admin
కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇవి వాహనాలను ప్రోత్సహిస్తున్నాం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ దేశంలోనే కొత్త రాష్ట్రమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 రూపొందించుకున్నామన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో కోటమంది నివసిస్తున్నారని పేర్కొన్నారు. ‘భారత్ ప్రపంచం సహకారం అనుసంధానం పోటీతత్వం’ పేరుతో నిర్వహించిన పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా వార్షిక సదస్సులో సిఎం ప్రసంగించారు. ప్రస్తుతం 70 కిలో మీటర్లు ఉన్న మెట్రో లైన్లను 150 కిలో మీటర్లకు విస్తరిస్తున్నామని, […]
AP Assembly 2025 : ఏపీ అసెంబ్లీ సమావేశాలు – ప్రత్యక్ష ప్రసారం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2వ రోజు కొనసాగుతున్నాయి. సభ మొదలవగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఇందులో భాగంగా పలువురు సభ్యులు మాట్లాడారు. మరోవైపు మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చ జరపాలంటూ డిమాండ్ చేశారు. మండలి పోడియంను చుట్టుముట్టారు.
ఇటుకల లోడుతో ట్రాక్టర్ అదుపు తప్పి వ్యక్తి మృతి

రంగారెడ్డి జిల్లా: తలకొండపల్లి మండలం మాదాయపల్లిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. సిమెంట్ ఇటుక బట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ సోలార్ సమీపంలో బోల్తా పడిందని స్థానిక నివేదికలు తెలుపుతున్నాయి. Also Read : హైదరాబాద్ విలవిల
ఏపీ లాసెట్ 2025 అభ్యర్థులకు అలర్ట్ – కౌన్సెలింగ్ గడువు మరోసారి పొడిగింపు..! ఇవిగో వివరాలు
Bihar elections 2025 : ‘నువ్వా నేనా’.. బీహార్‌లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ మధ్య తీవ్ర పోటీ!
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి తీర్మానం.. శాసన మండలి వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రారంభంకాగానే గందరగోళం నెలకొంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషేనురాజు తిరస్కరించారు. వాయిదా తీర్మానంపై చర్చ చేయాలని వైసిపి పట్టుబడుతోంది. సభలో నినాదాలతో వైసిసి సభ్యులు హోరెత్తించారు. పిపిపి విధానం రద్దు చేయాలని వైసిపి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వైసిపి సభ్యులు ఆందోళన చేయడంతో శాసన మండలి రెండో సారి వాయిదా పడింది. కానీ బిఎసి సమావేశం జరపాలని ప్రభుత్వం నిర్ణయం […]
పంట వ్యర్థాలతో ఎన్నో అనర్థాలు

ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో పంట వ్యర్థాల దహనంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు బుధవారం (17.9.25) కీలక వ్యాఖ్యలు చేసింది. ఏటా శీతాకాలంలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరడానికి పంటవ్యర్థాల దహనమే ప్రధాన కారణమన్న వాదనలు వస్తున్న నేపథ్యంలో దీనికి పాల్పడుతున్న కొంత మందిని ఎందుకు జైలుకు పంపకూడదని పంజాబ్ ప్రభుత్వాన్ని నిలదీసింది. అలాగే ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ బోర్డుల్లో ఖాళీలను మూడు నెలల్లోగా భర్తీ చేయాలని ఆదేశించింది. పంజాబ్, హర్యానా, […]
అరబ్బుల అసమర్థ నిస్సహాయత

ఖతార్ రాజధాని దోహాపై ఈ నెల 9న ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి మొత్తం అరబ్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అరబ్బులు కాని ఇతర ముస్లిం దేశాలను, ఇతరత్రా అన్ని దేశాలను కూడా. ఎందుకో తెలిసిందే. ఖతార్ అమెరికాకు ఒక నమ్మిన బంటువలే వ్యవహరిస్తున్నది. గల్ఫ్ ప్రాంతం లో అన్నింటికన్న పెద్ద అమెరికన్ సైనిక స్థావరం ఖతార్‌లోనే ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఖతార్‌ను సందర్శించగా ఆయనకు ఆ దేశాధిపతి చాలా ఖరీదైన బోయింగ్ విమానాన్ని […]
నిర్మల్ జిల్లాలో పోలీస్ స్టేషన్ లో ఎస్ఐని కత్తితో పొడిచిన దుండగుడు

నిర్మల్: పోలీస్ స్టేషన్‌లోనే హెడ్ కానిస్టేబుల్ పై దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా కుభీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కత్తితో పోలీస్ స్టేషన్‌లోకి ఓ వ్యక్తి వచ్చాడు. నేరుగా ఎస్ఐ గదిలోకి వెళ్తుండగా హెడ్ కానిస్టేబుల్ టి.నారాయణ అడ్డుకున్నాడు. అయితే వెంటనే తన వద్ద ఉన్న కత్తితో ఆయన కడుపులో పైభాగంలో నిందితుడు పొడిచాడు. అక్కడే ఉన్న […]