admin
గ్రూప్- 2 ఫలితాలు విడుదల
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పరిశీలకులను నియామకం
అక్టోబర్ 1న మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో వర్షాలు!
ఇజ్రాయెల్-హమాస్ వార్.. 66 వేలకుపైగా పాలస్తీనియులు మృతి
కొండారెడ్డిపల్లిలో సౌర కాంతులు
ఫిబ్రవరిలో హైదరాబాద్ – విజయవాడ 8 లేన్ల రహదారి పనులు ప్రారంభం
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నవంబర్ నెల నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు!
విరాట్ కోహ్లీ ఇన్‌స్టా పోస్ట్.. మొత్తం ఇంటర్నెట్ షేక్..
టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నాడు. టి-20, టెస్ట్ ఫార్మాట్‌కి రిటైర్‌మెంట్ ప్రకటించి.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్.. త్వరలో జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. అయితే విరాట్ సోషల్‌మీడియాలో ఎప్పుడో ఒకసారి పోస్ట్ పెడుతుంటాడు. పెట్టినప్పుడల్లా అతని పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతుంది. సోషల్‌మీడియా అంత యాక్టివ్‌గా ఉండపోయినా.. విరాట్‌కు మిలియన్స్‌లో ఫాలోవర్లు ఉన్నారు.
తాజాగా విరాట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. తన భార్య అనుష్కతో కలిసి ఉన్న ఫొటోను విరాట్ షేర్ చేశాడు. ‘చాలాకాలం తర్వాత’ అంటూ ఆ పోస్ట్‌కి క్యాప్షన్ జత చేశాడు. ఈ ఫొటో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. పోస్టు పెట్టిన 15 గంటల్లోనే దీనికి 9 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. కోహ్లీ చివరిసారిగా ఐపిఎల్‌లో ఆడాడు. 18 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ఏడాది ఐపిఎల్ ట్రోఫ్రీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఆసియాకప్ ఫైనల్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
దుబాయ్: ఆసియాకప్-2025లో ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. 41 ఏళ్ల తర్వాత భారత్, పాకిస్థాన్ జట్లు ఆసియాకప్ ఫైనల్స్‌లో తలపడుతున్నాయి. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే గ్రూప్ దశలో ఒకసారి, సూపర్ ఫోర్‌లో ఒకసారి భారత్, పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లోనూ పాక్‌ను ముచ్చటగా ఓడించి ట్రోఫీని అందుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. హార్థిక్ పాండ్యా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అతని స్థానంలో రింకూ సింగ్ జట్టులోకి వచ్చాడు. బుమ్రా, దుబేలు తుది జట్టులోకి వచ్చారు. ఇక పాకిస్థాన్ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది.
తుది జట్లు:
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్(కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్