admin
టాటా మోటార్స్ సరికొత్త రికార్డు.. ఒక్కరోజే 10,000 కార్ల డెలివరీ
చంద్రబాబుకు సిఐ శంకరయ్య లీగల్ నోటీసులు

అమరావతి: ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిఐ శంకరయ్య లీగల్ నోటీసులు పంపించారు. రూ. 1.45 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో తన ప్రతిష్టకు బాబు భంగం కలిగించారని ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో సిఎం చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో వివరించారు. తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని శంకరయ్య ఆరోపణలు చేశారు. వివేకా హత్య జరిగినప్పుడు 2019లో పులివెందుల సిఐగా శంకరయ్య ఉన్నారు. ప్రస్తుతం కర్నూలు రేంజ్‌లో […]
లేట్ అయ్యింది కానీ.. 40ఏళ్ల వయస్సులో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినా కోటీశ్వరులు అవ్వొచ్చు! ఎలా అంటే..
షేక్ పేట్ లో పర్యటించిన మంత్రులు పొన్నం, వివేక్

షేక్ పేట్: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో షేక్ పేట్ డివిజన్ ఓయూ కాలనీ లో సహచర మంత్రి వివేక్ వెంకట్ స్వామితో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. షేక్ పేట్ డివిజన్ లో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంత్రులకు వివరించారు. వర్షాల కారణంగా ప్రస్తుతం చేస్తున్న పనులు, చేయాల్సిన పనులు గురించి మంత్రులకు తెలియజేశారు. డివిజన్ లో నాలాల సమస్యలు, సిసి రోడ్లు నిర్మాణం అంశాలపై సమావేశంలో చర్చ […]
Canara Bank Apprentice Recruitment : కెనరా బ్యాంక్లో అప్రెంటీస్ పోస్టులు- ఇలా అప్లై చేసుకోండి..
కృష్ణా, గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం..! ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రమాద హెచ్చరిక జారీ, లోతట్టు ప్రాంతాలకు అలర్ట్
కొత్త జిఎస్ టి… పాల ధరల్లో మార్పులేదు… మండిపడుతున్న ప్రజలు

హైదరాబాద్: పాల ఉత్పత్తులపై జిఎస్ టి తగ్గించి ఇవ్వడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. కొత్త జిఎస్ టి అమల్లోకి వచ్చి మూడు రోజులైనా పాల ధరల్లో మార్పులు లేవని మండిపడుతున్నారు. పాత ధరలకే పాల ఉత్పత్తులు వ్యాపారులు అమ్ముతుండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు జిఎస్ టి తగ్గించి ఇవ్వడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. ధరల డిస్‌ప్లే బోర్డులు ఎక్కడా కనిపించకపోవడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. జిఎస్టి తగ్గిన చాలా వస్తువులను పాత రేటుపై అమ్ముతున్నారని ప్రజలు ధ్వజమెత్తుతున్నారు. […]
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుమల: బుధవారం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం మాడ వీధుల్లో గరుడ పఠంపై పరివార దేవతలు ఊరేగనున్నారు. సాయంత్రం 5:45కి ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ్టితో ప్రారంభమైన ఉత్సవాలు అక్టోబర్ 2వ తేదీన ముగియనున్నాయి. Also Read: స్థానిక సమరం… రిజర్వేషన్లు ఖరారు? విశిష్టత.. వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు […]
డోలీ మోత…. ప్రభుత్వాలు మారిన గిరిజనుల రాత మారడం లేదు

హైదరాబాద్: ఐటెక్ యుగంలోని అద్భుతమైన ఎఐ ప్రపంచంలో ఉన్నామని, ఆర్థిక గమనంలో దేశం ముందుకు వెళ్తుందని నాయకులు గొప్పలు చెబుతున్నారు. అభివృద్ధి అనేది పట్టణాలకు పరిమితమైందా?, గిరిజనులు జీవించే ప్రాంతాలలో సరైన రహదారులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. డోలీ మోతలు గిరిజనులకు తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని గిరిశిఖర గ్రామాల్లో గర్భిణీకి తీవ్ర అనారోగ్యాని గురికావడంతో డోలిమోతలో మోసుకుంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. బంధువులు తమకు డోలీ మోత […]