ఆమే నా ఫస్ట్ క్రష్: మంత్రి లోకేష్
: విద్యార్థి ప్రశ్నకు లోకేష్ సరదా సమాధానం!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన ‘హలో లోకేష్’ ముఖాముఖి కార్యక్రమంలో సరదా సన్నివేశం జరిగింది. మంత్రి లోకేష్ ను భరత్ అనే విద్యార్థి నవ్వుతూ ఓ ప్రశ్న అడిగాడు. ప్రశ్ని అడిగేముందు ఏమీ అనుకోవద్దని లోకేష్ ను కోరారు. అడుగుతారు ఏమీ అనుకోవద్దు ట్యాగ్ తగిలిస్తారు ఎందుకు అని లోకేష్ ఎదురు ప్రశ్నించాడు. లోకేష్ మీ ఫస్ట్ క్రష్ ఎవరు? అని ప్రశ్నించగానే నవ్వులో లోకేష్ మునిగిపోయాడు. నవ్వుతూ… తన మొదటి, చివరి క్రష్ వన్ అండ ఓన్లీ వన్ సతీమణి బ్రాహ్మణియే అని చెప్పారు. దీంతో అక్కడ ఉన్న విద్యార్థులంతా నవ్వుల్లు మునిగిపోయారు. దయచేసి దంపతుల మధ్య చిచ్చు పెట్టొద్దురా నాయనా? అని చమత్కరించారు. ఈ వీడియోను లోకేష్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఇది వైరల్ గా మారింది.