మూడో విడత పోలింగ్.. సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
తెలంగాణలో ఇవాళ మూడో విడత పంచాయతి ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే, కొమురంభీం జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాస్‌పెల్లిలో సర్పంచ్ అభ్యర్థి రాజయ్య ఓటమి భయంతో పురుగులమందు తాగాడు. తన దగ్గర డబ్బులు లేవని.. దీంతో తనకు ఓటు వేస్తారో వేయరోనని రాజయ్య ఆవేదన వ్యక్తం చేస్తూ… ఓడిపోతాననే భయంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో వెంటనే రాజయ్యను గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, రాష్ట్రంలో పంచాయతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలు ప్రాంతాల నుంచి ప్రజలు.. ఓటు వేసేందుకు సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య పోటీ రసవత్తరంగా జరుగుతోంది.