చితక్కొట్టిన వైభవ్.. డబుల్ సెంచరీ జస్ట్ మిస్
దుబాయ్: అండర్-19 పురుషుల ఆసియాకప్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత్‌కు అదిరిపోయే అరంభాన్ని అందించాడు. యుఎఇతో జరుగుతున్న మ్యాచ్‌లో చితక్కొట్టిన వైభవ్.. తృటిలో డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో యుఎఇ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన భారత్ స్కోర్ బోర్డును వైభవ్ పరుగులు పెట్టించాడు. 55 బంతుల్లో సెంచరీ చేసి.. మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. మరో ఆరోన్ జార్జ్ కూడా బ్యాట్‌తో చెలరేగిపోయాడు. వీరిద్దరు రెండో వికెట్‌కి ఏకంగా 212 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఆరోన్ అర్థశతకం కూడా సాధించాడు. అనంతరం వైభవ్ దూకుడుగా ఆడాడు.. 95 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్సులతో 171 పరుగులు చేశాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 433 పరుగులు చేసింది.