet

marsbahis

vdcasino

grandpashabet

bahiscasino

casinoroyal

sekabet

jojobet

casibom

casibom giriş

casibom güncel giriş

joybet

kingroyal

yakabet

yakabet

betkolik

betkolik

wbahis

kingroyal

masterbetting

kingroyal

imajbet

sekabet

pusulabet

meritking

vdcasino

betlike

vdcasino

ultrabet

tlcasino

casibom

galabet

ultrabet

tarafbet

madridbet

tarafbet

casino siteleri

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

padişahbet giriş

padişahbet

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

vevobahis

హర్మన్ సేనకు జయ హారతి!

ఆనందం అంబరాన్ని చుంబించిన వేళ! అందనంత దూరంలో ఆకాశాన ఉన్న జాబిల్లి అందినంత సంబరం! ఏళ్ల తరబడి కన్నకలలు ఫలించిన రోజు! మొన్నటి రోజు భారత క్రికెట్ క్రీడాకారిణులు సాధించిన అపూర్వమైన విజయాన్ని వర్ణించడానికి ఇలాంటి ఉపమానాలు ఎన్నయినా చాలవంటే అతిశయోక్తి కాదు. క్రమశిక్షణ, ఐకమత్యం, ఆత్మవిశ్వాసం ఒకచోట చేరితే ఏమవుతుంది? అద్భుతమైన విజయం సొంతమవుతుంది. నవీ ముంబయిలోని డివై పాటిల్ స్టేడియంలో అదే జరిగింది! ఏడు మ్యాచ్‌లు ఆడి ఒక సెంచరీతో సహా 308 పరుగులు చేసిన ఓపెనర్ ప్రతీకా రావల్ సెమీఫైనల్‌కు ముందే గాయంతో వైదొలిగింది! విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే కెప్టెన్ హర్మన్ ప్రీత్, స్మృతి మంధాన ఫామ్ అంతంత మాత్రమే. పైగా వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓటమి. అలాంటి పరిస్థితుల్లో భారత్ గెలుస్తుందని ఎవరైనా ఎలా అనుకుంటారు? కానీ, మన అమ్మాయిలు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. చరిత్రను తిరగరాశారు. తమదైన రోజున ఎలాంటి అద్భుతాలనైనా చేయగలమని నిరూపించారు.

కనీవినీ ఎరుగని బ్యాటింగ్‌తో భారత్‌ను పైనల్‌కు నడిపించిన జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్, ఫైనల్లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన షెఫాలీ, అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ విశ్వరూపం చూపించిన దీప్తిశర్మ భారత్‌ను విజయశిఖరాలవైపు నడిపించిన తీరు అమోఘం. అయితే విజేతల గురించే కాదు, ఈ సందర్భంగా స్ఫూర్తిదాయకమైన ఆటను ప్రద్శరించిన ప్రత్యర్థులను సైతం ప్రస్తావించుకోవడం సముచితం అనిపించుకుంటుంది. ఫైనల్లో దక్షిణాఫ్రికా ఓడిపోయి ఉండవచ్చు గాక, కానీ ఆ జట్టు కెప్టెన్ లారా వోల్వార్డ్ బాధ్యతాయుతమైన ఆటతీరు, చివరికంటా పోరాడినవైనం చిరస్మరణీయం. ప్రపంచ కప్ సెమీ ఫైనల్లోనూ, ఫైనల్లోనూ సెంచరీలు చేసిన లారా, కెప్టెన్ పదవికి వన్నె తెచ్చిందనడంలో సందేహం లేదు. నిన్నమొన్నటి వరకూ క్రికెట్ కు.. అదీ పురుషుల క్రికెట్‌కు తప్ప భారతదేశంలో మరే ఆటకూ ఆదరణ ఉండేది కాదు. అంతర్జాతీయంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఫుట్ బాల్ క్రీడకు కూడా ఇక్కడ ఆదరణ అంతంత మాత్రమే.

ఇక మహిళల క్రికెట్ గురించి చెప్పాల్సిన పనేముంది? ‘మైదానానికి రండి.. మా ఆట చూడండి.. మమ్మల్ని తిట్టండి.. బాగా ఆడితే ప్రోత్సహించండి’ అంటూ మన మాజీ ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు సునీల్ చెత్రీ ఒక సందర్భంలో కన్నీటి పర్యంతమవుతూ అన్న మాటలు మన మహిళా క్రికెట్‌కూ వర్తిస్తాయి. భారత మహిళల క్రికెట్ అసోసియేషన్ ఐదు దశాబ్దాల క్రితమే రూపుదిద్దుకున్నా, దాదాపు 30 ఏళ్లపాటు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండేది. నిధులు లేక నీరసించి, దిశానిర్దేశం చేసే కోచ్‌లు లేక నిస్తేజంగా మారిన మహిళా క్రికెట్‌కు ఊపిరులూదింది నిస్సందేహంగా బిసిసిఐయే. మహిళల క్రికెట్ ఇరవై ఏళ్ల కిందట బిసిసిఐ అధీనంలోకి వచ్చాక, క్రికెట్ తీరే మారిపోయింది. ఆట కొత్త నడకలు నేర్చింది. వేగాన్ని అందిపుచ్చుకుంది. దూకుడే తన చిరునామాగా మార్చుకుంది. ‘మేం కోమలాంగులం కాదు.. కొదమ సింహాలం’ అంటూ మనవాళ్లు సత్తా చూపడం మొదలుపెట్టారు.

ముఖ్యంగా నిన్నటి తరం క్రీడాకారిణులు మిథాలీరాజ్, జులన్ గోస్వామి, అంజుమ్ చోప్రా తమదైన ఆట తీరుతో భారత మహిళా క్రికెట్ స్వరూపాన్ని ఆసాంతం మార్చేశారు. వారి క్రమశిక్షణను, ఆటనూ హర్మన్ సేన యథాతథంగా అందిపుచ్చుకుందనడానికి మొన్నటి రోజు చేసిన అద్భుత ప్రదర్శనే నిదర్శనం. మహిళల ప్రీమియర్ లీగ్‌కు బిసిసిఐ శ్రీకారం చుట్టడం కూడా కలిసివచ్చింది. ఎందరో మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వచ్చారు. తాజా విజయంతో భారత మహిళా క్రికెట్ విశ్వవేదికపై మరిన్ని విజయాలు సాధిస్తుందనడంలో సందే హం లేదు. అంతటి ఆత్మవిశ్వాసాన్ని మన ఆణిముత్యాలు అందిపుచ్చుకున్నారు. అంతకుమించిన క్రమశిక్షణనూ అలవరచుకున్నారు. క్రికెట్ ను ఎంచుకునే క్రీడాకారిణులకు భారత మహిళా జట్టు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. రెండుసార్లు అందినట్టే అంది చేజారిన ట్రోఫీ మూడోసారి చిక్కిన మధుర క్షణాలివి. అంతేకాదు, భారత మహిళల జట్టు అంతర్జాతీయ వేదికలపై ఆడటం మొదలుపెట్టిన 50 ఏళ్ల తరువాత లభించిన విజయం కూడా. అపూర్వమైన ఈ విజయాన్ని ఆస్వాదిద్దాం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిద్దాం. జయహో భారత్!

విషం చిమ్ముతున్న విభజన రాజకీయాలు

భారతదేశం బలం, వైవిధ్యం రాజ్యాంగ నైతికత పై ఆధారపడి ఉంది. ఎన్నికైన నాయకులు పెడ ధోరణి పట్టినప్పుడు ప్రతిఘటించడం పౌరులు, ప్రతిపక్ష పార్టీలు, పౌరసమాజం, మీడియా విధి అవుతుంది. అన్యాయాలను మౌనంగా సహించడం అన్యాయాలను సమర్థిం చడమే. వలసలు, పోరాటం, సాంసృ్కతిక ఐక్యతతో కూడిన ఉమ్మడి చరిత్రలతో ముడిపడి ఉన్న అసోం, బెంగాల్ రాష్ట్రాలు రెండు ద్వేష రాజకీయాల ప్రయోగశాలలుగా మారడానికి అనుమతించరాదు. వీరంతా భారతీయులే. ద్వేషపూరితమైన కంచెలు భౌగోళిక సరిహద్దుల కన్నా ప్రమాదకరమైనవి. అసోంలో అక్రమ వలసదారులను బహిష్కరిస్తామనడం, బెంగాల్‌లో బంగ్లాదేశ్ తో కంచెలు వేయమని హామీ ఇవ్వడం బిజెపి ద్వంద్వ ప్రమాణాలకు తార్కాణం. సిఎఎ ఈ వైఖరికి ప్రతీకగా నిలుస్తుంది.  

నైతికత స్థానే రాజకీయ ఆశయం చోటుచేసుకున్ననప్పుడు పాలన మోసపూరితంగా మారుతుంది. అసోం నుంచి పశ్చిమ బెంగాల్ వరకూ అడుగడుగునా అదే కన్పిస్తోంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన బిజెపి ఎంపి జగన్నాథ్ సర్కార్ తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే, భారతదేశం బంగ్లాదేశ్ మధ్య ముళ్ల కంచెను తొలగిస్తుందని ఈ మధ్య చేసిన వ్యాఖ్య -వలసలు, సరిహద్దులు, జాతీయవాదంపై బిజెపి రాజకీయాల్లోని వైరుధ్యాన్ని స్పష్టం చేస్తున్నది. బంగ్లాదేశ్ నుంచి చొరబాటులను ఆపడం, ముఖ్యంగా అసోంలో అక్రమ వలసదారులను బహిష్కరించడంపై పార్టీ ఏళ్లుగా చేస్తున్న వాదనకు ఇది విరుద్ధంగా ఉంది. బిజెపి సీనియర్ ఎంపి చేసిన వ్యాఖ్య పశ్చిమ బెంగాల్ లోనే కాక, ఈశాన్య భారతంలో, మరీ ముఖ్యంగా అసోంలో ఆగ్రహాన్ని, అనుమానాలను రేకెత్తించింది. ఈ ప్రాంతంలో సరిహద్దు భద్రత, అక్రమ వలసలు దశాబ్దాలుగా రాజకీయంగా, భావోద్వేగ పరంగా సున్నితమైన అంశం.

అసోం ఒప్పందం, భద్రతా పరమైన రక్షణ

2016లో అసోంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పుడు, అది స్థానిక అసోమీ ప్రజల గుర్తింపు, హక్కులను కాపాడతామని స్పష్టమైన వాగ్దానం చేసింది. 2016, 2021 ఎన్నికల మేనిఫెస్టోలో బిజెపి 1985 అసోం ఒప్పందాన్ని అమలు చేస్తామని హామీఇచ్చింది. ఆల్ అసోం స్టూడెంట్స్, యూనియన్ (ఆసు) నేతృత్వంలో ఏళ్లతరబడి సాగిన ఆందోళన తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. అసోం నుంచి విదేశీయులను గుర్తించి బహిష్కరించడానికి 1971 మార్చి 25ను కటాఫ్ తేదీగా నిర్ణయించారు. మున్ముందు చొరబాట్లను నిరోధించడానికి భారత బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి కంచె వేయాలని కూడా ఈ ఒప్పందంలో పేర్కొన్నారు. అసోం ఒప్పందం కేవలం ఓ డాక్యుమెంట్ మాత్రమే కాదు. దేస జనాభా సమతౌల్యత కాపాడుకునేందుకు వందలాదిమంది అసోమీ యువకుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న ఒప్పందం. ఇది రక్షణకు హామీ, అసోం భాష, సాంసృ్కతిక, రాజకీయ గుర్తింపు నీరుగారబోదని ఇచ్చిన వాగ్దానం. అయినా, బిజెపి ఒప్పందం పట్ల విధేయత చూపుతోనే, పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) తీసుకువచ్చింది. ఇది ఒప్పందం ప్రాథమిక స్ఫూర్తిని సమర్థవంతంగా మోసం చేసే చట్టం. 1971 గడువు తర్వాత బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలో ప్రవేశించిన హిందూ బెంగాలీలకు పౌరసత్వం ఇవ్వడంద్వారా బిజెపి అసోం ఒప్పందం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తించింది.సిఎఎ, అసోం ఉద్యమానికి నాయకత్వం వహించిన వారి త్యాగాలను దెబ్బతీయడమే కాక, బిజెపి ద్వంద్వ వైఖరిని బయటపెడుతుంది. ఒకపక్క ఇది ముస్లంలను చొరబాటుదారులు అని ఆరోపిస్తుంది, వారి బహిష్కరణకు వాగ్దానం చేస్తుంది. మరోపక్క ముస్లిమేతర వలసదారులకు, ముఖ్యంగా హిందూ బెంగాలీలకు పూర్తి పౌరసత్వాన్ని అందిస్తుంది. వీరిలో చాలా మంది 1971 తర్వాత బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించిన వారే. ఇది కేవలం రాజకీయ అవకాశవాదమే కాదు, భావజాలంతో కూడిన ద్రోహం.

వలసల విషయంలో బిజెపి ద్వంద్వ వైఖరి

వలసలపై బిజెపి రాజకీయాలు ఎప్పుడూ ద్వంద్వ ప్రమాణాలతో కూడినవే. అసోంలో ఆ పార్టీ నాయకులు అక్రమ బంగ్లాదేశ్ ముస్లింలను బహిష్కరణకు గగ్గోలు పెడుతున్నారు. బెంగాల్‌లో, కేంద్రంలో మరి కొందరు సరిహద్దులను తెరుస్తామని, ముళ్లకంచెలను తొలగిస్తామని హామీ ఇస్తున్నారు. చొరబాటు అంశం వివిధ రాష్ట్రాలలో ఎన్నికల లబ్ధి కోసం సాధనంగా ఉపయోగించుకుంటున్నట్లు కన్పిస్తోంది. భారతదేశ సరిహద్దులను రక్షించడం, అసోం ఒప్పందం పవిత్రతను కాపాడడంలో బిజెపికి నమ్మకం ఉంటే పార్టీ సీనియర్ ఎంపి, భారత- బంగ్లా సరిహద్దుల్లో ముళ్లకంచె తొలగిస్తామని ఎలా అంటారు. ఇది సరిహద్దు భద్రతకోసం అసోం ప్రజల పోరాటాన్ని అపహాస్యం చేయడం కాదా? ఈ అంశంలో వైరుధ్యం స్పష్టంగా కన్పిస్తోంది. అసోంలో లక్షలాది మందిని – “డి- ఓటర్లు”, “చొరబాటుదారులు” అని ముద్రవేసిన కాషాయదళం ఇప్పుడు బెంగాల్‌లో బంగ్లాదేశ్‌తో సరిహద్దులు లేని ఐక్యతపై మాట్లాడుతోంది. ఇది జాతీయవాదం కాదు. కేవలం కపటత్వమే.

అసోం ముఖ్యమంత్రి ద్వేషపూరిత రాజకీయాలు

అసోం ముఖ్యమంత్రి ఈ విభజనను మరింత పెంచారు. విభిన్న సంసృ్కతులు, భాషలు, విశ్వాసాలకు నిలయంగా ఉన్న అసోంలో కీలక పదవిలో ఉన్న ఆయన తన రాజకీయ వేదికను ద్వేషం, బహిష్కరణలకు వేదికగా మార్చుకు న్నారు. రాష్ట్రంలో కొన్ని తరాలుగా నివసిస్తున్న బెంగాలీ సంతతికి చెందిన ముస్లింలు, మియా ముస్లింలను- బహిష్కరిస్తామని తరచు ఆయన బెదిరించడం, రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ వాగ్దానాన్ని ఉల్లంఘించడమే. ఆక్రమణలను తొలగించే నెపంతో వేలాది ముస్లిం కుటుంబాలను ఇప్పటికే ప్రభుత్వ, అటవీ భూములనుంచి బహిష్కరించారు. ఈ చర్యలు ముస్లింలు పెద్దసంఖ్యలో ఉన్న గ్రామాలను టార్గెట్ చేయడమే. అవి నిరాశ, ఆవేదనలను మిగిల్చాయి. కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు బంగ్లాదేశ్ ముస్లింలకు ఆశ్రయం కల్పిస్తున్నాయని సిఎం పదేపదే చెప్పడం మతపరమైన విద్వేషాన్ని మరింత పెంచుతోంది. మతం ఆధారంగా విధేయత, ద్రోహం అని విభజించడం ఓ ప్రమాదకరమైన ప్రయత్నం. ఇది భారతదేశ, లౌకిక, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమైన ఆలోచనే. ముఖ్యమంత్రి సొంత ప్రజల్లో ఒక వర్గంపై బహిరంగ యుద్ధం ప్రకటించడం, వారిని బయటి వ్యక్తులుగా ముద్రవేయడం పాలనా పరిమైన సమస్యమే కాదు, అది నైతిక సంక్షోభంగా మారుతుంది.

“అమర్ సోనార్ బంగ్లా” వివాదం

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన “అమర్ సోనార్ బంగ్లా” బంగ్లాదేశ్ జాతీయ గీతం. కాంగ్రెస్ నాయకులు ఈ గీతాన్ని పాడడంపై బిజెపి వివాదం సృష్టించడం అసంబద్ధతను ప్రతిబింబిస్తుంది. బ్రిటీష్ హయాంలో 1905లో బెంగాల్ విభజనకు నిరసనగా ఠాగూర్ రాసిన పాట విభజనకు కాదు. ఐక్యతకు సంబందించిన గీతం. మతపరమైన, రాజకీయ సరిహద్దులు ఏర్పడక ముందు బెంగాల్ సమైక్య వారసత్వాన్ని ప్రతిబింబించిన గీతం. అయినా, ఈ గీతం ఆలపించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించడం, జాతి వ్యతిరేక గీతంగా ముద్రవేయడం దారుణం. వలసవాద వ్యతిరేక ప్రతిఘటన, ఠాగూర్ మానవతా వాదం సార్వత్రికను సూచించే పాట పట్ల అసహనం వ్యక్తం చేయడం దివాలా కోరుతనం. అభద్రతా భావాన్ని ప్రతిబింబిస్తుంది. కంచెలను తొలగించడం, బెంగాల్, బంగ్లాదేశ్‌లను ఏకం చేయడం గురించి మాట్లాడుతున్న అదే బిజెపి ఎంపి, అమర్ సోనార్ బంగ్లా పాటపట్ల అభ్యంతరం వ్యక్తం చేయడం విడ్డూరం.

ప్రజాస్వామ్యం, లౌకిక వాదానికి ముప్పు

1950లో భారత రాజ్యాంగం ఆమోదించినప్పుడు అది మతం, జాతితో సంబంధం లేకుండా, పౌరులు అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని వాగ్దానం చేసింది. ప్రతి ముఖ్యమంత్రి పదవి చేపట్టే సమయంలో రాజ్యాంగాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకోనని వాగ్దానం చేస్తారు. అసోం ముఖ్యమంత్రి రాజ్యాంగ పదవిలో ఉంటూ, ఒక వర్గాన్ని లక్ష్యంగా ఎంచుకుని, వారిని ఇళ్లనుంచి వెళ్లగొట్టి, వారి పౌరసత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇది రాజ్యాంగం ఉల్లంఘనతో పాటు, ప్రజాస్వామ్యానికి ముప్పు భావించవచ్చు. అధికారంలో ఉన్నవారు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే, ప్రజాస్వామ్యం పతనం మొదలవుతుంది. ఆ మనస్తత్వమే నిరంకుశ ధోరణులకు దారితీస్తుంది. భారతదేశం బలం, వైవిధ్యం రాజ్యాంగ నైతికతపై ఆధారపడి ఉంది. ఎన్నికైన నాయకులు పెడ ధోరణి పట్టినప్పుడు ప్రతిఘటించడం పౌరులు, ప్రతిపక్ష పార్టీలు, పౌరసమాజం, మీడియా విధి అవుతుంది.

అన్యాయాలను మౌనంగా సహించడం అన్యాయాలను సమర్థించడమే. వలసలు, పోరాటం, సాంసృ్కతిక ఐక్యతతో కూడిన ఉమ్మడి చరిత్రలతో ముడిపడి ఉన్న అసోం, బెంగాల్ రాష్ట్రాలు రెండు ద్వేష రాజకీయాల ప్రయోగశాలలుగా మారడానికి అనుమతించరాదు. వీరంతా భారతీయులే. ద్వేషపూరితమైన కంచెలు భౌగోళిక సరిహద్దులకన్నా ప్రమాదకరమైనవి. అసోంలో అక్రమవలసదారులను బహిష్కరిస్తామనడం, బెంగాల్‌లో బంగ్లాదేశ్ తో కంచెలు వేయమని హామీ ఇవ్వడం బిజెపి ద్వంద్వ ప్రమాణాలకు తార్కాణం. సిఎఎ ఈ వైఖరికి ప్రతీకగా నిలుస్తుంది. ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైన ప్రవర్తన ఇలాగే కొనసాగితే, భిన్నాభిప్రాయాలను నేరంగా పరిగణించే పరిస్థితి తలెత్తవచ్చు. మైనారిటీలను అమానవీయంగా చూస్తే ప్రజాస్వామ్యం ఓ నినాదంగా మారే ప్రమాదం ఉంది. ఈ ధోరణులకు వ్యతిరేకంగా ప్రజలు శాంతియుతంగా పోరాడాలి. రాజ్యాంగమే భారత దేశానికి నిజమైన సంరక్షణ కల్పిస్తుందని అధికారంలో ఉన్నవారికి గుర్తు చేయాల్సిన సమయం ఆసన్నమైంది.

గీతార్థ పాఠక్

సహాయం భిక్ష కాదు.. రైతుల హక్కు

మొంథా తుఫాన్ రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. అపారంగా పంటలకు నష్టం జరిగింది. రోడ్లు, భవనాల శాఖకు, విద్యుత్ సంస్థకు అపార నష్టం జరిగింది. నదులు, వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి అనేక చోట్ల గండ్లు పడ్డాయి. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక ఇళ్లు నేల కూలాయి. వేల కోట్లలో నష్టం జరిగింది. తెలంగాణలో వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, హనుమకొండ, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, జనగాం, కరీంనగర్ మొదలైన జిల్లాల్లో 2.5 లక్షల ఎకరాల్లో వరి, 1.51 లక్షల ఎకరాల్లో పత్తితో పాటు మిర్చి, మొక్కజొన్న మొదలైన పంటలు 5 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. క్షేత్రస్థాయి పరిశీలనలో పంటల విస్తీర్ణత ఇంకా ఎక్కువగా ఉంటుంది. పంట నష్టంతోపాటు రెండు డిస్కింల పరిధిలో విద్యుత్ సంస్థకు 10 వేల కోట్ల దాకా నష్టం జరిగింది. 4,576 కిలోమీటర్ల మేర రహదార్లు దెబ్బతిన్నాయి. 302 కల్వర్టులు ధ్వంసమయ్యాయి. రహదారుల మరమ్మతులకు 2,713 కోట్ల అవసరమని ఆర్ అండ్ బి శాఖ మంత్రి పేర్కొన్నారు. తుఫాన్ వల్ల జరిగిన మొత్తం నష్టం రూ. 5,265 కోట్లుగా ప్రాథమిక అంచనా వేశారు. నష్టం ఇంకా పెరుగుతుంది.

తెలంగాణలో పంట కాల్వల, మురుగు కాల్వల నిర్వహణ సరిగా లేకపోవటం, ముళ్లకంపలు, పూడికలతో కాల్వలు నిండి ఉండటం వల్ల వరదలు, భారీ వర్షాలు వచ్చినప్పుడు కాల్వలకు గండ్లు పడి పంటలు ముంపునకు గురవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మురుగు నీటి కాల్వలే లేవు. తెలంగాణ ప్రభుత్వం ఎకరా పంటకు నష్ట పరిహారంగా 10 వేల రూపాయలు ప్రకటించింది. ఇది రైతుకు ఊరటనివ్వదు. ఎకరా సేద్యానికి రూ. 35 వేలకు పైగా రైతు పెట్టుబడి పెట్టాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే పరిహారం రైతు నిలదొక్కుకోవటానికి ఉపయోగపడదు. రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం ఎకరాకు రూ. 20 వేల పరిహారం ఇవ్వాలి. కౌలు రైతులకు పరిహారమే లభించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు మొదలగు జిల్లాల్లో మొంథా తుఫాన్‌వల్ల లక్షా, 38 వేల హెక్టార్లలో పంటలకు నష్టం జరిగిందని, 12,215 హెక్టార్లలో ఉద్యాన వన పంటలు దెబ్బతిన్నాయని, ఆక్వారంగంలోని 32 వేల ఎకరాల్లో రైతాంగం నష్టపోయారని, 2,261 పశువులు చనిపోయాయని, 4,794 కిలోమీటర్ల ఆర్ అండ్ బి రోడ్ల, కల్వర్టులు, వంతెనలు దెబ్బతిన్నాయని, 311 కల్వర్టుల, వంతెనలకు నష్టం వాటిల్లిందని, విద్యుత్ సంస్థకు అపారంగా నష్టం జరిగిందని, మొత్తం నష్టం 5,244 కోట్ల రూపాయలగా ప్రాథమిక అంచనాను కూటమి ప్రభుత్వం కేంద్రానికి పంపింది.

క్షేత్ర స్థాయి పరిశీలనలో నష్టం చాలా ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది. అనేక చెరువులు, వాగులకు గండ్లు పడి పంటలతోపాటు వందలాది గ్రామాలు నీటమునిగాయి. అనేక చోట్ల రాకపోకలు స్తంభించి పోయాయి. వరదలకు కొద్ది మరణాలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్‌లో పంటల నష్టంపై భిన్నాభిప్రాయా లున్నాయి. 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, కూటమి ప్రభుత్వం పంట నష్టాన్ని తక్కువ చేసి చెబుతుందనే విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వ పంట నష్టం తక్కువగా చెప్పడం ద్వారా రైతులకు నష్టపరిహారం కింద ఇచ్చే మొత్తాన్ని తగ్గించుకోవడం కోసమేననే అభిప్రాయాలు వస్తున్నాయి. పంటలు కోల్పోయిన రైతాంగానికి ఇచ్చే పరిహారం కూడా, వారికి ఊరట ఇవ్వటం లేదు. రైతు ఇప్పటికే ఎకరాకి రూ. 35 వేలు దాకా సేద్యానికి పెట్టుబడి పెట్టాడు. కౌలు రైతులు అదనంగా మరో రూ. 15 వేలు కౌలు రూపంలో చెల్లించాడు. ప్రభుత్వం ప్రకటించే నష్ట పరిహారం ఎకరాకు ఎంత అన్నది ఇంకా ప్రకటించలేదు. కనీసం ఎకరాకి రూ. 20 వేలు నష్ట పరిహారం ప్రకటించాలి.

కౌలు రైతులకు నష్ట పరిహారం సమస్యగా మారింది. వైసిపి పాలన కాలంలో పంటల బీమా పథకానికి ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించడం వల్ల పంట నష్టానికి కొంత మేరకు పరిహారం అందేది. కారణం తెలియదు గాని చంద్రబాబు ప్రభుత్వం రైతాంగం తరపున ఈ సంవత్సరం ప్రీమియం చెల్లించలేదు. ఫలితంగా బీమా సంస్థల నుంచి రైతాంగానికి పరిహారం లభించక నష్టపోతున్నారు. బీమా పరిహారం లభించి ఉంటే, అది రైతుకు ఉపయోగం ఉండేది. ఇన్‌పుట్ సబ్సిడీ కింద ఇప్పటికే రైతులకు రూ. 595 కోట్లు కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సిఉంది. పంటలు ముంపునకు గురైనప్పుడు, రైతాంగం నుండి ఎటువంటి వంకలు పెట్టకుండా మద్దతు ఇచ్చి ప్రభుత్వ సంస్థలే కొనుగోలు చేయాలి. మొంథా తుఫాన్ గురైన రైతుల నుండి పంట కొనుగోళ్లు చేయాలంటే, పంట నష్ట పరిహారం కోసం పేర్లు నమోదు చేసుకోరాదని, చేసుకుంటే నష్ట పోగా మిగిలిన పంటను మిల్లర్లు ఇచ్చే రేటుకు అమ్ముకోమని, కొనుగోలు కేంద్రాల్లో కొనే అవకాశం లేదని అధికారులు కొన్ని ప్రాంతాల్లో రైతులకు తెగేసి చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంపునకు గురైన పంటలకు మద్దతు ధర ఇచ్చే అవకాశం లేదని మిల్లర్లు చెబుతున్నారు. అలాంటప్పుడు మిల్లర్లు ఇచ్చిన ధరకే రైతులు అమ్ముకోవాలి.

ఫలితంగా రైతు తీవ్రంగా నష్టపోతాడు. రాష్ట్రంలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ప్రతి సంవత్సరం సంభవిస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వరదలు రావటానికి, పంటలు ముంపుకి గురి కావటానికి కారణమైన నదుల, వాగుల, కాల్వల, చెరువుల కరకట్టలను పటిష్ట చేయడం, పూడికలు తీయడం, డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరణ చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చు. వీటి పట్ల రాష్ట్ర పాలకులు దృష్టి పెట్టకపోవడం వల్ల తుఫాన్ల సందర్భంగా పంటలకు అపార నష్టం జరుపుతున్నది. రెండు రాష్ట్రాల్లో తీవ్ర సంక్షోభంలో ఉన్న రైతాంగం, మొంథా తుఫాన్ వల్ల పంటలు నష్టపోయి మరింత సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. కౌలు రైతులతోసహా నష్టపోయిన రైతులకు ఎకరాకు కనీసం రూ. 20 వేలు ఇవ్వాలి. ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతుల నుండి మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకులు ఇచ్చిన పంట రుణాలు రద్దు చేయాలి. పంటకాల్వల, డ్రైనేజీ కాల్వలను ఆధునీకరణ చేయాలి. సహాయం పొందడం పాలకుల భిక్షకాదని, అది తమ హక్కు అని రెండు రాష్ట్రాల రైతాంగం సాధనకు ఉద్యమించాలి. 

బొల్లిముంత సాంబశివరావు

9885983526

రీయింబర్స్‌మెంట్ అడిగితే విజిలెన్స్ దాడులా?

పెండింగ్‌లో ఉన్న ఫీజులను చెల్లించడానికి ముందు కురాని రాష్ర్ట ప్రభుత్వం కొత్త నిబంధనతో విద్యార్థులే ముందుగా ఫీజులు చెల్లించే విధంగా చేస్తుంది. అంతిమంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రకు పాల్పడుతుంది. ప్రపంచ అందాల పోటీలకు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. రీయింబర్స్‌మెంట్ అంటే కేవలం ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యగా రాష్ర్ట ప్రభుత్వం చిత్రీకరిస్తుంది. దీని వెనక దాదాపు 12 లక్షల మంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు నెలకొని ఉంది.  

రాష్ర్టంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఇవ్వవలసిన రూ. 8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ పెండింగ్‌లో ఉన్నాయి. విద్యాసంస్థల ఆందోళనలు, విద్యార్థి సంఘాల పోరాటాల ఫలితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 1200 కోట్ల రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ను వెంటనే విడుదల చేస్తామని, దానిలో రూ. 600 కోట్లను దసరాకు, మిగతా రూ. 600 కోట్లను దీపావళికి ఇస్తామని ప్రకటించింది. విద్యాసంస్థలు, విద్యార్థి సంఘా లు సర్కార్ ప్రకటనను నమ్మాయి. కానీ పండగల పేరుతో కాలయాపన జరిగింది గాని విద్యార్థులకు న్యాయం జరగలేదు.

ఫలితంగా ఎప్పటి లాగానే లక్షలాది మంది విద్యార్థులు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ రాక, ఆర్థిక భారం తో చదువులను కొనసాగించలేక, ఉన్నత చదువులు చదువుకోలేక తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ప్రతి సంవత్సరం రెగ్యులర్‌గా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వెంటనే చెల్లిస్తామని నమ్మ బలికింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చింది. కానీ ఎన్నికల్లో ఇచ్చిన రీయింబర్స్‌మెంట్ హామీని అటకెక్కించింది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయని ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి మరొక కొత్త కుట్రకు తెరలేపింది.

రీయింబర్స్‌మెంట్‌ను కాలేజ్ అకౌంట్‌లో కాకుండా నేరుగా విద్యార్థి అకౌంట్‌లో వేస్తామని ప్రకటించింది. దీంతో ప్రైవేట్ విద్యాసంస్థలే కాకుండా ప్రభుత్వ విద్యాసంస్థల్లో కూడా మొత్తం ఫీజు ముందు చెల్లిస్తేనే వారికి ఆయా కాలేజీల్లో సీట్లు కన్ఫర్మ్ చేస్తున్నారు. దీంతో తీవ్రమైన ఆర్థిక భారం పేద విద్యార్థులపై పడుతుంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఫీజులను చెల్లించడానికి ముందుకురాని రాష్ర్ట ప్రభుత్వం కొత్త నిబంధనతో విద్యార్థులే ముందుగా ఫీజులు చెల్లించే విధంగా చేస్తుంది. అంతిమంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రకు పాల్పడుతుంది. ప్రపంచ అందాల పోటీలకు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. రీయింబర్స్‌మెంట్ అంటే కేవలం ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యగా రాష్ర్ట ప్రభుత్వం చిత్రీకరిస్తుంది.

దీని వెనక దాదాపు 12 లక్షల మంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు నెలకొని ఉంది. రాష్ర్టంలో ఉన్న ఉస్మానియా, కాకతీయ, మహాత్మా గాంధీ, జెఎన్‌టియు, తెలంగాణ యూనివర్శిటీ లాంటి ప్రతిష్ఠాత్మకమైన ప్రభుత్వ యూనివర్శిటీలకు కూడా వందల కోట్ల పెండింగ్ బిల్లులు రావలసి ఉంది. ఈ యూనివర్శిటీలన్నీ నిధులు లేక, సౌకర్యాలు లేక, చదువు చెప్పే ప్రొఫెసర్లు లేక దినదినగండం నూరేళ్ల ఆయుష్షుగా కొనసాగుతున్నాయి. ఈ పెండింగ్ నిధులు విడుదలయితే కొంతైనా పరిస్థితి మెరుగుపడవచ్చు. ప్రజాస్వామ్యాన్ని 7వ గ్యారెంటీగా ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ అడిగిన విద్యార్థులపై, విద్యార్థి సంఘాల నాయకులపై కక్ష గట్టింది. విద్యార్థుల పోరాటాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసింది.

రీయింబర్స్‌మెంట్ సాధించడం కోసం అనేక సార్లుగా ఆందోళనలు చేసినా, పోరాటాలు నిర్వహించినా, విద్యాసంస్థల బందును నిర్వహించినా కూడా కనీసం స్పందించలేదు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యాసంస్థలను మూసివేస్తామని హెచ్చరించిన ఫలితంగా వారితో రాష్ర్ట ప్రభుత్వం చర్చలు జరిపి రీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. నేడు వారి హామీని నెరవేర్చని ఫలితంగా మరొకసారి నిరవధికంగా నవంబర్ 3 నుండి విద్యాసంస్థలను మూసివేస్తామని ప్రకటించాయి. దీనికి ప్రతిగా ప్రభుత్వం విద్యాసంస్థలపై విజిలెన్స్ దాడులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు విద్యాసంస్థలు నిబంధనలు పాటించకుంటే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవలసిన రాష్ర్ట విద్యాశాఖ అధికారులు నాడు చోద్యం చూసింది. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్శిటీలు ఏమాత్రం నిబంధనలు పాటించకుండా లక్షలరూపాయలను డొనేషన్ల పేరుతో వసూలు చేస్తున్నప్పుడు రాష్ర్ట ప్రభుత్వం స్పందించలేదు.

అనేక ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలు పాటించకుండా అక్రమంగా ఫీజులు పెంచుకున్నప్పుడు, సరైన సదుపాయాలు కల్పించనప్పుడు, నిబంధనలకు తూట్లు పొడిచినప్పుడు, విద్యారంగంపై ఉన్న జిఒలను అమలు చేయనప్పుడు విద్యార్థి సంఘాలు ఉద్యమిస్తే నాడు పట్టించుకోలేదు. కానీ నేడు రీయింబర్స్‌మెంట్ అడగగానే విజిలెన్స్ దాడులు చేస్తామని బెదిరించడం ఎంతమాత్రం సబబు కాదు. రీయింబర్స్‌మెంట్ విడుదలపై రాష్ర్ట ప్రభుత్వం ప్రజాస్వామికంగా వ్యవహరించకుండా భేషజాలకు పోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. విద్యా సంవత్సరాన్ని కోల్పోతారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన రాష్ర్ట ప్రభుత్వం దాడుల పేరుతో బెదిరింపులకు పాల్పడటం శోచనీయం. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ విడుదలపై ఉద్యమించాల్సిన గురుతర బాధ్యత నేడు విద్యార్థి లోకంపై ఉంది. ఐక్యపోరాటాలను నిర్మించాల్సిన తక్షణ కర్తవ్యం నేడు విద్యార్థి సంఘాలపై ఉంది.

పి.మహేష్

97003 46942

అవినీతి భరతం పట్టేదెవరు?

ఎక్కడ, ఎప్పుడు చూసినా అవినీతి దుర్వాసనలు గుప్పుమంటున్నాయి. అనాదిగా స్థానిక సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల వరకు అన్ని విభాగాల్లో/ స్థాయిల్లో అవినీతి భూతం రెచ్చిపోతున్నది. వార్డు మెంబర్ నుంచి కేంద్ర మంత్రుల వరకు అన్ని విభాగాల్లో ఆయా స్థాయిలో అవినీతి చెదలు దేశ శ్రేయస్సు ను భోంచేస్తున్నాయి. ప్రభుత్వ శాఖల్లో పని కావాలంటే ఆమ్యామ్యాలు ముట్టచెప్పాల్సిన అనివార్యం, అగత్యం ఏర్పడింది. అక్రమార్జనలకు అంతు లేకుండా పోతున్నది. అవినీతి నిరోధక శాఖలు ప్రతి రోజూ ఏదో ఒక అవినీతి చేపను వలపన్ని పట్టుకుంటున్నది, తర్వాత అవినీతికి తలవంచి వదిలేస్తున్నది. స్కామ్‌లు, లంచాలు నిత్యకృత్యం అయ్యాయి. ప్రభుత్వ శాఖలో పని జరగాలంటే ముట్టచెప్పాల్సిందే అని ప్రజలు దృఢ అభిప్రాయానికి వస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని పెంచి పోషిస్తున్న యంత్రాంగాలు, ఆహార సరుకుల కల్తీల లీలలు, నాణ్యతకు తిలోదకాలిస్తూ ప్రాజెక్టుల నిర్మాణాలు, పట్టపగలే లంచాలు తీసుకుంటున్న ప్రబుద్ధులు మన ముందు కాలర్ ఎగిరేస్తూ కార్లల్లో షికార్లు కొడుతున్నారు. మనిషిలో నైతికతకు గండిపడితే అవినీతి వరదలు ప్రవహిస్తాయని తెలుసుకోవాలి.

అవినీతి చెదలుకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్, అప్రమత్తత విభాగాలను ఎన్ని ఏర్పాటు చేసినా ఆయా శాఖల స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించే విధంగా ప్రభుత్వ ప్రబుద్ధుల్లో చిత్తశుద్ధి లోపించి అనవసర స్వార్థ పూరిత జోక్యంతో మూడు పువ్వులు ఆరుకాయలుగా అక్రమార్కులు విర్ధిల్లడం విచారకరం. భారత ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో పని తీరును మెరుగుపరచడం, పారదర్శకత పెంచడం, కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలు నిర్వహించడం, ఫిర్యాదుల విభాగాలను బలోపేతం చేయడం, ఆరోపణలు గుప్పుమన్నపుడు వెంటనే నిష్పాక్షిక విచారణ జరపడం, విజిలెన్స్ విషయంలో అత్యాధునిక డిజిటల్ సదుపాయాలను వినియోగించుకోవడం లాంటి లక్ష్యాలతో ఏట 27 అక్టోబర్ నుండి 02 నవంబర్ వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు లేదా విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్‌ను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఈ వారోత్సవాల్లో భాగంగా దేశ సమగ్రతను కాపాడడం, అవినీతి నిర్మూలన, బంధుప్రీతి చూపడం, పక్షపాతాన్ని పెంచిపోషించడం, లంచం ఇవ్వడమా కాదు లంచాన్ని తీసుకోవడం కూడా నేరమని అవగాహన పర్చడం కొనసాగుతున్నది.

నవ భారతదేశాన్ని నిర్మించడానికి మన జీవితాల్లో నైతిక విలువలను పెంపొందించడం, ప్రోత్సహించడం అత్యవసరమని అవగాహన కల్పించడం కొనసాగుతున్నది. దేశ శ్రేయస్సుకు నైతిక సమాజ స్థాపన అనే థీమ్‌ను తీసుకొని ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నది. ప్రతి భారతీయుడు అప్రమత్తంగా ఉండాలని, ఎల్లవేళల నిజాయితీ/ చిత్తశుద్ధి అత్యున్నత ప్రమాణాల్లో ఉండాలని, అవినీతి రహిత సమాజ స్థాపనకు ప్రతినబూనాలని ప్రజలను కోరుతున్నారు. సంతానం కమిటీ సిఫార్సుల ఆధారంగా దేశ సమగ్రత కాపాడడం, పారదర్శకత పెంచడం, జవాబుదారీతనాన్ని అమలు చేయడం, అవినీతి నిర్మూలన లాంటి ధ్యేయాలతో 1964లో భారత ప్రభుత్వం ‘సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లేదా సివిసి’ అనబడే అత్యున్నత ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేసింది. విజిలెన్స్ కార్యకలాపాల్లో సున్నితమైన ప్రాంతాల్లో సిబ్బంది పర్యవేక్షణ, ఫిర్యాదుల విచారణ, దుష్ప్రవర్తనలకు ఆస్కారం లేకుండా విధుల నిర్వహణకు సలహాలు ఇవ్వడం, కాంట్రాక్టుల పర్యవేక్షణ/ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం లాంటి ప్రధాన విధులతో సివిసి, ఇతర విజిలెన్స్ శాఖలు పని చేస్తున్నాయి.

విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా విద్యాలయాల్లో నైతిక ప్రవర్తన ప్రాధాన్య అంశాలను తీసుకొని పలు పోటీలను నిర్వహించడం, విజిలెన్స్ విభాగాలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, నైతిక ప్రవర్తన ప్రదర్శించిన సిబ్బందిని సన్మానించడం, విజిలెన్స్ అవగాహన ప్రతిజ్ఞను సామూహికంగా చేయించడం, దేశ శ్రేయస్సు కోరి నీతినిజాయితీలను పెంచి పోషించడం లాంటి పలు కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. రాజకీయ నాయకుల్లో నైతిక ప్రవర్తన పెరిగితే ప్రభుత్వ శాఖల్లో కూడా అవినీతి తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నేడు మెజారిటీ ప్రజా ప్రతినిధులు అవినీతి ఆరోపణల అభియోగాలను ఎదుర్కొంటున్నారు. దీపావళి పర్వదిన వేళల్లో మన జీవితాల్లో వెలుగులు ప్రసరించడానికి నైతిక సమాజ స్థాపన జరగాలని, ప్రతి ఒక్కరూ అసలుసిసలైన ‘భారతీయుడు’ కావాలని, అవినీతి రహిత భారత కలలను సాకారం చేయడానికి అందరం చేయిచేయి కలిపి అవినీతి అనకొండలను ఆమడదూరం తరిమేద్దాం, నీతినిజాయితీ వర్ధిల్లే సమాజ స్థాపనకు కృషి చేద్దాం. 

– డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి

– 99497 00037

కదులుతున్న ప్రజాస్వామ్య పునాదులు

గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రజాస్వామ్యాన్ని ప్రజలచే ఏర్పడే ప్రజల ప్రభుత్వంగా వివరించాడు. అనంతరం ప్రముఖ అమెరికా దేశ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల ద్వారానే నడిచే ప్రభుత్వం అని అద్భుతంగా నిర్వచించాడు. కాలక్రమేణా ఈ భావన ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి, అనేక దేశాల పాలనా విధానాలకు మార్గదర్శకంగా నిలిచింది. భారతదేశం కూడా తన రాజ్యాంగ ప్రవేశికలో భారతదేశం ఒక ప్రజాస్వామ్య గణతంత్ర దేశం అని గర్వంగా ప్రకటించింది. ప్రజాస్వామ్యం అనేది ప్రజల సంకల్పానికి ప్రతిబింబం, ప్రజల హక్కులకు పరిరక్షణ, ప్రజల శ్రేయస్సుకై నడిచే పటిష్టమైన జవాబుదారీ పాలనా విధానం. రాచరిక వ్యవస్థలను రూపుమాపి, ప్రజలే ప్రభువులు అనే భావంతో ఏర్పడిన ప్రజాస్వామ్యంలో రాజకీయం ప్రధాన పాత్రను పోషిస్తుంది. రాజకీయం అంటే ప్రజా శ్రేయస్సు కోసం అవసరమైన ప్రణాళికలను సిద్ధంచేసి, వాటిని సక్రమంగా అమలు చేయడానికి పన్నే యుక్తి. ప్రజాస్వామ్యంలో ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధి కోసం అవసరమైన పాలన యుక్తులను పన్నే ప్రజా నాయకులను ప్రజలే ఎన్నుకుంటారు; వారినే రాజకీయ నాయకులు అంటారు.

సంక్షిప్తంగా చెప్పాలంటే రాజకీయం అంటే పాలనా యుక్తి. ఆ యుక్తిని అమలు చేసే వారిని రాజకీయ నాయకులని అంటారు. కానీ నేటి పరిస్థితుల్లో రాజకీయం అంటే ఒకటి చెప్పి మరొకటి చేసే కుయుక్తిగా, నమ్మించి మోసం చేసే సాధనంగా మారిపోయింది. ఒకప్పుడు పాలనాదక్షతకు ప్రతీకగా ఉన్న రాజకీయం నేడు కపటానికి ప్రతిరూపంగా మారిపోతోంది. రాజకీయం చేయడం అనేది ఇప్పుడు ఒక మోసపూరితమైన మాటగా మిగిలిపోతోంది. మన కులమని, మన మతమని, మన ప్రాంతమని ప్రజలను ఎక్కడికక్కడ విభజిస్తూ తమ కుయుక్తులను పన్నుతున్నారు నేటి రాజకీయ నాయకులు. దీంతో రాజకీయాలు రోజురోజుకీ మరింత దిగజారిపోతూ ప్రజాస్వామ్యం పునాదులను కదిలించి వేస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ నాయకుల ఆలోచనా విధానంలో, మానసిక స్థితిలో గణనీయమైన అనైతిక మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి చిన్న కార్యక్రమాన్నీ ఎంతో గొప్పగా చెప్పుకునే నాయకులు, అదే కార్యక్రమాలను వారి ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు నిర్వహిస్తే, వారిని తీవ్ర పదజాలంతో విమర్శించడం నేటి రాజకీయ సంస్కృతిగా మారిపోయింది.

ఒక రాజకీయ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని గుడ్డిగా మరో పార్టీ వ్యతిరేకించడమే రాజకీయమని భావించే పరిస్థితి ఏర్పడింది. ప్రెస్‌మీట్లు పెట్టి నిర్మాణాత్మక చర్చలను జరపకుండా, సద్విమర్శలను చేయకుండా, మంచి సలహాలను సూచించకుండా ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు, పరుష పదజాలంతో దూషణలు చేసుకుంటూ, ప్రజాభివృద్ధికి ఉపయోగించవలసిన విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. నేటి రాజకీయ పార్టీలు ప్రజల కోసం పనిచేసే అత్యుత్తమ సేవా రంగాలుగా కాకుండా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసే అవినీతి వ్యాపార సంస్థలుగా మారిపోతున్నాయి. రాజకీయ పార్టీలు వాటిని నడిపే నాయకుల ఆలోచనా ధోరణి ఈ విధంగా ఉంటే ప్రజాస్వామ్య విలువలు క్రమక్రమంగా అంతరించిపోయి, ప్రజా ప్రభుత్వాలలో ‘ప్రజా’ అనే పదం పోయి ప్రభుత్వాలు మాత్రమే మిగులుతాయి. ప్రజల ఓటు ద్వారా ఎన్నిక కాబడిన ప్రజా ప్రభుత్వాలు ప్రజలకు శాశ్వతమైన అభివృద్ధిని అందించకుండా వారిని ఆకర్షించడానికి ఎటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు లేని సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలను మోసం చేస్తున్నాయి. సమాజ, దేశ అభివృద్ధి కంటే వారి పార్టీ ప్రయోజనాలే ప్రధానమనేలా రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారు.

ఎన్నికల ముందు ప్రజల ఓట్ల కోసం తప్పు అని తెలిసినా తప్పుడు హామీలు ఇస్తూ ప్రజల బలహీనతలతో ఆడుకుంటున్నారు ఈ రాజకీయ నాయకులు. ప్రజలు కూడా తాత్కాలికమైన ప్రయోజనాలకు ఆశపడి అప్రయోజకులను తమ నాయకులుగా ఎన్నుకొని వారి అభివృద్ధిని వారే నాశనం చేసుకుంటున్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ప్రభుత్వాలు మారుతున్నా, పాలనా విధానాలలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా సమాజ అభివృద్ధి కంటే వారి పార్టీ అభివృద్ధికే పెద్దపీట వేస్తుంది. నేటి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఐదేళ్లకోసారి, ఓటు వేసే ముందు మాత్రమే ఈ రాజకీయ నాయకులకు కనిపిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యపు అర్థాన్ని అపహాస్యం చేస్తుంది. రాజకీయ నాయకులు చేసే అక్రమాలు, తప్పులను, వారిని గుడ్డిగా అభిమానించే అభిమానులు ఏమాత్రం ఆలోచించకుండా సమర్థిస్తూ ఉంటారు.

వారు అభిమానించే నాయకుడు తప్పు చేసినప్పుడు అతనిని ఎవరైనా విమర్శిస్తే, ఈ అభిమానులు సామాజిక మాధ్యమాలలో తమ నాయకుడిని విమర్శించిన వారిపై విపరీతమైన దుర్భాషలతో పోస్టులు పెడుతున్నారు. విమర్శించిన వారిని కించుపరిచే విధంగా మీమ్స్, మార్పిడి ఫోటోలు అసభ్యంగా తయారు చేసి షేర్ చేస్తున్నారు. ఇది సమాజానికి చేటుచేసే విష సంస్కృతి. నిజమైన అభిమానం అంటే, ఒక నాయకుడిని గుడ్డిగా సమర్ధించడం కాదు. ఆ నాయకుడు చేసే మంచి పనుల నుంచి స్ఫూర్తిని పొందడం, తప్పు జరిగినప్పుడు సద్విమర్శలు చేయడం. కానీ, గుడ్డి అభిమానంతో అసభ్యకరమైన చర్చలు, పోస్టులు సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తూ సంఘ వ్యతిరేక శక్తులుగా మారుతున్నారు ఈ అభిమానులు. నేటి రాజకీయ నాయకులు మాయ మాటలతో అభిమానులను రెచ్చగొట్టి వారి స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి ఆలోచనా విధానాన్ని నాయకులు మార్చుకోవాలి. లేకపోతే సమాజంలో ఐక్యత దెబ్బతింటుంది. నాయకులు తమ అభిమానులకు సరిగ్గా మార్గనిర్దేశం చేయాలి.

ఎందుకంటే, తప్పు చేసినా కూడా పొగిడే అభిమానులను కలిగి ఉన్న నాయకుడు ఎప్పటికీ నైతికంగా అభివృద్ధి చెందలేడు. కాబట్టి, నాయకులు తమ అభిమానుల్లో స్ఫూర్తిని రగిలించి, వారు సమాజానికి గొప్పగా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలి. ప్రజాస్వామ్యాన్ని సమాజంలో పటిష్టంగా నిర్మించాలంటే కేవలం చట్టాలను రూపొందించడం మాత్రమే కాక, వాటిని ప్రభుత్వాలు చిత్తశుద్ధితో, సమర్థవంతంగా అమలు చేయాలి. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలోనే వారి పాత్ర ఆగిపోకూడదు. తమ ఓట్ల ద్వారా నాయకులను ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రజలు, ఆ ప్రభుత్వ బాధ్యతలను నిర్వహిస్తున్న నాయకులు ప్రజాస్వామ్య పరిరక్షణకై సమన్వయంతో కలిసి పనిచేయాలి. నాయకులు ప్రజలు వారికి కట్టిపెట్టిన అధికారాన్ని ప్రజాశ్రేయస్సు కోసం వినియోగించాలి.

నాయకులు పెత్తనం చెలాయించే అధికారులుగా కాక, ప్రజాక్షేమం కోరుకునే సేవకులుగా పనిచేయాలి. అభిమానులు వ్యక్తులను కాక, ఆ వ్యక్తులు చేసే గొప్ప కార్యక్రమాలను అభిమానించాలి. తమ అభిమాన నాయకుడిపై విమర్శలు వచ్చినప్పుడు, ఆ విమర్శలలో నిజాన్ని విశ్లేషించి, నిర్మాణాత్మకంగా స్పందించాలి. అంతేగాని, ఒకరు విమర్శించగానే గుడ్డిగా తమ అభిమాన నాయకులను సమర్ధించకూడదు. ప్రజాస్వామ్యంలో విశ్లేషకుల నిర్మాణాత్మక చర్చలు, విశ్లేషణలు, ప్రతిపక్షాల సద్విమర్శలు, పోరాటాలు అన్నీ ముఖ్యమైన అంశాలే. ఇవి ప్రజలకు విషయాలపై అవగాహన కలిగిస్తాయి. ప్రభుత్వాలను పరిపాలించే రాజకీయ నాయకులు, వారిని ఎన్నుకున్న ప్రజలు, నాయకుల చుట్టూ ఉన్న అభిమానగణం, ప్రభుత్వ అధికారులు, ప్రతిపక్షాలు అందరూ సమష్టిగా, అవగాహనతో చట్టాలను అమలు చేయగలిగితే ప్రజాస్వామ్యపు నిజమైన అర్థం శాశ్వతంగా పరిరక్షించబడుతుంది. 

– ననుబోలు రాజశేఖర్, 9885739808

ప్రతీకారం వీడి పరస్పర మైత్రి

పరస్పర ప్రతీకార సుంకాల హెచ్చింపులతో ప్రపంచ వాణిజ్యాన్ని గందరగోళ పరుస్తున్న అమెరికా, చైనా అధినేతల మధ్య దక్షిణ కొరియా లోని బుసాన్ వేదికగా భేటీ జరగడం అనూహ్య పరిణామం. ఆరేళ్ల తరువాత ఇరువురు నేతలు కలుసుకోవడం ఇదే మొదటిసారి. బుసాన్‌లో దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో తాను ఒప్పందం కుదుర్చుకున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు ఏప్రిల్‌లో తాను చైనా పర్యటిస్తానని, ఆ తరువాత జిన్‌పింగ్ అమెరికా పర్యటన ఉంటుందని ప్రకటించారు. నిన్నమొన్నటివరకు శత్రువులుగా కత్తులు నూరుకున్న అగ్రనేతలు ఇద్దరూ దోస్తీ కావడం మంచి పరిణామమే. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇంకా తనదారిలోకి సరిగ్గా రావడం లేదని, అందుకని చైనాతో స్నేహం పెంచుకుంటే ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపేందుకు పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావచ్చన్నది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఈ భేటీలో ఈ విషయాలేవీ ప్రస్తావనకు రాకుండా కేవలం వాణిజ్య అంశాలపైనే వీరు దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే షట్‌డౌన్‌లో నడుస్తోన్న అమెరికా ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే ట్రంప్ ప్రస్తుత ప్రధాన లక్షంగా కనిపిస్తోంది.

అధిక సుంకాల వల్ల అమెరికాకు ఎగుమతులు తగ్గిపోవడంతో చైనా కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ దశలో ఇరుదేశాలు పరస్పర ప్రయోజనాలు సాధించుకోవడానికి ప్రయత్నించడం ఎంతైనా అవసరం. అయితే ట్రంప్ చెప్పే దానికి, చేసే దానికి మధ్య ఉన్న అవాంతరాలను ఎదుర్కోవడానికి ప్రపంచం అలవాటుపడిన తరుణంలో ఆందోళనలకు కొంత విరామం కలిగి ఉండవచ్చు. అన్ని సమస్యలు క్లుప్తంగా పరిష్కరించబడతాయని నమ్మడమంటే ఈసారి ట్రంప్ తన మాటలను చేతలతో నిరూపించడానికి మొగ్గు చూపిస్తుండడమే కావచ్చు. చైనాపై అమెరికా విధించిన సుంకాలు 10 శాతం వరకు తగ్గుతాయని ట్రంప్ ప్రకటించారు. 57 శాతం నుంచి 47 శాతానికి సుంకాలు తగ్గుతాయి. దీనికి బదులుగా చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులపై ఏడాది కాలం వరకు ఆంక్షలను తొలగించింది. దీంతో సరఫరా గొలుసులకు అంతరాయం కలిగిస్తూ, ప్రపంచ వాణిజ్యాన్ని ఛిన్నాభిన్నం చేసిన వాణిజ్యయుద్ధం ముగింపు ప్రారంభమైందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

అమెరికాతో ఒప్పందానికి అన్ని దేశాలు సన్నద్ధం కావడానికి లేదా వారి ఎగుమతి గమ్యస్థానాలను గుర్తించడానికి అవకాశాలు కలగవచ్చు. గత ఆరు నెలలుగా ట్రంప్ చపలమైన ఇష్టాయిష్టాలు, ఊహాగానాలతో అధిక సుంకాలు, ప్రతీకార సుంకాలతో ఆర్థిక వాణిజ్య లావాదేవీలు ప్రపంచ దేశాల్లో అస్తవ్యస్తమయ్యాయి. చైనా, బ్రెజిల్ తోపాటు భారత్‌కూడా దీనికి బాధితురాలైంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల ద్వారా రష్యా ఖజానాను నింపుతుండడం ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధానికి దోహదం చేస్తోందని భారత్‌పై విచక్షణారహితంగా ట్రంప్ నిందారోపణ చేయడం తీవ్రంగా కొనసాగుతోంది. అందువల్ల భారత్ కూడా అమెరికా నుంచి అత్యధిక సుంకాల బాధితురాలు కావలసి వస్తోంది. అందుకనే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపాలన్న డిమాండ్ ట్రంప్ నుంచి పదేపదే వస్తోంది. ఈ మేరకు రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులకు కూడా బ్రేక్ పడినట్టు పరిస్థితులు తెలియజేస్తున్నాయి.

సింథటిక్ మత్తు పదార్థం ఫెంటానిల్ తయారీకి అవసరమైన రసాయనాల సరఫరాను నివారించాలన్న అమెరికా విజ్ఞప్తిని చైనా అంగీకరించడంతో ఫెంటానిల్ విషయంలో చైనాపై ప్రతీకారంగా విధించిన 20 శాతం సుంకాల్లో 10 శాతం తగ్గిస్తానని ట్రంప్ జిన్‌పింగ్‌తో భేటీ సందర్భంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత్, బ్రెజిల్‌తో కూడా త్వరలో వాణిజ్య ఒప్పందాలు సమంజసమైన రీతిలో కుదుర్చుకునేలా ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చిందా అన్న ప్రశ్న ఎదురవుతోంది. అమెరికాకు దిగుమతి అయ్యే ఏ వస్తువులపైనయినా సరే సుంకాలు అధికంగా విధిస్తే అమెరికాలోని పౌరులు ప్రతివారూ తమ జేబులోంచి ఎక్కువగా చెల్లించుకోవలసి వస్తుందని ట్రంప్ ఇప్పటికైనా గ్రహించారా అన్న చర్చ సాగుతోంది. కెనడాపై టారిఫ్‌ల భారాన్ని రోనాల్డ్ రీగన్ వ్యతిరేకించగా, ఆ అభిప్రాయాన్ని తిరిగి తెరపైకి తీసుకురావడానికి వీలుగా ట్రంప్ టారిఫ్ తంత్రాలు చాలావరకు ఆగిపోవాల్సి వచ్చినప్పుడు, ప్రపంచ వాణిజ్యంలో కొంత క్రమబద్ధీకరణ జరిగినప్పుడు 2026 నుంచి సజావుగా సాగుతుందని అంచనా వేయడం కష్టం.

రష్యానుంచి కొనుగోళ్లను తగ్గించడాన్ని భారత్ సమర్థిస్తోంది కాబట్టి దానికి తగ్గట్టు భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయాలన్న తార్కిక ఆలోచతో భారత్ ఎదురు చూస్తోంది. ట్రంప్‌ను, అమెరికా రైతులను సంతోషపెట్టడానికి సోయాబీన్‌ను కొనుగోలు చేస్తామని చైనా బలవంతంగా అంగీకరించి ఉండవచ్చు. కానీ ఇదే విషయంలో భారత్ సందిగ్ధంలో పడవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా సార్వత్రిక గందరగోళం తలెత్తిన కొన్ని నెలల తరువాత అమెరికాలో పెట్రోలు ధరలు, సూపర్ మార్కెట్లలో కిరాణా సామాన్ల ధరలు బాగా తగ్గించగలిగానని ట్రంప్ తన విజయాలుగా చాటుకుంటున్నప్పటికీ, ట్రంప్ తన తీవ్ర వైఖరి నుంచి వెనక్కు తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అది మంచిదే అయితే ఊదరగొట్టే చర్యలు, ప్రతీకార సుంకాల విధింపులు ఎన్ని అనుభవించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను ప్రపంచ అగ్రరాజ్యాలు రెండూ అర్థం చేసుకున్నాయి. అమెరికాకు చైనాతో ఉన్న భారీ వాణిజ్య లోటు పోరాటానికి కారణమైనప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రమాదం లోకి నెట్టేంత రిస్క్ వారు తీసుకోలేకపోయారు. 

కులం పునాదులు కూలాల్సిందే

‘భారత దేశంలో కులం సామాజిక సామరస్యతను పరిరక్షించడానికి ఉపయోగపడింది. అంతేకాని కులం ప్రగతి నిరోధకమైంది కాదు’ అంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం గత నెల సెప్టెంబర్ 23వ తేదీన సుప్రీంకోర్టు ముందు ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ సమస్యకు సంబంధించి దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఇందుకు గాను మధ్యప్రదేశ్ ప్రభుత్వం మౌలోని డా॥ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి ఎందిన సోషల్ సైన్సెస్ విభాగం నిర్వహించిన ఒక సామాజిక సర్వేను తన అఫిడవిట్‌లో ప్రస్తావించింది. వెనుకబడిన తరగతుల సామాజిక ఆర్థిక, విద్య, రాజకీయ స్థితిగతులపై ఈ సర్వే జరిగింది. ఈ సర్వేలో మిగతా విషయాలు ఎట్లా ఉన్నప్పటికీ, కులంపై చేసిన వ్యాఖ్యానం కేవలం సైద్ధాంతిక సమస్య మాత్రమే కాదు. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర. ఇటువంటి వాదనలు రెండు విషయాలను మరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా కులం అనే సమస్యపైన ఆర్‌ఎస్‌ఎస్‌లోని కొన్ని శక్తులు భారతదేశ వాస్తవిక స్థితిని మరుగు పరిచి, క్రమంగా రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను పట్టించుకోకపోవడం గాని, క్రమంగా వాటిని రాజ్యాంగం నుంచి తొలగించడానికి ప్రయత్నం జరుగుతున్నది.

భారతదేశంలో కులం ఎన్నో అనర్థాలకు దారి తీసిందని, మరెన్నో ఘాతుకాలు జరిగాయని, ముఖ్యంగా మనుషుల్లో ఉండాల్సిన మానవ సంబంధాలను కేవలం హెచ్చుతగ్గుల సాంప్రదాయంగా మార్చి, ఒకరి మీద మరొకరు ఆధిపత్యం చెలాయించడానికి వాడుకున్నారని చరిత్ర పొడవునా ఎన్నో రుజువులున్నాయి. భారతదేశంలో కులం అనేది లేదని, పాశ్చాత్య ఆక్రమణదారులు దీనిని సృష్టించారని మరొక ప్రచారం. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న వాళ్లు కళ్లు ఉన్న అంధులు తప్ప ఎక్కువ చెప్పిన ప్రయోజనం లేదు. కులం ఉనికిలో ఉన్నదని వీళ్లు అంగీకరిస్తున్నారు. అయితే ఈ కులం సామాజిక ప్రగతికి మాత్రమే ఉపయోగపడిందని వారి భావన. ఒకవేళ అదే నిజమైతే చరిత్ర పొడవునా జరిగిన ఘర్షణలు, యుద్ధాలు వీళ్లకు కనిపించలేదు.

వీళ్లు నమ్ముతున్న పురాణాలు కూడా అదే విషయాన్ని రుజువు చేయడం లేదా! భారతదేశ సాంప్రదాయానికి ప్రధాన గురువులైన వశిష్టుడు, విశ్వామిత్రుడు జరిపిన సంఘర్షణ బ్రాహ్మణ క్షత్రియ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కాదా! అదే విధంగా బ్రాహ్మణ వర్గమంఆ యాగాల పేరుతో జాతి సంపదను అగ్గిపాలు చేస్తుంటే, మిగతా కులాలు, వర్గాలు తిరగబడితే, తమ మనస్సు నచ్చు గోమాంసం తినడం మానేసి మళ్లీ తమ ఆధిపత్యం కోసం ఆర్థిక దోపిడీ కోసం సాంప్రదాయాలను సృష్టించడం లేదా! భారతంలోని కథలన్నీ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదుర్కొన్న క్షత్రియుల హత్యల ఉదంతాలు కావా!

అంతేకాకుండా గౌతమ బుద్ధుని మొదలుకొని బాబా సాహెబ్ అంబేద్కర్ దాకా సాగించిన సామాజిక ఉద్యమం ఎందుకు? గురునానక్, కబీర్, జ్ఞానేశ్వర్ తుకారాం, చొక్కామేళా, గాడ్గేబాబా, జ్యోతిబా ఫూలే, సావిత్రి భాయి ఫూలేలు ఎందుకు తమ కులాధిపత్య పోరాటాలకు అంకితం చేశారు? ఇది చరిత్ర. వర్తమానంలోకి వస్తే ఇప్పటికీ దళితుల మీద ఎందుకు హత్యలు, అత్యాచారాలు, దాడులు, అవమానాలు జరుగుతున్నాయి. ఇవి సామరస్య హత్యలా, విద్వేష హత్యలా! ఒక చిన్న పిల్లవాడు పాఠశాలలో నీటి కుండను ముట్టుకున్నాడని కర్రతో కొట్టి చంపింది కూడా కుల సామాజిక సామరస్యమేనా? కీలవేణిమని, బెల్చి, కారంచేడు, చుండూరు, ఖైర్లాంజి లాంటి అతి ఘోరమైన దళితుల ఊచకోత సామాజిక సామరస్యతకు నిదర్శనమా? అయితే ఇవన్నీ తెలియక కాదు. కావాలని ఒక కుట్రపూరితమైన చర్చను లేవనెత్తుతున్నాయి. అది కూడా ప్రజాస్వామ్య విధానంలో, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం అటువంటి అభిప్రాయాన్ని అది కూడా సుప్రీంకోర్టు ముందు పెట్టడం యాదృచ్ఛికం కాదు.

భారతదేశ సుప్రీం కోర్టుకు ఒక ప్రధానమైన బాధ్యత ఉంది. అది రాజ్యాంగ విలువలను కాపాడడం, హక్కులను రక్షించడం. అయితే ఇటువంటి వాదనలు సుప్రీం కోర్టు ముందు పెట్టడమంటే, ఎంతో మంది దార్శనికులు, రాజ్యాంగ నిపుణులు, ప్రత్యేకించి బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని నిరాకరించడమే. నిజానికి ఈ ఒక్క విషయం చాలు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడానికి. ఎందుకంటే పదవీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తాము రాజ్యాంగ విలువలను కాపాడుతామని ప్రమాణం చేస్తారు. ఈ అఫిడవిట్‌లో పేర్కొన్న అంశం పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైనది.

భారత రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పూర్తిగా భారత దేశంలో ఉన్న సామాజిక వ్యత్యాసాలు, ప్రత్యేకించి కులవ్యవస్థ, అంటరానితనం నిర్మూలన జరగాలని ఉద్దేశించినవి. ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 14 నుంచి 21 వరకు సంపూర్ణంగా కుల అసమానతలను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. అదే విధంగా ఆదేశిక సూత్రాలలోని చాలా అంశాలు కుల అసమానతలను రూపుమాపడానికి ఉపయోగపడతాయని భావించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు కూడా మౌనం వహిస్తే దాని అర్థం ఏమిటో తెలియదు. ఇటు ప్రజా ఓట్లతో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఇటువంటి వ్యాఖ్యలు భవిష్యత్‌లో రాజ్యాంగ విలువలను సంపూర్ణంగా మార్చి సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను పెంచి పోషించే కుల వ్యవస్థను మళ్లీ మనం తిరిగి మరింత బలం చేకూర్చినట్టవుతుంది.

అదే విధంగా కుల వ్యవస్థ వలన సామాజిక రంగంలోనే కాదు, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అది మరింత పటిష్టంగా కనపడుతున్నది. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు కేవలం ఉపాధి, వ్యాపారం, వాణిజ్యం మాత్రమే కాదు కులం కూడా ఈ అసమానతలను పెంచి పోషిస్తున్నది. ఈ రోజు దేశంలో వ్యాపారాలు, పరిశ్రమలు, కార్పొరేట్లు కొన్ని కులాలకే పరిమితమవుతున్నాయి. ఆయా రంగాల్లో ఆ కులాలు ఆధిపత్యం నిరంతరం కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఇందులో ఎటువంటి మార్పులు లేవు. ఈ విషయాలపైన ఎన్నో పరిశోధనలు జగిగాయి. జరుగుతున్నాయి. వ్యాపారాలు, పరిశ్రమలు కొన్ని కులాలకు డబ్బులు ఆర్జించి పెట్టి లక్షల కోట్ల అధిపతులను చేసే అదే వ్యాపార, పారిశ్రామిక వర్గాలు కంపెనీల్లో పని చేసి ప్రాణాలు కోల్పోవడం నిమ్న కులాల వంతుగా మారింది. దానికి ఎన్నైన ఉదాహరణలు ఇవ్వవచ్చు. ఆధిపత్య కులాలు అన్ని రంగాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంటే, మిగతా కులాలు పేదరికంలో మగ్గుతున్నాయి.

విద్య, వైద్య సౌకర్యాలు కూడా ఎవరికి అందుబాటులో ఉన్నాయి? వరదల్లో కరువులో ఎవరు ఆకలి చావుల్లో బతుకుతున్నారు? రైతుల ఆత్మహత్యల్లో ఏ కులాలు ఉన్నాయి? ఇవన్నీ తెలియని విషయాలు కాదు. ఈ విషయాలు మాట్లాడుతున్న వాళ్లు చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. అయితే ఈ కుల వ్యవస్థ వల్ల అనేక సమస్యలకు, అసమానతలకు, అవమానాలకు, హత్యలకు, అత్యాచారాలకు గురవుతున్న నూటికి ఎనభై శాతం మంది వివక్షకు గురవుతున్న కులాలు ఇప్పటికైనా మేల్కోవాలి. ఈ దేశంలో కులం ఉన్నంత వరకు ఈ అవమానాలు, వివక్ష సమసిపోదని గుర్తించాలి. బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు కుల వ్యవస్థ ఈ దేశ విచ్ఛిన్నానికి కారణం కాగలదని, కులం పునాదుల మీద జాతిని, నీతిని నిర్మించలేమని అర్థం చేసుకోవాలి. 

– మల్లేపల్లి లక్ష్మయ్య (దర్పణం)

యుద్ధోన్మాదాల మాయా ప్రపంచం

ప్రపంచ చరిత్రను తిప్పిచూసినా, యుద్ధాల జాడ కనిపిస్తుంది. కాలం మారినా, మనిషి ఆలోచన మారినా యుద్ధం అనే ఆతురత మాత్రం మానవ స్వభావంలో ఏదో మూలన దాగి ఉంది. కొన్నిసార్లు అది అహంకారంగా పుట్టుతుంది. కొన్నిసార్లు భయంగా, మరికొన్నిసార్లు ఆత్మరక్షణ అనే పేరుతో రూపం దాలుస్తుంది. దేశాల మధ్య యుద్ధాలకు ప్రధాన కారణం అధికారం మీద ఆకాంక్ష. ఒక దేశం తన ప్రభావాన్ని మరొక దేశంపై చూపించాలనే ప్రయత్నం చేస్తుంది. సరిహద్దులు విస్తరించాలనే ఆశ, ఆర్థిక వనరులపై ఆధిపత్యం సాధించాలనే తపన, వ్యూహాత్మక ప్రాధాన్యమున్న ప్రాంతాలపై కన్నేయడం ఇవన్నీ యుద్ధాలకు విత్తనాలు వేస్తాయి. ఒక దేశం ప్రజాస్వామ్య మార్గంలో నడుస్తే, ఇంకో దేశం నియంతృత్వం దిశగా సాగుతుంది. ఆ విలువల మధ్య ఉన్న భిన్నతే కొన్ని సందర్భాల్లో సాయుధ ఘర్షణలకు దారితీస్తుంది. అయితే ఇవి కేవలం సిద్ధాంతాల మధ్య పోరాటం కాదు వాటి వెనుక మనుషుల భావాలు, ఆశలు, భయాలు కూడా ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాలు కూడా యుద్ధాలను ప్రేరేపిస్తాయి. చమురు, బంగారం, నీరు, ఖనిజాలు వంటి సహజ వనరులు ఉన్న ప్రాంతాలు ఎప్పుడూ ఆర్థిక స్పర్ధకు వేదిక అవుతాయి.

ఎవరైతే ఆ వనరులను నియంత్రిస్తారో, వారే ప్రపంచానికి నియంత్రణ కలిగి ఉంటారనే భావనతో దేశాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా నిలబడతాయి. కానీ ప్రతి యుద్ధం వెనుక ఒక మానవ కథ ఉంటుంది. ఒక సైనికుడి కన్నీరు, ఒక తల్లి ఆవేదన, ఒక చిన్నారి భయం – ఇవే నిజమైన యుద్ధ దృశ్యాలు. గెలిచిన దేశమూ, ఓడిన దేశమూ చివరికి గాయాలతోనే మిగిలిపోతాయి. యుద్ధం ఎవరినీ సంతోషపెట్టదు; అది కేవలం నష్టాల పునాదిపై నిర్మితమైన విజయాన్ని మాత్రమే అందిస్తుంది. నేటి ప్రపంచం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా, యుద్ధాల రూపంమారినా వాటి మూలస్వభావం మాత్రం మారలేదు. ఇప్పుడు బాంబులు, కత్తులు కాకుండా సాంకేతిక ఆయుధాలు, సైబర్ దాడులు, ఆర్థిక ఆంక్షలు యుద్ధ రూపాలు అవుతున్నాయి. కానీ అసలు తాత్పర్యం ఒకటే ఎవరో ఒకరు గెలవాలనే మనస్తత్వం. ఇలాంటి సమయాల్లో మానవ విలువలే అసలైన ఆయుధం కావాలి. సంభాషణ, పరస్పర గౌరవం, అవగాహన – ఇవే దేశాల మధ్య శాంతి దారులు. యుద్ధం అనేది ధైర్యానికి కాదు, సహనానికి పరీక్ష. ఎవరు శాంతిని కాపాడగలరో, వారు నిజమైన వీరులు. ప్రపంచం మొత్తానికీ ఈ సత్యం ఒక జ్ఞాపకం కావాలి.

యుద్ధం ఎవరికీ లాభం కాదు; ప్రేమ, నమ్మకం, సంభాషణ – ఇవే శాశ్వత విజయ మార్గాలు. మానవతనే యుద్ధం మీద గెలిచే ఏకైక శక్తి. గత నూరేళ్ల యుద్ధగాథలు – ప్రపంచానికి ఒక నేర్చుకోదగిన పాఠం ప్రపంచ చరిత్రలో గత నూరేళ్ల కాలం అత్యంత మార్పులు, పరీక్షలు, మానవతకు గాఢమైన పాఠాలు నేర్పిన కాలంగా నిలిచింది. ఈ శతాబ్దం రెండు ప్రపంచ యుద్ధాలతో మొదలై, శాంతి ప్రయత్నాలతో ముగిసిన అనుభవాల సమాహారం. యుద్ధం అనే పదం కేవలం పోరాటాన్ని మాత్రమే కాదు, మానవ మనసులోని ఆశలు, భయాలు, ఆధిపత్యం, రక్షణల మధ్య నడిచే సంఘర్షణను సూచిస్తుంది. ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభం నుంచే ప్రపంచ దేశాలు సాంకేతికంగా ఎదుగుతున్న సమయంలో, 1914లో యూరప్ దిశగా ఒక పెద్ద మంట మొదలైంది. ఆస్ట్రియా యువరాజు ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్యతో మొదలైన ఈ ఘర్షణ, క్రమంగా ప్రపంచ దేశాలను చుట్టుకుంది. ఆ యుద్ధంలో యూరప్ దాదాపు మొత్తం కుదేలైంది. కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. శాంతి కోసం ఏర్పడిన ‘లీగ్ ఆఫ్ నేషన్స్’ తర్వాతి కాలంలో ప్రపంచ సహకారానికి పునాదిగా మారింది.

మొదటి యుద్ధం ముగిసి ఇరవై ఏళ్లలోపే, ప్రపంచం మరలా ఆగ్రహాగ్నిలో చిక్కుకుంది. జర్మనీ, ఇటలీ, జపాన్ లాంటి దేశాల విస్తరణ వాంఛ, మరోసారి ప్రపంచాన్ని అగ్నిగుండం చేసింది. అణుబాంబులు, ట్యాంకులు, గగనయానాలు – మానవ విజ్ఞానానికి నొప్పి కలిగించే పరికరాలుగా మారాయి. చివరికి యుద్ధం ముగిసింది. కానీ ప్రపంచం రెండు శక్తులుగా విడిపోయింది. ఒకటి పశ్చిమ దేశాలు, మరొకటి తూర్పు బ్లాక్. ఇదే కాలం లో ఐక్యరాజ్యసమితి పుట్టింది – శాంతికి పునాది వేసిన ప్రపంచ వేదికగా. 1945 తర్వాత ప్రపంచం నేరుగా యుద్ధం చేయకపోయినా, ఆలోచనల యుద్ధం కొనసాగింది. అమెరికా, సోవియట్ రష్యా మధ్య నడిచిన ప్రచ్ఛన్నయుద్ధం అనేది ఆయుధాల పోటీగా, అంతరిక్ష పోటీగా, ఆర్థిక ఆధిపత్య పోటీగా మారింది. ప్రపంచ దేశాలు ఈ రెండు శక్తుల మధ్య సంతులనం పాటించే ప్రయత్నం చేశాయి. 1950 1975 మధ్య కాలం వరకు కొరియా యుద్ధం, వియత్నాం యుద్ధం వంటి ఘర్షణలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఇవి కేవలం ప్రాంతీయ సరిహద్దుల పోరాటం మాత్రమే కాకుండా, ప్రజల ఆత్మగౌరవం, స్వాతంత్య్రం కోసం జరిగిన త్యాగాల పాఠాలుగా నిలిచాయి.

మధ్యప్రాచ్యంలో జరిగిన యుద్ధాలు- సూయెజ్, ఇరాన్, ఇరాక్, గల్ఫ్ వంటి ఘర్షణలు చమురు ఆధారిత ఆర్థికత, భూభాగ ప్రాధాన్యం కారణంగా చోటు చేసుకున్నాయి. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. నగరాలు శిథిలమయ్యాయి, వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. కానీ ఆ దేశ ప్రజల ధైర్యం, దేశభక్తి ప్రపంచానికి స్ఫూర్తి ఇచ్చింది. శాంతి కోసం వారి ప్రయత్నం మానవ విలువల పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రపంచం నేడు కూడా యుద్ధాల భయంతో పూర్తిగా విముక్తి పొందలేదు. సాంకేతిక శతాబ్దంలోనూ యుద్ధాలు కొత్త రూపాల్లో కొనసాగుతున్నాయి. సరిహద్దుల వద్ద తుపాకీ శబ్దాలే కాకుండా, ఆర్థిక ఆంక్షలు, సైబర్ దాడులు, సమాచార మాయాజాలాలు, వ్యూహాత్మక ప్రభావ పోటీలు కూడా యుద్ధాలే అయ్యాయి. మధ్యప్రాచ్యంలో ఇంకా ఘర్షణలు ఆగలేదు; యూరప్ తూర్పు అంచుల్లో ఉక్రెయిన్ యుద్ధం నేటి మానవతకు సవాలు విసురుతోంది. ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లోనూ అంతర్గత ఘర్షణలు ప్రజల జీవితాలను కుదిపేస్తున్నాయి. శాంతి ఒప్పందాలు కుదురుతున్నా, అవిశ్వాసపు గోడలు మాత్రం ఇంకా కూలలేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఇప్పుడు తెలుసుకోవలసిన ఒక సత్యం ఉంది. యుద్ధం ఎవరికీ పరిష్కారం కాదు, శాంతి మాత్రమే మానవతకు ఆశ్రయం. ఆగ్నేయ, తూర్పు, పశ్చిమ ఏదైనా కావచ్చు, చివరికి ప్రతి మానవ హృదయంలో శాంతి అగ్ని వెలిగితేనే ఈ ప్రపంచం నిజమైన విజయం పొందుతుంది.

– చిటికెన కిరణ్ కుమార్ 94908 41284

శుక్రవారం.. షుక్రియా

శుక్రవారం… ముస్లింలకు పవిత్రమైన రోజు. మంత్రి మండలిలో మైనారిటీ మినిస్టర్ లేని లోటు సరిగ్గా నమాజ్‌కు కొద్దిసేపు ముందు తీరింది. అంతేనా! మరో 10 రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉండగా, అక్కడి ఓటర్లలో 30 శాతం ప్రాబల్యం గల ముస్లింల దృష్టిని అకస్మాత్తుగా ఆకర్షించింది. మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌ను తన కేబినెట్‌లోకి తీసుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టైమింగ్ ముచ్చటేస్తోంది. నిశ్శబ్దంగా ఉండీ ఉండీ ఒక్కసారిగా గుంపగుత్త ఓట్లపై గురిపెట్టారన్నది సమయం, సందర్భం, నేపథ్యం చెప్పకనే చెబుతున్నాయి. తన మంత్రి వర్గం పాక్షిక విస్తరణ ముహూర్తంలోనూ ముస్లింల మనోభావాలను గొప్పగా పాటించారు. శుక్రవారం ప్రమాణ స్వీకారం. మధ్యలో ఒక శుక్రవారం. తదుపరి శుక్రవారం (నవంబర్ 14, బాలల దినోత్సవం కూడా) ఓట్ల లెక్కింపు. మొత్తానికి శుక్రవారం షుక్రియాగా ఈ ఈవెంట్ నమోదైంది. జూబ్లీహిల్స్ లో 4 లక్షల మంది ఓటర్లలో లక్షా ఇరవై వేల మంది ముస్లింలే. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్ తక్షణ కర్తవ్యం ఏమిటో ఈరోజు నుంచే చూస్తున్నాం! ఎఐసిసి, సిఎం మధ్య సమన్వయం భాసిల్లుతోందని మంత్రివర్గం స్వల్ప విస్తరణ రుజువు చేసింది.

మూడు ఖాళీల భర్తీకోసం వేచిచూసి విసిగిపోతున్నారు ఆశావహులు. ఎందుకు నాన్చుతూ రెండేళ్ళు వెళ్ళదీశారో వారికి ఎరుకలోకి వచ్చినట్టయింది. మనకు గుర్తుండే ఉంటుంది. వైఎస్సార్ రెండోసారి ముఖ్యమంత్రి అవడానికి ముందు ఆంధ్రాలో ప్రచారానికి బయల్దేరారు. తెలంగాణలో పోలింగ్ సమయం ముగిసిందని తన చేతి గడియారం వంక చూసి, నిర్ధారించుకొన్నారు. హైదరాబాద్ పోవాలంటే మనకు వీసా కావాలా? అంటూ కోస్తాంధ్ర రాయలసీమ ఓట్లను ఒక్క వాక్యంతో బుట్టలో వేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అలానే సైలెంట్ వ్యూహాన్ని అమలు చేసే దాకా లోకానికి తెలియలేదు. ఇప్పటికిప్పుడు ఈ పొలిటికల్ డెవలప్‌మెంట్ ఎవరి ఊహకూ అందలేదు. కంటోన్మెంట్ మాదిరిగానే జూబ్లీహిల్స్‌లో విజయంపై గురి తప్పవద్దనే సిఎం సైలెంటుగా తన పని తాను చేసుకుపోతున్నారని విదితమైంది. తన రాజకీయ నిర్ణయాలను అమల్లోకి తెచ్చేదాకా రహస్యంగా ఉంచుతున్నారని తెలుస్తుంది. పోలింగ్‌కు 10 రోజుల ముందు తన మంత్రి మండలిలోకి అజారుద్దీన్‌ను తీసుకోవడం ఇందుకు కొనసాగింపు.

గెలుపోటములను తీక్షణంగా డిసైడ్ చేసే స్థాయిలో మైనారిటీల ఓట్లు జూబ్లీహిల్స్‌లో ఉన్నాయి. గుంభనంగా ఉంటూ ఉంటూ ఏకంగా అజారుద్దీన్‌ను కేబినెట్ లోకి సమయానుకూలంగా చేర్చుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికిప్పుడు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఎవరూ అంచనా వేయలేదు. ఎమ్మెల్సీ పదవి అజారుద్దీన్‌కు ఆల్రెడీ ప్రతిపాదించారు. తాను ఇక 6 నెలలలోపు ఏదో ఒక చట్టసభలో సభ్యుడు కావాల్సి ఉంటుంది. అజారుద్దీన్‌కు బెర్త్ కోసం ఎఐసిసి ఆమోదం ఉండకుండా ఉండదు. అంటే.. హైకమాండ్, రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ వ్యూహాల్లో సమన్వయంతోనే ఉన్నట్లు వేరే చెప్పక్కర్లేదు. మూడు ఖాళీలకుగాను అజారుద్దీన్‌కు స్థానంతో మంత్రి మండలిలో మైనారిటీలు లేని లోటు తీర్చడం, జూబ్లీహిల్స్‌లో వారి మద్దతు కూడగట్టేందుకు ఇంతకుమించిన మంచి సమయం మరొకటి ఉండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా, సమయస్పూర్తితో నిశ్చయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.

సిఎం రేవంత్ రెడ్డి శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్న దృశ్యాలు మనకు కనిపించిన 24 గంటల్లోనే మంత్రి మండలిలో మైనారిటీకి స్థానం అనే సంచలన సమాచారం దేనికదే అయినప్పటికీ… బిజెపి, బిఆర్‌ఎస్ ఎత్తుగడలకు ఏమాత్రం తక్కువ కాకుండా… అన్ని మతాలు, వర్గాల ఓట్ల కోసం రేవంత్ రెడ్డి మామూలుగా గురి పెట్టలేదని మాత్రం తెలుస్తున్నది. నవంబర్ 9 వరకూ స్వయంగా జూబ్లీహిల్స్ ప్రచారంలో లెగ్ వర్క్, ఫీల్ వర్క్ మొదలుపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట కొత్త మంత్రి అజారుద్దీన్ ఉండనుండడం రాజకీయ తెరపై సరికొత్త సన్నివేశం. జూబ్లీహిల్స్ లోనూ తన ఎత్తుగడలు క్లిక్ అయితే, సాధారణ ఎన్నికలకు ఏడాది లేదా రెండేళ్ల ముందు ఇలానే ఎవరికీ అంతుబట్టని అస్త్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయోగిస్తారు.

– ఇల్లెందుల దుర్గాప్రసాద్

94408 50384