అమెరికాపై వ్యామోహం… వైద్యురాలు ఆత్మహత్య
ఎక్కడో కిర్గిస్తాన్ లో ఎంబిబిఎస్ చేసింది. ఆనక హెచ్ వన్ బి వీసాపై అమెరికాకు వెళ్లి అక్కడ అబ్జర్వర్ షిప్ పూర్తి చేసి రెసిడెన్సి ప్రోగ్రామ్ కు సెలెక్ట్ అయింది. ఇండియాకు వచ్చింది కానీ ఇంతలోనే వీసా నిబంధనలు ప మార్చడంతో ఆమె జెవన్ విసాకు అప్లై చేస్తే నిరాకరించబడింది దానితో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఇక్కడే ఎఫ్ఎంజి గ్రాడ్యుయేట్ గా కంప్లీట్ చేసి భారత్ లోనే ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది. గుంటూరు వాళ్ల ఊరిలోనే ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. వివాహం చేసుకొని మంచి ఆనందకరమైన జీవితం గడిపి ఉండవచ్చు. కానీ అమెరికాకు వెళ్లి మంచి జీవితాన్ని పొందాలని, ఎక్కువ డాలర్లు సంపాదించవచ్చు. మంచి జీవితమే ఉంటుంది అని మన సమాజంలో చిన్నప్పటినుంచి నూరి పోయడం వలన ఆమెకు ఆ విధమైన డిసప్పాయింట్మెంట్ కలిగింది..
జీతం కింద కొన్ని డాలర్లు ఎక్కువగా వస్తాయేమో కానీ అక్కడ ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. మన అంత సులభంగా జీవనశైలి, ఫ్రీడం ఉండదు. మనకు అక్కడ తెలిసిన వాళ్ళు మన బంధువులు కూడా ఉండరు. అక్కడ ఏది సమస్య వచ్చినా కానీ మనమే పరిష్కరించుకోవాలి. ఎంతో క్రమశిక్షణతో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది లేదంటే ఏదో ఒక కేసులలో ఇరుక్కోవడం కూడా మనం గమనిస్తున్నాం.
అదే మన భారత దేశంలో చాలా తక్కువ డబ్బులతో ఇక్కడ జీవించవచ్చు. మనకు అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు. ఏ సమస్య వచ్చినా తలా ఒక చెయ్యి వేసి పరిష్కారం చూపిస్తారు. మనం గర్వంగా మన దేశంలో తల ఎత్తుకొని తిరగవచ్చు. చిన్న చిన్న పొరపాట్లు చేసిన గాని పెద్ద పెద్ద శిక్షలు ఉండవు. అతిగా ఎక్స్పెక్టేషన్లు లేకపోతే మనదేశంలోనే ప్రశాంతంగా బతకవచ్చు. ఈ విషయం మన నెక్స్ట్ జనరేషన్ కు మనం తెలపాలి. ఎపిలోని గుంటూరుకు చెందిన కాకు రోహిణి అనే వైద్యురాలుకు అమెరికా వీసా రద్దు కావడంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తెలంగాణలోని హైదరాబాద్‌లో జరిగింది.
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు