చెట్టును ఢీకొని ద్విచక్రవాహనంపై ఇద్దరు మృతి
అమరావతి: శ్రీ సత్యసాయి జిల్లా లో నల్లమాడ మండలం గోపేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్టును ఢీకొని ద్విచక్రవాహనంపై ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం వాహనదారుల నిర్లక్ష్యమేనని పోలీసులు భావిస్తున్నారు.