ఎడిటోరియల్
Auto Added by WPeMatico
పాటతల్లి పెద్దకొడుకు గోరటి వెంకన్న
పర్యాటకానికి పెద్దపీట
లద్దాఖ్‌లో మరో జెన్‌జెడ్ విప్లవం?

కేంద్ర ప్రాంతమైన లద్దాఖ్ ఆందోళనలతో భగ్గుమంటోంది. కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌కు రాష్ట్రహోదా కల్పించాలని, భారత రాజ్యాంగం లోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని బుధవారం (24.9.25) నాడు జనం ముఖ్యంగా యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆందోళనకారుల డిమాండ్లు ఏమిటి? ఎందుకు ఇది నేపాల్‌లోని జెన్‌జెడ్ విప్లవం రీతిలో ఉధృతమైంది? కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇవన్నీ లోతుగా పరిశీలించవలసి ఉంది. 2019 లో ఆర్టికల్ 370 […]
ఉపాధ్యాయులకు టెట్ ని‘బంధనలు’

వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుంది విద్యా హక్కు చట్టం అమలుపై సుప్రీంకోర్టు తీర్పు. విద్యా హక్కు చట్టం- 2009 సెక్షన్ 23(1) ఆధారంగా జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సిటిఇ) 23-ఆగస్టు, -2010 నోటిఫికేషన్ ప్రకారం ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేసింది. టెట్ అంశం పై ‘అంజుమన్ ఇషాత్-ఎ-తలీమ్ ట్రస్ట్ vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర & ఆర్శ్’ కేసు విషయంలో జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ ఉపాధ్యాయులుగా నియమించబడ్డ […]
భారతీయుల భవిష్యత్తుపై హెచ్1బి ప్రభావం

అమెరికాలో ఉన్నత నైపుణ్యాలు కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించడానికి ప్రధాన ద్వారంగా ఉన్న హెచ్-1బి వీసా, భారతీయ యువతకు గ్లోబల్ అవకాశాల కోసం అనేక సంవత్సరాలుగా ప్రధాన మార్గంగా ఉంది. 1990లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ద్వారా ప్రవేశపెట్టబడిన ఈ వీసా ముఖ్యంగా టెక్నాలజీ, ఇంజినీరింగ్, వైద్య, పరిశోధన రంగాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ప్రతి సంవత్సరం 85,000 కొత్త హెచ్-1బి వీసాలను జారీ చేస్తున్నారు. అందులో 65,000 సాధారణ వర్గానికి, 20,000 […]
పచ్చదనం.. ప్రకృతికి ఇంధనం

గాలి, నీరు, పరిసరాలు కాలుష్య రహితంగా ఉన్నప్పుడే ఆరోగ్యం కూడా సక్రమంగా ఉంటుంది. వాతావరణం అవాంఛనీయ వాయువుల చేరికతో విషతుల్యం కావడం వలన అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా వినియోగించడం, వాతావరణంలో హరిత వాయువులు పెరగడం, ప్లాస్టిక్ వినియోగం తదితర కారణాల వలన పర్యావరణ సమస్యలు పెరుగుతున్నాయి. పర్యావరణ సంబంధిత సమస్యల వల్ల ఏటా 12 మిలియన్ల మంది ప్రజలు పలు అనారోగ్య సమస్యలకు గురై మరణిస్తున్నారు. ప్రపంచంలో తలెత్తే పలురకాల అనారోగ్య […]
కన్నడలో కుదరని కులాల సర్వేలు

కర్ణాటకలో కులాల సర్వేలు జరుగుతున్నా లింగాయత్, వక్కలిగ కులాల పెత్తనంతో ఏదీ ఒక కొలిక్కి రావడం లేదు. 2013లో కాంతరాజ్ సారథ్యంలోని బిసి కమిషన్, 2020-24లో జయప్రకాశ్ నేతృత్వంలోని బిసి కమిషన్ కులాలపై సర్వేలు నిర్వహించి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినా, ఆధిపత్య కులాలకు సంతృప్తి కలగక అభ్యంతరాలు లేవదీయడంతో కథ మళ్లీ మొదటికొస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సోమవారం (22.9.2025) నుంచి మళ్లీ కులాల సర్వే చేపట్టింది. 2015లో నిర్వహించిన సర్వేను పక్కనపెట్టింది. దీని […]
సుంకాల దెబ్బతో ‘స్వదేశీ’ గానం

భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల ముందు (సెప్టెంబర్ 21, 2025) జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ‘స్వదేశీ’ని మరోసారి పునరుజ్జీవింపు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్‌లు, హెచ్-1బి వీసా, ఫీజులు లక్ష డాలర్లకు పెంచిన నిర్ణయం వల్ల భారతీయ ఐటి కంపెనీలు, ఉద్యోగులు కష్టాల్లో పడ్డారు. ఈ నేపథ్యంలో మోడీ ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘స్వదేశీ 2.0’ అని పిలుపునిచ్చారు. ‘మన పెద్ద శత్రువు విదేశీ వస్తువులపై ఆధారపడటం’ […]
సమితి వేదికపైనా ట్రంప్ అదే పాట

తనను తాను పొగుడుకుంటే తన్నుకున్నట్లే ఉంటుందన్నది సామెత. అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఈ సామెత నూటికి నూరుపాళ్లూ వర్తిస్తుంది. తాను రెండోసారి పదవి చేపట్టాక ఎన్నో యుద్ధాలను ఆపానని, కాబట్టి తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని వితండవాదం చేస్తున్న ఈ పెద్దమనిషి, చివరకు ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలోనూ అదే పాట పాడారు. గత ఏడు నెలల్లో ఏడు యుద్ధాలను ఆపానంటూ చిట్టా విప్పిన ట్రంప్ మహాశయుడు పాకిస్తాన్-భారత్ ఘర్షణను కూడా మరొకసారి తన ఖాతాలోకే వేసుకున్నారు. […]